పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

చతుర్థ స్కంధము : ధ్రువుండు తపంబు చేయుట

 •  
 •  
 •  

4-236-వ.
 • ఉపకరణాలు:
 •  
 •  
 •  

నిజధర్మపరిశోభితంబైన యేకాగ్రచిత్తంబున నిలిపి సేవింపు; మమ్మహాత్ముని కంటె నీ దుఃఖం బపనయించువాఁ డన్యుం డొక్కరుండు గలండే?" యని పలికినఁ బరమార్థ ప్రాప్తి హేతుకంబులైన తల్లివాక్యంబులు విని తన్నుఁ దాన నియమించుకొని పురంబు వెడలి చను నవసరంబున నారదుండు తద్వృత్తాంతం బెఱింగి, యచ్చటికిం జనుదెంచి, యతని చికీర్షితంబు దెలిసి, పాపనాశకరం బైన తన కరతలంబు నా ధ్రువుని శిరంబునం బెట్టి "మానభంగంబునకు సహింపని క్షత్రియుల ప్రభావం బద్భుతంబు గదా? బాలకుం డయ్యుఁ బినతల్లి యాడిన దురుక్తులు చిత్తంబునం బెట్టి చనుచున్నవాఁ" డని మనంబున నాశ్చర్యంబు నొంది “యో బాలక! సకల సంపత్సమృద్ధం బగు మందిరంబు దెగడి యొంటి నెందు నేగెదవు? స్వజన కృతం బగు నవమానంబుచే నిను సంతప్తుంగాఁ దలంచెద” ననిన ధ్రువుం డిట్లనియె; సపత్నీమాతృ వాగిషుక్షతం బగు వ్రణంబు భగవద్ధ్యానయోగ రసాయనంబున మాపి కొందు"ననిన విని ధ్రువునికి నారదుం డిట్లనియె.

టీకా:

నిజధర్మ = స్వధర్మముచే; పరిశోభితంబు = చక్కగ శోభకలిగినది; ఐన = అయిన; ఏకాగ్ర = ఏకాగ్రమైన; చిత్తంబునన్ = మనసులో; నిలిపి = నిలుపుకొని; సేవింపుము = పూజింపుము; ఆ = ఆ; మహాత్ముని = మహాత్ముని; కంటె = కంటె; నీ = నీ యొక్క; దుఃఖంబున్ = దుఃఖమును; అపనయించువాడు = పోగొట్టువాడు; అన్యుండు = ఇతరమైనవాడు; ఒక్కరుండు = ఒక్కడు; కలండే = ఉన్నాడా ఏమి; అని = అని; పలికినన్ = అనగా; పరమార్థ = మోక్షము, ఉత్తమ ప్రయోజనముల; ప్రాప్తి = లభించుటకు; హేతుకంబులు = కారణమైనవి; ఐన = అయిన; తల్లి = తల్లి యొక్క; వాక్యంబులు = మాటలు; విని = విని; తన్ను = తనను; తాన = తనే; నియమించుకొని = ఆజ్ఞాపించుకొని; పురంబున్ = ఊరినండి; వెడలి = బయటబడి; చను = వెళ్ళు; అవసరంబునన్ = సమయమునందు; నారదుండు = నారదుడు; తత్ = ఆ; వృత్తాంతము = సమాచారము; ఎఱింగి = తెలిసి; అచ్చటికి = అక్కడికి; చనుదెంచి = వచ్చి; అతని = అతని యొక్క; చికీర్షితంబు = చేయనిచ్చగించినది, సంకల్పించినది; తెలిసి = తెలుసుకొని; పాప = పాపమును; నాశకరంబు = నాశనము చేయగలది; ఐన = అయిన; తన = తన యొక్క; కరతలంబున్ = అరచేతిని; ఆ = ఆ; ధ్రువుని = ధ్రువుని; శిరంబునన్ = తలపైన; పెట్టి = పెట్టి; మానభంగంబున్ = అభిమానునకు దెబ్బతగులుట; కున్ = కు; సహింపని = సహించని; క్షత్రియుల = రాజవంశీయుల; ప్రభావంబు = తేజస్సు; అద్భుతంబున్ = అద్భుతమైనది; కదా = కదా; బాలకుండు = చిన్నపిల్లవాడు; అయ్యున్ = అయినప్పటికిని; పినతల్లి = పిన్ని; ఆడిన = పలికిన; దురుక్తులు = తిట్లు; చిత్తంబునన్ = హృదయములో; పెట్టి = పెట్టుకొని; చనుచున్నవాడు = వెళుతున్నాడు; అని = అని; మనంబునన్ = మనసులో; ఆశ్చర్యంబున్ = ఆశ్చర్యమును; ఒంది = పొంది; ఓ = ఓ; బాలక = పిల్లవాడ; సకల = సమస్తమైన; సంపత్ = సంపదలతోను; సమృద్ధంబు = సమృద్ధిగ ఉన్నవి; అగు = అయిన; మందిరంబున్ = గృహమును; తెగడి = నిందించి; ఒంటిన్ = ఒంటరిగ; ఎందున్ = ఎక్కడకి; ఏగెదవు = వెళ్ళెదవు; స్వ = స్వంత; జన = వారిచే; కృతంబు = చేయబడిన; అవమానంబు = అవమానము; చేన్ = చేత; నిను = నిన్ను; సంతప్తున్ = మిక్కిలి బాధపడినవాడు; కాన్ = అగునట్లు; తలచెదన్ = అనుకొనెదను; అనినన్ = అనగా; ధ్రువుండు = ధ్రువుడు; ఇట్లు = ఈ విధముగ; అనియెన్ = పలికెను; సపత్నీ = సవితి; మాతృ = తల్లి యొక్క; వాక్ = మాటలు అనెడి; ఇషు = బాణములచే; క్షతంబున్ = గాయపడినది; అగు = అయిన; వ్రణంబు = పుండు; భగవత్ = భగవంతుని; ధ్యాన = ధ్యానించుట అనెడి; యోగ = యోగ; రసాయనంబున = ఔషధమును; మాపికొందు = మాన్చుకొంటాను; అనినన్ = అనగా; విని = విని; ధ్రువుని = ధ్రువుని; కిన్ = కి; నారదుండు = నారదుడు; ఇట్లు = ఈ విధముగ; అనియెన్ = పలికెను.

భావము:

(హరిని) స్వధర్మాయత్తమైన ఏకాగ్రచిత్తంలో నిలిపి ఆరాధించు. ఆ మహాత్ముని కంటె నీ దుఃఖాన్నితొలగింప గలిగినవాడు మరొకడు లేడు.” అన్నది సునీతి. పరమార్థసిద్ధికి కారణాలైన తల్లి మాటలను ధ్రువుడు విని తనకు తానే ఒక నిర్ణయానికి వచ్చి పట్టణం నుండి బయలుదేరాడు. ఆ సమయంలో నారదమహర్షి ఆ వృత్తాంతాన్ని తెలుసుకొని ధ్రువుని దగ్గరకు వచ్చి, అతని కోరికను తెలుసుకొని, పాపాలన్నిటినీ పారద్రోలే తన చల్లని చేతితో అతని శిరస్సును స్పృశించాడు. ‘గౌరవహానిని సహింపని క్షత్రియుల తేజస్సు అద్భుతమైనది కదా! పసివాడై కూడ పినతల్లి పలికిన దుర్వాక్కులను మనస్సులో ఉంచుకొని నగరంనుండి వెళ్ళిపోతున్నాడు’ అని మనస్సులో ఆశ్చర్యపడి “నాయనా! సకల సంపదలు కలిగిన గృహాన్ని విడిచి ఒంటరిగా ఎక్కడికి పోతున్నావు? బంధువులు చేసిన అవమానంచేత బాధపడుతున్నట్లున్నావు” అని పలుకగా ధ్రువుడు ఇలా అన్నాడు “సవతితల్లి మాటల వల్ల అయిన గాయాన్ని భగవద్ధ్యానం అనే ఔషధంతో నయం చేసుకొంటాను”. ధ్రువుని మాటలు విన్న నారదుడు ఇలా అన్నాడు.

4-237-క.
 • ఉపకరణాలు:
 •  
 •  
 •  

"విను పుత్రక! బాలుఁడవై
యంబును గ్రీడలందు నాసక్తమనం
బునఁ దిరిగెడు నిక్కాలం
బు నీ కవమానమానములు లే వెందున్.

టీకా:

విను = వినుము; పుత్రక = అబ్బాయి; బాలుడవు = పిల్లవాడవు; ఐ = అయ్యి; అనయంబునున్ = ఎల్లప్పుడును; క్రీడలు = ఆటల; అందున్ = లో; ఆసక్తము = ఆసక్తి గల; మనంబునన్ = మనసులో; తిరిగెడు = వర్తించెడి; ఈ = ఈ; కాలంబునన్ = కాలములో; నీకున్ = నీకు; అవమానములు = అవమానములు; లేవు = లేవు; ఎందున్ = ఎక్కడను.

భావము:

“నాయనా! విను. ఎల్లప్పుడు ఆటలందు ఆసక్తిని చూపవలసిన ఈ పసివయస్సులో గౌరవాగౌరవాలను పట్టించుకొనవలసిన పని లేదు.

4-238-తే.
 • ఉపకరణాలు:
 •  
 •  
 •  

కాన మనమునఁ దద్వివేకంబు నీకుఁ
లిగెనేనియు సంతోషలితు లయిన
పురుషు లాత్మీయకర్మ విస్ఫురణఁ జేసి
వితత సుఖదుఃఖము లనుభవింతు రెపుడు.

టీకా:

కాన = కావున; మనమునన్ = మనసులో; తత్ = ఆ; వివేకంబునన్ = తెలివిడి; నీకున్ = నీకు; కలిగెన్ = ఉన్నట్లు; ఏనియు = అయితే; సంతోష = సంతోషముతో; కలితులు = కూడినవారు; అయిన = అయిన; పురుషులు = మానవులు; ఆత్మీయ = తమ యొక్క; కర్మ = కర్మల; విస్ఫురణన్ = కంపనలు; చేసి = వలన; వితత = విస్తారమైన; సుఖ = సుఖములను; దుఃఖములనన్ = దుఃఖములనను; అనుభవింతురు = అనుభవిస్తారు.

భావము:

కనుక మంచి చెడులను నిర్ణయించే వివేకం నీకు ఉన్నా విచారించకు. మానవులు తమ పూర్వకర్మలను బట్టి కలిగే సుఖదుఃఖాలను అనుభవిస్తూ ఉంటారు.

4-239-వ.
 • ఉపకరణాలు:
 •  
 •  
 •  

కావున వివేకంబు గల పురుషుండు దనకుం బ్రాప్తంబు లగు సుఖ దుఃఖంబులు దైవవశంబులుగాఁ దలంచి తావన్మాత్రంబునం బరితుష్టుం డగు; నీవును దల్లి చెప్పిన యోగమార్గ ప్రకారంబున సర్వేశ్వరానుగ్రహంబుఁ బొందెద నంటివేని.

టీకా:

కావునన్ = అందుచేత; వివేకంబున్ = తెలివిడి; కల = కలిగిన; పురుషుండు = మానవుడు; తన = తన; కున్ = కు; ప్రాప్తంబులు = లభించినవి; అగు = అయిన; సుఖదుఃఖంబులు = సుఖదుఃఖంబులను; దైవ = దేవునికి; వశంబులు = వశమైనవి; కాన్ = అయినట్లు; తలంచి = అనుకొని; తావత్ = అంత; మాత్రంబునన్ = మాత్రముచేత; పరితుష్టుండు = సంతోషముకలవాడు; అగు = అవుతాడు; నీవునున్ = నీవుకూడ; తల్లి = తల్లి; చెప్పిన = చెప్పిన; యోగమార్గ = యోగమార్గము; ప్రకారంబునన్ = ప్రకారముగ; సర్వేశ్వర = విష్ణుమూర్తి; అనుగ్రహంబున్ = అనుగ్రహమును; పొందెదన్ = పొందుతాను; అంటివేని = అంటుంటే.

భావము:

కనుక తెలివి గల మానవుడు తనకు కలిగే సుఖదుఃఖాలను దైవసంకల్పం వల్ల కలిగినవని భావించి, వానితోనే తృప్తిపడతాడు. కాదు, నీవు నీ తల్లి చెప్పిన యోగమార్గాన్ని అనుసరించి భగవంతుని దయను పొందుతాను అన్నట్లయితే...

4-240-సీ.
 • ఉపకరణాలు:
 •  
 •  
 •  

నఘాత్మ! యోగీంద్రు నయంబు ధరఁ బెక్కు-
న్మంబు లందు నిస్సంగమైన
తినిఁ బ్రయోగ సమాధినిష్ఠలఁ జేసి-
యైనను దెలియ లే తని మార్గ;
ది గాన నతఁడు దురారాధ్యుఁ డగు నీకు-
నుడుగుము నిష్ఫలోద్యోగ మిపుడు
గాక నిశ్శ్రేయస కాముఁడ వగుదేనిఁ-
దండ్రి! వర్తించు తత్కా లమందుఁ

4-240.1-తే.
 • ఉపకరణాలు:
 •  
 •  
 •  

బూని సుఖదుఃఖములు రెంటిలోన నెద్ది
దైవవశమునఁ జేకుఱు దానఁ జేసి
డెందమునఁ జాల సంతుష్టి నొందువాఁడు
విమలవిజ్ఞాని యన భువి వెలయుచుండు.

టీకా:

అనఘాత్మ = పుణ్యాత్మా; యోగ = యోగులలో; ఇంద్రులు = శ్రేష్ఠులు; అనయంబున్ = అవశ్యము; ధరన్ = భూమిపైన; పెక్కు = అనేకమైన; జన్మంబులు = జన్మలు; అందున్ = లో; నిస్సంగము = సంగములేనిది; ఐన = అయిన; మతిన్ = బుద్దితో; ప్రయోగ = ఆచరణతో కూడిన; సమాధి = యోగసమాధి; నిష్ఠలన్ = నిష్ఠల; చేసి = వలన; ఐనను = అయినప్పటికిని; తెలియన్ = తెలిసికొన; లేరు = లేరు; అతని = అతని; మార్గమున్ = త్రోవ; అదిగాన = అందుచేత; అతడు = అతడు; దురారాధ్యుడు = ఆరాధించుట కష్టమైనవాడు; అగు = అగును; నీకున్ = నీకు; ఉడుగుము = వదులుము; నిష్ఫల = ఫలితములేని; ఉద్యోగమున్ = ప్రయత్నమును; ఇపుడు = ఇప్పుడు; కాక = లేదా; నిశ్శ్రేయస = మోక్షమును; కాముడువు = కోరువాడవు; అగుదేని = అయినట్లయితే; వర్తించు = వర్తించు; తత్ = ఆ; కాలము = కాలము; అందున్ = లో.
పూని = పూనుకొని; సుఖ = సుఖము; దుఃఖములు = దుఃఖములు; రెంటి = రెండింటి; లోనన్ = లోను; ఎద్ది = ఏది; దైవ = దేవునికి; వశమునన్ = వశమై; చేకుఱున్ = చేకూరుతుందో; దానన్ = దాని; చేసి = తో; డెందమునన్ = హృదయములో; చాలన్ = మిక్కిలి; సంతుష్టిన్ = సంతృప్తిని; ఒందు = పొందెడి; వాడు = వాడు; విమల = నిర్మలమైన; విజ్ఞాని = మంచిజ్ఞానముకలవాడు; అన = అనగా; భువిన్ = భూమిమీద; వెలయుచున్ = ప్రసిద్ధికెక్కుతూ; ఉండు = ఉండును.

భావము:

పుణ్యాత్మా! యోగీంద్రులు పెక్కు జన్మలలో నిస్సంగులై తీవ్రమైన సమాధి యోగాన్ని అభ్యసించి కూడ ఆ దేవుని స్వరూపాన్ని తెలుసుకోలేరు. ఆ హరిని ఆరాధించడం నీకు చాల కష్టం. కాబట్టి వ్యర్థమైన ఈ ప్రయత్నాన్ని విడిచిపెట్టు. మోక్షాన్ని కోరుకున్నట్లయితే ముసలితనంలో దానికోసం ప్రయత్నించు. దైవవశాన సుఖదుఃఖాలలో ఏది కలిగినా మనస్సులో సంతోషించేవాడు విజ్ఞాని అనిపించుకుంటాడు.

