పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

పంచమ స్కంధము - ఉత్తర : పాతాళ లోకములు

 •  
 •  
 •  

5.2-105-వ.
 • ఉపకరణాలు:
 •  
 •  
 •  

అట్టి భూమండలంబు క్రింద యోజనాయుతాంతరంబున నండకటాహాయామంబు గలిగి క్రమంబున నొండొంటికిం గ్రిందగుచు నతల వితల సుతల రసాతల తలాతల మహాతల పాతాళలోకంబు లుండు; నట్టి బిల స్వర్గంబుల యందు నుపరి స్వర్గంబున కధికం బైన కామ భోగంబుల నైశ్వర్యానందంబులను సుసమృద్ధ వనోద్యాన క్రీడా విహార స్థానంబు లననుభవించుచు దైత్య దానవ కాద్రవేయాది దేవయోనులు నిత్య ప్రముదితానురక్తు లగుచుఁ గళత్రాపత్య సుహృద్బంధు దాసీదాస పరిజనులతోఁ జేరుకొని మణిగణ ఖచితంబులగు నతిరమణీయ గృహంబులయందు నీశ్వరునివలనం జేటు లేని కాయంబులు గలిగి వివిధ మాయావిశేష వినిర్మిత నూతన కేళీసదన విహరణమండప విచిత్రోద్యానాదుల యందుఁ గేళీవినోదంబులు సలుపుచుఁ జరియింతు; రంత.

టీకా:

అట్టి = అటువంటి; భూమండలంబున్ = భూమండలమునకు; క్రిందన్ = క్రిందన; యోజన = యోజనములు; అయుత = పదివేల (10,000); అంతరంబునన్ = దూరములలో; అండకటాహా = బ్రహ్మాండగోళమమంత; ఆయామంబున్ = విస్తరించుకొన్నది; కలిగి = కలిగినట్టియును; క్రమంబునన్ = వరుసగా; ఒండొంటికిని = ఒకదానికొకటి; క్రిందన్ = క్రిందనుండునవి; అగుచున్ = అగుచు; అతల = అతలము; వితల = వితలము; సుతల = సుతలము; రసాతల = రసాతలము; తలాతల = తలాతలము; మహాతల = మహాతలము; పాతాళ = పాతాళము యనెడి; లోకంబులున్ = లోకములు; ఉండును = ఉండును; అట్టి = అటువంటి; బిల = బిలము {బిలము - భూమి లేదా కొండల యందలి ఖాళీస్థలము లేదా కన్నము}; అందున్ = లలో; ఉపరి = పైనుండెడి; స్వర్గంబున్ = స్వర్గమున; కున్ = కు; అధికంబున్ = పెద్దవి; ఐన = అయినట్టి; కామ = కోరికలు తీర్చుకొను; లోకంబులన్ = లోకములలో; ఐశ్వర్య = సంపదలు; ఆనందంబులనున్ = ఆనందములను; సు = చక్కగా; సమృద్ధ = నిండైన; వన = వనములు; ఉద్యాన = తోటలు; క్రీడా = క్రీడించుటకు; విహార = విహరించుటకు; స్థానంబులనున్ = అనుకూలమైన ప్రదేశములందు; అనుభవించుచున్ = అనుభవించుతు; దైత్య = రాక్షస విశేషము; దానవ = రాక్షస విశేషము; కాద్రవేయ = నాగులు; ఆది = మొదలగు; దేవయోనులు = ఉత్తమ జన్మలుగలవారు; నిత్య = శాశ్వతమైన; ప్ర = మిక్కిలి; ముదిత = ఆనందములు మరియు; అనురక్తులు = ఆపేక్షలు కలవారు; అగుచున్ = అగుచు; సుహృత్ = సహృదయులు; బంధు = బంధువులు; దాసి = దాసీజనములు; దాస = సేవకులు; పరిజనులు = పరిచారకులు; తోన్ = తోటి; చేరుకొని = కూడుకొని; మణి = మణిమాణిక్యముల; గణ = సమూహములచే; ఖచితంబులు = తాపడము చేయబడినవి; అగు = అయినట్టి; అతి = మిక్కిలి; రమణీయ = అందమైన; గృహంబుల = ఇండ్ల; అందున్ = లో; ఈశ్వరుని = దైవము; వలనన్ = వలన; చేటు = ఆపదలు; లేని = లేనట్టి; కాయంబులు = దేహములు; కలిగి = కలిగి ఉండి; వివిధ = అనేక రకములైన; మాయా = మాయల యొక్క; విశేష = విశిష్టములచే; వినిర్మిత = చక్కగా నిర్మింపబడిన; నూతన = సరికొత్త; కేళీ = క్రీడా; సదన = గృహములు; విహరణ = విహరించుటకైన; మండప = మండపములు; విచిత్ర = చక్కగా రచింపబడిన; ఉద్యాన = తోటలు; ఆదుల = మొదలగువాని; అందున్ = లో; కేళీ = క్రీడలు; వినోదంబులున్ = వినోదములను; సలుపుచున్ = చేయుచు; చరియింతురు = తిరుగుతుందురు; అంత = అంతట;

భావము:

అటువంటి భూమండలం క్రింద ఒకదాని క్రింద ఒకటిగా అతలం, వితలం, సుతలం, తలాతలం, రసాతలం, మహాతలం, పాతాళం అనే ఏడు లోకాలున్నాయి. ఈ లోకాలలో ఒక్కొక్కదానికి మధ్య పదివేల యోజనాల దూరం ఉంటుంది. ఇవి క్రింద ఉన్నా స్వర్గం వంటివే. ఈ క్రింది స్వర్గాలు పైనున్న స్వర్గం కంటే ఎంతో గొప్పవి. ఇక్కడ దైత్యులు, దానవులు, నాగులు మొదలైన దేవజాతికి చెందినవాళ్ళు ఉంటారు. వాళ్ళందరూ ఐశ్వర్యం వల్ల సంక్రమించిన ఆనందానుభవంతో సుఖభోగాలతో తులతూగుతూ జీవిస్తారు. సర్వాంగ సుందరాలైన ఉద్యానవనాలలో, క్రీడా ప్రదేశాలలో విహరిస్తూ ఉంటారు. వారు తమ భార్యలతో, బిడ్డలతో, చెలికాండ్రతో, దాస దాసీ జనంతో మణులు చెక్కిన రమణీయమైన గృహాలలో సర్వదా సంతోషం అనుభవిస్తూ ఉంటారు. ఈశ్వరుని కరుణ వల్ల వారికి దైహికాలైన వ్యాధులు లేవు. మాయలతో నిర్మింపబడ్డ కొంగ్రొత్త కేళీగృహాలలో, విహార మంటపాలలో, చిత్ర విచిత్రమైన ఉద్యానవనాలలో క్రీడా వినోదాలతో సంచరిస్తూ ఉంటారు.

5.2-106-సీ.
 • ఉపకరణాలు:
 •  
 •  
 •  

ట్టి పాతాళంబులందును మయకల్పి-
ములగు పుటభేదముల యందు
హురత్ననిర్మిత ప్రాకార భవన గో-
పు సభా చైత్య చత్వవిశేష
ముల యందు నాగాసురుల మిథునములచే-
శు పిక శారికానిర సంకు
ముల శోభిల్లు కృత్రి భూములను గల-
గృహములచే నలంకృతము లగుచు

5.2-106.1-ఆ.
 • ఉపకరణాలు:
 •  
 •  
 •  

కుసుమచయ సుగంధి కిలయ స్తబక సం
తులచేత ఫలవితులచేత
తులరుచిర నవలతాంగనాలింగిత
విటపములను గలుగు విభవములను.

టీకా:

అట్టి = అటువంటి; పాతాళంబులు = పాతాళలోకముల; అందును = లో; మయ = మయునిచేత; కల్పితములు = నిర్మింపబడినవి; అగు = అయినట్టి; పుటభేదనములన్ = నగరముల; అందున్ = లో; బహు = అనేకమైన; రత్న = రత్నములతో; నిర్మిత = నిర్మింపబడిన; ప్రాకార = ప్రహారిగోడలు; భవన = భవనములు; గోపుర = గోపురములు; సభా = సభామండపములు; చైత్య = గుడులు; చత్వర = ముంగిళ్ళ; అందున్ = లో; నాగ = నాగుల; అసుర = రాక్షసుల; మిథునముల్ = జంటల; చేన్ = చేత; శుక = చిలుకల; పిక = కోకిల; శారిక = గోరువంకల; నికర = గుంపుల; సంకులములన్ = కలకలారావములతో; శోభిల్లు = శోభాయమానమగుతున్న; కృత్రిమ = మానవనిర్మిత; భూములను = తలములు, నేలలు; కల = కలిగిన; గృహముల్ = ఇండ్లచే; చేన్ = చేత; అలంకృతములు = అలంకరింపబడినవి; అగుచున్ = అగుచు;
కుసుమ = పూల; చయ = గుత్తుల; సుగంధిన్ = సువాసనలు; కిసలయ = చిగుళ్ళ; స్తబక = గుత్తుల; సంతతుల్ = సమూహముల; చేన్ = చేత; ఫల = పండ్ల; వితతుల్ = సమృద్దముల; చేతన్ = వలన; అతుల = మిక్కిలి; రుచిర = మనోహరమైన; నవ = లేత; లత = లతలు యనెడి; అంగన = స్త్రీలచే; ఆలంగిత = కొగలింపబడిన; విటపములను = వృక్షములను; కలుగు = కలిగెడి; విభవములను = వైభవములను;

భావము:

అటువంటి పాతాళలోకాలలో మయుడు నిర్మించిన మాయా పట్టణాలు ఎన్నో ఉన్నాయి. ఆ పట్టణాలలో నానావిధ రత్నాలతో నిర్మించిన ప్రాకరాలు, గోపురాలు, సౌధాలు, విశాలమైన సభా సమావేశ స్థలాలు, చైత్యాలు ఉన్నాయి. వాటిలో దైత్య దానవ నాగ దంపతులు విహరిస్తూ ఉంటారు. మాయతో వాళ్ళు నిర్మించుకున్న విహార ప్రదేశాలలో చిలుకలు, కోకిలలు, గోరువంకలు కలకలారావాలు చేస్తుంటాయి. పూల వాసనలు, చిగురుటాకుల గుత్తుల బొత్తులు, రకరకాల ఫలాలు సమృద్ధిగా కలిగిన ఆ ఉద్యానవనాలలో లతాసుందరులు పెనవేసుకున్న తరుశాఖలు కన్నుల పండుగ చేస్తుంటాయి.

5.2-107-వ.
 • ఉపకరణాలు:
 •  
 •  
 •  

మఱియు మానసేంద్రియంబుల కానందకరంబులైన నానావిధ జలవిహంగమ మిథునంబులు గలిగి నిర్మలజలపూరితంబులై మత్స్యకుల సంచార క్షుభితంబులైన కుముద కువలయ కహ్లార లోహిత శతపత్రాదికంబులఁ దేజరిల్లెడు సరోవరంబులుగల యుద్యానవనంబుల యందుఁ గృతనికేతనులై స్వర్గభూముల నతిశయించిన వివిధ విహారంబులు గలిగి యహోరాత్రాది కాలవిభాగ భయంబులు లేక మహాహిప్రవరుండయిన శేషుని శిరోమణి దీధితులచే నంధకారోపద్రవంబు లేక యెల్లప్పుడు దివసాయమానంబుగా నుండు; నా లోకంబు నందు నఖిల జనులు దివ్యౌషధి రస రసాయనంబుల ననవరతంబు నన్నపానంబులుగా సేవించుటం జేసి యచ్చటివారలకు నాధివ్యాధులును, వలితపలితంబులును, జరారోగంబులును, శరీరవైవర్ణ్యంబులును, స్వేదదౌర్గంధ్యంబులును, గలుగక పరమకల్యాణమూర్తు లగుచు హరిచక్రభయంబు దక్క నన్యంబగు మృత్యుభయంబు నొందక యుందు; రదియునుం గాక.