4-241-వ.
 • ఉపకరణాలు:
 •  
 •  
 •  

మఱియు గుణాఢ్యుం డగువానిం జూచి సంతోషించుచు నాభాసుం డగు వానిం జూచి కరుణించుచు సమానుని యెడ మైత్రి సలుపుచు వర్తించుచున్నవాఁడు తాపత్రయాదికంబులం దొఱంగు"నని నారదుండు పలికిన విని ధ్రువుం డిట్లనియె; “ననఘా! యీ శమంబు సుఖదుఃఖ హతాత్ము లగు పురుషులకు దుర్గమం బని కృపాయత్తుండవైన నీ చేత వినంబడె; నట్లయినం బరభయంకరం బగు క్షాత్త్ర ధర్మంబు నొందిన యవినీతుండనగు నేను సురుచి దురుక్తులను బాణంబుల వలన వినిర్భిన్నహృదయుండ నగుట మదీయచిత్తంబున శాంతి నిలువదు; కావునం ద్రిభువనోత్కృష్టంబు ననన్యాధిష్ఠితంబు నగు పదంబును బొంద నిశ్చయించిన నాకు సాధుమార్గంబు నెఱింగింపుము; నీవు భగవంతుం డగు నజుని యూరువు వలన జనించి వీణావాదన కుశలుండవై జగద్ధితార్థంబు సూర్యుండునుం బోలె వర్తింతు;"వనిన విని.

టీకా:

మఱియు = ఇంకను; గుణ = గుణమములలో; ఆఢ్యుండు = శ్రేష్ఠుడు; అగు = అయిన; వానినన్ = వానిని; చూచి = చూసి; సంతోషించుచున్ = సంతోషిస్తూ; ఆభాసుండున్ = తెలివి లేనివాడు, భ్రంశుడు; అగు = అయిన; వానిన్ = వానిని; చూచి = చూసి; కరుణించుచున్ = దయచూపుతూ; సమానుని = సమానమైన వాని; ఎడన్ = అందు; మైత్రి = స్నేహము; సలుపుచున్ = చేస్తూ; వర్తించుచున్ = ఉండెడి; వాడు = వాడు; తాపత్రయ = తాపత్రయములు {తాపత్రయములు - 1ఆధ్యాత్మికము 2ఆదిదైవితము 3 ఆదిభౌతికము అనబడు మూడు (3) కారణములచే కలుగు తాపములు (బాధలు)}; ఆదికంబులన్ = మొదలైనవానివలన; తొఱంగును = తొలగును; అని = అని; నారదుండు = నారదుడు; పలికిన = పలుకగా; విని = విని; ధ్రువుండు = ధ్రువుడు; ఇట్లు = ఈ విధముగ; అనియెన్ = పలికెను; అనఘా = పుణ్యుడా; ఈ = ఈ; శమంబు = శమము {శమము - శాంతగుణము, మనోవ్యాపారంబులను ఉపశమింపచేయుట}; సుఖ = సుఖము; దుఃఖ = దుఃఖములచే; హత = దెబ్బతిన్న; ఆత్ములు = మనసులు కలవారు; అగు = అయిన; పురుషులు = మానవుల; కున్ = కు; దుర్గమంబు = ఆచరించలేనిది; అని = అని; కృపాయత్తుండవు = దయగలవాడవు; ఐన = అయిన; నీ = నీ; చేతన్ = చేత; వినంబడెన్ = చెప్పితివి; అట్లు = ఆ విధముగ; అయినన్ = అయినప్పటికిని; పర = శత్రువులకు; భయంకరంబు = భయముగొల్పునది; అగు = అయిన; క్షాత్ర = క్షత్రియ; ధర్మంబున్ = స్వభావమును; ఒందిన = పొందిన; అవినీతుండను = జితేంద్రియుడను కానివాడను; అగు = అయిన; నేను = నేను; సురుచి = సురుతి యొక్క; దురుక్తులు = తిట్లు; అను = అనెడి; బాణంబులన్ = బాణముల; వలన = వలన; వినిర్భిన్న = ముక్కచెక్కలైన; హృదయుండన్ = హృదయము కలవాడను; అగుటన్ = ఔటవలన; మదీయ = నా యొక్క; చిత్తంబునన్ = మనసులో; శాతి = శాంతి; నిలువదు = నిలబడదు; కావునన్ = అందుచేత; త్రిభువన = ముల్లోకములందు {ముల్లోకములు - 1భూః 2భువస్ 3భువ లోకములు}; ఉత్కృష్టంబున్ = ఉన్నతమైనది; అనన్య = అనితరులచే; అధిష్ఠితంబున్ = ఎక్కబడినిది; అగు = అయిన; పదంబునున్ = స్థానమును; పొందన్ = పొందవలెనని; నిశ్చయించిన = నిశ్చయించుకొన్న; నాకున్ = నాకు; సాధు = చక్కటి; మార్గంబున్ = దారి; ఎఱింగింపుము = తెలుపుము; నీవు = నీవు; భగవంతుండు = భగవంతుడు; అగు = అయిన; అజుని = బ్రహ్మదేవుని; ఊరువు = తొడ; వలన = నుండి; జనించి = పుట్టి; వీణా = వీణను; వాదన = వాయించుట యందు; కుశలుండవు = నేర్పరివి; ఐ = అయ్యి; జగత్ = లోకములకు; హిత = మంచి; అర్థంబున్ = కొరకు; సూర్యునిన్ = సూర్యుని; పోలెన్ = వలె; వర్తింతువు = తిరిగెదవు; అనినన్ = అనగా; విని = విని.

భావము:

ఇంకా గుణవంతుని చూసి సంతోషిస్తూ, గుణహీనుని చూసి జాలిపడుతూ, తనతో సమానుడైనవానితో స్నేహం చేస్తూ ప్రవర్తించేవాని దరికి తాపత్రయాలు చేరవు” అన్న నారదుని మాటలు విన్న ధ్రువుడు ఇలా అన్నాడు. “పుణ్యాత్మా! సుఖదుఃఖాల వల్ల తెలివి కోల్పోయిన వారికి శాంతి లభించదని అన్నావు. శత్రువులకు భయం కలిగించే క్షాత్రధర్మాన్ని నేను అవలంబించాను. కనుక నాకు వినయం ఎక్కడిది? సురుచి పలికిన దుర్భాషలు అనే బాణాలచేత బ్రద్దలైన నా హృదయంలో శాంతికి తావు లేదు. కాబట్టి ముల్లోకాలలోను శ్రేష్ఠమైనది, ఇతరు లెవ్వరూ పొందనిది అయిన స్థానాన్ని నేను పొందాలని ఆశపడుతున్నాను. అందుకు నాకు చక్కని ఉపాయాన్ని ఉపదేశించు. నీవు బ్రహ్మ ఊరువునుండి జన్మించి, నేర్పుతో వీణను మ్రోగిస్తూ, లోకాలకు మేలును కూర్చే నిమిత్తం సూర్యభగవానిని వలె సంచరించే మహానుభావుడివి” అని చెప్పగా (నారదుడు) విని...

4-242-క.
 • ఉపకరణాలు:
 •  
 •  
 •  

నాదుఁ డిట్లను "ననఘ! కు
మాక! విను నిన్ను మోక్షమార్గంబునకున్
బ్రేరేచినవాఁ డిప్పుడు
ధీజనోత్తముఁడు వాసుదేవుం డగుటన్.

టీకా:

నారదుండు = నారదుడు; ఇట్లు = ఈ విధముగ; అను = అనెను; అనఘ = పుణ్యుడా; కుమారక = అబ్భాయి; విను = విను; నిన్ను = నిన్ను; మోక్ష = మోక్షము యొక్క; మార్గంబున్ = దారి; కున్ = కి; ప్రేరేచిన = పురికొల్పిన; వాడు = వాడు; ఇప్పుడు = ఇప్పుడు; ధీర = ధీరులైన; జన = వారికి; ఉత్తముడు = ఉత్తముడు; వాసుదేవుండు = విష్ణుమూర్తి; అగుటన్ = అయినందువలన.

భావము:

నారదు డిలా అన్నాడు “పుణ్యాత్మా! నాయనా! విను. నిన్ను మోక్షమార్గాన్ని పొందడానికి ప్రేరేపించినవాడు పురుషోత్తముడైన వాసుదేవుడే. కనుక...

4-243-వ.
 • ఉపకరణాలు:
 •  
 •  
 •  

నీవు నమ్మహాత్ముని నజస్రధ్యాన ప్రవణ చిత్తుండవై భజియింపుము.

టీకా:

నీవు = నీవు; ఆ = ఆ; మహాత్మునిన్ = మహాత్ముని; అజస్ర = నిరంతరమైన; ధ్యాన = ధ్యానమునందు; ప్రవణ = ఆసక్తిగల; చిత్తుండవు = చిత్తము కలవాడవు; ఐ = అయ్యి; భజియింపుము = సేవించుము.

భావము:

నీవు ఆ మహాత్ముని ఏకాగ్రమైన చిత్తంతో సేవించు.

4-244-క.
 • ఉపకరణాలు:
 •  
 •  
 •  

పురుషుఁడు దవిలి చతుర్విధ
పురుషార్థశ్రేయ మాత్మఁ బొందెద ననినన్
రఁ దత్ప్రాప్తికి హేతువు
రిపదయుగళంబు దక్క న్యము గలదే?

టీకా:

పురుషుడు = మానవుడు; తవిలి = పూని; చతుర్విధపురుషార్థ = చతుర్విధ పురుషార్థముల {చతుర్విధ పురుషార్థములు - 1ధర్మ 2అర్థ 3కామ 4మోక్షములు}; శ్రేయమున్ = శ్రేయస్సును; పొందెదను = పొందుతాను; అనినన్ = అన్నచో; ధరన్ = భూమ్మీద; తత్ = దాని; ప్రాప్తి = పొందుట; కున్ = కు; హేతువు = దారి; హరి = హరి; పద = పాదములు అనెడి; యుగళంబున్ = ద్వయము; తక్క = తప్పించి; అన్యమున్ = ఇతరమైనది; కలదే = ఉన్నదా ఏమి.

భావము:

ధర్మార్థకామమోక్షాలు అనబడే నాలుగు పురుషార్థాలను శ్రేయస్సును పొందాలి అని అనుకునే మానవునికి హరి పాదపద్మాలు తప్ప మరొక ఉపకరణము లేదు.

4-245-వ.
 • ఉపకరణాలు:
 •  
 •  
 •  

కావున.

టీకా:

కావునన్ = అందుచేత.

భావము:

అందుచేత

4-246-క.
 • ఉపకరణాలు:
 •  
 •  
 •  

యమునానదితటమునఁ
రి సాన్నిధ్యంబు శుచియు తిపుణ్యమునై
రఁగిన మధువనమునకును
సగుణా! చనుము మేలు మకుఱు నచటన్.

టీకా:

వర = శ్రేష్ఠమైన; యమునా = యమున అనెడి; నది = నది యొక్క; తటమునన్ = ఒడ్డున; హరి = విష్ణుమూర్తి; సాన్నిధ్యంబున్ = సాన్నిధానము; శుచియు = శుచి; అతి = మిక్కిలి; పుణ్యమున్ = పుణ్యము; ఐ = అయ్యి; పరగిన = ప్రసిద్ధమైన; మధువనమున్ = మధువనము; కున్ = కు; సరసగుణా = మనోహర గుణములు కలవాడ; చనుము = వెళ్ళు; మేలు = మేలు; సమకుఱున్ = కలుగును.

భావము:

సుగుణనిధీ! యమునానది ఒడ్డున హరికి నివాసస్థానమూ, పవిత్రమూ, పుణ్యప్రదమూ అయిన మధువనానికి వెళ్ళు. అక్కడ నీకు మేలు కలుగుతుంది.

4-247-క.
 • ఉపకరణాలు:
 •  
 •  
 •  

మునా తటినీ శుభ
తోములం గ్రుంకి నిష్ఠతో నచ్చట నా
రాణునకును నమస్కృతు
లాతమతిఁ జేసి చేయు మనియమములన్.

టీకా:

ఆ = ఆ; యమునా = యమున యొక్క; తటనీ = ఒడ్డున; శుభ = శుభ్రమైన; తోయములన్ = నీటిలో; క్రుంకి = స్నానము చేసి; నిష్ఠ = నిష్ఠ; తోన్ = తో; అచ్చట = అక్కట; నారాయణన్ = నారాయణన; కును = కు; నమస్కృతులు = నమస్కారములు; ఆయత = దీర్ఘమైన, గొప్ప; మతిన్ = మనస్సు; చేసి = తో; చేయు = చేయుము; యమనియమములన్ = యమనియమముల సాధన.

భావము:

శుభాలను కలిగించే ఆ యమునానది నీటిలో స్నానం చేసి, నిశ్చలమైన బుద్ధితో నారాయణునికి నమస్కరించు. యమ నియమాలను అవలంబించు.

4-248-వ.
 • ఉపకరణాలు:
 •  
 •  
 •  

మఱియు బాలుండ వగుటం జేసి వేదాధ్యయనా ద్యుచిత కర్మానర్హుండ వయ్యు నుచితంబులగు కుశాజినంబులం జేసి స్వస్తిక ప్రముఖాసనంబులం గల్పించుకొని త్రివృత్ప్రాణాయామంబులచేతం బ్రాణేంద్రియ మనోమలంబు లను చాంచల్య దోషంబులఁ బ్రత్యాహరించి స్థిరం బయిన చిత్తంబున.

టీకా:

మఱియున్ = ఇంకను; బాలుండవు = పిల్లవాడవు; అగుటన్ = అయినందుచేత; చేసి = వలన; వేద = వేదములను; అధ్యయన = అధ్యయనము; ఆది = మొదలగు; ఉచిత = ఉచిత; కర్మా = కర్మలకు; అనర్హుండవు = అర్హత లేనివాడవు; అయ్యున్ = అయినప్పటికిని; ఉచితంబులు = ఉచితములు; అగు = అయిన; కుశ = దర్భలు; అజినంబులన్ = జింకచర్మములను; చేసి = పొంది; స్వస్తిక = స్వస్తికాసనము; ప్రముఖ = మొదలైనముఖ్య; ఆసనంబులన్ = ఆసనములను; కల్పించుకొని = వేసి; త్రివృత్ = మూడు (3) ఆవృత్తుల (రేచక, పూరక, కుంభకములు); ప్రాణాయామంబుల్ = ప్రాణాయామముల; చేతన్ = చేత; ప్రాణ = ప్రాణముల; ఇంద్రియ = ఇంద్రియముల; మనః = మానసిక; మలంబులను = మలినములను; చాంచల్య = చంచలము అనెడి; దోషంబులన్ = దోషములను; ప్రత్యాహరించి = పరిహరించి; స్థిరంబు = స్థిరము; అయిన = అయినట్టి; చిత్తంబునన్ = చిత్తముయందు.

భావము:

ఇంకా పసివాడవు కనుక వేదాలను పఠించే అర్హత నీకు లేకున్నా దర్భలతోను, జింకచర్మంతోను స్వస్తికం మొదలైన ఆసనాలను కల్పించుకొని, పూరకము రేచకము కుంభకము అనే ఈ మూడు విధాలైన ప్రాణాయామాలతో ప్రాణేంద్రియ మనోమలాలను పొగొట్టుకొని, చాంచల్య దోషాలను తొలగించుకొని, స్థిరమైన మనస్సుతో (హరిని ధ్యానించు).

4-249-సీ.
 • ఉపకరణాలు:
 •  
 •  
 •  

శ్రిత సత్ప్రసాదాభి ముఖుండును-
స్నిగ్ధప్రసన్నాననేక్షణుండు
సురుచిర నాసుండు సుభ్రూయుగుండును-
సుకపోల తలుఁడును సుందరుండు
రినీల సంశోభితాంగుండుఁ దరుణుండు-
రుణావలోక నోష్ఠాధరుండుఁ
రుణాసముద్రుండుఁ బురుషార్థ నిధియును-
బ్రణతాశ్రయుండు శోనకరుండు

4-249.1-తే.
 • ఉపకరణాలు:
 •  
 •  
 •  

లిత శ్రీవత్సలక్షణ క్షితుండు
ర్వలోక శరణ్యుండు ర్వసాక్షి
పురుష లక్షణ యుక్తుండుఁ బుణ్యశాలి
సిత మేఘనిభశ్యాముఁ వ్యయుండు.

టీకా:

ఆశ్రిత = ఆశ్రయించినవారికి; సత్ = మంచి; ప్రసాద = వరములనిచ్చటయందు; అభిముఖుండును = ముందుండువాడును; స్నిగ్ధ = మృదువైన; ప్రసన్న = ప్రసన్నమైన; ఆనన = ముఖముతో; ఈక్షణుండు = చూసెడివాడు; సు = చక్కటి; రుచిర = ప్రకాశవంతమైన; నాసుండును = ముక్కుకలవాడును; సు = చక్కటి; భ్రూయుగుండును = భ్రూయుగ్మము కలవాడును; సు = చక్కటి; కపోలతలుడును = చెంపలు కలవాడును; సుందరుండు = అందమైనవాడు; హరినీల = ఇంద్రనీలము వలె; సంశోభిత = చక్కగ శోభకలిగిన; అంగుండు = అవయవములు కలవాడు; తరుణుండు = తరుణవయస్సున యుండువాడు; అరుణా = ఎర్రని; అవలోకన = చూపులు; ఓష్ఠ = పైపెదవి; అధరుండు = క్రింది పెదవి కలవాడు; కరుణా = దయకు; సముద్రుండున్ = సముద్రుడును; పురుషార్థ = చతుర్విధపురుషార్థములకు {చతుర్విధపురుషార్థములు - 1ధర్మ 2అర్థ 3కామ 4మోక్షములు}; నిధియున్ = నిధివంటివాడును; ప్రణత = నమస్కరించినవారికి; ఆశ్రయుండును = ఆశ్రయము ఇచ్చువాడును; శోభన = మంగళ; కరుండు = ఒనగూర్చువాడును;
లలిత = అందమైన; శ్రీవత్స = శ్రీవత్సము అనెడి; లక్షణ = పుట్టుమచ్చచేత; లక్షితుండు = కలవాడును; సర్వ = సమస్తమైన; లోక = లోకములకు; శరణ్యుండు = శరణ్యము యైనవాడు; సర్వ = అన్నిటికిని; సాక్షి = సాక్షియైనవాడు; పురుష = పురుషుని; లక్షణ = లక్షణములు; యుక్తుండు = కలగినవాడు; పుణ్యశాలి = పుణ్యస్వరూపుడు; అసిత = నల్లని; మేఘ = మేఘముతో; నిభ = సమానమైన; శ్యాముడు = శ్యాముడు; అవ్యయుండు = నాశరహితుడు.

భావము:

శ్రీహరి ఆశ్రితుల యెడ అపారమైన కృపారసం చూపేవాడు. సుప్రసన్నమైన ముఖం, చల్లని చూపులు, అందమైన ముక్కు, సొగసైన కనుబొమలు, చిక్కని చెక్కిళ్ళు కలిగిన చక్కనివాడు. ఇంద్రనీల మణులవలె ప్రకాశించే మేను కల పడుచువాడు. ఎఱ్ఱని నేత్రాలు, పెదవులు కలవాడు. దయాసముద్రుడు. పురుషార్థాలను ప్రసాదించేవాడు. నమస్కరించే వారికి ఆశ్రయ మిచ్చేవాడు. శుభాలను కలిగించేవాడు. శ్రీవత్సం అనే అందమైన పుట్టుమచ్చ కలవాడు. సర్వలోక రక్షకుడు. సర్వమూ చూచేవాడు. ఉత్తమ లక్షణాలు కలిగిన పురుషోత్తముడు. పుణ్యస్వరూపుడు. నీలమేఘశ్యాముడు. అవ్యయుడు.

4-250-వ.
 • ఉపకరణాలు:
 •  
 •  
 •  

మఱియును.

టీకా:

మఱియును = ఇంకను.

భావము:

ఇంకా. . . .

4-251-సీ.
 • ఉపకరణాలు:
 •  
 •  
 •  

హా కిరీట కేయూ కంకణ ఘన-
భూషణుం డాశ్రిత పోషణుండు
లాలిత కాంచీకలాప శోభిత కటి-
మండలుం డంచిత కుండలుండు
హనీయ కౌస్తుభణి ఘృణి చారు గ్రై-
వేకుం డానంద దాకుండు
లలిత ఘన శంఖ క్ర గదా పద్మ-
స్తుండు భువన ప్రస్తుఁ డజుఁడు

4-251.1-తే.
 • ఉపకరణాలు:
 •  
 •  
 •  

మ్ర సౌరభ వనమాలికా ధరుండు
తవిమోహుండు నవ్యపీతాంబరుండు
లిత కాంచన నూపురాలంకృతుండు
నిరతిశయసద్గుణుఁడు దర్శనీయతముఁడు.

టీకా:

హార = హారము; కిరీట = కిరీటము; కేయూర = భూజకీర్తులు; కంకణ = కంకణములు; ఘన = గొప్ప; భూషణుండు = ఆభరణములు ధరించినవాడు; ఆశ్రిత = ఆశ్రయించినవారిని; పోషణుండు = పాలించువాడు; లాలిత = అందమైన; కాంచీ = మొలనూలు; కలాపము = ఆభరణముతో; శోభిత = శోభిల్లుతున్న; కటి = కటి; మండలుండు = ప్రదేశము కలవాడు; అంచిత = అలంకరింపబడిన; కుండలుండు = కుండలములు కలవాడు; = మహనీయ = గొప్ప; కౌస్తుభ = కౌస్తుభము అనెడి; మణి = మణి యొక్క; ఘృణి = కాంతులు కలవాడు; చారు = అందమైన; గ్రైవేయకుండు = కంఠహారములు కలవాడు; ఆనంద = ఆనందమును; దాయకుండు = ఇచ్చువాడు; = సలలిత = అందముగల; ఘన = గొప్ప; శంఖ = శంఖము; చక్ర = చక్రము; గదా = గద; పద్మ = పద్మము; హస్తుండు = చేత కలవాడు; భువన = లోకముల; ప్రశస్తుడు = ప్రశంసించబడువాడు; అజుడు = జన్మములేనివాడు.
కమ్ర = కమ్మని; సౌరభ = సువాసనలు కల; వనమాలికా = వనమాలలు {వనమాల - పూలు పత్రములు కూర్చిన దండ}; ధరుండు = ధరించినవాడు; హత = పోగొట్టబడు; విమోహుండు = మోహములవాడు; నవ్య = కొత్త; పీతాంబరుండు = పట్టుబట్టలు కలవాడు; లలిత = అందమైన; కాంచన = బంగారు; నూపుర = అందెలచే; అలంకృతుండు = అలంకరించబడినవాడు; నిరతిశయ = అతిశయము కాని; సత్ = మంచి; గుణుండు = గుణములుకలవాడు; దర్శనీయతముఁడు = అత్యధికమైన చూడదగ్గవాడు {దర్శనీయుడు - దర్శనీయతరుడు - దర్శనీయతముఁడు}.

భావము:

ఆ శ్రీహరి హారాలు, కిరీటం, భుజకీర్తులు మొదలైన అలంకారాలతో అలరారుతూ ఉంటాడు. ఆయన ఆశ్రితులను పోషించేవాడు. అతని కటిప్రదేశం అందమైన మొలత్రాడుతో ప్రకాశిస్తూ ఉంటుంది. ఆయన చెవులకు మకరకుండలాలను ధరిస్తాడు. కౌస్తుభం అనే మణికాంతులతో అందమైన కంఠమాలను ధరిస్తాడు. ఆయన ఆనందాన్ని కలిగించేవాడు. శంఖ చక్ర గదా పద్మాలను నాలుగు చేతులలో ధరించి ఉంటాడు. ఆయన లోకప్రసిద్ధుడు. కమ్మని సువాసన గల వనమాలను మెడలో వేసుకుంటాడు. ఆయన అజ్ఞానాన్ని పోగొట్టేవాడు. సరిక్రొత్త పచ్చని పట్టు వస్త్రాన్ని కట్టుకుంటాడు. మేలిమి బంగారు అందెలు ఆయన కాళ్ళకు అలంకరింపబడి ఉంటాయి. గొప్ప సద్గుణాలు కలవాడు. దర్శించవలసినవాడు.

4-252-క.
 • ఉపకరణాలు:
 •  
 •  
 •  

సమనోలోచన ము
త్కరుఁడును హృత్పద్మ కర్ణికా నివసిత వి
స్ఫు దురునఖ మణిశోభిత
ణ సరోజాతుఁ డతుల శాంతుఁడు ఘనుఁడున్.

టీకా:

సరస = సరసమైన; మనః = మనస్సు అనెడి; లోచన = కన్నులకు; ముత్కరుడును = సంతోషము కలిగించువాడు; హృత్ = హృదయము అనెడి; పద్మ = పద్మము యొక్క; కర్ణికా = బొడ్డునందు; నివసిత = నివసించెడి; విస్ఫురత్ = మెరుస్తున్న; ఉరు = పెద్దవైన; నఖ = గోర్లు అనెడి; మణి = మణులచే; శోభిత = శోభిల్లుతున్న; చరణ = పాదములు అనెడి; సరోజాతుడు = పద్మములు కలవాడు; అతుల = సాటిలేని; శాంతుడు = శాంతము కలవాడు; ఘనుడున్ = గొప్పవాడు.

భావము:

ఆ శ్రీహరి ఆశ్రితుల మనస్సులకు, కన్నులకు ఆనందాన్ని కలిగించేవాడు. భక్తుల హృదయ పద్మాలలో ప్రకాశించే పాదపద్మాలు కలవాడు. సాటిలేని శాంత స్వభావుడు. మహానుభావుడు.

4-253-వ.
 • ఉపకరణాలు:
 •  
 •  
 •  

అయిన పురుషోత్తముఁ బూజించుచు హృదయగతుండును, సాను రాగవిలోకనుండును, వరదశ్రేష్ఠుండును నగు నారాయణు నేకాగ్రచిత్తంబునం ధ్యానంబు చేయుచు బరమ నివృత్తి మార్గంబున ధ్యాతుండైన పురుషోత్తముని దివ్యమంగళస్వరూపంబు చిత్తంబునం దగిలిన మరల మగుడ నేరదు; అదియునుం గాక, యే మంత్రంబేని సప్త వాసరంబులు పఠియించిన ఖేచరులం గనుంగొను సామర్థ్యంబు గలుగు; నట్టి ప్రణవయుక్తం బగు ద్వాదశాక్షర కలితంబును దేశకాల విభాగ వేది బుధానుష్ఠితంబును నయిన ‘ఓం నమో భగవతే వాసుదేవాయ’ యనెడి వాసుదేవ మంత్రంబునం జేసి.

టీకా:

అయిన = అయినట్టి; పురుష = పురుషులలో; ఉత్తమున్ = ఉత్తముని; పూజించుచున్ = పూజిస్తూ; హృదయ = హృదయమునందు; గతుండును = ఉన్నవాడు; సానురాగ = అనురాగముతోకూడిన; విలోకనుండును = చూపులు కలవాడు; వరద = వరములను ఇచ్చుటలో; శ్రేష్ఠుండు = ఉత్తముడు; అగు = అయినట్టి; నారాయణున్ = విష్ణుమూర్తిని; ఏకాగ్ర = ఏకాగ్రత కల; చిత్తంబునన్ = మనసులో; పరమ = అత్యుత్తమమైన; నివృత్తి = వైరాగ్య; మార్గంబునన్ = మార్గమున; ధ్యానంబున్ = ధ్యానమును; చేయుచున్ = చేస్తూ; ధ్యాతుండు = ధ్యానింపబడువాడ; ఐన = అయినట్టి; పురుషోత్తముని = విష్ణుమూర్తి; దివ్య = దివ్యమైన; మంగళ = శుభకరమైన; స్వరూపంబున్ = స్వరూపమును; చిత్తంబునన్ = మనసులో; తగిలినన్ = లగ్నమైనచో; మరల = మరల; మగుడనేరదు = వెనుదిరిగిపోలేదు; అదియునున్ = అంతే; కాక = కాకుండ; ఏ = ఏ; మంత్రంబు = మంత్రము; ఏని = అయితే; సప్త = ఏడు (7); వాసరంబులు = దినములు; పఠియించినన్ = పఠించినచో; ఖేచరులన్ = ఆకాశమున చరించువారిని; కనుంగొన = చూచుటకు; సామర్థ్యంబు = సామర్థ్యము; కలుగున్ = కలుగుతుందో; అట్టి = అటువంటి; ప్రణవ = ఓంకారముతో; యుక్తంబు = కూడినది; అగు = అయిన; ద్వాదశా = పన్నెండు (12); అక్షర = అక్షరములు; కలితంబున్ = కలిగినదియు; దేశ = దేశము; కాల = కాలము; విభాగ = విభాగములు; వేది = తెలిసిన; బుధ = జ్ఞానులచే; అనుష్ఠితంబును = అనుష్ఠానము చేయబడునదియు; అయిన = అయినట్టి; ఓంనమోభగవతేవాసుదేవాయ = ఓంనమోభగవతేవాసుదేవాయ; అనెడి = అనెడి; వాసుదేవ = వాసుదేవ; మంత్రంబున్ = మంత్రము; చేసి = వలన.

భావము:

అటువంటి పురుషోత్తముని పూజించు. హృదయంలో కుదురుకున్నవాడూ, అనురాగమయ వీక్షణాలు వెదజల్లేవాడూ, వరాలను ఇచ్చేవాడూ అయిన నారాయణుని అచంచలమైన మనస్సుతో ధ్యానించు. అప్పుడు ఆ పురుషోత్తముని దివ్యమంగళ విగ్రహం మనస్సులో సాక్షాత్కరించి స్థిరంగా నిలిచిపోతుంది. ఏ మంత్రాన్ని ఏడు దినాలు జపిస్తే దేవతలను దర్శించే శక్తి కలుగుతుందో, ఓంకారంతో కూడి, పన్నెండు అక్షరాలు కలిగి, దేశకాల విభాగాలను తెలుసుకొని జపించవలసిన ‘ఓం నమో భగవతే వాసుదేవాయ’ అనే ఆ వాసుదేవ మంత్రాన్ని జపించాలి.

4-254-సీ.
 • ఉపకరణాలు:
 •  
 •  
 •  

దూర్వాంకురంబుల దూర్వాంకురశ్యాము-
లజంబులను జారులజనయనుఁ
దులసీ దళంబులఁ దులసికా దాముని-
మాల్యంబులను సునైర్మల్య చరితుఁ
త్రంబులను బక్షిత్రునిఁ గడు వన్య-
మూలంబులను నాది మూలఘనుని
నంచిత భూర్జత్వగాది నిర్మిత వివి-
దాంబరంబులను పీతాంబరధరుఁ

4-254.1-తే.
 • ఉపకరణాలు:
 •  
 •  
 •  

నరు భక్తిని మృచ్ఛిలాదారు రచిత
రూపముల యందుఁ గాని నిరూఢమైన
లిలముల యందుఁ గాని సుస్థలము లందుఁ
గాని పూజింపవలయు నక్కమలనాభు.

టీకా:

దూర్వార = గఱిక అనెడి గడ్డి; అంకురంబులన్ = లేత చివుళ్ళతో; దూర్వారాంకురశ్యాము = లేతగఱికవలె నవనవలాడు శ్యాముని; జలజంబులను = పద్మములతో; చారు = అందమైన; జలజనయనున్ = పద్మములవంటి కన్నులు కలవాని; తులసీదళంబులన్ = తులసిదళములతో; తులసీకాదామునిన్ = తులసిమాల ధరించినవాని; = మాల్యంబులన్ = మాలలతో; సు = మంచి; నైర్మల్య = నిర్మలమైన; చరితున్ = వర్తన కలవానిని; పత్రంబులన్ = ఆకులతో; పక్షి = గరుత్మంతుని; పత్రుని = రెక్కలకలవానిని; కడు = అనేకమైన; వన్య = అడవి; = మూలంబులను = మూలికలతో; ఆదిమూలఘనుని = సృష్టికి మొదటి దుంప వంటి వానిని; అంచిత = చక్కటి; భూర్జ = బూరుగుదూది; త్వక్ = బట్ట; ఆది = మొదలైనవానిచే; నిర్మిత = చేయబడిన; వివిధ = రకరకముల; అంబరములను = వస్త్రములచేత; పీతాంబరధరునిన్ = విష్ణుమూర్తిని; తనరు = అతిశయించిన; భక్తిని = భక్తితో.
మృత్ = మట్టి; శిలా = శిల; దారు = కర్ర; రచిత = చేయబడిన; రూపములన్ = బొమ్మలు; అందు = వలన; కాని = కాని; నిరూఢమైన = ప్రసిద్ధమైన; సలిలముల = జలముల; అందు = లో; కాని = కాని; సుస్థలముల = మంచి ప్రదేశముల; అందు = లో; కాని = కాని; పూజింపవలయున్ = పూజించవలెను; ఆ = ఆ; కమలనాభున్ = విష్ణుమూర్తిని {కమలనాభుడు - పద్మము నాభి యందు కలవాడు, విష్ణువు}.