టీకా:

మఱియున్ = ఇంకను; మానస = మనసులకు; ఇంద్రియంబుల్ = ఇంద్రియముల; కున్ = కు; ఆనంద = ఆనందమును; కరంబులు = కలిగించునవి; ఐన = అయినట్టి; నానవిధ = అనేక రకములైన; జలవిహంగమ = నీటిపక్షుల; మిథునంబులు = జంటలు; కలిగి = కలిగుండి; నిర్మల = స్వచ్ఛమైన; జల = నీటితో; పూరితంబులు = నిండినవి; ఐన = అయినట్టి; మత్స్య = చేపల; కుల = సమూహముల; సంచార = తిరుగుటలచే; క్షుభితంబులు = కదలుచున్నట్టివి; ఐన = అయినట్టి; కుముద = తెల్లకలువలు; కువలయ = కలువలు; కహ్లార = ఎఱ్ఱకలువలు; లోహిత = ఎఱ్ఱని; శతపత్ర = తామరపూలు; ఆదికంబులన్ = మొదలగువానిచే; తేజరిల్లెడు = విరాజిల్లుతున్న; సరోవరంబులు = సరస్సులు; కల = కలిగిన; ఉద్యానవనంబులన్ = తోటలు; అందున్ = లో; కృత = క్రీడా; నికేతనులు = గృహములు కలవారు; ఐ = అయ్యి; స్వర్గ = స్వర్గము నందలి; భూములన్ = ప్రదేశములను; అతిశయించిన = మించిన; వివిధ = అనేక రకములైన; విహారంబులు = విహరింపదగినవి; కలిగి = కలిగి ఉండి; అహోరాత్ర = రాత్రంబగళ్ళు; ఆది = మొదలగు; కాల = సమయ; విభాగ = విభాగ భేదముల; భయంబులు = భయములు; లేక = లేకుండగ; మహా = గొప్ప; అహి = సర్పములలో; ప్రవరుండు = శ్రేష్ఠుడు; అయిన = ఐనట్టి; శేషుని = ఆశేషుడి యొక్క {శేషుడు - మహాప్రళయమున సర్వంసహా లయమైన తరువాత శేషముగా మిగిలి విష్ణుని సేవయందుండు వాడు}; శిరోమణి = శిరసు నందు అలంకరించిన మణి యొక్క; దీధితుల = కాంతుల; చేన్ = వలన; అంధకర = చీకటు లనెడి; ఉపద్రవంబులు = ప్రమాదములు; లేక = లేకుండగ; ఎల్లప్పుడు = ఎల్లప్పుడును; దివస = పగలుగా; ఆయమానంబుగాన్ = చేయబడినదై; ఉండున్ = ఉండును; ఆ = ఆ; లోకంబున్ = లోకము; అందున్ = లో; అఖిల = సమస్తమైన; జనులు = ప్రజలు; దివ్య = దివ్యమైన; ఔషధి = మూలికల; రస = రసములు; రసాయనంబులు = ఔషధముల, మందుల; అనవరతంబు = ఎడతెగకుండగ; అన్న = ఆపారము; పానంబులుగా = పానీయములుగా; సేవించుటన్ = తీసుకొనుట; చేసి = వలన; అచ్చటి = అక్కడి; వారల్ = వారల; కున్ = కి; ఆధి = మనోవ్యధలు; వ్యాధులును = శారీరక రుగ్మతలు; వలిత = చర్మము ముడుతలు పడుట; పలితంబులును = శిరోజములు నెరయుట; జరా = ముసలితనములు; రోగంబులు = అనారోగ్యములు; శరీర = దేహము; వైవర్ణ్యంబులును = పాలిపోవుటలు; స్వేదదౌర్గంధ్యంబులును = చెమట వాసనలును; కలుగక = కలగక; పరమ = అత్యుత్తమ; కల్యాణ = శుభకర; మూర్తులు = స్వరూపులు; అగుచున్ = అగుచు; హరిచక్ర = విష్ణుచక్రమువలని; భయంబున్ = భయము; తక్క = తప్పించి; అన్యంబు = ఇతరములు; అగు = అయిన; మృత్యు = మరణకారకముల; భయంబున్ = భయములు; ఒందక = పొందక; ఉందురు = ఉండెదరు; అదియునున్ = అంతే; కాక = కాకుండగ;

భావము:

ఇంకా మనస్సుకు, ఇంద్రియాలకు ఆహ్లాదం కలిగించే సరస్సులు కూడా అక్కడ ఉన్నాయి. ఆ సరోవరాలలో రకరకాలైన నీటిపక్షుల జంటలు విహరిస్తుంటాయి. అక్కడ నీరు నిర్మలంగా ఉంటుంది. చేపలు ఈదుతూ కోనేటిలో కదలికలను కలిగిస్తాయి. ఆ సరోవరాలలో తెల్ల కలువలు, నల్ల కలువలు, ఎఱ్ఱ కలువలు, రంగు రంగుల తామరపూలు ఉన్నాయి. అటువంటి సరస్సులు కలిగిన ఉద్యానవనాలలో వాళ్ళు ఇళ్ళు ఏర్పరచుకొంటారు. స్వర్గ భోగాలను మించిన భోగాలు వారికి అందుబాటులో ఉంటాయి. వారికి పగలు, రాత్రి అనే కాలభేదాలు ఉండవు. శేషుడు మొదలైన సర్పరాజుల పడగల మీద ఉన్న దివ్యమైన మణులవల్ల వారికి చీకట్లు ఉండవు. అక్కడ ఎప్పుడూ పట్టపగలు లాగా ఉంటుంది. అక్కడివారు దివ్యమైన మూలికలను, రస రసాయనాలను ఆహారంగా స్వీకరించడం వల్ల దేహవ్యాధులు కాని, మనోవ్యాధులు కాని వారికి ఉండవు. దేహం పాలిపోదు. ముడతలు పడదు. జుట్టు నెరసిపోదు. ముసలితనం రాదు. రోగాలు లేవు. చెమట, దుర్వాసనలు ఉండవు. ఆకర్షణీయమైన ఆకారాలు కలిగి ఉంటారు. వారికి సుదర్శన చక్ర భయం తప్ప మరే మృత్యుభయం లేదు. అంతేకాక...

5.2-108-తే.
 • ఉపకరణాలు:
 •  
 •  
 •  

ట్టి పాతాళలోకంబునందు విష్ణు
క్ర మెప్పుడేనిని బ్రవేశంబు నొందు
ప్పుడెల్లను దైత్యకులాంగనలకు
ర్భసంపద లందంద రఁగుచుండు.

టీకా:

అట్టి = అటువంటి; పాతాళలోకంబున్ = పాతాళలోకముల; అందున్ = లో; విష్ణుచక్రము = విష్ణుచక్రము {విష్ణుచక్రము - విష్ణుమూర్తి యొక్క చక్రాయుధము}; ఎప్పుడు = ఎప్పుడు; ఏనిని = అయినా; ప్రవేశంబున్ = ప్రవేశించుటను; ఒందున్ = పొందునో; అప్పుడున్ = అప్పుడు; ఎల్లను = అందరు; దైత్య = దైత్యుల యొక్క {దైత్యులు - దితి యొక్క సంతానము, రాక్షసులు}; కులాంగనల్ = కులస్త్రీల; కున్ = కు; గర్భసంపదల్ = సంతానసౌభాగ్యము {గర్భసంపదలు - గర్భ (గర్భమున పుట్టినవారి క్షేమములు అనెడి) సంపద (సౌభాగ్యము)}; అందంద = అక్కడక్కడ; కరగుచుండు = కరిగిపోవుచుండును;

భావము:

అటువంటి పాతాళలోకంలో విష్ణుచక్రం ఎప్పుడు ప్రవేశిస్తుందో అప్పుడే రాక్షసస్త్రీలకు గర్భస్రావం కలుగుతుంటుంది.

5.2-109-చ.
 • ఉపకరణాలు:
 •  
 •  
 •  

లమునందు నమ్మయుని యాత్మజుఁడైన బలాసురుండు స
మ్మతిఁ జరియించు షణ్ణవతి మాయలఁ గూడి వినోద మందుచుం
గులములందు నేఁడు నొక కొందఱు నచ్చటి మాయఁ జెంది సం
ముఁ జరించుచుండుదురు ప్పక మోహనిబద్ద చిత్తులై.

టీకా:

అతలమున్ = అతలము; అందున్ = లో; ఆ = ఆ; మయుని = మయుని యొక్క; ఆత్మజుడు = కుమారుడు; ఐన = అయిన; బల = బలుడు అనెడు; అసురుడు = రాక్షసుడు; సమ్మతిన్ = ఇచ్ఛాపూర్వకముగ; చరియించున్ = తిరుగుతుండును; షణ్ణవతి = తొంభైయారు (96) {షణ్ణవతి - షట్ (ఆరు, 6) నవతి (తొంభై, 90) - 96}; మాయలన్ = మాయలతో; కూడి = కలసి; వినోదము = వినోదమును; అందుచున్ = పొందుతూ; నేడునున్ = ఈనాటికిని; ఒకకొందఱు = కొంతమంది; అచ్ఛటి = అక్కడి; మాయన్ = మాయ లందు; చెంది = పడి; సంతతమున్ = ఎల్లప్పుడు; చరించుచుండుదురు = వర్తింతురు; తప్పక = విడువక; మోహ = మోహము నందు; నిబద్ధ = బంధింపబడిన; చిత్తులు = మనసులు కలవారు; ఐ = అయ్యి;

భావము:

అతలం అనే లోకంలో మయుని కుమారుడైన బలాసురుడు స్వేచ్ఛగా విహరిస్తూ ఉంటాడు. అతడు తొంభై ఆరు విధాలైన మాయలతో వినోదిస్తూ ఉంటాడు. ఈ మాయలకు భూలోకంలోని వారు కొందరు లొంగిపోయి సమ్మోహితులై చరిస్తుంటారు.

5.2-110-వ.
 • ఉపకరణాలు:
 •  
 •  
 •  

అట్టి బలుని యావలింతలను స్వైరిణులు కామినులు పుంశ్చలు లను స్త్రీ గణంబులు జనియించి; రా కామినీ జనంబులు పాతాళంబుఁ బ్రవేశించిన పురుషునికి హాటకరసం బనియెడు సిద్ధరసఘుటిక నిచ్చి రససిద్ధునిం గావించి యతనియందు స్వవిలాసావలోక నానురాగ స్మిత సల్లాపోపగూహ నాదుల నిచ్ఛా విహారంబులు సలుపుచుండ నా పురుషుండు మదాంధుండై తానె సిద్ధుండ ననియును నాగాయుత బలుండ ననియును దలంచి నానావిధ రతిక్రీడలఁ బరమానందంబు నొందుచుండు.

టీకా:

అట్టి = అటువంటి; బలుని = బలాసురుని; ఆవలింతలను = ఆవలింతలందు; స్వైరిణులుల్ = స్వేచ్ఛగా పురుషులతో తిరిగెడు స్త్రీలు, జారిణి; కామినులుల్ = ప్రియ సంగమమున మిక్కిలి ఆసక్తిగల స్త్రీలు; పుంశ్చలుల్ = రంకుటాలు, కులట; అను = అనెడి; స్త్రీ = స్త్రీల; గణంబులున్ = సమూహములు; జనియించిరి = పుట్టిరి; ఆ = ఆ; కామినీ = స్త్ఱ్ఱీ; జనంబులు = జనములు; పాతాళంబున్ = పాతాళమును; ప్రవేశించిన = చేరినట్టి; పురుషుని = పురుషుని; కిన్ = కి; హాటకరసంబున్ = హాటకరసము, బంగారపు మందు; అనియెడు = అనెడి; సిద్ధరస = సిద్ధరసపు {సిద్ధరసము - సిద్ధి (వాంఛిత ప్రాప్తి) కలిగించెడి రసము (ఔషధము)}; ఘుటికన్ = గుళికను; ఇచ్చి = సేవించుటకు ఇచ్చి; రససిద్ధునిన్ = శృంగారరస సిద్ధునిగా; కావించి = చేసి; అతని = అతని; అందున్ = తో; స్వ = తమ; విలాస = విలాసవంతమైన; అవలోకన = చూపులు; అనురాగ = ఆపేక్షపూరిత; స్మిత = చిరునవ్వులు; సల్లాప = చక్కటి మాటలు; ఉపగూహనంబులు = కౌగిలింతలు; ఇచ్ఛా = ఇష్టానుసార; విహారంబులున్ = వర్తనలు; సలుపుచుండన్ = చేయుచుండగా; ఆ = ఆ; పురుషుండు = మానవుడు; మద = మదముచేత; అంధుండు = కన్న గాననివాడు; ఐ = అయ్యి; తానె = తనే; సిద్ధుండను = శృంగారరస సిద్ధుడను; అనియును = అని; నాగ = ఏనుగులు; అయుత = పదివేలకి సమానమైన; బలుండను = బలము కలవాడను; అనియును = అని; తలంచి = భావించుకొని; నానవిధ = అనేక విధములైన; రతిక్రీడలన్ = శృంగార వినోదము లందు; పరమ = అత్యధికమైన; ఆనందంబున్ = ఆనందమును; ఒందుచుండు = పొందుచుండును;

భావము:

అటువంటి బలాసురుని ఆవులింతల నుండి స్వైరిణులు, కామినులు, పుంశ్చలులు అనే స్త్రీ సమూహాలు పుట్టారు. ఆ స్త్రీలు పాతాళంలో ప్రవేశించిన పురుషునికి హాటకరసం అనే సిద్ధ రసఘుటికను ఇచ్చి అతనిని శృంగారరస సిద్ధుణ్ణి చేస్తారు. తమ తళుకు బెళుకు చూపులతో, అనురాగ ప్రదర్శనలతో, చిరునవ్వులతో, సరస సల్లాపాలతో, కౌగిలింతలతో అతనిని లోబరచుకొంటారు. తమకు నచ్చిన రీతిలో ఆ పురుషునితో విహారం సాగిస్తారు. అపుడు పాతాళం ప్రవేశించిన ఆ పురుషుడు తానే సిద్ధపురుషుడనని భావిస్తాడు. దర్పంతో అతని కళ్ళు నెత్తి కెక్కుతాయి. తాను పదివేల ఏనుగుల బలం కలవాడనని భావించుకొని రకరకాల రతిక్రీడలతో పరమానందం అనుభవిస్తుంటాడు.