భావము:

గరికపోచలవలె శ్యామలవర్ణం కల వాసుదేవుణ్ణి గరికపోచలతో, అందమైన పద్మాలవంటి కన్నులు కలిగినవానిని పద్మాలతో, తులసిదండలు ధరించేవానిని తులసీదళాలతో, మాలిన్యం లేని శీలం కలవానిని పూలమాలలతో, పక్షివాహనుని పత్రాలతో, లోకాలకు ఆదిమూలుడైన మహానుభావుని వనమూలికలతో, పచ్చని పట్టు వస్త్రాలు ధరించేవానిని నారబట్టలతో సేవించాలి. భగవంతుణ్ణి మృణ్మయ, శిలామయ, దారుమయ ప్రతిమలలో కాని, నిర్మల జలాలలో కాని, పవిత్ర స్థలాలలో కాని ఆరాధించాలి.
“ఓం నమో భగవతే వాసుదేవాయః” అనే ద్వాదశాక్షరీ మంత్రోపాసన విధానం నారదమునీశ్వరుడు పంచాబ్దముల ధ్రువునికి ఉపదేశిస్తున్నాడు. అతి శక్తివంతమైన తిరుగులేని మహా మంత్రపూరిత ఘట్టమిది.

4-255-క.
 • ఉపకరణాలు:
 •  
 •  
 •  

ధృ చిత్తుఁడు శాంతుండు ని
పరిభాషణుఁడు సుమహితాచారుఁడు వ
ర్ణి హరిమంగళ గుణుఁడును
మివన్యాశనుఁడు నగుచు మెలఁగఁగ వలయున్.

టీకా:

ధృత = ధారణగల; చిత్తుడు = చిత్తము కలవాడు; శాంతుడు = శాంతము కలవాడు; నియత = నియమించిన; పరిభాషణుండు = సంభాషణలు కలవాడు; సు = మంచి; మహిత = గొప్ప; ఆచారుడు = ఆచరణలు కలవాడు; వర్ణిత = వర్ణిస్తున్న; హరి = విష్ణుమూర్తి; మంగళ = శుభకరమైన; గుణుండును = గుణములు కలవాడు; మిత = మితమైన; వన్య = అడవిలో దొరుకువానిని; అశనుడు = తినువాడు; అగుచున్ = అవుతూ; మెలగవలయును = తిరుగవలెను.

భావము:

మనోనిగ్రహం కలవాడై, శాంతుడై, మితభాషియై, సదాచార సంపన్నుడై, శ్రీహరి కళ్యాణగుణాలను వర్ణిస్తూ కందమూలాలను మితంగా స్వీకరిస్తూ ఉండాలి.

4-256-వ.
 • ఉపకరణాలు:
 •  
 •  
 •  

ఉత్తమశ్లోకుండగు పుండరీకాక్షుండు నిజమాయా స్వేచ్ఛావతార చరితంబుల చేత నచింత్యముగా నెద్దిచేయు నద్ది హృదయగతంబుగా ధ్యానంబు చేయం దగు; మఱియుఁ గార్యబుద్ధిం జేసి చేయంబడు పూజావిశేషంబులు వాసుదేవమంత్రంబున సర్వేశ్వరునికి సమర్పింప వలయు; నిట్లు మనోవాక్కాయ కర్మంబులచేత మనోగతం బగునట్లుగా భక్తి యుక్తంబు లయిన పూజల చేతఁ బూజింపం బడి, సర్వేశ్వరుండు మాయాభిభూతులు గాక సేవించు పురుషులకు ధర్మాది పురుషార్థంబులలోన నభిమతార్థంబు నిచ్చు; విరక్తుం డగువాఁడు నిరంతర భావం బయిన భక్తియోగంబునం జేసి మోక్షంబుకొఱకు భజియించు"నని చెప్పిన విని ధ్రువుండు నారదునకుం బ్రదక్షిణ పూర్వకంబుగా నమస్కరించి మహర్షి జనసేవ్యంబై సకలసిద్ధుల నొసంగుచు భగవత్పాద సరోజాలంకృతం బయిన మధువనంబునకుం జనియె; నంత.

టీకా:

ఉత్తమ = ఉత్తములచే; శ్లోకుండు = స్తుతింపబడువాడు; అగు = అయిన; పుండరీకాక్షుండు = హరి; నిజ = తన; మాయా = మాయతోకూడిన; స్వేచ్చా = తన ఇచ్చానుసారము; అవతార = అవతరించుట; చరితంబులన్ = వర్తనల; చేతన్ = చే; చింత్యముగా = చింతింపదగినదిగ; ఎద్ది = ఏదయితే; చేయున్ = చేయునో; అద్ది = దానిని; హృదయగతంబుగా = హృదయమందుల; ధ్యానంబున్ = ధ్యానము; మఱియున్ = ఇంకను; కార్య = పూనిన; బుద్ధిన్ = బుద్ధి; చేసి = తో; చేయంబడు = చేసెడి; పూజా = పూజల; విశేషంబులన్ = విశేషములను; వాసుదేవమంత్రంబునన్ = వాసుదేవమంత్రముతో; సర్వేశ్వరుని = హరి; కిన్ = కి; సమర్పింపవలయు = చక్కగ అర్పింపవలెను; ఇట్లు = ఈ విధముగ; మనస్ = మనస్సు; వాక్ = మాటలు; కర్మంబుల = చేయుపనుల; చేతన్ = చే; మనః = మనసునకు; గతంబు = చేరినది; అగునట్లుగా = అయ్యేటట్లుగా; భక్తి = భక్తితో; యుక్తంబులు = కూడినవి; అయిన = అయిన; పూజల = పూజలు; చేతన్ = చే; పూజింపంబడి = పూజింపబడి; సర్వేశ్వరుండు = విష్ణుమూర్తి; మాయా = మాయకి; అభిభూతులు = లొంగినవారు; కాక = కాకుండగ; సేవించు = సేవించెడి; పురుషులకు = పురుషులకు; ధర్మాది = ధర్మాది {ధర్మాది - 1ధర్మ 2అర్థ 3కామ 4మోక్షములు అనెడి చతుర్విధపురుషార్థములు}; పురుషార్థంబులన్ = పురుషార్థముల; లోనన్ = లో; అభిమతార్థంబున్ = కోరినది; ఇచ్చున్ = ఇచ్చును; విరక్తుండు = వైరాగ్యము కలవాడు; అగువాడు = అయినవాడు; నిరంతర = ఎడతెగని; భావంబున్ = భావము; అయిన = అయిన; భక్తి = భక్తి; యోగంబునన్ = యోగము; చేసి = వలన; మోక్షంబున్ = మోక్షము; కొఱకున్ = కోసము; భజియించు = సేవించు; అని = అని; చెప్పిన = చెప్పగ; విని = విని; ధ్రువుండు = ధ్రువుడు; నారదున = నారదున; కున్ = కు; ప్రదక్షిణ = ప్రదక్షిణతో; పూర్వకంబుగా = కూడినదిగా; నమస్కరించి = నమస్కరించి; మహర్షి = మహర్షులైన; జనంబు = వారిచే; సేవ్యంబు = సేవింపబడినది; ఐ = అయ్యి; సకల = సమస్తమైన; సిద్ధులను = సిద్ధులను; ఒసంగుచున్ = ఇస్తూ; భగవత్ = భగవంతుని; పాద = పాదములు అనెడి; సరోజ = పద్మములచే; అలంకృతంబు = అలంకరింపబడినది; అయిన = అయిన; మధు = మధు అనెడి; వనంబున్ = వనమున; కున్ = కు; చనియె = వెళ్ళెను; అంత = అంత.

భావము:

పురుషోత్తముడైన పుండరీకాక్షుడు తన మాయామహిమతో ఇచ్ఛానుసారంగా పెక్కు అవతారాలను ధరించి చేసిన లీలావిశేషాలను మనస్సులో భావించాలి. ఆత్మార్పణ బుద్ధితో చేసే పూజలను ద్వాదశాక్షర మంత్రంతో వాసుదేవునకు సమర్పించాలి. ఈ విధంగా త్రికరణ శుద్ధిగా భక్తితో పూజించేవారు విష్ణుమాయలో చిక్కుకొనరు. వారికి భగవంతుడు ధర్మార్థకామమోక్షాలు అనే పురుషార్థాలలో కోరిన దానిని అనుగ్రహిస్తాడు. విరక్తితో ముక్తిని కోరువాడు, ఎడతెగని భక్తిభావంతో సేవిస్తూ ఉంటాడు” అని నారదుడు ఉపదేశించగా ధ్రువుడు అతనికి ప్రదక్షిణం చేసి, నమస్కరించి, మహర్షులు నివసించేది, కోరిన కోరికలను ప్రసాదించేది, భగవంతుని పాదపద్మాలచేత అలంకరింపబడింది అయిన మధువనానికి బయలుదేరాడు.

4-257-తే.
 • ఉపకరణాలు:
 •  
 •  
 •  

ద్మభవ సూనుఁ డుత్తానపాదు కడకు
రిగి యా రాజుచే వివిధార్చనముల
నంది సంప్రీతుఁడై యున్నతాసనమున
నెమిఁ గూర్చుండి యాతని ను చూచి.

టీకా:

పద్మభవ = బ్రహ్మదేవుని; సూనుడు = పుత్రుడు; ఉత్తానపాదు = ఉత్తానపాదుని; కడకున్ = దగ్గరకు; అరిగి = వెళ్ళి; ఆ = ఆ; రాజు = రాజు; చేన్ = చేత; వివధ = రకరకముల; అర్చనములన్ = పూజనములను; అంది = పొంది; సంప్రీతుడు = సంతుష్టుడు; ఐ = అయ్యి; ఉన్నత = ఎత్తైన; ఆసనమునన్ = ఆసనమున; ఎలమిన్ = అతిశయించి; కూర్చుండి = కూర్చుని; ఆతని = అతని; వలను = వైపు; చూచి = చూసి.

భావము:

నారదుడు ఉత్తానపాదుని దగ్గరకు వెళ్ళి, ఆ రాజు చేసిన నానావిధాలైన పూజలను అందుకొని, ఆనందంతో ఉన్నతాసనంపై కూర్చున్నవాడై ఆ రాజు వంక చూచి...

4-258-వ.
 • ఉపకరణాలు:
 •  
 •  
 •  

ఇట్లనియె.

టీకా:

ఇట్లు = ఈ విధముగ; అనియె = పలికె.

భావము:

ఇలా అన్నాడు.

4-259-క.
 • ఉపకరణాలు:
 •  
 •  
 •  

"భూనాయక! నీ విపుడా
మ్లానాస్యుఁడ వగుచుఁ జాల దిలోఁ జింతం
బూనుట కేమి కతం?" బన
నా నారదుతోడ నాతఁ నియెన్ మరలన్.

టీకా:

భూనాయక = రాజ {భూనాయకుడు - భూమికి నాయకుడు, రాజు}; నీవున్ = నీవు; ఇపుడున్ = ఇప్పుడు; ఆమ్లాన = మిక్కిలి వాడిన; ఆస్యుడవు = మోము కలవాడవు; అగుచున్ = అవుతూ; చాలన్ = మిక్కిలి; మది = మనసు; లోన్ = లో; చింతన్ = చింతను; పూనుట = కలిగి యుండుట; కున్ = కు; ఏమి = ఏమి; కతంబు = కారణము; అనన్ = అనగ; ఆ = ఆ; నారదున్ = నారదుని; తోడన్ = తోటి; ఆతడున్ = అతడు; అనియెన్ = పలికెను; మరలన్ = మరల.

భావము:

“రాజా! నీ వదనసరోజం వాడి ఉన్నది. నీ మనస్సులోని విచారానికి కారణం ఏమిటి?” అని ప్రశ్నించిన నారదునితో ఉత్తానపాదుడు ఇలా అన్నాడు.

4-260-క.
 • ఉపకరణాలు:
 •  
 •  
 •  

"మునివర! వివేకశాలియు
ఘుఁడు నైదేండ్ల బాలుఁ స్మత్ప్రియ నం
నుఁ డదయుఁడ నగు నాచే
ను బరిభవ మొంది చనియెఁ ల్లియుఁ దానున్.

టీకా:

ముని = మునులలో; వర = శ్రేష్ఠుడ; వివేకశాలియు = వివేకము కలవాడు; అనఘుడు = పుణ్యుడు; ఐదేండ్ల = అయిదు సంవత్సరముల; బాలుడు = బాలుడు; అస్మత్ = నా యొక్క; ప్రియ = ప్రియమైన; నందనుండు = పుత్రుడు; అదయుండను = దయమాలినవాడిని; అగు = అయిన; నా = నా; చేతన్ = చేత; పరిభవంబున్ = పరాభవమును; ఒంది= పొంది; చనియెన్ = వెళ్ళెను; తల్లియన్ = తన అమ్మతో; తానున్ = తాను.

భావము:

“మునీంద్రా! నా ప్రియపుత్రుడు ధ్రువుడు ఐదేండ్లవాడు. మంచి తెలివితేటలు గలవాడు; పాపం ఎరుగనివాడు; అతనిని నేను దయమాలి అవమానించాను. అందుకు వాడు అలిగి తల్లితో పాటు వెళ్ళిపోయాడు.

4-261-మ.
 • ఉపకరణాలు:
 •  
 •  
 •  

ని యుగ్రాటవిఁ జొచ్చి యచ్చటఁ బరిశ్రాంతుండు క్షుత్పీడితుం
డును నామ్లాన ముఖాంబుజుండు ననఘుండున్ బాలకుం డైన మ
త్తయున్ ఘోర వృ కాహి భల్ల ముఖ సత్త్వశ్రేణి నిర్జించెనో
ని దుఃఖించెద నాదు చిత్తమున నార్యస్తుత్య! యిట్లౌటకున్.

టీకా:

చని = వెళ్ళి; ఉగ్ర = భయంకరమైన; అటవిన్ = అడవిని; చొచ్చి = ప్రవేశించి; అచ్చటన్ = అక్కడ; పరిశ్రాంతుండున్ = మిక్కిలి అలసినవాడు; క్షుత్పీడితుండును = ఆకలిచే పీడింపబడువాడు; ఆమ్లాన = వడలిపోయిన; ముఖ = ముఖము అనెడి; అంబుజుండున్ = పద్మము కలవాడు; అనఘుండు = పాపము లేని వాడు; బాలకుండు = చిన్న పిల్లవాడు; ఐన = అయిన; మత్ = నా యొక్క; తనయున్ = పుత్రుని; ఘోర = భయంకరమైన; వృక = తోడేళ్ళు; అహి = పాములు; భల్ల = ఎలుగుబంట్లు; ముఖ = మొదలైన; సత్త్వ = జంతువుల; శ్రేణి = సమూహము; నిర్జించెనో = సంహరించెనో; అని = అని; దుఃఖించెదన్ = దుఃఖిస్తున్నాను; నాదు = నా యొక్క; చిత్తమునన్ = మనసులో; ఆర్యస్తుత్య = గొప్పవారిచే స్తుతింపబడువాడ; ఇట్లు = ఈ విధముగ; ఔటకున్ = అగుటకు.

భావము:

అలా వెళ్ళి భయంకరమైన అడవిలో ప్రవేశించి మార్గాయాసంతోను, ఆకలి బాధతోను ముఖపద్మం వాడిపోయిన నా కుమారుణ్ణి, ఏపాపం ఎరుగని పసివాణ్ణి తోడేళ్ళు, సర్పాలు, ఎలుగుబంట్లు మొదలైన క్రూరజంతువులు పొట్టన బెట్టుకున్నాయేమో అనే భయంతో, బాధతో లోలోపల కుమిలిపోతున్నాను. మహానుభావా! ఇలా జరిగినందుకు నేను దుఃఖిస్తున్నాను.

4-262-తే.
 • ఉపకరణాలు:
 •  
 •  
 •  

ట్టి యుత్తమబాలు నా యంకపీఠ
మందుఁ గూర్చుండనీక నిరాకరించి
యంగనాసక్త చిత్తుండ నైనయట్టి
నాదు దౌరాత్మ్య మిది మునినాథచంద్ర!"

టీకా:

అట్టి = అటువంటి; ఉత్తమ = ఉత్తముడైన; బాలున్ = బాలుని; నా = నా యొక్క; అంక = అంకము అనెడి; పీఠము = పీఠము; అందున్ = లో; కూర్చుండనీక = కూర్చోనీయక; నిరాకరించి = నిరాకరించి; అంగనా = స్త్రీ యెడల; ఆసక్త = చిక్కుకొన్న; చిత్తుండను = మనసు కలవాడను; ఐన = అయిన; అట్టి = అటువంటి; నాదు = నా యొక్క; దౌరాత్మ్యము = దురాత్ముని భావము; ఇది = ఇది; ముని = మునులకు; నాథ = నాయకులలో; చంద్ర = చంద్రునివంటివాడ.

భావము:

అటివంటి ఉత్తముడైన బాలుణ్ణి నా ఒడిలో కూర్చోనివ్వక అవమానించాను. మునీంద్రా! నా చిన్న భార్య సురుచి మీది వలపుతో ఈ దుర్మార్గపు పని చేశాను.”

4-263-ఉ.
 • ఉపకరణాలు:
 •  
 •  
 •  

నా విని నారదుండు నరనాథున కిట్లను "నీ కుమారుఁ డా
దేకిరీట రత్నరుచిదీపిత పాదసరోజుఁడైన రా
జీదళాక్ష రక్షితుఁ డశేష జగత్పరికీర్తనీయ కీ
ర్తీవిభవప్రశస్త సుచరిత్రుఁడు; వానికి దుఃఖ మేటికిన్?

టీకా:

నా = అనగా; విని = విని; నారదుండు = నారదుడు; నరనాథున్ = రాజున; కిన్ = కి; ఇట్లు = ఈ విధముగ; అను = అనెను; నీ = నీ యొక్క; కుమారుడు = పుత్రుడు; ఆ = ఆ; దేవకిరీటరత్నరుచిదీపితపాదసరోజుఁడు = విష్ణుమూర్తి {దేవ కిరీట రత్న రుచి దీపిత పాద సరోజుఁడు – దేవతల కిరీటముల కాంతులచే ప్రకాశిస్తున్న పాదములు అనెడి పద్మములు కలవాడు, విష్ణువు}; ఐన = అయిన; రాజీవదళాక్ష = విష్ణుమూర్తిచే; రక్షితుడు = రక్షింపబడుతున్నవాడు; అశేష = అనంతమైన; జగత్ = లోకములచే; పరి = మిక్కిలి; కీర్తనీయ = కీర్తింపదగిన; కీర్తి = కీర్తి యొక్క; విభవ = వైభవముచే; ప్రశస్త = శ్రేష్ఠమైన; సు = మంచి; చరిత్రుడు = ప్రవర్తన కలవాడు; వానికిన్ = అతనికోసము; దుఃఖము = దుఃఖము; ఏటికిన్ = ఎందులకు.

భావము:

ఉత్తానపాదుని మాటలు విని నారదుడు ఇలా అన్నాడు “రాజా! దేవతల కిరీటాల రత్నకాంతులతో ప్రకాశించే పాదపద్మాలు కల శ్రీహరి చేత రక్షింపబడే నీ కుమారుడు సమస్త లోకాలు ప్రస్తుతించే కీర్తి సంపదతో ప్రసిద్ధికెక్కిన చరిత్ర కలవాడు. అతనికోసం దుఃఖించడ మెందుకు?

4-264-ఉ.
 • ఉపకరణాలు:
 •  
 •  
 •  

కావున నమ్మహాత్ముఁడు సుర్మము చేత సమస్త లోకపా
లాళి కందరాని సముదంచిత నిత్యపదంబునం బ్రభు
శ్రీ విలసిల్లఁ జెందుఁ దులసీదళదాము భజించి; యా జగ
త్పానుఁడైన నీ సుతు ప్రభావ మెఱుంగవు నీవు భూవరా!

టీకా:

కావునన్ = అందుచేత; ఆ = ఆ; మహాత్ముడు = మహాత్ముడు; సు = మంచి; కర్మము = కర్మములు; చేతన్ = చేత; సమస్త = సమస్తమైన; లోకపాల = లోకపాలకుల; ఆవళి = సమూహమున; కిన్ = కి; అందరాని = అందుకోలేని; సమ = మిక్కిలి; ఉదంచిత = గౌరవనీయమైన; నిత్య = శాశ్వతమైన; పదంబున్ = పదము నందు; ప్రభు = ప్రభుత్వము అనెడి; శ్రీ = సంపదతో; విలసిల్లన్ = విలసిల్లుటను; చెందు = చెందును; తులసీదళదాము = నారాయణుని {తులసీదళ దాము - తులసీదళముల దండ ధరించినవాడు, విష్ణువు}; భజించి = పూజించి; ఆ = ఆ; జగత్ = లోకములను; పావనుడు = పవిత్రము చేయువాడు; ఐన = అయిన; నీ = నీ యొక్క; సుతు = పుత్రుని; ప్రభావమున్ = గొప్పదనము; ఎఱుంగవు = తెలియవు; నీవు = నీవు; భూవర = రాజ.

భావము:

రాజా! ఉత్తానపాదా! లోకపావనుడైన నీ పుత్రుని ప్రభావం నీకు తెలియదు కాని. మహాత్ముడైన నీ కుమారుడు తన పుణ్యంతో తులసీదళదాముడైన నారాయణుని సేవించి లోకపాలకులు సైతం పొందరాని నిత్యపదానికి అధీశ్వరు డవుతాడు.

4-265-వ.
 • ఉపకరణాలు:
 •  
 •  
 •  

అదియునుం గాక.

టీకా:

అదియున్ = అంతే; కాక = కాకుండగ.

భావము:

అంతేకాక...

4-266-క.
 • ఉపకరణాలు:
 •  
 •  
 •  

నీ కీర్తియు జగముల యం
దాల్పము నొందఁజేయు నంచిత గుణర
త్నారుఁ డిట కేతెంచును
శోకింపకు మతనిఁ గూర్చి సుభగచరిత్రా!"

టీకా:

నీ = నీ యొక్క; కీర్తియు = కీర్తినికూడ; జగములన్ = లోకముల; అందున్ = లో; ఆకల్పమున్ = కల్పాంతము వరకు; ఒందన్ = పొందునట్లు; చేయు = చేసెడి; అంచిత = చక్కటి; గుణ = గుణములనెడి; రత్నాకరుడు = సముద్రము వంటివాడు {రత్నాకరుడు – రత్నముల సమూహము కలవాడు, సముద్రుడు}; ఇటకున్ = ఇక్కడకు; ఏతెంచును = వచ్చును; శోకింపకుము = దుఃఖింపకుము; అతని = అతని; గూర్చి = గురించి; సుభగ = సౌభాగ్యమైన; చరిత్రా = ప్రవర్తనకలవాడ.

భావము:

పుణ్యాత్మా! నీ కుమారుడు నీ కీర్తిని కల్పాంతం వరకు సుస్థిరంగా ఉండేటట్లు చేస్తాడు. అతడు సుగుణ రత్నాకరుడు. అచిరకాలంలోనే నీ దగ్గరకు వస్తాడు. నీ పుత్రుని కోసం నీవు దుఃఖించవద్దు.”

4-267-క.
 • ఉపకరణాలు:
 •  
 •  
 •  

ని నారదుండు పలికిన
విని మనమున విశ్వసించి విభుఁడును బ్రియ నం
నుఁ జింతించుచు నాదర
మునఁ జూడం డయ్యె రాజ్యమును బూజ్యముగన్.

టీకా:

అని = అని; నారదుండు = నారదుడు; పలికిన = పలుకగా; విని = విని; మనమునన్ = మనసులో; విశ్వసించి = నమ్మి; విభుడును = రాజు; ప్రియ = ప్రియమైన; నందనున్ = పుత్రునికై; చింతించుచున్ = ఆలోచిస్తూ; ఆదరమునన్ = ఆదరముతో; చూడండు = చూడనివాడు; అయ్యెన్ = ఆయెను; రాజ్యమున్ = రాజ్యమును; పూజ్యముగన్ = శ్రద్ధగా.

భావము:

అని నారదుడు చెప్పిన మాటలను రాజు తన మనస్సులో విశ్వసించి, ప్రియపుత్రుని తలచుకొంటూ రాజ్యపాలన పట్ల పూర్తిగా నిరాదరం చూపసాగాడు.

4-268-వ.
 • ఉపకరణాలు:
 •  
 •  
 •  

అంత నక్కడ నా ధ్రువుండు.

టీకా:

అంతన్ = అంత; అక్కడ = అక్కడ; ఆ = ఆ; ధ్రువుండు = ధ్రువుడు.

భావము:

ఆ సమయంలో అక్కడ ధ్రువుడు...

4-269-క.
 • ఉపకరణాలు:
 •  
 •  
 •  

ని ముందటఁ గనుఁగొనె మధు
మును ముని దేవ యోగి ర్ణిత గుణ పా
మును దుర్భవ జలద ప
మును నిఖిలైక పుణ్యరభవనంబున్.

టీకా:

చని = వెళ్ళి; ముందటన్ = ఎదురుగ; కనుగొనెన్ = చూసెను; మధు = మధు అనెడి; వనమునున్ = వనమును; ముని = మునుల; దేవ = దేవతల; యోగి = యోగులచే; వర్ణిత = స్తుతింపబడిన; గుణ = గుణములచే; పావనమును = పవిత్రమైనది; దుర్భవ = చెడ్డదైన సంసార మనెడి; జలద = మేఘములకు; పవనమును = వాయువు వంటిది; నిఖిల = సమస్తము; ఏక = అఖండ; పుణ్య = పుణ్యములకు; వర = శ్రేష్ఠమైన; భవనంబున్ = నివాసమును.

భావము:

(ధ్రువుడు) పోయి పోయి ఎదురుగా మధువనాన్ని చూశాడు. దాని పవిత్రతను మునులు, దేవతలు, యోగులు మొదలైన వారు వర్ణించారు. అది సంసారమనే మబ్బును చెదరగొట్టే ప్రభంజనం వంటిది. సకల పుణ్యాలకు తావైనది.

4-270-వ.
 • ఉపకరణాలు:
 •  
 •  
 •  

అట్లు గని డాయంజని యమునానదిం గృతస్నానుండై నియతుండును, సమాహిత చిత్తుండును నై సర్వేశ్వరుని ధ్యానంబు చేయుచుం బ్రతిత్రిరాత్రాంతంబునఁ గృత కపిత్థ బదరీఫల పారణుం డగుచు దేహ స్థితి ననుసరించి యిటుల నొక్కమాసంబు హరిం బూజించి, యంత నుండి యాఱేసి దినంబుల కొక్కపరి కృతజీర్ణ తృణ పర్ణాహారుం డగుచు, రెండవ మాసంబున విష్ణుసమారాధనంబు చేసి, యంత నుండి నవరాత్రంబుల కొకమా ఱుదకభక్షణంబు చేయుచు, మూఁడవ మాసంబున మాధవు నర్చించి, యంతనుండి ద్వాదశ దినంబుల కొకమాఱు వాయుభక్షణుం డగుచు, జితశ్వాసుండై నాలవ మాసంబునం, బుండరీకాక్షుని భజియించి, యంతనుండి మనంబున నలయక నిరుచ్ఛ్వాసుండై యేకపదంబున నిలిచి, పరమాత్మఁ జింతించుచు, నచేతనంబైన స్థాణువుంబోలె నైదవ మాసంబును జరిపె; నంత.

టీకా:

అట్లు = ఆ విధముగ; డాయన్ = దగ్గరకు; చని = వెళ్ళి; యమునా = యమున అనెడి; నదిన్ = నదిలో; కృత = చేసిన; స్నానుండు = స్నానము చేసినవాడు; ఐ = అయ్యి; నియతుండును = నియమములను పూనినవాడు; సమ = చక్కగా; ఆహిత = కూడగట్టుకొనిన; చిత్తుండును = మనసు కలవాడు; ఐ = అయ్యి; సర్వేశ్వరుని = విష్ణుమూర్తిని; ధ్యానంబున్ = ధ్యానము; చేయుచున్ = చేస్తూ; ప్రతి = ప్రతి; త్రి = మూడు (3); రాత్రంబునన్ = రాత్రుల కొకమారు; కృత = చేసిన; కపిత్థ = వెలగ; బదరీ = రేగు; ఫల = పండ్లను; పారణుండు = భోజనము కలవాడు; అగుచున్ = అవుతూ; దేహ = శరీర; స్థితిని = స్థితిని; అనుసరించి = ప్రకారము; ఇటుల = ఈ విధముగ; ఒక్క = ఒక; మాసంబు = నెల; హరిన్ = విష్ణుని; పూజించి = పూజించి; అంతన్ = అప్పటి; నుండి = నుండి; ఆఱేసి = ఆరు చొప్పున; దినంబుల = దినముల; కున్ = కి; ఒక్క = ఒక; పరి = మారు; కృత = చేసిన; జీర్ణ = ఎండిన; తృణ = గడ్డి; పర్ణ = ఆకులు; ఆహారుండు = భోజనము కలవాడు; అగుచున్ = అవుతూ; రెండవ = రెండో (2); మాసంబునన్ = నెలలో; విష్ణు = విష్ణుమూర్తిని; సమ = చక్కగా; ఆరాధనంబు = పూజ; చేసి = చేసి; అంత = అప్పటి; నుండి = నుండి; నవ = తొమ్మిది (9); రాత్రంబుల = రాత్రుల; కున్ = కి; ఒక = ఒక; మాఱున్ = మారు; ఉదక = నీటిని; భక్షణంబున్ = తీసుకొనుట; చేయుచున్ = చేస్తూ; మూడవ = మూడో (3); మాసంబునన్ = నెలలో; మాధవున్ = విష్ణుమూర్తిని; అర్చించి = పూజించి; అంత = అప్పటి; నుండి = నుండి; ద్వాదశ = పన్నెండు (12); దినంబుల = దినముల; కున్ = కి; ఒక = ఒక; మాఱున్ = మారు; వాయు = వాయువును; భక్షణుండు = తినువాడు; అగుచున్ = అవుతూ; జిత = జయించిన; శ్వాసుండు = శ్వాస కలవాడు; నాలవ = నాలుగో (4); మాసంబునన్ = నెలలో; పుండరీకాక్షునిన్ = విష్ణుమూర్తిని; భజియించి = పూజించి; అంత = అప్పటి; నుండి = నుండి; మనంబునన్ = మనసులో; అలయక = అలసిపోకుండగ; నిరుచ్ఛ్వాసుండు = ఊపిరివిడుచుట లేనివాడు; ఐ = అయ్యి; ఏక = ఒంటి; పదంబునన్ = కాలుమీద; నిలిచి = నిలబడి; పరమాత్మన్ = పరమాత్మను; చింతించుచున్ = ధ్యానిస్తూ; అచేతనంబున్ = కదలికలులేనిది; ఐన = అయిన; స్థాణువున్ = రాయి; పోలెన్ = వలె; ఐదవ = అయిదవ (5); మాసంబునున్ = నెలను; జరిపెన్ = గడిపెను; అంత = అంతట.

భావము:

ధ్రువుడు మధువనంలో ప్రవేశించి, యమునా నదిలో స్నానం చేసాడు. నియమంతో ఏకాగ్రచిత్తంతో భగవంతుణ్ణి ధ్యానింపసాగాడు. శరీరస్థితినిబట్టి మూడు దినాల కొకసారి వెలగపండ్లను, రేగుపండ్లను ఆరగిస్తూ ఒక్క నెల శ్రీహరిని అర్చిస్తూ గడిపాడు. తరువాత ఆరు దినాలకు ఒకసారి జీర్ణతృణపర్ణాలను తింటూ విష్ణుపూజలో రెండవ నెల గడిపాడు. తొమ్మిది దినాలకు ఒకమారు నీటిని త్రాగి మాధవసమారాధనలో మూడవ నెల గడిపాడు. అనంతరం పన్నెండు దినాల కొకసారి గాలిని ఆరగిస్తూ ఉచ్ఛ్వాస నిశ్వాసాలను నిరోధించి నారాయణ సేవలో నాలుగవ నెల గడిపాడు. తరువాత ఒంటికాలిపై నిలిచి పరమాత్ముణ్ణి భజిస్తూ ప్రాణం లేని మ్రోడులాగా నిశ్చలంగా ఐదవ నెల గడిపాడు.