5.2-111-సీ.
 • ఉపకరణాలు:
 •  
 •  
 •  

హాటకేశ్వరుఁడైన యంబికాధీశుండు-
వితలంబునందుల వేడ్క నిలిచి
నదు పార్షద భూతతులతో బ్రహ్మస-
ర్గోపబృంహణమున నొక్కచోటఁ
బార్వతీ సంభోగరుఁ డగుచుండఁగా-
వారల వీర్యంబులనఁ బుట్టి
ట్టిది హాటకి నియెడు నది యని-
లాగ్నులు భక్షించి యందు నుమియ

5.2-111.1-తే.
 • ఉపకరణాలు:
 •  
 •  
 •  

దియు హాటక మను పేర తిశయిల్లి
న్నె మీఱుచు శుద్ధ సుర్ణమయ్యె
నా సువర్ణంబు నా లోకమందు నున్న
నుల కెల్లను వినుత భూణము లయ్యె.

టీకా:

హాటకేశ్వరుడు = హాటకేశ్వరుడు; ఐన = అయి ఉన్నట్టి; అంబికాధీశుండు = శివుడు {అంబికాధీశుండు - అంబిక (పార్వతీదేవి) యొక్క అధీశుడు (భర్త), పరమశివుడు}; వితలంబున్ = వితలము; అందులన్ = లో; వేడ్కన్ = వేడుకగా; నిలిచి = వసించి; తనదు = తన యొక్క; పార్షద = పరివారమైన; భూత = భూతముల; తతుల = గణముల; తోన్ = తోటి; బ్రహ్మ = బ్రహ్మదేవుని; సర్గ = సృష్టి; ఉపబృంహణమునన్ = సంవృద్దియందు; ఒక్క = ఒక; చోటన్ = ప్రదేశములో; పార్వతీ = పార్వతీదేవితో; సంభోగపరుడు = కలియుచున్నవాడు; అగుచుండగా = అగుతుండగా; = = వారల = వారి యొక్క; వీర్యంబు = వీర్యము {వీర్యము - శుక్ర శ్రోణితములు}; వలనన్ = వలన; పుట్టినట్టిది = పుట్టినటువంటిది; హాటకి = హాటకి; అనియెడునది = అనెడిది; అనిల = వాయువు; అగ్నులున్ = అగ్నిలను; భక్షించి = తిని; అందునున్ = దానిలో; ఉమియున్ = ఉమ్మివేయును; అదియున్ = అదే;
హాటకము = బంగారము; అను = అనెడి; పేరన్ = పేరుతో; అతిశయిల్లున్ = మించును; వన్నెమీఱుచున్ = ప్రసిద్దమగుచు; శుద్ధ = పరిశుద్ధమైన; సువర్ణము = బంగారము; అయ్యెన్ = అయినది; ఆ = ఆ; సువర్ణంబున్ = బంగారము; ఆ = ఆ; లోకము = లోకము; అందున్ = లోకము; ఉన్న = ఉన్నట్టి; జనుల్ = ప్రజల; కిన్ = కి; ఎల్లనే = అందరకు; వినుత = ప్రసిద్దమైన; భూషణములు = ఆభరణములు; అయ్యెన్ = అయ్యెను;

భావము:

వితలం అనే లోకానికి హాటకేశ్వరుడనే పేరు గలవాడు, పార్వతీపతి అయిన శివుడు అధి దేవత. భూతగణ సమేతుడైన శివుడు బ్రహ్మసృష్టిని వృద్ధి పొందించటం కోసం పార్వతీ సంభోగ పరవశుడౌతాడు. అపుడు అతని వీర్యం నుండి హాటకి అనే నది పుట్టింది. ఆ నదిలోని జలరూపమైన వీర్యాన్ని వాయువుతో కూడా అగ్ని ఆహారంగా తీసుకొని ఉమియగా హాటకం అనే పరిశుద్ధమైన బంగారం పుట్టింది. ఆ వితలలోకంలోని వారి కందరికీ ఆ బంగారం భూషణ రూపంలో ఉపయోగ పడుతున్నది.

5.2-112-సీ.
 • ఉపకరణాలు:
 •  
 •  
 •  

క్రింది సుతలంబు నందు మహాపుణ్యుఁ-
గు విరోచనపుత్రుఁడైన యట్టి
లిచక్రవర్తి యా పాకశాసనునకు-
ము మొసంగఁగఁగోరి, దితి గర్భ
మున వామనాకృతిఁ బుట్టి యంతటఁ ద్రివి-
క్రమ రూపమునను లోత్రయంబు
నాక్రమించిన దానవారాతిచేత ముం-
టన యీఁబడిన యింద్రత్వ మిట్లు

5.2-112.1-ఆ.
 • ఉపకరణాలు:
 •  
 •  
 •  

లుగువాఁడు పుణ్యర్మసంధానుండు
రిపదాంబుజార్చ నాభిలాషుఁ
గుచు శ్రీరమేశు నారాధనము చేయు
చుండు నెపుడు నతి మహోత్సవమున.

టీకా:

ఆ = దానికి; క్రింది = క్రిందినున్న; సుతలంబున్ = సుతలము; అందున్ = లో; మహా = గొప్ప; పుణ్యుడు = పుణ్యవంతుడు; అగు = అయిన; విరోచన = విరోచనుని; పుత్రుడు = కుమారుడు; ఐనట్టి = అయినటువంటి; బలి = బలి యనెడి; చక్రవర్తి = మహారాజు; ఆ = ఆ; పాకశాసనున్ = ఇంద్రుని {పాకశాసనుడు - పాకాసురుని శాసించినవాడు, ఇంద్రుడు}; కున్ = కి; ముదము = సంతోషము; ఒసగన్ = కలిగించుట; కోరి = కోసము; అదితి = అదితి యొక్క; గర్భమునన్ = కడుపున; వామన = పొట్టివాని; ఆకృతిన్ = రూపుతో; పుట్టి = అవతరించి; అంతటన్ = ఆ తరువాత; త్రివిక్రమ = త్రివిక్రమ {త్రివిక్రమ - మూడడుగులతో ముల్లోకములను కొలువగల పరాక్రమము (సామర్థ్యము)}; రూపమునను = స్వరూపముతో; లోక = లోకములు; త్రయంబున్ = మూటిని; ఆక్రమించిన = విస్తరిల్లిన; దానవారాతి = విష్ణుమూర్తి {దానవారాతి - దానవుల (రాక్షసుల)కు ఆరాతి (శత్రువు), విష్ణువు}; చేతన్ = చేత; ముందటన = పూర్వము; ఈబడిన = ఇవ్వబడినట్టి; ఇంద్రత్వము = ఇంద్రునిగా ఉండుట; ఇట్లు = ఈవిధముగ (సుతలాధిపతిగా); కలుగువాడు = పొందినవాడు;
పుణ్యకర్మ = పుణ్యకార్యములు; సంధానుండు = చేయువాడు; హరి = విష్ణుమూర్తి; పాద = పాదములు యనెడి; అంబుజ = పద్మములను; అర్చన = సేవించెడి; అభిలాషుండు = కోరికగలవాడు; అగుచున్ = అగుచు; శ్రీరమేశున్ = విష్ణుమూర్తిని {శ్రీరమేశుడు - శ్రీరమ (శ్రీకరమగు లక్ష్మీదేవి)కి ఈశుడు (భర్త), విష్ణువు}; ఆరాధనము = పూజించుట; చేయుచుండున్ = చేయుచుండును; ఎపుడున్ = ఎల్లప్పుడును; అతి = మిక్కిలి; మహోత్సవమునన్ = అధికమైన ఉత్సాహముతో;

భావము:

వితలం క్రింద సుతలం ఉంది. సుతలంలో బలి చక్రవర్తి ఉన్నాడు. అతడు పుణ్యవంతుడైన విరోచనుని కుమారుడు. శ్రీమన్నారాయణుడు ఇంద్రుణ్ణి సంతోషపెట్టాలనుకొని అదితి గర్భంలో వామనుడై పుట్టాడు. త్రివిక్రమ రూపం ప్రదర్శించి ముల్లోకాలను ఆక్రమించాడు. చివరకు విష్ణువు బలి చక్రవర్తికి సుతలంలో ఇంద్రత్వం అనుగ్రహించాడు. ఆ బలి ఎన్నో పుణ్యకర్మలు చేసాడు. శ్రీహరి పాదపద్మాలను సేవించాలనే అభిలాష కలవాడు. అతడు ఎంతో ఉత్సాహంతో లక్ష్మీశుడైన శ్రీమన్నారాయణుని ఆరాధిస్తూ ఉంటాడు.

5.2-113-వ.
 • ఉపకరణాలు:
 •  
 •  
 •  

నరేంద్రా! సకలభూతాంతర్యామియు దీర్థభూతుండును నయిన వాసుదేవుని యందుఁ జిత్తంబు గలిగి యిచ్ఛిన భూదానంబునకు సాక్షాత్కరించిన మోక్షంబు ఫలం బగుం; గాని పాతాళస్వర్గ రాజ్యంబులు ఫలంబులు గానేర; వయిన నెవ్వరికిని మోక్షంబు సాక్షాత్కృతంబు గాకుండుటంజేసి లోకప్రదర్శనార్థంబు పాతాళ స్వర్గరాజ్యంబుల నిచ్చె; క్షుత పతన ప్రస్ఖలనాదు లందును వివశుండైన యెడల నామస్మరణంబు చేయు పురుషుండు గర్మబంధంబువలన విముక్తుం డగుచు సుజ్ఞానంబునం బొందు; నట్టి వాసుదేవుం డాత్మజ్ఞాన ప్రపోషణంబు జేయు మాయామయంబు లైన భోగైశ్వర్యంబుల నెల్ల నెట్లొసంగు ననవలదు; భగవంతుండు యాచనజేసి సకల సంపదలఁ జేకొని శరీరమాత్రావశిష్టునిం జేసి వారుణ పాశంబులం గట్టి విడిచినప్పుడు బలీంద్రు డిట్లనియె.

టీకా:

నరేంద్రా = రాజా; సకల = అఖిలమైన; భూత = జీవుల; అంతర్యమియున్ = అంతరాత్మగా ఉండువాడు; తీర్థభూతుండును = పుణ్యతీర్థ స్వరూప మైనవాడును; అయిన = అయినట్టి; వాసుదేవుని = విష్ణుమూర్తిని; అందున్ = ఎడల; చిత్తంబున్ = మనసు; కలిగి = కలిగి; ఇచ్చిన = దాన మిచ్చినట్టి; భూదానంబున్ = భూదానమున; కున్ = కు; సాక్షాత్కరించిన = ప్రత్యక్షముగా లభించిన; మోక్షంబు = మోక్షమే; ఫలంబున్ = ఫలితము; అగున్ = అగునే; కాని = కాని; పాతాళ = పాతాళ మందలి; స్వర్గ = స్వర్గమునకు; రాజ్యంబులు = రాజ్యాధికారములు; ఫలంబులున్ = ఫలితములు; కానేరవు = కాలేవు; అయినన్ = అయిప్పటికిని; ఎవ్వరి = ఎవ్వరి; కినిన్ = కి కూడ; మోక్షంబున్ = మోక్షము; సాక్షాత్కృతంబు = ఎదురుగ కనబడునది; కాకుండుటన్ = కాకపోవుట; చేసి = వలన; లోక = లోకములకు; ప్రదర్శన = చక్కగా చూపుట; అర్థము = కోసము; పాతాళ = పాతాళ మందలి; స్వర్గ = స్వర్గమునకు; రాజ్యంబులు = రాజ్యాధికారములు; ఇచ్చెన్ = ఇచ్చెను; క్షుత = తుమ్ముట; పతన = పడుట; ప్రస్ఖలన = తొట్రుపాటు; ఆదులు = మొదలగువాని; అందున్ = అందు; వివశుండు = వశము తప్పినవాడు; ఐన = అయిన; ఎడల = సమయములలో; నామ = భగవంతుని నామమును; స్మరణంబు = స్మరించుట; చేయు = చేసెడి; పురుషుండు = మానవుడు; కర్మబంధంబున్ = కర్మబంధముల; వలనన్ = నుండి; విముక్తుండు = ముక్తిపొందినవాడు; అగుచున్ = అగుచు; సుజ్ఞానంబునన్ = మంచి జ్ఞానమును; పొందును = పొందును; అట్టి = అటువంటి; వాసుదేవుండు = నారాయణుడు; ఆత్మజ్ఞాన = తత్త్వజ్ఞానమును; ప్రపోషణంబున్ = చక్కగా పోషింపబడినదిగా; చేయున్ = చేయును; మాయా = మాయతో; మయంబులు = నిండినవి; ఐన = అయిన; భోగ = భోగములు; ఐశ్వర్యంబులన్ = సంపదలు; ఎల్లన్ = సర్వమును; ఎట్లు = ఏ విధము; ఒసంగున్ = ప్రసాదించును; అనవలదు = అనవద్దు; భగవంతుడు = విష్ణుమూర్తి; యాచన = యాచించుట; చేసి = చేసి; సకల = సర్వ; సంపదలన్ = సంపదలను; చేకొని = స్వీకరించి; శరీర = దేహము; మాత్ర = మాత్రమే; అవశిష్టునిన్ = మిగిలినవానిగా; చేసి = చేసి; వారుణ = వరుణ; పాశంబులన్ = తాళ్ళతో; కట్టి = కట్టివేసి; విడిచిన = వదలిన; బలి = బలి అనెడి; ఇంద్రుడు = ఇంద్రుడు; ఇట్లు = ఈ విధముగ; అనియె = పలికెను;