4-271-సీ.
 • ఉపకరణాలు:
 •  
 •  
 •  

కల భూతేంద్రి యాయ మగు హృదయంబు-
నందు విషయములఁ జెందనీక
హదాది తత్త్వ సమాజమ్ములకును నా-
ధార భూతమును బ్రధాన పూరు
షేశ్వరుఁ డైనట్టి శాశ్వత బ్రహ్మంబుఁ-
నదైన హృదయ పద్మమున నిలిపి
రి రూపమున కంటె న్యంబు నెఱుఁగక-
చిత్త మవ్విభునందుఁ జేర్చియున్న

4-271.1-తే.
 • ఉపకరణాలు:
 •  
 •  
 •  

తన ముల్లోకములు చాలఁ గంపమొందె;
వెండియును బేర్చి యయ్యర్భకుండు ధరణి
నొక్కపాదంబు చేర్చి నిల్చున్నవేళఁ
బేర్చి యబ్బాలు నంగుష్టపీడఁ జేసి.

టీకా:

సకల = సమస్తమైన; భూత = భూతములకు; ఇంద్రియ = ఇంద్రియములకు; ఆశ్రయము = శరణ్యమైనది; అగు = అయిన; హృదయంబున్ = హృదయము; అందున్ = లోను; విషయములన్ = ఇంద్రియార్థములను, శబ్దాది విషయ సుఖములను; చెందనీక = చెందనీయకుండగ; మహదాది = మహత్తు మొదలైన {మహదాది - చతుర్వింశతితత్వంబులు, (1)మహత్తు (1)పురుషుడు (1)ప్రకృతి (5)పంచభూతములు (5)పంచతన్మాత్రలు (5)పంచకర్మేంద్రియములు (5)పంచజ్ఞానేంద్రియములు మరియు (1)అంతఃకరణము మొత్తము 1+1+1+5+5+5+5+1 = 24}; తత్త్వ = తత్త్వముల; సమాజమ్ముల్ = సమూహముల; కున్ = కి; ఆధారభూతమును = ఆధారమైనది; ప్రధాన = ప్రధానము అనబడెడి మూలత్త్వమునకు; పూరుష = పురుషుడు అనబడెడి జీవునకు; ఈశ్వరుడు = ప్రభువు; ఐనట్టి = అయినట్టి; = శాశ్వతబ్రహ్మంబున్ = శాశ్వతబ్రహ్మమును; తనది = తనది; ఐన = అయిన; హృదయ = హృదయము అనెడి; పద్మమున = పద్మము యందు; నిలిపి = నిలిపికొని; హరి = హరి యొక్క; రూపమున్ = రూపమున; కంటెన్ = కంటెను; అన్యంబున్ = ఇతరమును; ఎఱుగక = తెలియక; చిత్తమున్ = మనసును; ఆ = ఆ; విభున్ = ప్రభువు; అందున్ = అందు; చేర్చి = చేర్చి; ఉన్న = ఉండిన.
కతన = కారణముచేత; ముల్లోకములున్ = ముల్లోకములును; చాలన్ = మిక్కిలిగ; కంపమున్ = వణకుట; ఒందెన్ = చెందెను; వెండియును = ఇంకను; పేర్చి = అతిశయించి; ఆ = ఆ; అర్భకుండు = పిల్లవాడు; ధరణిన్ = భూమిపైన; ఒక్క = ఒంటి; పాదంబున్ = పాదమును; చేర్చి = ఆధారముగా చేసికొని; నిల్చున్న = నిలబడిన; వేళన్ = సమయములో; పేర్చిన్ = అతిశయించిన; ఆ = ఆ; బాలున్ = పిల్లవాని; అంగుష్ట = కాలి బొటకనవేలి; పీడన్ = పీడనము, ఒత్తిడి; చేసి = వలన.

భావము:

ధ్రువుడు చాంచల్యం లేని తన హృదయంలో ఇతర విషయాలను చొరనీయలేదు. మహత్తు మొదలైన తత్త్వాలకు ఆధారభూతుడూ, ప్రకృతి పురుషులకు అధీశ్వరుడూ, శాశ్వతుడూ అయిన భగవంతుణ్ణి తన హృదయపద్మంలో నిలుపుకున్నాడు. శ్రీహరి రూపాన్ని తప్ప మరి దేనినీ మనస్సులో స్మరించకుండా తన చిత్తాన్ని తదాయత్తం చేశాడు. ఈ విధంగా ధ్రువుడు తీవ్రమైన తపస్సును సాగించాడు. అతని తపఃప్రభావాన్ని సహింపలేక ముల్లోకాలు కంపించాయి. ధ్రువుడు భూమిపై ఒంటికాలు మోపి నిలుచున్నాడు. అతని కాలి బొటనవ్రేలి ఒత్తిడికి...

4-272-తే.
 • ఉపకరణాలు:
 •  
 •  
 •  

సుమతీతల మర్ధము వంగఁ జొచ్చె
భూరిమద దుర్నివారణ వాణేంద్ర
మెమఁ గుడి నొరగఁగ నడు డుగునకును
లన మొందు నుదస్థిత లము వోలె.

టీకా:

వసుమతీ = భూమి; తలము = తలము; అర్ధము = సగము; వంగన్ = ఒరిగిపోవుట; చొచ్చెన్ = చెందెను; భూరి = అత్యధికమైన; మద = మదముచేత; దుర్నివారణ = నివారింపరాని; వారణ = ఏనుగులలో; ఇంద్రము = శ్రేష్ఠమైనది; ఎడమన్ = ఎడమపక్కకి; కుడిన్ = కుడిపక్కకి; ఒరగన్ = ఒరుగుతుండగ; అడుగడుగున్ = అడుగడుగున; కున్ = కి; చలనమొందును = కదలిపోవును; ఉదత్ = నీటియందు; స్థిత = ఉన్న; కలము = పడవ; పోలెన్ = వలె.

భావము:

మదపుటేనుగు కుడి ఎడమలకు ఒరిగినప్పుడు అడుగడుగునా కంపించే పడవలాగా సగం భూమి వంగి క్రుంగింది.

4-273-చ.
 • ఉపకరణాలు:
 •  
 •  
 •  

తఁడు ననన్యదృష్టిని జరాచర దేహిశరీర ధారణా
స్థితి గల యీశునందుఁ దన జీవితమున్ ఘటియింపఁ జేసి యే
తఁ గనఁ దన్నిరోధమునఁ గైకొని కంపము నొందె నీశ్వరుం;
తఁడు చలింప నిజ్జగము న్నియుఁ జంచల మయ్యె భూవరా!

టీకా:

అతడు = అతడు; అనన్య = అనితరమైన; దృష్టిని = దృష్టితో; చర = చలనము కల; అచర = చలనము లేని; దేహి = జీవుల; శరీర = శరీరములందు; ధారణా = ధారణ యొక్క; స్థితి = స్థితిలో; కల = ఉన్న; ఈశున్ = ఈశ్వరుని; అందున్ = అందు; తన = తన యొక్క; జీవితమున్ = ప్రాణమును; ఘటియింపన్ = కూర్చుట; చేసి = వలన; ఏకతన్ = ఐక్యమును; కనన్ = పొందగ; తత్ = దాని; నిరోధమునన్ = నిరోధమును; కైకొని = గ్రహించి; కంపమున్ = కంపించుటను; ఒందెన్ = పొందెను; ఈశ్వరుండు = ఈశ్వరుడు; అతడు = అతడు; చలింపన్ = చలించగ; ఈ = ఈ; జగములున్ = లోకములు; అన్నియున్ = సర్వము; చంచలము = మిక్కిలి చలించునవి; అయ్యెన్ = అయినవి; భూవరా = రాజా.

భావము:

ధ్రువుడు ఏకాగ్రదృష్టితో చరాచర విశ్వానికి అధీశ్వరుడైన భగవంతుని ధ్యానించాడు. తదేక చిత్తంతో తన ప్రాణవాయువును నిరోధించి పరమేశ్వరునితో అనుసంధానం చేసాడు. ఈ విధంగా శ్వాసను నిరోధించడం వల్ల శ్రీహరి కంపించాడు. ఆయన కంపించగానే అఖిలలోకాలూ ప్రకంపించాయి.

4-274-క.
 • ఉపకరణాలు:
 •  
 •  
 •  

లోకభయంకర మగు
నా లోకమహావిపద్దశాలోకనులై
యా లోకపాలు రందఱు
నా లోకశరణ్యుఁ గాన రిగిరి భీతిన్.

టీకా:

ఆలోక = చూచుటకు; భయంకరము = భీకరము; అగున్ = అయిన; ఆ = ఆ; లోక = లోకములకు; మహా = గొప్ప; విపత్ = ప్రమాదముల; దశా = దశను; ఆలోకనులు = చూసినవారు; ఐన = అయినట్టి; ఆ = ఆ; లోకపాలురు = లోకపాలకులు; అందఱున్ = అందరు; ఆ = ఆ; లోకశరణ్యున్ = నారాయణుని {లోకశరణ్యుడు - లోకములన్నిటికిని శరణ్యము యైనవాడు, విష్ణువు}; కానన్ = చూచుటకు; అరిగిరి = వెళ్ళిరి; భీతిన్ = భయముతో.

భావము:

లోకాలకు సంభవించిన ఆ చూడటానికి భయంకరమైన మహా విపత్తును చూచి అష్ట దిక్పాలకులు మొదలైన లోకపాలు రందరూ భయంతో లోకరక్షకుడైన హరిని దర్శించడానికి వెళ్ళారు.

4-275-వ.
 • ఉపకరణాలు:
 •  
 •  
 •  

అట్లరిగి నారాయణు నుద్దేశించి కృతప్రణాములై కరంబులు ముకుళించి యిట్లనిరి.

టీకా:

అట్లు = ఆ విధముగ; అరిగి = వెళ్ళి; నారాయణున్ = హరిని; ఉద్దేశించి = ఎడల; కృత = చేసిన; ప్రణాములు = నమస్కారములు కలవారు; ఐ = అయ్యి; కరంబులున్ = చేతులు; ముకుళించి = జోడించి; ఇట్లు = ఈ విధముగ; అనిరి = పలికిరి.

భావము:

అలా వెళ్ళి దేవతలంతా నారాయణునికి నమస్కరించి చేతులు మోడ్చి ఇలా అన్నారు.

4-276-చ.
 • ఉపకరణాలు:
 •  
 •  
 •  

"రి! పరమాత్మ! కేశవ! చరాచర భూతశరీర ధారివై
రఁగుదు వీవు; నిట్టులుగఁ బ్రాణనిరోధ మెఱుంగ మెందు ముం
దివుగ దేవదేవ! జగదీశ్వర! సర్వశరణ్య! నీ పదాం
బురుహము లర్థిమై శరణు బొందెద మార్తి హరించి కావవే!"

టీకా:

హరి = విష్ణుమూర్తి; పరమాత్మ = విష్ణుమూర్తి; కేశవ = విష్ణుమూర్తి; చర = చలనము కల; అచర = చలనము లేని; శరీర = జీవులయందు; ధారివి = ధారణ కలవాడవు; ఐ = అయ్యి; పరగుదువు = ప్రవర్తిల్లువాడవు; ఈవు = నీవు; ఇట్టులగన్ = ఈ విధముగ; ప్రాణ = ప్రాణముల; నిరోధమున్ = చేటు; ఎఱుంగము = తెలియము; ఎందున్ = ఎక్కడను; ముందు = ఇంతకుముందు; తిరవుగన్ = నిశ్చయముగ; దేవదేవ = హరి {దేవదేవుడు - దేవుళ్ళకి దేవుడు, విష్ణువు}; జగదీశ్వర = హరి {జగదీశ్వరుడు - జగత్తునకు ఈశ్వరుడు, విష్ణువు}; సర్వశరణ్య = హరి {సర్వశరణ్యుడు - సర్వులకి (అందరికి) శరణ్యుడు, విష్ణువు}; నీ = నీ యొక్క; పద = పాదములు అనెడి; అంబురుహముల్ = పద్మములు; అర్థిమై = కోరి; శరణు = శరణము; పొందెదమున్ = పొందుచున్నాము; ఆర్తిన్ = ఆర్తిని, బాధను; హరించి = పోగొట్టి; కావవే = కాపాడుము.

భావము:

“శ్రీహరీ! పరమాత్మా! కేశవా! నీవు సర్వప్రాణి శరీరాలలో అంతర్యామిగా ఉండే స్వామివి. పూర్వం ఎప్పుడూ ఈ విధంగా మాకు ప్రాణనిరోధం ప్రాప్తించలేదు. ఊపిరి ఆడక ఉక్కిరిబిక్కిరి అవుతున్నాము. జగదీశ్వరా! సర్వశరణ్యా! నీ చరణ కమలాలను శరణు కోరుతున్నాము. ఆపదను తొలగించి కాపాడు.”

4-277-వ.
 • ఉపకరణాలు:
 •  
 •  
 •  

అని దేవతలు విన్నవించిన నీశ్వరుండు వారల కిట్లనియె “నుత్తానపాదుం డనువాని తనయుండు విశ్వరూపుండ నయిన నా యందుఁ దన చిత్తం బైక్యంబు చేసి తపంబు గావించుచుండ, దానంజేసి భవదీయ ప్రాణనిరోధం బయ్యె; నట్టి దురత్యయం బైన తపంబు నివర్తింపఁ జేసెద వెఱవక మీమీ నివాసంబులకుం జనుం” డని యానతిచ్చిన నా దేవతలు నిర్భయాత్ములై యీశ్వరునకుఁ బ్రణామంబు లాచరించి త్రివిష్టపంబునకుం జనిరి; తదనంతరంబ.

టీకా:

అని = అని; దేవతలు = దేవతలు; విన్నవించిన = విన్నవించగ; ఈశ్వరుండు = నారాయణుడు; వారల = వారి; కిన్ = కి; ఇట్లు = ఈ విధముగ; అనియె = పలికెను; ఉత్తానపాదుండు = ఉత్తానపాదుడు; అను = అనెడు; వాని = వాని; తనయుండు = పుత్రుడు; విశ్వ = విశ్వము; రూపుండను = రూపముగా కలవాడను; అయిన = అయిన; నా = నా; అందున్ = అందు; తన = తన యొక్క; చిత్తంబున్ = చిత్తమును; ఐక్యంబున్ = ఐక్యము; చేసి = చేసి; తపంబున్ = తపస్సును; కావించుచుండన్ = చేస్తుండగా; దానన్ = దాని; చేసి = వలన; భవదీయ = మీ యొక్క; ప్రాణ = ప్రాణమునకు; నిరోధంబు = నిరోధము; అయ్యెన్ = కలిగినది; అట్టి = అటువంటి; దురత్యయంబు = దాటరానిది; ఐన = అయిన; తపంబున్ = తపస్సును; నివర్తింపన్ = మానిపింప; చేసెదన్ = చేసెదను; వెఱవక = బెదరక; మీమీ = మీమీ; నివాసంబుల్ = నివాసముల; కున్ = కు; చనుండు = వెళ్ళండి; అని = అని; ఆనతిచ్చిన = చెప్పగా; ఆ = ఆ; దేవతలు = దేవతలు; నిర్భయ = భయములేని; ఆత్ములు = మనసులు కలవారు; ఐ = అయ్యి; ఈశ్వరున్ = హరి; కున్ = కి; ప్రణామంబులు = నమస్కారములు; ఆచరించి = చేసి; త్రివిష్టపంబు = స్వర్గమున {త్రివిష్టపము – త్రిదివము, మూడవలోకము, వ్యు. తృతీయం విష్టపము – త్రివిష్టపము, స్వర్గలోకము}, ముల్లోకముల; కున్ = కు; చనిరి = వెళ్ళిరి; తదనంతరంబ = తరువాత.