భావము:

రాజా! వాసుదేవుడు అన్ని ప్రాణులలోను అంతర్యామిగా ఉండేవాడు. పైగా పుణ్యతీర్థం లాగా పవిత్రుడు. అటువంటి వాసుదేవుని మనసులో నిలుపుకొని బలిచక్రవర్తి భూదానం చేసాడు. ఇటువంటి భూదానానికి శ్రీమన్నారాయణుడు మెచ్చుకొని సాక్షాత్కరించాడు. ఆ సాక్షాత్కారానికి మోక్షమే ఫలం. అంతేకాని స్వర్గరాజ్యం కాని, పాతాళరాజ్యం కాని ఫలాలు కావు. అయితే ముక్తి అన్నది ఎవరికీ కనిపించేది కాదు. అందువల్ల శ్రీహరి బలిచక్రవర్తికి లోక ప్రదర్శనార్థం పాతాళ స్వర్గరాజ్యాలు ఇచ్చాడు. తుమ్మినప్పుడు, పడినప్పుడు, కాలు జారినప్పుడు, తెలివి తప్పినప్పుడు శ్రీమన్నారాయణుని నామస్మరణం చేసే పురుషునికి కర్మబంధాలు ఉండవు. ఆ బంధాల నుండి విముక్తి పొంది సుజ్ఞానవంతు డౌతాడు. ఆత్మజ్ఞానం అనుగ్రహించే వాసుదేవుడు మాయామయమైన ఇహలోక భోగాలను, అశాశ్వతమైన ఐశ్వర్యాలను ఏ విధంగా ప్రసాదిస్తాడనే సందేహం వద్దు. శ్రీహరి యాచన నెపంతో బలిచక్రవర్తి సర్వ సంపదలను హరించాడు. బలిని కేవలం శరీరమాత్ర అవశిష్టుణ్ణి చేసాడు. వారుణ పాశాలతో బంధించి చివరకు వదలిపెట్టినప్పుడు బలి ఈ విధంగా అన్నాడు.

5.2-114-సీ.
 • ఉపకరణాలు:
 •  
 •  
 •  

రమేశ్వరునకు నెప్పటి పదార్థములందు-
దృష్ణ లేకుండుట దెలిసినాఁడ
నింద్రాదులెల్ల నుపేంద్రునిఁ బ్రార్థించి-
డిగిరి గాని శ్రీరికిఁ గోరి
లు లేవు; మిక్కిలి గంభీరమగు మహా-
కాల స్వభావంబు లుగుచుండు
రయంగ మన్వంతరాధిపత్యమును లో-
త్రయంబును నెంత గాన తలప

5.2-114.1-ఆ.
 • ఉపకరణాలు:
 •  
 •  
 •  

త్పితామహుండు మానవంతుండు ప్ర
హ్లాద విభునిఁ జూచి ర్షమంది
యెద్ధియైనఁ గోరు మిచ్చెద ననుటకు
నంతలోన నీశ్వరాజ్ఞఁ దెలిసి.

టీకా:

పరమేశ్వరున్ = విష్ణుమూర్తి; కున్ = కి; ఎప్పటి = ఎటువంటి; పదార్థంబుల్ = వస్తువుల; అందున్ = ఎడలను; తృష్ణ = కాంక్ష; లేకుండుట = లేకపోవుట; తెలిసినాడన్ = తెలిసికొంటిని; ఇంద్ర = ఇంద్రుడు; ఆదులు = మొదలైనవారు; ఎల్లను = అందరును; ఉపేంద్రుని = విష్ణుమూర్తిని; ప్రార్థించి = వేడుకొని; = అడిగిరి = అడిగిరి; కాని = అంతేకాని; శ్రీహరి = నారాయణుని; కిన్ = కి; కోరికలు = కోరికలు; లేవు = లేవు; మిక్కిలి = బహు; గంభీరము = లోతైనది; అగు = అయిన; మహా = గొప్ప; కాల = కాలమే; స్వభావంబు = స్వభావము; కలుగుచున్ = కలిగుంటూ; ఉండున్ = ఉండును; అరయంగ = తెలిసికొన్నచో; మన్వంతర = మన్వంతరమునందు; అధిపత్యమును = అధికారము; లోకత్రయంబునున్ = ముల్లోకములందు {ముల్లోకములు - భూః భువః సువః లోకములు మూడు}; ఎంతగాన = ఏమాత్రము; తలపన్ = తలచుకొనుటకు;
మత్ = మా యొక్క; పితామహుండు = తాత; మానవంతుడు = మంచివర్తనగలవాడు; ప్రహ్లాద = ప్రహ్లాదుడు యనెడి {ప్రహ్లాదుడు - ప్ర (మిక్కిలి) హ్లాదుడు (సంతోషముగలవాడు)}; విభునిన్ = ప్రభువును; చూచి = దర్శించి; హర్షమున్ = సంతోషమును; అంది = పొంది; ఎద్ది = ఏది; ఐనన్ = అయినను; కోరుము = కోరుకొనుము; ఇచ్చెదను = ఇచ్చెదను; అనుట = అనగా; కున్ = దానికి; అంత = దాని; లోన్ = లోని; ఈశ్వర = భగవంతుని; ఆజ్ఞ = అనుజ్ఞ; తెలిసి = అర్థముచేసికొని;

భావము:

“భగవంతునికి ఎటువంటి పదార్థాలపైన కాంక్ష లేదని నాకు తెలుసు. ఇంద్రుడు మొదలైన దేవతలు ఉపేంద్రుని ప్రార్థించడం వల్ల ఆ స్వామి వచ్చి నన్ను యాచించాడు. అంతేకాని అసలు శ్రీహరికి కోరికలనేవి లేవు. అదే గంభీరమైన ఆయన స్వభావం. దృష్టి ఉన్నవారికి మన్వంతరాధిపత్యం ఎంత? త్రిలోకాధిపత్యం ఎంత? మా పితామహుడు ప్రహ్లాదుడు అభిమానవంతుడు. నరసింహావతారంలో ఆ స్వామి ఎంతో సంతోషంతో మా తాతను చూచి ఏది అడిగితే అది ఇస్తానని అన్నాడు. అప్పుడు మహానుభావుడైన ప్రహ్లాదుడు ఈశ్వరాజ్ఞలోని అంతరార్థాన్ని తెలిసికొని...

5.2-115-వ.
 • ఉపకరణాలు:
 •  
 •  
 •  

ఇట్లకుతోభయంబుఁ బిత్ర్యం బయిన రాజ్యంబు నొల్లక పరమేశ్వరు దాస్యంబ కోరె, నా ప్రహ్లాద చరిత్ర కథనావసరమ్మున నీ తండ్రికిని నీకును విశేషంబుగా నే పురుషుండు భగవదనుగ్రహంబుఁ బొంద నోపు" నని పుండరీకాక్షుం డానతిచ్చిన వాక్యంబులు వక్ష్యమాణ గ్రంథంబున విస్తరించెద; నా బలిచక్రవర్తి గృహద్వారంబున నఖిలలోకగురుం డయిన శ్రీమన్నారాయణుండు గదాపాణియును నిజజనానుకంపితుండును శంఖచక్రాద్యాయుధ ధరుండును, నగుచు నిప్పుడును దేజరిల్లుచుండు; నట్టి బలిద్వారంబున లోకంబుల గెలువ నిచ్చగొన్న దశగ్రీవుం డుల్లంఘిత శాసనుండై ప్రవేశంబు గావింప నయ్యాది పురుషుండు దన పాదాంగుష్ఠంబున యోజనాయు తాయుతంబులం బాఱం జిమ్మె; వినుము.

టీకా:

ఇట్లు = ఈ విధముగ; అకుతోభయము = దేనివలనను వెఱపులేకపోవుట {వ్యు. న + కుతః + భయమ్}; ఐ = అయ్యి; పిత్ర్యంబు = పిత్రార్జితంబు; అయిన = అయినట్టి; రాజ్యంబున్ = రాజ్యాధికారమును; ఒల్లకన్ = కోరక; పరమేశ్వరు = భగవంతుని; దాస్యంబున్ = సేవను; కోరెన్ = కోరుకొనెను; ఆ = ఆ; ప్రహ్లాద = ప్రహ్లాదుని యొక్క; చరిత్ర = వర్తనము; కథన = జరిగెడు; అవసరమ్మునన్ = సమయము నందు; నీ = నీ యొక్క; తండ్రి = నాన్న; కిని = కంటెను; నీకునున్ = నీకంటెను; విశేషంబుగాన్ = అధికముగా; ఏ = ఏ యొక్క; పురుషుండు = మానవుడు; భగవత్ = భగవంతుని; అనుగ్రహంబున్ = అనుగ్రహమును; పొందనోపును = పొందగలడు; అని = అని; పుండరీకాక్షుండు = నారాయణుడు {పుండరీకాక్షుడు - పుండరీకములు (పద్మముల వంటి) అక్షుడు (కన్నులు కలవాడు), విష్ణువు}; ఆనతిచ్చిన = చెప్పినట్టి; వాక్యంబులున్ = మాటలను; వక్ష్యమాన = రాబోవు; గ్రంథంబునన్ = పుస్తక భాగములో; విస్తరించెదన్ = విస్తరించి చెప్పెదను; ఆ = ఆ; బలిచక్రవర్తి = బలిచక్రవర్తి యొక్క; గృహ = గృహ; ద్వారంబునన్ = ద్వారము వద్ద; అఖిల = సర్వమైన; లోక = జగత్తులకు; గురుండు = గురుడు; అయిన = అయినట్టి; శ్రీమత్ = శ్రీమంతమైన; నారాయణుండు = నారాయణుడు {నారాయణుడు - నారముల (నీటి) యందు వసించెడివాడు, విష్ణువు}; గదాపాణి = గదను చేత ధరించినవాడు; నిజ = తన; జనా = వారి ఎడల; అనుకంపింతుండును = దయ కలవాడు; శంఖ = శంఖము; చక్ర = చక్రము; ఆది = మొదలగు; ఆయుధ = ఆయుధములను; ధరుండునున్ = ధరించినవాడు; అగుచును = అగుచు; ఇప్పుడునున్ = ఇప్పుడు కూడ; తేజరిల్లుచుండున్ = విలసిల్లుతుండును; అట్టి = అటువంటి; బలి = బలిచక్రవర్తి యొక్క; ద్వారంబునన్ = గుమ్మమును; లోకంబులన్ = లోకములను; గెలువన్ = గెలిచెడి; ఇచ్చగొన్న = కాంక్షించుతున్న; దశగ్రీవుండు = రావణాసురుడు {దశగ్రీవుడు - దశ (పది) గ్రీవుడు (కంఠములు కలవాడు), రావణుడు}; ఉల్లంఘిత = అతిక్రమించిన; శాసనుండు = ఆజ్ఞ కలవాడు; ఐ = అయ్యి; ప్రవేశంబున్ = ప్రవేశించుట; కావింపన్ = చేయగా; ఆ = ఆ; ఆదిపురుషుండు = నారాయణుడు {ఆదిపురుషుడు - సృష్టికి మొదటినుండి ఉన్న పురుషుడు (కారకుడు), విష్ణువు}; పాద = కాలి; అంగుష్ఠంబునన్ = బొటకనవేలితో; యోజన = యోజనములు; ఆయుత = పదివేల; ఆయుతంబులన్ = దూరమునకు; పాఱంజిమ్మె = విసిరివేసెను; వినుము = వినుము;

భావము:

మా తాత దేనివలననూ భయంలేని తన తండ్రి రాజ్యం కావాలని కోరలేదు. పరమేశ్వరుని దాస్యాన్నే కోరాడు” అన్నాడు. అప్పుడు “నీ తండ్రికంటే నీకంటే విశేషంగా ఏ పురుషుడు భగవదనుగ్రహం పొందగలుగుతాడు?” అంటూ ఆ పుండరీకాక్షుడు పలికిన పలుకుల సారాన్ని తరువాత (సప్తమ స్కంధంలో) విస్తరించి చెబుతాను. సకల జగద్గురుడైన శ్రీమన్నారాయణుడు తన వారిపట్ల దయ కలిగిన వాడై శంఖం, చక్రం మొదలైన ఆయుధాలతో గదను ధరించి ఆ బలిచక్రవర్తి గృహద్వారంలో ఇప్పటికీ కాపలా కాస్తున్నాడు. అటువంటి బలిచక్రవర్తి ఉండే సుతలలోకాన్ని జయించాలనే వాంఛ గొన్న రావణుడు అనుజ్ఞ లేకుండా సుతలం లోనికి ప్రవేశించినప్పుడు ఆ శ్రీహరి తన కాలి బొటన వ్రేలితో లంకేశ్వరుణ్ణి పదికోట్ల యోజనాల దూరంలో పడేటట్లు చిమ్మివేశాడు.

5.2-116-క.
 • ఉపకరణాలు:
 •  
 •  
 •  

సుతలమునకుఁ గ్రిందై
భాసిల్లుఁ దలాతలంబు; ప్రభు వందు మయుం
డా సురపుర నిర్మాతగ
వాసిగఁ బొగడొంది యేలు సుధాధీశా!

టీకా:

ఆ = ఆ; సుతలమున్ = సుతలము; కున్ = కు; క్రిందన్ = క్రిందిది; ఐ = అయ్యి; భాసిల్లున్ = ప్రకాశించును; తలాతలంబున్ = తలాతలము; ప్రభువు = ప్రభువు; అందున్ = అందు; మయుండు = మయుడు; ఆ = ఆ; అసురపుర = రాక్షస నగరములను; నిర్మాతగా = నిర్మించినవానిగా; = వాసిగన్ = ప్రసిద్ధముగా; పొగడు = కీర్తిని; పొంది = పొంది; ఏలు = పరిపాలించును; వసుధాధీశా = రాజా;

భావము:

రాజా! ఆ సుతలానికి క్రింది భాగంలో తలాతలం ఉంది. రాక్షసుల పట్టణాలను నిర్మించిన మహాశిల్పిగా ప్రసిద్ధుడైన మయుడు ఆ తలాతలాన్ని పాలిస్తుంటాడు.

5.2-117-చ.
 • ఉపకరణాలు:
 •  
 •  
 •  

పుహరుచే రమేశ్వరుఁడు భూతహితార్థముగాఁ బురత్రయం
రుదుగ నీఱు జేసె; శరణాగతు నా మయుఁ గాచి యెంతయుం
రుణఁ దలాతలంబునకుఁ ర్తగ నిల్పిన నున్నవాఁడు శ్రీ
రుని సుదర్శనంబునకుఁ ప్పి విముక్తభయుండు గాఁ దగన్.

టీకా:

పురహరున్ = పరమశివుని {పురహరుడు - త్రిపురములను హరించినవాడు, శివుడు}; చేన్ = చేత; రమేశ్వరుడు = హరి {రమేశ్వరుడు - రమ (లక్ష్మీదేవి)కి ఈశ్వరుడు (ప్రభువు), విష్ణువు}; భూత = భూతములకు; హిత = మేలు; అర్థముగాన్ = కోసము; పురత్రయమును = త్రిపురములను; అరుదుగన్ = అద్భుతముగా; నీఱుజేసెన్ = భస్మముజేసెను; శరణాగతున్ = శరణు కోరినవానిని; ఆ = ఆ; మయున్ = మయుని; కాచి = కాపాడి; ఎంతయున్ = మిక్కిలి; కరుణన్ = దయతో; తలాతలంబున్ = తలాతలమున; కున్ = కు; కర్తగ = భర్తగా; నిల్పినన్ = నిలబెట్టగా; ఉన్నవాడు = ఉన్నాడు; శ్రీధరుని = విష్ణుమూర్తి యొక్క {శ్రీధరః- శ్రీదేవిని వక్షమున ధరించినవాడు, విష్ణుసహస్రనామాలు 610వ నామం}; సుదర్శనంబున్ = సుదర్శనచక్రమున; కున్ = కు; తప్పి = తప్పించి; విముక్త = విడిచిన; భయుండున్ = భయము కలవాడు; కాన్ = అయ్యి; తగన్ = పూర్తిగా;

భావము:

ముల్లోకాలకు హితం కలిగించడానికి శ్రీహరి శివునిచేత త్రిపురాలను బూడిద చేయించాడు. అప్పుడు మయుడు విష్ణువును శరణు పొందాడు. శ్రీహరి మయుణ్ణి కనికరించి తలాతలానికి రాజుగా చేసాడు. అతనికి విష్ణుదేవుని సుదర్శన చక్రం వల్ల తప్ప మరి దేనివల్లను మరణభయం లేదు.

5.2-118-క.
 • ఉపకరణాలు:
 •  
 •  
 •  

లఁపఁగ నా క్రింద మహా
మునఁ గద్రువవధూటి నయులు సర్పం
బులు గలవు పెక్కు శిరములు
రంగాఁ గ్రోధవశగణావళి యనఁగన్.

టీకా:

తలపగన్ = విచారించిన; ఆ = ఆ; క్రింద = క్రిందిది; మహాతలమునన్ = మహాతలము నందు; కద్రువ = కద్రువ యనెడు; వధూటి = స్త్రీమూర్తి యొక్క; తనయులు = సంతానము; సర్పంబులు = పాములు; కలవు = ఉన్నవి; పెక్కు = అనేకమైన; శిరములన్ = శిరస్సులతో; అలరంగన్ = ఒప్పుతుండగా; క్రోధ = క్రోధమునకు; వశ = లొంగినట్టి; గణ = సమూహముల; ఆవళి = ఉపద్రవము; అనగగన్ = అన్నట్లుగ;

భావము:

తలాతలానికి క్రింద మహాతలం ఉంది. ఆ మహతలంలో కద్రువ కొడుకులైన సర్పరాజులు ఉన్నారు. వారికి ఒక్కొక్కరికి పెక్కు పడగ లున్నాయి. ఆ సర్పగణం కోపోద్రేకంతో ప్రవర్తిస్తూ ఉంటారు.

5.2-119-వ.
 • ఉపకరణాలు:
 •  
 •  
 •  

మఱియును గుహక తక్షక కాళియ సుషేణాది ప్రధాను లయిన వార లతుల శరీరంబులు గలిగి యాదిపురుషుని వాహనం బైన పతగరాజ భయంబున ననవరతంబు నుద్వేజితు లగుచు స్వకళత్రా పత్య సుహృద్భాంధవ సమేతు లయి యుండుదు; రా క్రింద రసాతలంబున దైత్యులు దానవులు నగు నివాతకవచ కాలకేయు లను హిరణ్యపుర నివాసులగు దేవతాశత్రువులు మహా సాహసులును దేజోధికులును నగుచు సకల లోకాధీశ్వరుండైన శ్రీహరితేజంబునం బ్రతిహతులై వల్మీకంబు నందు నడంగి యున్న సర్పంబుల చందంబున నింద్రదూత యగు సరమచేఁ జెప్పబడెడు మంత్రాత్మక వాక్యంబులకు భయంబు నొందు చుండుదురు.

టీకా:

మఱియునున్ = ఇంకను; కుహక = కుహకుడు; తక్షక = తక్షకుడు; కాళియ = కాళియుడు; సుషేణ = సుషేణుడు; ఆది = మొదలగు; ప్రధానులు = ముఖ్యులు; అయిన = అయినట్టి; వారలు = వారు; అతుల = సాటిలేని; శరీరంబులున్ = దేహములు; కలిగి = కలిగి ఉండి; ఆదిపురుషుని = నారాయణుని; వాహనంబున్ = వాహనము; ఐన = అయినట్టి; పతగరాజ = గరుత్మంతుని {పతగరాజు - పతంగ (పక్షుల)కు రాజు, గరుత్మంతుడు}; భయంబునన్ = భయమువలన; అనవరతంబు = ఎడతెగక; ఉద్వేజితులు = భయపడుతున్నవారు; అగుచున్ = అగుచు; స్వ = తమ; కళత్రా = భార్యలు; అపత్య = సంతానము; సుహృత్ = స్నేహితులు; బాంధవ = బంధువుల; సమేతులు = కూడినవారు; అయి = అయ్యి; ఉండుదురు = ఉండెదరు; ఆ = దానికి; క్రిందన్ = క్రిందను; రసాతలంబునన్ = రసాతలమున; దైత్యులున్ = దైత్యులు {దైత్యులు - దితి యొక్క సంతానము, రాక్షసులు}; దానవులున్ = దానవులు; అగు = అయినట్టి; నివాత = నివాతులు; కవచ = కవచులు; కాలకేయులు = కాలకేయులు; అను = అనెడి; హిరణ్యపుర = హిరణ్యపురము నందు; నివాసులు = నివసించెడివారు; అగున్ = అయిన; దేవతా = దేవతలకు; శత్రువులు = శత్రువులు; మహా = గొప్ప; సాహసులును = సాహసము కలవారును; తేజస్ = తేజస్సు; అధికులునున్ = అధికముగా కలవారు; అగుచున్ = అగుచు; సకల = సర్వమైన; లోక = జగత్తులకు; అధీశ్వరుండున్ = ప్రభువు; ఐన = అయిన; శ్రీహరి = నారాయణుని; తేజంబునన్ = తేజస్సు యందు; ప్రతిహతులున్ = ఓడింపబడువారును; ఐ = అయ్యి; వల్మీకంబునన్ = పుట్ట; అందున్ = లో; అడంగి = అణగి; ఉన్న = ఉన్నట్టి; సర్పంబులన్ = పాముల; చందంబునన్ = వలె; ఇంద్ర = ఇంద్రుని యొక్క; దూత = దూత; అగు = అయిన; సరమ = సరమ; చేన్ = చేత; చెప్పబడెడు = ఉచ్చరింపబడెడు; మంత్రాత్మక = మంత్రపూర్వకములగు; వాక్యంబుల్ = వాక్యముల; కున్ = కు; భయంబున్ = భయమును; ఒందుచుండుదురు = పొందుతుందురు;

భావము:

ఇంకా ఆ మహాతలంలో కుహకుడు, తక్షకుడు, కాళియుడు, సుషేణుడు మొదలైన సర్ప ముఖ్యు లున్నారు. వారు సాటిలేని మేటిరూపం కలవారు. ఆదిపురుషుడైన నారాయణుని వాహనమైన గరుత్మంతుని భయంవల్ల కలవరపడుతూ ఎల్లప్పుడూ భార్యలతో, బిడ్డలతో, మిత్రులతో, బంధువులతో కలిసి ఉంటారు. మహాతలం క్రింద రసాతలం ఉంది. ఆ రసాతలంలో దైత్యులు, దానవులు అయిన హిరణ్యపురవాసులు, నివాతకవచులు, కాలకేయులు అనేవారు నివాసం చేస్తుంటారు. వారు దేవతల పట్ల శత్రుత్వం వహించి ఉంటారు. వారు మహా సాహసవంతులు, తేజోవంతులు. అయినా అన్ని లోకాలకు ప్రభువైన శ్రీహరి తేజస్సుకు లొంగినవారై పుట్టలలో దాగిన సర్పాల మాదిరిగా భయంతో బ్రతుకుతుంటారు. ఇంద్రుని దూతి అయిన సరమ ఉచ్చరించే మంత్రాలకు భయపడుతూ ఉంటారు.

5.2-120-క.
 • ఉపకరణాలు:
 •  
 •  
 •  

ఇందుకులోద్భవ! వినుమా
క్రింటి పాతాళమునను గ్రీడించుచు నా
నంము నొందుచు నుండును
సండిఁబడి నాగకులము తురత తోఁడన్.

టీకా:

ఇందుకులోద్భవ = పరీక్షితుడా {ఇందుకు లోద్భవుడు - ఇందు (చంద్ర) కుల (వంశము) ఉద్భవుడు (పుట్టినవాడు), పరీక్షితుడు}; వినుము = వినుము; ఆ = ఆ; క్రిందటి = క్రిందది ఐన; పాతాళమునను = పాతాళము నందు; క్రీడించుచున్ = క్రీడించుతూ; ఆనందమున్ = సంతోషమును; ఒందుచుండును = పొందుతుండును; సందడిబడి = సందడించుచు; నాగకులము = నాగులు; చతురత = చాతుర్యముల; తోడన్ = తోటి;

భావము:

చంద్రవంశంలో పుట్టిన పరీక్షిన్మహారాజా! విను. అన్నిటికన్నా దిగువ పాతాళలోకం ఉంది. ఆ పాతాళలోకం లోని నాగజాతివారు ఎంతో తెలివి గలవారై ఎంతో ఉత్సాహంగా తిరుగుతూ ఉంటారు.

5.2-121-వ.
 • ఉపకరణాలు:
 •  
 •  
 •  

ఇట్లు వాసుకి ప్రముఖులైన శంఖ కుళిక మహాశంఖ శ్వేత ధనంజయ ధృతరాష్ట్ర శంఖచూడ కంబళాశ్వతర దేవదత్తాదు లయిన మహానాగంబు లైదు నేడు పది నూఱు వేయి శిరంబులు గలిగి ఫణామణికాంతులం జేసి పాతాళ తిమిరంబును బాపుచుందురు.