భావము:

అని దేవతలు విన్నవించగా శ్రీహరి వారితో ఇలా అన్నాడు. “ఉత్తానపాదుని కొడుకు విశ్వస్వరూపుణ్ణి అయిన నాయందు తన మనస్సును సంధానం చేసి తపస్సు చేస్తున్నాడు. అందువల్ల మీకు ప్రాణనిరోధం కలిగింది. ఆ బాలుణ్ణి తపస్సు నుండి విరమింప జేస్తాను. భయపడకండి. మీ మీ ఇండ్లకు వెళ్ళండి” అని ఆనతి నివ్వగా భయం తొలగిన దేవతలు వాసుదేవునకు నమస్కరించి తమ లోకాలకు బయలుదేరి వెళ్ళారు. ఆ తరువాత...

4-278-సీ.
 • ఉపకరణాలు:
 •  
 •  
 •  

రి యీశ్వరుండు విహంగ కులేశ్వర-
యానుఁడై నిజభృత్యుఁడైన ధ్రువునిఁ
నుఁగొను వేఁడుక నియింప నా మధు-
నమున కప్పుడు ని ధ్రువుండు
రువడి యోగవిపాక తీవ్రంబైన-
బుద్దిచే నిజమనోంబురుహ ముకుళ
మందుఁ దటిత్ప్రభాత మూర్తి యటఁ దిరో-
ధానంబునను బొంది త్క్షణంబ

4-278.1-తే.
 • ఉపకరణాలు:
 •  
 •  
 •  

పురోభాగమందు నిల్చిను బూర్వ
మధికజ్ఞాన నయన గోర సమగ్ర
మూర్తిఁ గనుఁగొని సంభ్రమమునను సమ్మ
దాశ్రువులు రాలఁ బులకీకృతాంగుఁ డగుచు

టీకా:

హరి = విష్ణువు; ఈశ్వరుండు = విష్ణువు; విహంగకులేశ్వర = గరుడుని {విహంగకులేశ్వరుడు - విహంగ (పక్షుల)కు ప్రభువు, గరుడుడు}; యానము = వాహనము ఎక్కినవాడు; ఐ = అయ్యి; నిజ = తన యొక్క; భృత్యుడు = సేవకుడు; ఐన = అయిన; ధ్రువుని = ధ్రువుని; కనుగొను = చూసెడి; వేడుక = కుతూహలము; జనియింపన్ = పుట్టగా; ఆ = ఆ; మధువనమున్ = మధువనమున; కున్ = కు; అప్పుడు = అప్పుడు; చని = వెళ్ళి; ధ్రువుండు = ధ్రువుడు; పరువడి = క్రమముగ; యోగ = యోగము యొక్క; విపాకము = పరిపక్వముచేత; తీవ్రంబు = తీక్షణము; ఐన = అయిన; బుద్ధి = బుద్ధి; చేన్ = చేత; నిజ = తన యొక్క; మనః = మనస్సు అనెడి; అంబురుహ = పద్మపు; ముకుళము = మొగ్గ; అందున్ = లో; తటిత్ = మెరపు; ప్రభా = ప్రకాశముతో; ఆయత = విస్తారమైన; మూర్తిన్ = స్వరూపము; అటన్ = అక్కడ; తిరోధానంబునను = అదృశ్యమును; పొంది = పొంది; తత్క్షణంబ = అదేక్షణములో.
తన = తన యొక్క; పురోభాగము = ఎదుటి ప్రదేశము; అందున్ = లో; నిల్చినన్ = నిలబడగా; పూర్వ = ఇంతకుముందు; సమధిక = మిక్కిలి అదికమైన; జ్ఞాన = జ్ఞానము అనెడి; నయన = కన్నులకు; గోచర = కనబడిన; సమగ్ర = సమగ్రమైన; మూర్తిన్ = స్వరూపమును; కనుగొని = దర్శించి; సంభ్రమమునను = సంభ్రమము వలన; సమ్మద = ఆనంద; ఆశ్రువులు = బాష్పములు; రాలన్ = రాలుతుండగ; పులకీకృత = పులకరిస్తున్న; అంగుడు = దేహము కలవాడు; అగుచున్ = అవుతూ.

భావము:

భగవంతుడైన హరి గరుడవాహన మెక్కి తన భక్తుడైన ధ్రువుణ్ణి చూడాలనే ఉత్సాహంతో మధువనానికి వచ్చాడు. అప్పుడు ధ్రువుడు ధ్రువమైన భక్తియోగంతో, నిశ్చలమైన బుద్ధితో తన మనస్సులో ప్రకాశిస్తున్న శ్రీహరిని చూస్తూ ఉండటం చేత బయట ఉన్న శ్రీహరిని చూడలేకపోయాడు. ఇంతలో అతని మనస్సులోని మూర్తి మాయమై పోయింది. అప్పుడు ధ్రువుడు తనముందు సాక్షాత్కరించిన కరుణామూర్తిని కనుగొన్నాడు. తొట్రుపాటు చెందాడు. చెక్కిళ్ళపై స్రవించే ఆనంద బాష్పాలతో స్వామిని తిలకించి పులకించాడు.

4-279-తే.
 • ఉపకరణాలు:
 •  
 •  
 •  

యనముల విభుమూర్తిఁ బానంబు చేయు
గిదిఁ దన ముఖమునను జుంనము చేయు
లీలఁ దగ భుజములను నాలింగనంబు
చేయుగతి దండవన్నమస్కృతు లొనర్చె.

టీకా:

నయనములన్ = కళ్ళతో; విభు = ప్రభువు యొక్క; మూర్తిన్ = స్వరూపమును; పానంబు = తాగుట; చేయు = చేస్తున్న; పగిదిన్ = విధముగ; తన = తన; ముఖమునను = ముఖమును; చుంబనము = ముద్దు; చేయు = పెట్టుకుంటున్న; లీలన్ = విధముగ; తగ = తగినట్లు; భుజములను = భుజములను; ఆలింగనంబున్ = కౌగలించుకొనుట; చేయు = చేస్తున్న; గతిన్ = విధముగ; దండవన్నమస్కృతుల్ = సాష్టాంగనమస్కారములు {దండవన్నమస్కృతులు - దండము (కఱ్ఱ)వలె పడి నమస్కరించుటలు}; ఒనర్చెన్ = చేసెను.

భావము:

తన కళ్ళతో స్వామి సౌందర్యాన్ని పానం చేస్తున్నట్లు, తన ముఖంతో స్వామిని ముద్దు పెట్టుకుంటున్నట్లు, తన చేతులతో స్వామిని కౌగిలించుకుంటున్నట్లు అనుభూతి పొందుతూ సాగిలపడి సాష్టాంగ నమస్కారం చేసాడు.

4-280-వ.
 • ఉపకరణాలు:
 •  
 •  
 •  

ఇట్లు దండప్రణామంబు లాచరించి కృతాంజలి యై స్తోత్రంబు చేయ నిశ్చయించియు స్తుతిక్రియాకరణ సమర్థుండుఁ గాక యున్న ధ్రువునకును సమస్త భూతంబులకు నంతర్యామి యైన యీశ్వరుం డాతని తలంపెఱింగి వేదమయం బయిన తన శంఖంబు చేత నబ్బాలుని కపోలతలం బంటిన జీవేశ్వర నిర్ణయజ్ఞుండును, భక్తిభావ నిష్ఠుండును నగు ధ్రువుండు నిఖిలలోక విఖ్యాత కీర్తిగల యీశ్వరుని భగవత్ప్రతిపాదితంబు లగుచు వేదాత్మకంబులైన తన వాక్కుల నిట్లని స్తుతియించె “దేవా! నిఖిలశక్తి ధరుండవు నంతఃప్రవిష్టుండవు నైన నీవు లీనంబు లైన మదీయ వాక్యంబులం బ్రాణేంద్రియంబులం గరచరణ శ్రవణత్వ గాదులను జిచ్ఛక్తిచేఁ గృపంజేసి జీవింపం జేసిన భగవంతుం డవును, బరమపురుషుండవును నైన నీకు నమస్కరింతు; నీ వొక్కరుండవయ్యు మహదాద్యంబైన యీ యశేష విశ్వంబు మాయాఖ్యం బయిన యా త్మీయశక్తిచేతం గల్పించి యందుం బ్రవేశించి యింద్రియంబు లందు వసించుచుఁ దత్తద్దేవతారూపంబులచే నానా ప్రకారంబుల దారువు లందున్న వహ్ని చందంబునం బ్రకాశింతువు; అదియునుం గాక.

టీకా:

ఇట్లు = ఈ విధముగ; దండప్రణామంబులు = సాష్టాంగనమస్కారములు; ఆచరించి = చేసి; కృత = చేసిన; అంజలి = నమస్కారము కలవాడు; ఐ = అయ్యి; స్తోత్రంబు = స్తోత్రము; చేయ = చేయవలెనని; నిశ్చయించియు = సంకల్పించుకొని; స్తుతి = స్తోత్రము; క్రియా = చేయుటకు; కరణ = చేసెడి; సమర్థుండు = సమర్థత కలవాడు; కాక = కాకుండగ; ఉన్న = ఉన్నట్టి; ధ్రువున్ = ధ్రువుని; కున్ = కి; సమస్త = సమస్తమైన; భూతంబుల్ = జీవుల; కున్ = కి; అంతర్యామి = లోనుండువాడు; ఐన = అయిన; ఈశ్వరుండు = హరి; అతని = అతని; తలంపున్ = ఊహను; ఎఱింగి = తెలిసి; వేద = వేదములతో; మయంబున్ = నిండినది; అయిన = అయినట్టి; తన = తన; శంఖంబు = శంఖము; చేతన్ = తోటి; ఆ = ఆ; బాలునిన్ = పిల్లవాని; కపోల = చెక్కిలి; తలంబున్ = ప్రదేశమును; అంటిన = తాకిన; జీవ = జీవుని; ఈశ్వర = ఈశ్వరుని అనెడి; నిర్ణయజ్ఞుండును = నిర్ణయించు జ్ఞానము కలవాడు; భక్తిభావ = భక్తిభావమునందు; నిష్ఠుండును = నిష్ఠకలవాడును; అగు = అయిన; ధ్రువుండు = ధ్రువుడు; నిఖిల = సమస్తమైన; లోక = లోకములందు; విఖ్యాతి = ప్రసిద్ధమైన; కీర్తి = కీర్తి; కల = కలిగిన; ఈశ్వరుని = హరిని; భగవత్ = భగవంతునిగ; ప్రతిపాదితంబులు = నిర్ణయించెడివి; అగుచున్ = అవుతూ; వేద = వేదముల; ఆత్మకంబులు = స్వరూపంబులు; ఐన = అయిన; తన = తన; వాక్కులన్ = పలుకులతో; ఇట్లు = ఈ విధముగ; అని = అని; స్తుతియించె = స్తుతియించెను; దేవా = భగవంతుడా; నిఖిల = సమస్తమైన; శక్తి = సామర్థ్యములను; ధరుండవు = ధరించినవాడవు; అంతః = లోపల; ప్రవిష్టుండవు = ప్రవేశించినవాడవు; ఐన = అయిన; నీవు = నీవు; లీనంబులు = లీనమైపోయినవి; ఐన = అయిన; మదీయ = నా యొక్క; వాక్యంబులన్ = మాటను; ప్రాణ = ప్రాణములను; ఇంద్రియంబులన్ = ఇంద్రియములను; కర = చేతులు; చరణ = కాళ్ళు; శ్రవణ = చెవులు; త్వక్ = చర్మము; ఆదులనున్ = మొదలగువాటిని; చిత్ = చేతన; శక్తి = శక్తి; చేన్ = చేత; కృపంజేసి = దయచేసి; జీవింపన్ = జీవించునట్లు; చేసిన = చేసిన; భగవంతుండవును = మహా మహిమాన్వితుండవును {భగవంతుండు – మహా మహిమాన్వితుడు}; పరమపురుషుండవును = పరమాత్మవవును {పరమపురుషుడు - సర్వాతీతమై సకల పురముల (దేహముల)లోను ఉండువాడు, పరమాత్మ}; ఐన = అయిన; నీకున్ = నీకు; నమస్కరింతు = నమస్కరించెదను; నీవు = నీవు; ఒక్కరుండవు = ఒకడివే; అయ్యు = అయి యుండియు; మహదాద్యంబు = మహదాదులతో కూడినది; ఐన = అయిన; ఈ = ఈ; అశేష = అనంతమైన; విశ్వంబున్ = విశ్వమును; మాయా = మాయ అనెడి; ఆఖ్యంబు = పేరుకలది; అయిన = అయిన; ఆత్మీయ = ఆత్మ యొక్క; శక్తిన్ = శక్తి; చేతన్ = చేత; కల్పించి = సృష్టించి; అందున్ = వాటిలో; ప్రవేశించి = చేరి; ఇంద్రియంబుల్ = ఇంద్రియముల; అందున్ = లో; వసించుచున్ = నివసిస్తూ; తత్తత్ = ఆయా; దేవతా = దేవతల; రూపంబులన్ = రూపముల; చేన్ = చేత; నానా = వివిధ; ప్రకారంబులన్ = రకములుగ; దారువులు =కొయ్యలు; అందున్ = లోపల; ఉన్న = ఉండెడి; వహ్ని = అగ్ని; చందంబునన్ = వలె; ప్రకాశింతువు = ప్రకాశిస్తుంటావు; అదియునున్ = అంతే; కాక = కాకుండగ.

భావము:

ఈ విధంగా సాష్టాండ దండ ప్రణామం చేసి, చేతులు జోడించి శ్రీహరిని స్తుతించాలనుకొని, స్తుతి విధానం తెలియక మిన్నకున్నాడు ధ్రువుడు. సర్వాంతర్యామియైన భగవంతుడు ధ్రువుని తలంపు గ్రహించి తన చేతిలో ఉన్న వేదమయమైన పాంచజన్య శంఖంతో ఆ బాలుని చెక్కిలిని స్పృశించాడు. ఆ ప్రభావం వల్ల జీవేశ్వర నిర్ణయాన్ని గుర్తించిన ధ్రువుడు భక్తిభావంతో భగవంతుడు ప్రసాదించిన వేదవాక్కులతో విశ్వవిఖ్యాతుడైన ఈశ్వరుణ్ణి ఇలా స్తుతించాడు. “దేవా! నీవు అఖిల శక్తిసంపన్నుడవు. అంతర్యామివి. స్తంభించిపోయిన నా వాక్కులను, ప్రాణాలను, నా కరచరణాది సకలేంద్రియాలను దయతో జ్ఞానాత్మకమైన నీ శక్తివల్ల తిరిగి బ్రతికించిన భగవంతుడవు. పరమపురుషుడవైన నీకు నమస్కారం. నీవు ఒక్కడవే అయినప్పటికీ నీ మాయాశక్తిచేత ఈ సమస్త విశ్వాన్ని సృజిస్తావు. ఆ విశ్వంలో ప్రవేశిస్తావు. ఇంద్రియాలతో నివసిస్తావు. అగ్ని ఒక్కటే అయినా ఎన్నో దారువులలో ప్రకాశించే విధంగా నీవు ఆయా దేవతారూపాలలో ప్రవేశించి ప్రకాశిస్తావు.

4-281-చ.
 • ఉపకరణాలు:
 •  
 •  
 •  

మతి నార్తబాంధవ! భద్ఝన బోధసమేతుఁడై భవ
చ్చణముఁ బొంది నట్టి విధి ర్గము సుప్తజనుండు బోధమం
యఁగఁ జూచురీతిఁ గనుట్టి ముముక్షు శరణ్యమైన నీ
ణములం గృతజ్ఞుఁడగు జ్జనుఁ డెట్లు దలంపకుండెడున్?

టీకా:

వర = శ్రేష్ఠమైన; మతిన్ = బుద్ధితో; ఆర్తబాంధవ = బాధలలో ఉన్నవారికి చుట్టము వంటివాడ; భవత్ = నీ యొక్క; ఘన = గొప్ప; బోధ = జ్ఞానము, బోధము; సమేతుండు = కూడినవాడు; ఐ = అయ్యి; భవత్ = నీ యొక్క; చరణమున్ = పాదమును; పొందిన = చెందిన; అట్టి = అటువంటి; విధి = బ్రహ్మదేవుని; సర్గమున్ = సృష్టిని; సుప్త = నిద్రించిన; జనుండు = వాడు; బోధము = మెలుకువ; అందున్ = లో; అరయగన్ = విచారించి; చూచున్ = చూసెడి; రీతిన్ = విధముగ; కనునట్టి = కనబడెడి; ముముక్ష = మోక్షము కోరెడివారికి; శరణ్యము = దిక్కు; ఐన = అయిన; నీ = నీ; చరణములన్ = పాదములను; కృతజ్ఞుండు = కృతజ్ఞుడు; అగు = అయినట్టి; సత్ = మంచి; జనుడు = వాడు; ఎట్లు = ఏ విధముగ; తలంపక = ధ్యానించకుండ; ఉండెడున్ = ఉండగలడు.