టీకా:

ఇట్లు = ఈ విధముగా; వాసుకి = వాసుకి; ప్రముఖులు = మొదలగు ముఖ్యులు; ఐన = అయిన; శంఖ = శంఖుడు; కుళిక = కుళికుడు; మహాశంఖ = మహాశంఖుడు; శ్వేత = శ్వేతుడు; ధనంజయ = ధనంజయుడు; ధృతరాష్ట్ర = ధృతరాష్ట్రుడు; శంఖచూడ = శంఖచూడుడు; కంబళ = కంబళుడు; అశ్వతర = అశ్వతరుడు; దేవదత్త = దేవదత్తుడు; ఆదులు = మొదలైనవారు; అయిన = ఐన; మహా = గొప్ప; నాగంబులున్ = నాగములు; ఐదు = అయిదు (5); ఏడు = ఏడు (7); పది = పది (10); నూఱు = వంద (100); వేయి = వెయ్యి (1,000); శిరంబులున్ = తలలు, పడగలు; కలిగి = కలిగి ఉండి; ఫణా = పడగ లందలి; మణి = మణుల; కాంతులన్ = వెలుగుల; చేసి = వలన; పాతాళ = పాతాళ మందలి; తిమిరంబున్ = చీకటిని; పాపుచుందురు = పోగొట్టుచుందురు;

భావము:

వాసుకి, శంఖుడు, కుళికుడు, మహాశంఖుడు, శ్వేతుడు, ధనంజయుడు, ధృతరాష్ట్రుడు, శంఖచూడుడు, కంబళుడు, అశ్వతరుడు, దేవదత్తుడు మొదలైనవారు పాతాళలోక వాసులైన మహానాగులు. వారిలో కొందరు ఐదు తలలవారు, కొందరు నూరు తలలవారు, వేయి తలలవారూ ఉన్నారు. వారి పడగల మీద మణులు మెరుస్తూ ఉంటాయి. ఆ మణుల కాంతులు పాతాళంలోని చీకట్లను పారద్రోలుతుంటాయి.

5.2-122-సీ.
 • ఉపకరణాలు:
 •  
 •  
 •  

పాతాళలోకంబు పాఁతున శేషుండు-
వెలయంగ ముప్పదివేల యోజ
నంబుల వెడలుపును దోఁకఁ జుట్టగా-
జుట్టుక యుండు; విష్ణుని మహోగ్ర
మైన శరీరంబు; దానై యనంతాఖ్య-
సంకర్షణుం డుండు సంతతంబు;
ట్టి యనంత నామాభిధానుని మస్త-
మున సిద్ధార్థంబు రణి ధరణి;

5.2-122.1-ఆ.
 • ఉపకరణాలు:
 •  
 •  
 •  

యంత నా విభుండు ఖిలలోకంబుల
సంహరింపఁగోరి చండకోప
శత సృజనఁ జేయు రుస నేకాదశ
రుద్రమూర్తు లనెడు రౌద్రమతుల.
^ ఏకాదశ రుద్రులు -వారి స్థానములు.

టీకా:

పాతాళలోకంబున్ = పాతాళలోకము; పాతునన్ = అడుగు భాగమున; శేషుండు = ఆదిశేషుడు; వెలయంగ = ప్రసిద్ధముగ; ముప్పదివేల = ముప్పైవేల (30,000); యోజనంబులన్ = యోజనముల; వెడలుపుననను = విశాలముగా; తోకన్ = తోకను; చుట్టగా = చుట్టగా; చుట్టుకన్ = చుట్టుకొని; ఉండున్ = ఉండును; విష్ణుని = నారాయణుని యొక్క; మహా = మిక్కిలి; ఉగ్రమైన = క్రోధపూరితమైన; శరీరంబున్ = దేహము; తానున్ = తను; ఐ = అయ్యి; అనంత = అనంతుడు; ఆఖ్యన్ = పేరుతో; సంకర్షణుండు = సంకర్షుణుండు {సంకర్షుణుడు - చతుర్వూహములలోని (1వాసుదేవ 2ప్రద్యుమ్న 3అనిరుద్ధ 4సంకర్షణ) సంకర్షణమనబడెడి వ్యూహము}; ఉండున్ = ఉండును; సంతతంబున్ = ఎల్లప్పుడును; అట్టి = అటువంటి; అనంత = అనంతుడు; నామ = పేరు; అభిదానుని = గలవాని; మస్తకమునన్ = శిరస్సుపైన, పడగపైన; సిద్ధార్థంబున్ = తెల్ల ఆవగింజ; కరణిన్ = వలె; ధరణి = భూమండలము;
అంతన్ = ప్రళయకాలమందు; విభుండు = ప్రభువు; అఖిల = సర్వమైన; లోకంబులన్ = లోకములను; సంహరింపన్ = సంహరింపజేయ; కోరి = కోరుతూ; చండ = భయంకరమైన; కోప = క్రోధమునకు; వశతన్ = లోనగుటచేత; సృజనజేయు = సృష్టించును; వరుసన్ = వరుసగా; ఏకాదశ = పదకొండుగురు {ఏకాదశరుద్రులు - 1అజుడు 2ఏకపాదుడు 3అహిర్బుద్న్యుడు 4త్వష్ట 5రుద్రుడు 6హరుడు 7శంభుడు 8త్రయంబకుడు 9అపరాజితుడు 10ఈశానుడు 11త్రిభువనుడు}; రుద్రమూర్తులన్ = రుద్రులు యనెడు; రౌద్ర = రౌద్రమైన; మతులన్ = మనసులుగలవారిని;

భావము:

పాతాళలోకం అడుగున ఆదిశేషుడు ఉన్నాడు. అతడు ముప్పైవేల యోజనాల వెడల్పున చుట్ట చుట్టుకొని ఉంటాడు. విష్ణుదేవుని మహత్తర శరీరమైన ఆ ఆదిశేషునికే అనంతుడు, సంకర్షణుడు అని పేర్లు. అనంతుడని పేరు కలిగిన ఆదిశేషుని తలమీద ఆవగింజలాగా ఈ భూమండలం ఉన్నది. ప్రళయకాలంలో లోకాలను సంహరించే నిమిత్తం ఈ ఆదిశేషుడు ప్రచండమైన కోపంతో పదకొండు మంది రుద్రులను సృష్టిస్తాడు.

5.2-123-ఆ.
 • ఉపకరణాలు:
 •  
 •  
 •  

ట్టి రుద్రమూర్తు తుల త్రినేత్రులు
ఖిలశూల హస్తు గుచు నుందు;
రందు నున్న ఫణికులాధిపుల్ శేషుని
పాదపంకజముల క్తిఁ జేరి.

టీకా:

అట్టి = అటువంటి; రుద్రమూర్తులన్ = రౌద్రమైన స్వరూపులను; అతుల = సాటిలేని; త్రినేత్రులున్ = మూడు (3) కన్నులవారు; శూల = శూలములను; హస్తులు = చేతబట్టినవారు; అగుచున్ = అగుచు; ఉందురు = ఉండెదరు; అందున్ = దానిలో; ఉన్న = ఉన్నట్టి; ఫణి = నాగ; కుల = వంశ; అధిపులు = గొప్పవారు; శేషుని = ఆదిశేషుని యొక్క; పాద = పాదము లనెడి; పంకజములన్ = పద్మములను; భక్తిన్ = భక్తితో; చేరి = సమీపించి;

భావము:

ఆ రుద్రమూర్తు లందరూ మూడు కన్నులు కలవారు. అందరూ త్రిశూలధారులు. ఆ లోకంలోని సర్పరాజులు ఆదిశేషుని పాదపద్మాలపై భక్తి కలిగి ఉంటారు.

5.2-124-ఆ.
 • ఉపకరణాలు:
 •  
 •  
 •  

మ్రు లగుచు ననుదినంబును మౌళి ర
త్నములచేతఁ గడు ముదంబు నొంది
కోరికలు దలిర్ప నీరాజనంబుల
నిచ్చుచుందు రెపుడు చ్చికలను.

టీకా:

నమ్రులు = నమ్రతగా ఒంగి ఉన్నవారు; అగుచున్ = అగుచు; అనుదినంబునున్ = ప్రతిదినము; మౌళి = పడగన కల; రత్నముల్ = మణుల; చేతన్ = వలన; కడున్ = మిక్కిలి; ముదంబున్ = సంతోషమును; ఒంది = పొంది; కోరికలున్ = కోరికలు; తలిర్పన్ = చిగురించగా; నీరాజనంబులన్ = హారతులను; ఇచ్చుచుందురు = ఇస్తుంటారు; ఎపుడున్ = ఎల్లప్పుడును; మచ్చికలను = చనువుగా;

భావము:

ఆ సర్పరాజులు ఆదిశేషుని పట్ల వినమ్రత కలవారై ప్రతిదినం తమ పడగల మీది రత్నాల కాంతులతో ఆయనకు నీరాజనాలు అర్పిస్తుంటారు.

5.2-125-వ.
 • ఉపకరణాలు:
 •  
 •  
 •  

మఱియు; నా సంకర్షణమూర్తిం జేరి నాగకన్యకలు కోరికలు గల వార లగుచు నొప్పెడి శరీర విలాసంబులం జేసి యగరు చందన కుంకుమ పంకంబు లనులేపనంబులు చేయుచు సంకర్షణమూర్తి దర్శన స్పర్శనాదులను నుద్బోధిత మకరధ్వజావేశిత చిత్తంబుల గలిగి చిఱునవ్వు లొలయ నధికాభిలాషం జేసి స్మితావలోకనంబుల సవ్రీడితలై యవలోకించుచుండ ననంత గుణంబులు గల యనంతదేవుం డుపసంహరింపం బడిన క్రోధంబు గలిగి లోకంబులకు క్షేమంబు గోరుచు సురాసుర సిద్ధ గంధర్వ విద్యాధర ముని గణంబులనవరతంబు ధ్యానంబు జేయ సంతత సంతోషాతిశయంబున మ్రాఁగన్నుబెట్టుచు, సలలిత గీతావాద్యంబుల నానందంబు నొందుచుఁ దన పరిజనంబుల నతిస్నేహంబున నవలోకించుచు నవతులసీగంధ పుష్పరసామోదిత మధుకరవ్రాత మధుర గీతంబులు గల వైజయంతీవనమాలికల ధరియించుచు నీలాంబర ధరుండును హలధరుండును నగుచు నితండు మహేంద్రుండో? హరుండో? యనుచు జనంబులు పలుకుచుండఁ గాంచనాంబర ధరుం డై ముముక్షువులు ధ్యానంబులు చేయ నధ్యాత్మ విద్యా యుక్తం బయిన యానంద హృదయ గ్రంథిని భేదించు నట్టి శేషుని స్వాయంభువుండగు నారదుండు తుంబురు ప్రభ్రుతు లగు ఋషిశ్రేష్ఠులతోఁ జేరుకొని కమలాసనుని సభాస్థానము నందు నిట్లు స్తుతియించుచుండు.

టీకా:

మఱియున్ = ఇంకను; ఆ = ఆ; సంకర్షణమూర్తిన్ = సంకర్షుణుని; చేరి = దగ్గరకు వచ్చి; నాగకన్యలు = నాగస్త్రీలు; కోరికలున్ = కోరికలు; కలవారలు = కలిగినవారు; అగుచున్ = అగుచు; ఒప్పెడి = చక్కటి; శరీర = దేహము యొక్క; విలాసంబులన్ = విలాసముల; చేసి = వలన; అగరు = అగరు; చందన = చందనము; కుంకుమ = కుంకుమపువ్వుల; పంకంబుల్ = పైపూతు; అను = అనెడి; లేపనంబులు = లేపనములు; చేయుచు = రాయుచు; సంకర్షణమూర్తిన్ = సంకర్షణుని; దర్శన = దర్శించుకొనుట; స్పర్శన = స్పర్శించుట; ఆదులనున్ = మొదలగువానిచే; ఉద్భోధిత = రగల్చబడిన; మకరధ్వజ = మన్మథుని {మకరద్వజుడు - మకరము (మొసలి) ధ్వజము (జండా) పైగలవాడు, మన్మథుడు}; ఆవేశిత = ఆవేశము పొందిన; చిత్తంబుల్ = మనసులు; కలిగి = కలిగి ఉండి; చిఱునవ్వులున్ = చిరునవ్వులను; ఒలయన్ = ఒలికించుతుండగా; అధిక = మిక్కిలి; అభిలాషన్ = కాంక్షలు; చేసి = వలన; స్మిత = చిరునవ్వులుతో కూడిన; అవలోకనంబులన్ = చూపులతో; సవ్రీడితలు = సిగ్గులు కలవారు; ఐ = అయ్యి; అవలోకించుచుండన్ = చూస్తుండగా; అనంత = అనంతమైన; గుణంబులు = గుణములు; కల = కలిగిన; అనంత = అనంతుడు అనెడు; దేవుండు = దేవుడు; ఉపసంహరింపబడిన్ = తగ్గించుకొన్న; క్రోధంబున్ = క్రోధమును; కలిగి = కలిగి ఉండి; లోకంబుల్ = జగత్తుల; కున్ = కు; క్షేమంబున్ = మేలును; కోరుచున్ = కోరుతూ; సుర = దేవతలు; అసుర = రాక్షసులు; సిద్ధ = సిద్ధులు; గంధర్వ = గంధర్వులు; విద్యాధర = విద్యాధరులు; ముని = మునుల; గణంబులన్ = సమూహములను; అనవరతంబున్ = ఎల్లప్పుడును; ధ్యానంబున్ = ధ్యానము; చేయన్ = చేయుచుండగ; సంతత = నిత్యము; సంతోష = సంతోషము యొక్క; అతిశయనంబునన్ = అతిశయముచేత; మ్రాగన్నున్ = అరమోడ్పు కన్నులను; పెట్టుచున్ = పెడుతూ; సలలితగీత = లలితగీతములతో కూడిన; వాద్యంబులన్ = వాయిద్యములను; ఆనందంబున్ = సంతోషమును; ఒందుచున్ = పొందుతూ; తన = తన యొక్క; పరిజనంబులన్ = పరివారములను; అతి = మిక్కిలి; స్నేహంబునన్ = చనువుగా; అవలోకించుచున్ = చూచుచు; నవ = సరికొత్త; తులసీ = తులసి; గంధ = సువాసనలు కల; పుష్ప = పూల; రస = మకరందమును; ఆమోదిత = అంగీకరించిన; మధుకర = తుమ్మెదల; వ్రాత = సమూహముల యొక్క; మధుర = తీయని; గీతంబులున్ = పాటలు; కల = కలిగిన; వైజయంతీ = వైజయంతీ; వనమాలికలన్ = మాలలను; ధరియించుచు = ధరించుతూ; నీల = నల్లని; అంబర = వస్త్రములను; ధరుండును = ధరించినవాడును; హల = హలాయుధమును; ధరుండును = ధరించినవాడును; అగుచున్ = అగుచు; ఇతండు = ఇతడు; మహేంద్రుడో = విష్ణువేమో; హరుండో = శివుడేమో; అనుచున్ = అనుచు; జనంబులు = ప్రజలు; పలుకుచుండగాన్ = అనుచుండగా; కాంచన = బంగారపు, హాటక; అంబర = వస్త్రములను; ధరుండును = ధరించినవాడును; ఐ = అయ్యి; ముముక్షువులు = మోక్షమును వాంఛించెడివారు; ధ్యానంబులున్ = ధ్యానములను; చేయన్ = చేయగా; అధ్యాత్మ = ఆధ్యాత్మిక; విద్యా = విద్యతో; యుక్తంబున్ = కూడినది; అయిన = అయిన; ఆనంద = ఆనందకరమైన; హృదయ = హృదయ మందలి; గ్రంథినిన్ = గ్రంథిని, ముడిని; భేదించున్ = విడగొట్టును; అట్టి = అటువంటి; శేషుని = ఆదిశేషుని; స్వాయంభువుండు = తనకుతానె జనించినవాడు; అగు = అయిన; నారదుండు = నారదుడు; తుంబురు = తుంబురుడు; ప్రభృతులగు = మొదలగు; ఋషి = ఋషులలో; శ్రేష్ఠుల్ = ఉత్తముల; తోన్ = తోటి; చేరుకొని = కూడుకొని; కమలాసనుని = బ్రహ్మదేవుని {కమలాసనుడు - కమలము ఆసనముగా కలవాడు, బ్రహ్మ}; సభా = సభతీరిన; స్థానమున్ = ప్రదేశము; అందున్ = లో; ఇట్లు = ఈ విధముగా; స్తుతియించుచుండు = స్తోత్రము చేయుచుండును;

భావము:

ఇంకా సంకర్షణమూర్తి అయిన ఆ ఆదిశేషుని దగ్గరికి తమ కోరికలు తీర్చుకోడానికి నాగకన్యలు వస్తుంటారు. ఆయన సమక్షంలో తమ శరీర విలాసాలు ప్రదర్శిస్తూ ఉంటారు. అగరు, చందనం, కుంకుమపువ్వు కలిపిన సుగంధ లేపనాలతో ఆయనను అర్చిస్తారు. ఆ తరువాత ఆ అనంతుని అపురూపమైన రూపాన్ని తనివితీరా చూడడం వల్లను, ఆ మూర్తిని తాకడం వల్లను కామోద్రేకం కలిగినవారవుతారు. ఆ కారణంగా చిరునవ్వును చిందిస్తూ, సిగ్గు లొలకబోస్తూ, క్రీగంటి చూపులు ప్రసరింపజేస్తూ ఆయన వంక చూస్తూ ఉంటారు. అప్పుడు అనంత గుణ సంపన్నుడైన అనంతుడు తన సహజ కోపాన్ని వదలిపెట్టి శాంతుడౌతాడు. లోకాలన్నింటికి క్షేమాన్ని కాంక్షిస్తాడు. దేవతలు, అసురులు, సిద్ధులు, గంధర్వులు, విద్యాధరులు, మునులు అనంతుని సదా ధ్యానం చేస్తుంటారు. అపుడు అనంతుడు సంతోషంతో అరగన్నుమోడ్పులతో లలిత గీతాలతో కూడిన మనోహరమైన వాద్య ధ్వనులకు ఆనందిస్తుంటాడు. తన పరిజనాన్ని ప్రీతితో కటాక్షిస్తుంటాడు. వైజయంతీ వనమాలికలను ధరిస్తుంటాడు. ఆ మాలికలు అప్పుడే కూర్చిన తులసీ మంజరులతో కూడినవై ఉంటాయి. ఆ మంజరుల మకరంద సుగంధాలకు క్రమ్ముకొన్న తుమ్మెదలు జుంజుమ్మని పాటలు పాడుతుంటాయి. అతడెప్పుడూ నల్లని వస్త్రాలు ధరించి నాగలిని ఆయుధంగా పట్టుకొని ఉంటాడు. అతణ్ణి మహేంద్రుడో, శివుడో అని జనులు భావిస్తుంటారు. ఆ శేషుడు మోక్షార్థులై తనను ధ్యానించే వారి హృదయ గ్రంధిని తొలగించి ఆధ్యాత్మవిద్యతో కూడిన ఆనందాన్ని కలిగిస్తాడు. అందువల్లనే ముక్తిని కోరేవారు ఆనంతుని భక్తితో ఆరాధిస్తుంటారు. ఇన్ని మహిమలు కలిగినవాడు కనుక బ్రహ్మమానసపుత్రుడైన నారదుడు తుంబురుడు మొదలైన ఋషి పుంగవులతో కూడి బ్రహ్మదేవుని పేరోలగంలో అనంతుణ్ణి ఈ విధంగా స్తుతిస్తుంటాడు.

5.2-126-సీ.
 • ఉపకరణాలు:
 •  
 •  
 •  

లిమై నెవ్వని లీలావినోదముల్-
న్మ సంరక్షణ క్షయములకును
హేతువు లగుచుండు, నెవ్వని చూపుల-
నియించె సత్త్వరస్తమంబు
లెవ్వని రూపంబు లేకమై బహువిధం-
బులను జగత్తులఁ బ్రోచుచుండు,
నెవ్వని నామంబు లెఱుఁగక తలఁచిన-
యంతన దురితంబు లఁడఁగుచుండు,

5.2-126.1-తే.
 • ఉపకరణాలు:
 •  
 •  
 •  

ట్టి సంకర్షణాఖ్యుండు వ్యయుండు
నైన శేషుని వినుతి జేయంగఁ దరమె?
లఁప నెప్పుడు వాఙ్మనంబులకు నింక
మూఁడు లోకంబులందును భూతతతికి.

టీకా:

ఓలిమై = వరుసగా; ఎవ్వని = ఎవని యొక్క; లీలా = లీలలు, విధానములు; వినోదముల్ = క్రీడలు; జన్మ = సృష్టి; సంరక్షణ = స్థితి; లయముల్ = లయముల; కునున్ = కు; హేతువులు = కారణభూతములు; అగుచుండు = అగుచు ఉండును; ఎవ్వని = ఎవని యొక్క; చూపులన్ = దృక్కులందు; జనియించె = పుట్టెను; సత్త్వరజస్తమంబులు = త్రిగుణములు {త్రిగుణములు - సత్త్వరజస్తమంబులు యనెడి మూడు గుణములు}; ఎవ్వని = ఎవని యొక్క; రూపంబులు = రూపములు; ఏకమై = ఏకాగ్రమై; బహు = అనేక; విధంబులను = విధములుగా; జగత్తులను = లోకములను; ప్రోచుచుండున్ = కాపాడుతుండును; ఎవ్వని = ఎవని యొక్క; నామంబులు = నామములను; ఎఱుగక = తెలియకనైనా; తలచిన = భావించిన; అంతన = అంతనే; దురితంబులు = పాపములు; అడగుచుండున్ = అణగిపోవుతుండును; అట్టి = అటువంటి;
సంకర్షణ = సంకర్షణుడు; ఆఖ్యుండు = అనెడి పేరుగలవాడు; అవ్యయుండు = నాశనములేనివాడు; ఐన = అయినట్టి; శేషుని = ఆదిశేషుని; వినుతిజేయంగన్ = వర్ణించుట; తరమె = సాధ్యమాఏమి; తలపన్ = భావించుటకు; ఎప్పుడును = ఎప్పుడైన; వాక్ = మాటలకు; మనంబులు = మనసుల; కున్ = కును; ఇంక = ఇంకా; మూడులోకంబులు = ముల్లోకములు; అందునున్ = లోను; భూత = జీవుల; తతి = సమూహముల; కిన్ = కి;

భావము:

“ఎవని లీలావినోదాలు సృష్టి స్థితి సంహారాలకు హేతువు లవుతాయో, ఎవని చూపుల వల్ల సత్త్వరజస్తమో గుణాలు పుట్టాయో, ఎవని రూపం లోకాలను అనేక విధాలుగా కాపాడుతూ ఉంటుందో, ఎవని పేరును తెలియక పలికినా పాపాలు పటాపంచ లవుతాయో, అటువంటి సంకర్షణుడు, అవ్యయుడు అయిన ఆదిశేషుని పొగడడం ఎవరికీ సాధ్యంకాని పని. ఆ అనంతుడు వాక్కుకు, మనస్సుకు అందనివాడు. ముల్లోకాల వారికి అంతు చిక్కనివాడు.

5.2-127-ఆ.
 • ఉపకరణాలు:
 •  
 •  
 •  

ఱియుఁ బెక్కుగతుల మాబోఁటి వారలఁ
బ్రోవ దలఁచి శేషమూర్తి సాత్త్వి
స్వభావ మొందెఁ డఁకతో నట్టి శే
షుకు మ్రొక్కుచుందు నుదినంబు.

టీకా:

మఱియున్ = ఇంకను; పెక్కు = అనేక; గతులన్ = విధములుగా; మా = మా; బోటి = వంటి; వారలన్ = వారిని; ప్రోవన్ = కాపాడవలెనని; తలచి = భావించి; శేషమూర్తి = శేషసాయి; సాత్త్విక = సాత్త్వికమైన; స్వభావమున్ = స్వభావమును; ఒందెన్ = పొందెను; కడక = ప్రయత్నము; తోన్ = తోటి; అట్టి = అటువంటి; శేషున్ = శేషసాయి; కున్ = కి; మ్రొక్కుచుందున్ = నమస్కరించెదను; అనుదినంబున్ = ప్రతిదినము నందు;

భావము:

ఇంకా ఎన్నో విధాలుగా మావంటి వారిని కాపాడడం కోసం ఆ ఆదిశేషుడు సాత్త్విక స్వరూపుడై ఉన్నాడు. అటువంటి అనంతునికి ప్రతిదినమూ నమస్కరిస్తాము”.

5.2-128-వ.
 • ఉపకరణాలు:
 •  
 •  
 •  

మఱియు; నా శేషుని నెవ్వండేని నాకస్మికంబుగ నయినను నార్తుం డగుచు నయినను స్మరించినమాత్రన యఖిల పాపంబులం బాసి సకలశ్రేయస్సులం బొందు; నట్టి శేషునినే ముముక్షువు లాశ్రయించి ధ్యానం బొనర్చి భవబంధ నిర్ముక్తు లగుదు; రతని ఫణంబుల యందు భూగోళం బణుమాత్రం బగుచు నుండు; నతని మహామహిమలు గణుతింప సహస్రజిహ్వలు గల పురుషుండైన నోపం డని పలుకు చుందు; రా యనంతుండు పాతాళంబున నుండి సకల లోకహితార్థంబు భూమిని ధరియించు" నని లోకతిర్యఙ్మనుష్య గతులను లోకస్థితియును శుకయోగీంద్రుండు వినిపించి "యింక నేమి వినిపింతు నెఱింగింపు" మనినం బరీక్షిన్నరేంద్రుండు శుకయోగీంద్రున కిట్లనియె.

టీకా:

మఱియున్ = ఇంకనూ; ఆ = ఆ; శేషుని = ఆదిశేషుని; ఎవ్వండేనిన్ = ఎవరైనా సరే; ఆకస్మికంబుగన్ = ఏదో అప్పటికప్పుడు; అయినన్ = అయినా సరే; ఆర్తుండు = బాధలలో ఉన్నవాడు; అగుచున్ = అగుచు; అయినన్ = అయినా సరే; స్మరించిన = తలచిన; మాత్రన = మాత్రముననే; అఖిల = సర్వమైన; పాపంబులన్ = పాపములు; పాసి = దూరమై; సకల = అఖిలమైన; శ్రేయస్సులన్ = శుభములను; పొందున్ = పొందునో; అట్టి = అటువంటి; శేషుని = ఆదిశేషుని; ముముక్షువులు = మోక్షమును కాంక్షించువారు; ఆశ్రయించి = చేరి; ధ్యానంబున్ = ధ్యానము; ఒనర్చి = చేసి; భవబంధ = సంసార బంధనములనుండి; నిర్ముక్తులు = పూర్తిగా విముక్తులైన వారు; అగుదురు = అగుదురు; అతని = అతని యొక్క; ఫణంబులన్ = పడగల; అందున్ = పైన; భూగోళంబున్ = భూగోళము; అణు = అణువు; మాత్రంబున్ = అంతమాత్రము; అగుచున్ = అగుచు; ఉండును = ఉండును; అతని = అతని యొక్క; మహిమలు = మహత్వములు; గణుతింపన్ = గణించుటకు; సహస్ర = వేయి (1,000); జిహ్వలు = నాలుకలు; కల = కలిగిన; పురుషుండున్ = మానవుడైనను; ఓపండు = సమర్థుడు కాడు; అని = అని; పలుకుచుందురు = అనుచుందురు; ఆ = ఆ; అనంతుండు = ఆదిశేషుడు {అనంతుడు - (మహాప్రళయాంతమునను) అంతము లేని వాడు, శేషుడు}; పాతాళంబున = పాతాళలోకము నందు; ఉండి = ఉండి; సకల = సర్వమైన; లోక = జగత్తులకును; హిత = మేలు కలిగించుట; అర్థంబు = కోసము; భూమిని = భూగోళము; ధరియించును = శిరసున ధరించును; అని = అని; లోక = లోకములు; తిర్యక్ = చలనము కలవాని (జంతువుల); మనుష్య = మానవుల; గతులను = వర్తనలను; లోక = లోకముల; స్థితియును = స్థితి; శుక = శుకుడు అనెడి; యోగి = యోగులలో; ఇంద్రుడు = ఇంద్రునివంటివాడు; వినిపించి = చెప్పి; ఇంకన్ = ఇంకను; ఏమి = ఏమి; వినిపింతున్ = చెప్పమనెదవో; ఎఱిగింపుము = తెలుపుము; అనినన్ = అనగా; పరీక్షిత్ = పరీక్షిత్తు యనెడి; నరేంద్రుండు = రాజు; శుక = శుకుడు యనెడి; యోగి = యోగులలో; ఇంద్రుడు = ఇంద్రునివంటివాడు; ఇట్లు = ఈ విధముగ; అనియె = పలికెను.

భావము:

ఆ ఆదిశేషుణ్ణి ఎవరైనా సరే అకస్మాత్తుగా తలచుకొన్నా, బాధలలో చిక్కుకొని మొరపెట్టినా వారి పాపాలను పోగొట్టి సకల శ్రేయస్సులను ప్రసాదిస్తాడు. అందువల్ల ముక్తిని కోరేవారు అనంతుని ఆశ్రయించి ధ్యానించి భవబంధాలకు దూరమవుతారు. అతని పడగల మీద భూగోళం అణుమాత్రంగా నిలిచి ఉంటుంది. ఆ అనంతుని మహిమలు లెక్కించడం వేయి నాలుకలున్న వానికి కూడా అలవిగాని పని. ఆ అనంతుడు పాతాళంలో నివసిస్తూ అన్ని లోకాలకు మేలు కోరేవాడై భూమిని ధరిస్తాడు” అంటూ లోకాల స్వరూపాలను, జంతువుల స్వభావాలను, మానవుల నైజాలను శుకమహర్షి పరీక్షిత్తుకు విశదంగా బోధించి “ఇంకా ఏమేమి వినదలచుకొన్నావో అడుగు” అని పలికాడు. అప్పుడు పరీక్షిన్మహారాజు శుకునితో ఈ విధంగా అన్నాడు.

5.2-129-క.
 • ఉపకరణాలు:
 •  
 •  
 •  

"మునివర! లోకచరిత్రం
నుపమము మహావిచిత్ర గునట్లుగ నా
కును వినిపించితి వంతయుఁ
నుపడి నా చిత్తమందుఁ బాయక నిలిచెన్."

టీకా:

ముని = మునులలో; వర = ఉత్తముడా; లోక = లోకముల యొక్క; చరిత్రంబు = చరిత్ర; అనుపమము = సాటిలేనిది; మహా = మిక్కిలి; విచిత్రము = ఆశ్చర్యకరముగ; అగునట్లుగ = ఉండునట్లు; నా = నా; కునున్ = కు; వినిపించితి = చెప్పితివి; అంతయున్ = అదంతా; పనుపడి = నాటుకొని; నా = నా యొక్క; చిత్తము = మనసు; అందున్ = లో; పాయక = విడువక; నిలిచెన్ = స్థిరపడినవి;

భావము:

“మునీంద్రా! అతల వితలాది లోకాల స్వరూపాలను నా మనస్సులో నాటే విధంగా నీవు విశదీకరించావు. ఆ లోకాలన్నీ ఒకదాని కొకటి సాటిలేనివి. పైగా చాల చిత్ర విచిత్రమైనవి”.

5.2-130-వ.
 • ఉపకరణాలు:
 •  
 •  
 •  

అనిన శుకయోగీంద్రుం డిట్లనియె.

టీకా:

అనినన్ = అనగా; శుక = శుకుడు అనెడి; యోగి = యోగులలో; ఇంద్రుడు = ఇంద్రునివంటివాడు; ఇట్లు = ఈ విధముగ; అనియె = పలికెను;

భావము:

అని పలుకగా శుకమహర్షి ఇలా అన్నాడు.

5.2-131-ఆ.
 • ఉపకరణాలు:
 •  
 •  
 •  

"జంతుజాలములకు శ్రద్ధలు త్రిగుణాత్మ
ములు గాన వారి ర్మగతుల
తారతమ్యములును గిలి యిన్నియు వివి
ధంబు లగుచు సంతతంబు నుండు.

టీకా:

జంతు = జీవుల; జాలముల్ = సమూహముల; కున్ = కు; శ్రద్ధలు = శ్రద్ధలు, అక్కరలు; త్రిగుణ = సత్త్వ రజస్తమో గుణములతో; ఆత్మకములు = కూడినవి; కాన = కావున; వారి = వారి యొక్క; కర్మ = కర్మముల; గతులన్ = వర్తనలను అనుసరించి; తారతమ్యములు = హెచ్చుతగ్గులను; తగిలి = అనుసరించి; ఇన్నియున్ = ఇలాగే; వివిధంబులు = అనేక రకములు; అగుచు = అగుచు; సంతతంబు = ఎప్పుడును; ఉండు = ఉండును;

భావము:

“ఈ లోకంలోని జీవులకు సత్త్వరజస్తమో గుణాలను అనుసరించి శ్రద్ధలు వేరువేరుగా ఉంటాయి. సాత్త్విక శ్రద్ధ, రాజస శ్రద్ధ, తామస శ్రద్ధ అనే వానికి అనుగుణంగా వారి కార్యకలాపాలు కూడా వివిధంగా ఉంటాయి. ఈ తారతమ్యాలు ఎల్లప్పుడూ ఉంటూనే ఉంటాయి.

5.2-132-వ.
 • ఉపకరణాలు:
 •  
 •  
 •  

నరేంద్రా! ప్రతిషిద్ధలక్షణంబగు నధర్మం బాచరించు నరుని శ్రద్ధ విపరీతంబుగాఁ బ్రవర్తిల్లు నట్టివానికిఁ గలిగెడి కర్మఫలంబును విపరీతంబుగనే యుండుం గావున ననాద్యవిద్యాకామప్రవర్తనల వలనఁ బెక్కు తెఱంగులఁ గలిగెడి కర్మగతుల సంగ్రహంబుగ నెఱింగించెద" ననిన శుకునితోఁ బరీక్షిన్నరేంద్రుం డిట్లనియె.

టీకా:

నరేంద్ర = రాజా; ప్రతిషిద్ధ = నిషిద్ధమైనట్టి {ప్రతిషిద్ధము - అదికూడదు అని చెప్పెడిది, నిషిద్ధము}; లక్షణంబు = స్వభావముకలది; అగు = అయిన; అధర్మంబున్ = అధర్మమును; ఆచరించు = అనుసరించెడి; నరుని = మానవుని; శ్రద్ధ = శ్రద్ధ; విపరీతముగాన్ = భిన్నముగా; ప్రవర్తిల్లున్ = కలుగుతుండును; అట్టి = అటువంటి; వాని = వారి; కిన్ = కి; కలిగెడి = లభించెడి; కర్మ = కర్మముల; ఫలంబును = ఫలితములు కూడ; విపరీతంబుగనే = భిన్నముగనే; ఉండున్ = ఉండును; కావునన్ = అందుచేత; అనాద్య = అనాదినుండి ఉన్నవి; అవిద్యా = అజ్ఞానము వలన కలిగెడివి; కామప్రవర్తనల = ఇష్టానుసార ప్రవర్తనలు కలిగెడి; వలన = వలన; పెక్కు = అనేక; తెఱంగులన్ = విధముల; కలిగెడి = కలిగెడి; కర్మ = కర్మముల; గతులన్ = పర్యవసానములను; సంగ్రహంబుగా = చక్కగా గ్రహింపగలుగునట్లుగా, సంక్షిప్తముగా; ఎఱింగించెదన్ = తెలిపెదను; అనినన్ = అనగా; శుకుని = శుకుడు తో; పరీక్షిత్ = పరీక్షత్తు యనెడి; నరేంద్రుడు = రాజు; ఇట్లు = ఈ విధముగ; అనియె = పలికెను;

భావము:

రాజా! ఇది తగదని చెప్పడం ప్రతిషిద్ధం. తగదని చెప్పిన పనులను చేయడం అధర్మం. అటువంటి ప్రతిషిద్ధ లక్షణమైన అధర్మాన్ని ఆచరించే మానవుని శ్రద్ధ విపరీతంగా ఉంటుంది. శ్రద్ధయే భిన్నంగా ఉండడం వల్ల కర్మఫలాలు కూడా భిన్నంగానే ఉంటాయి. అందువల్ల అనాదికాలం నుంచి ఉన్నవీ, అజ్ఞానంవల్ల ఏర్పడేవీ, స్వేచ్ఛా ప్రవర్తన వల్ల కలిగేవీ అయిన నానావిధ కర్మగతులను సంగ్రహంగా చెబుతాను విను” అనగానే పరీక్షిత్తు శుకునితో ఇలా అన్నాడు.

5.2-133-ఆ.
 • ఉపకరణాలు:
 •  
 •  
 •  

"మునివరేణ్య! నరకములు ముజ్జగంబుల
యందొ? యంతరాళమందొ? వెలినొ?
దియుఁ గాక దేశమందుండు భూవిశే
ముల యందొ? తెలుపు సంతసమున."

టీకా:

ముని = మునులలో; వరేణ్య = శ్రేష్ఠుడా; నరకములు = నరకములు; ముజ్జగంబుల = ముల్లోకములకు; అందో = లోననా; అంతరాళమందో = నడిమి భాగములలోనా; వెలినో = అవతలనా; అదియునుం = అదికూడ; కాక = కాకుండగ; దేశము = ఉన్న ప్రదేశము; అందున్ = అందు; ఉండు = ఉండెడి; భూ = భూము లందలి; విశేషముల = ప్రత్యేక స్థలముల; అందో = లోనా; తెలుపు = చెప్పుము; సంతసమునన్ = సంతోషకరముగా;

భావము:

“శుకయోగీంద్రా! నరకాలు ఉన్నాయని అంటారు. అవి ఎక్కడ ఉన్నాయి? ముల్లోకాలలోనా? లేక రెండు లోకాల నడుమనా? ఈ రెండు కాక వెలుపల వేరే ప్రదేశంలోనా? ఎక్కడ ఉన్నాయి? నరకాలంటూ ప్రత్యేకంగా ఏవైనా లోకాలున్నాయా? నాకు వివరించి చెప్పు”.

5.2-134-వ.
 • ఉపకరణాలు:
 •  
 •  
 •  

అనిన శుకయెగీంద్రుం డిట్లనియె.

టీకా:

అనినన్ = అనగా; శుక = శుకుడు అనెడి; యోగి = యోగులలో; ఇంద్రుడు = ఇంద్రునివంటివాడు; ఇట్లు = ఈ విధముగ; అనియె = పలికెను;

భావము:

అని పరీక్షిత్తు ప్రశ్నించగా శుకమహర్షి ఇలా అన్నాడు.