భావము:

దీనబాంధవా! నిద్రనుండి మేలుకొన్నవాడు మళ్ళీ ప్రపంచాన్ని చూసినట్లుగా బ్రహ్మదేవుడు నిన్ను శరణు పొంది నీవు ప్రసాదించిన జ్ఞానంచేత ఈ సమస్త ప్రపంచాన్ని సందర్శిస్తాడు. మోక్షం కోరే వారికి శరణాలైన నీ చరణాలను కృతజ్ఞుడైన సజ్జనుడు ఎలా మరచిపోగలడు?

4-282-సీ.
 • ఉపకరణాలు:
 •  
 •  
 •  

హితాత్మ! మఱి జన్మరణ ప్రణాశన-
హేతు భూతుండవు నిద్ధకల్ప
రువవు నగు నిన్నుఁ గనెవ్వరే నేమి-
పూని నీ మాయా విమోహితాత్ము
గుచు ధర్మార్థ కామాదుల కొఱకుఁ దా-
ర్చించుచును ద్రిగుణాభమైన
దేహోపభోగ్యమై దీపించు సుఖముల-
నెనయంగ మదిలోన నెంతు; రట్టి

4-282.1-తే.
 • ఉపకరణాలు:
 •  
 •  
 •  

విషయ సంబంధ జన్యమై వెలయు సుఖము
వారికి నిరయమందును ఱలు దేవ!
భూరి సంసార తాప నివా గుణ క
థామృతాపూర్ణ! యీశ! మావ! ముకుంద!

టీకా:

మహితాత్మ = హరి {మహితాత్మ - మహిమ కలవాడ, విష్ణువు}; మఱి = మరి; జన్మ = జన్మలు; మరణ = మరణములను; ప్రణాశన = పూర్తిగ నాశింపజేయుటకు; హేతుభూతుండవు = కారణమైనవాడవు; ఇద్ధ = ప్రసిద్ధమైన; కల్పతరువవు = కల్పతరువువంటివాడవు; అగు = అయిన; నిన్నున్ = నిన్ను; తగన్ = తగి; ఎవ్వరు = ఎవరు; ఏనేమి = అయినాసరే; పూని = నిశ్చయముతో; నీ = నీ; మాయా = మాయచేత; విమోహిత = బాగుగ మోహములోపడిన; ఆత్ములు = వారు; అగుచున్ = అవుతూ; ధర్మ = ధర్మము; అర్థ = అర్థము; కామ = కామము; ఆదుల = మొదలగువాటి; కొఱకున్ = కోసము; తాము = తాము; అర్చించుచున్ = పూజిస్తూ; త్రిగుణ = సత్త్వరజస్తమో (త్రి) గుణములతో; ఆభము = ప్రదీప్తము; ఐన = అయిన; = దేహ = శరీరమునకు; ఉపభోగ్యము = అనుభవించదగినవి; ఐ = అయ్యి; దీపించు = ప్రకాశించు; సుఖములన్ = సుఖములను; ఎనయంగన్ = పొందుటకు; మదిన్ = మనసు; లోనన్ = లోను; ఎంతురు = ఎంచుకొనెదరు; అట్టి = అట్టి.
విషయ = విషయములకు; సంబంధ = సంబంధముతో; జన్యము = పుట్టినది; ఐ = అయ్యి; వెలయు = విలసిల్లు; సుఖమున్ = సుఖములు; వారికి = వారికి; నిరయము = నరకము; అందును = లో కూడ; వఱలు = ప్రవర్తిల్లు; దేవ = దేవుడ; భూరిసంసారతాపనివారగుణకథామృతాపూర్ణ = విష్ణుమూర్తి {భూరి సంసారతాప నివార గుణకథామృతా పూర్ణ - అత్యధికమైనసంసారతాపములను నివారించుగుణముకల కథల అమృతమున నిండినవాడు, విష్ణువు}; ఈశ = విష్ణుమూర్తి; మాధవా = విష్ణుమూర్తి; ముకుంద = విష్ణుమూర్తి.

భావము:

మహానుభావా! దేవా! మాధవా! ముకుందా! అపారమైన సంసార తాపాలను నివారించే సుగుణాలతో కూడిన కథాసుధాపూరం కలవాడా! జనన మరణాలను తొలగించి నీవు ప్రాణులను రక్షిస్తావు. తమ తమ కోరికలు నెరవేరటం కోసం నిన్ను సేవించేవారు నీ మాయచేత మోసగింపబడినవారే. భక్తజన కల్పవృక్షం అయిన నిన్ను దైహికాలైన ఐహికసుఖాలకోసం కొందరు సేవిస్తారు. విషయ సంబంధమైన సుఖం నరకంలో కూడా లభిస్తుంది.

4-283-మ.
 • ఉపకరణాలు:
 •  
 •  
 •  

విందోదర! తావకీన చరణధ్యానానురాగోల్లస
చ్చరితాకర్ణనజాత భూరిసుఖముల్ స్వానందకబ్రహ్మ మం
యన్ లేవఁట; దండ భృద్భట విమానాకీర్ణులై కూలు నా
సులోకస్థులఁ జెప్పనేల? సుజనస్తోమైక చింతామణీ!

టీకా:

అరవిందోదర = విష్ణుమూర్తి {అరవిందోదరుడు - అరవిందము (పద్మము) ఉదరమున కలవాడు, విష్ణువు}; తావకీన = నీ యొక్క; చరణ = పాదములను; ధ్యాన = ధ్యానించుట యందు; అనురాగన్ = ప్రీతిని; ఉల్లసత్ = ఉత్సాహపరిచెడి; చరిత్ర = కథలు; ఆకర్ణన = వినుటలువలన; జాత = పుట్టెడు; భూరి = అత్యధికమైన; సుఖముల్ = సౌఖ్యములు; స్వానందకబ్రహ్మము = ఆత్మానందక బ్రహ్మము; అందన్ = లోకూడ; పరికింపన్ = వెదకి చూసిన; లేవట = లేవు అట; దండభృత్ = యమధర్మరాజు; భట = భటులచే; విమాన = విమానము లందు; ఆకీర్ణులు = చెదరిపోయినవారు; ఐ = అయ్యి; కూలున్ = కూలెడి; ఆ = ఆ; సురలోకస్థులన్ = దేవతలను; చెప్పన్ = చెప్పుట; ఏలన్ = ఎందులకు; సు = మంచి; జన = వారిచే; స్తోమ = సమూహము; ఏక = ఒక్కడే యైన; చింతా = కోరినవి; మణీ = ఇచ్చెడి రత్నము వలె శ్రేష్ఠుడ.

భావము:

పద్మానాభా! సాధుజన చింతామణీ! నీ పాదస్మరణం వల్లను, అనురాగ సుధలు చిందే నీ కథలను వినటం వల్లను ప్రాప్తించే పరమసుఖం స్వాత్మానందంతో సమానమైన మోక్షంలో కూడ లభించదంటారు. ఇక యముని కాలదండం చేత విరిగిపడే విమానాల నుండి కూలిపోతున్న వేలుపుల మాట వేరే చెప్పటం దేనికి?

4-284-చ.
 • ఉపకరణాలు:
 •  
 •  
 •  

రి! భజనీయ మార్గనియతాత్మకులై భవదీయ మూర్తిపై
లిన భక్తియుక్తు లగువారల సంగతిఁ గల్గఁజేయు స
త్పురుష సుసంగతిన్ వ్యసనదుస్తర సాగర మప్రయత్నతన్
స భవత్కథామృత రసంబున మత్తుఁడనై తరించెదన్.

టీకా:

హరి = నారాయణ; భజనీయ = పూజించదగిన; మార్గ = విధమున; నియతా = నియమించుకొనిన; ఆత్మకులు = మనసులు కలవారు; ఐ = అయ్యి; భవదీయ = నీ యొక్క; మూర్తిన్ = స్వరూపము; పైన్ = మీద; వఱలిన = ప్రవర్తిల్లు; భక్తి = భక్తి; యుక్తులు = కూడినవారు; అగు = అయిన; వారల = వారి; సంగతిన్ = సహవాసమును; కల్గన్ = కలుగునట్లు; చేయు = చేయుము; సత్ = మంచి; పురుష = పురుషుల; సు = మంచి; సంగతిన్ = సహవాసమునను; వ్యసన = దోషము లనెడి {వ్యసనము - కామక్రోధములవలన పుట్టిన దోషము}; దుస్తర = దాటరాని; సాగరమున్ = సముద్రమును; అప్రయత్నన్ = అప్రయత్నముగ; సరస = మనోహరమైన; భవత్ = నీ యొక్క; కథా = కథ లనెడి; అమృతంబునన్ = అమృతముచేత; మత్తుడను = మత్తెక్కినవాడను; ఐ = అయ్యి; తరించెదన్ = దాటెదను.

భావము:

శ్రీహరీ! నిర్మలాత్ములై నీ సేవయందు ఆసక్తులైన భక్తులతో నాకు మైత్రి చేకూర్చు. ఆ సత్పురుషుల సాంగత్యం చేత నీ కథాసుధారసాన్ని మనసారా గ్రోలి, దుఃఖాలతో నిండిన దాటరాని సంసార సాగరాన్ని సులభంగా తరిస్తాను.

4-285-చ.
 • ఉపకరణాలు:
 •  
 •  
 •  

నితముఁ దావకీన భజనీయ పదాబ్జ సుగంధలబ్ధి నె
వ్వరి మది వొందఁగాఁ గలుగు, వారలు తత్ప్రియ మర్త్యదేహముం
ము తదీయ దార సుత కామ సుహృద్గృహ బంధు వర్గమున్
తురు విశ్వతోముఖ! రమాహృదయేశ! ముకుంద! మాధవా!

టీకా:

నిరతమున్ = ఎల్లప్పుడు; తావకీన = నీ యొక్క; భజనీయ = పూజించదగిన; పద = పాదములు అనెడి; అబ్జ = పద్మముల; సుగంధ = సువాసనలు; లబ్ధిన్ = దొరకుటను; ఎవ్వరి = ఎవరి; మదిన్ = మనసు; పొందగాన్ = పొందుటను; కలుగు = సాధించ కలిగిన; వారలు = వారు; తత్ = వారి; ప్రియ = ప్రియమగు; మర్త్య = మానవ; దేహమున్ = శరీరమును; కరము = మిక్కిలి; తదీయ = అతని; దార = భార్య; సుత = బిడ్డలు; కామ = హితులు; సుహృత్ = స్నేహితులు; గృహ = గృహములు; బంధు = బంధువుల; వర్గమున్ = సమూహమును; మఱతురు = మరచిపోతారు; విశ్వతోముఖ = హరి {విశ్వతోముఖుడు - విశ్వమంతయు వ్యాపించిన వాడు, విష్ణువు}; రమాహృదయేశ = హరి {రమా హృదయేశ - రమ (లక్ష్మీదేవి) హృదయమునకు ప్రభువు, విష్ణువు}; ముకుంద = హరి; మాధవా = హరి.

భావము:

విశ్వతోముఖా! రమామనోహరా! ముకుందా! మాధవా! నీ పాదపద్మాల సుగంధాన్ని అనుభవించిన వారు మరణ శీలమైన శరీరాన్ని లెక్కచేయరు. భార్యాపుత్రులను, మిత్రులను, భవనాలను, బంధువులను మరచిపోతారు.

4-286-సీ.
 • ఉపకరణాలు:
 •  
 •  
 •  

రమాత్మ! మర్త్య సుర్వ తిర్యఙ్మృగ-
దితిజ సరీసృప ద్విజగణాది
సంవ్యాప్తమును సదద్విశేషంబును-
గైకొని మహదాది కారణంబు
నైన విరాడ్విగ్రహంబు నే నెఱుఁగుఁదుఁ-
గాని తక్కిన సుమంళమునైన
సంతత సుమహితైశ్వర్య రూపంబును-
భూరిశబ్దాది వ్యాపా శూన్య

4-286.1-తే.
 • ఉపకరణాలు:
 •  
 •  
 •  

మైన బ్రహ్మస్వరూప మే నాత్మ నెఱుఁగఁ
బ్రవిమలాకార! సంసారయవిదూర!
రమమునిగేయ! సంతతభాగధేయ!
ళిననేత్ర! రమాలలనాకళత్ర!

టీకా:

పరమాత్మ = హరి {పరమాత్మ - అతీతమైన ఆత్మకలవాడు, విష్ణువు}; మర్త్య = మానవ; సుపర్వ = దేవతల; తిర్యక్ = అడ్డముగపోవునట్టి జంతువులు; మృగ = వేట జంతువులు; దితిజ = రాక్షసులు; సరీసృప = పాకెడి జంతువులు; ద్విజ = పక్షులు; గణ = సమూహములు; ఆది = మొదలైనవాటిలో; సంవ్యాప్తమును = చక్కగ వ్యాపించినది; సత్ = మంచివి; అసత్ = చెడ్డవి; విశేషంబును = విశిష్టమైనవి; కైకొని = పూని; మహదాది = మహదాదులు; కారణంబును = కారణముగ కలది; ఐన = అయిన; విరాడ్విగ్రహంబున్ = విరాడ్రూరూపమును; నేన్ = నేను; ఎఱుంగుదున్ = తెలియుదును; కాని = కాని; తక్కిన = దీనికి అతీతమైన; సు = మిక్కిలి; మంగళము = శుభకరము; ఐన = అయిన; సంతత = నిరంతర; సుమహిత = మిక్కిలి గొప్పదైన; ఐశ్వర్య = మహిమలతో కూడినట్టి; రూపంబును = రూపమును; భూరి = అత్యధికమైన; శబ్దాది = శబ్దము మొదలగు {శబ్దాది - 1శబ్దము 2స్పర్శము 3రూపము 4రుచి 5 వాసన}; వ్యాపార = వ్యాపారముల; శూన్యము = లేనిది; ఐన = అయిన.
బ్రహ్మ = బ్రహ్మము అనెడి; స్వరూపమున్ = స్వరూపమును; నేన్ = నేను; ఎఱుగన్ = ఎరగను; ప్రవిమాలాకార = హరి {ప్రవిమాలాకార - మిక్కిలి నిర్మలమైన ఆకారము కలవాడు, విష్ణువు}; సంసారభయవిదూర = హరి {సంసారభయవిదూర - సంసారము ఎడలి భయమును దూరము చేయువాడు, విష్ణువు}; పరమమునిగేయ = హరి {పరమమునిగేయుడు - అత్యుత్తమైన మునులచే కీర్తింపబడువాడు, విష్ణువు}; సంతతభాగధేయ = హరి {సంతతభాగధేయుడు - ఎడతెగని కర్మఫలముల రూపమైన వాడు, విష్ణువు}; నళిననేత్ర = హరి {నళిననేత్రుడు - పద్మములవంటి కన్నులు కలవాడు, విష్ణువు}; రమాలలనాకళత్ర = హరి {రమాలలనాకళత్రుడు - లక్ష్మీదేవిని భర్యగా కలవాడు, విష్ణువు}.

భావము:

పరమాత్మా! మానవులు, దేవతలు, మృగాలు, రాక్షసులు, పాములు, పక్షులు మొదలైన పలువిధాల ప్రాణులతో నిండి ప్రకృతి పురుషులతో కూడి మహదాదులకు కారణమైన నీ స్థూల రూపాన్ని నేను ఎరుగుదును. కాని నిత్యకల్యాణమూ, నిరంతర మహైశ్వర్య సంపన్నమూ అయి, శబ్ద వ్యాపారానికి గోచరం కాని నీ పరబ్రహ్మ స్వరూపాన్ని మాత్రం నేను ఎరుగను. రాజీవనేత్రా! రమాకళత్రా! నీవు నిర్మలాకారుడవు. భవభయదూరుడవు. మునిజన సంస్తవనీయుడవు. పరమ భాగ్యధౌరేయుడవు.

4-287-సీ.
 • ఉపకరణాలు:
 •  
 •  
 •  

ర్వేశ! కల్పాంత మయంబు నందు నీ-
ఖిల ప్రపంచంబు నాహరించి
నయంబు శేషసహాయుండవై శేష-
ర్యంక తలమునఁ వ్వళించి
యోగనిద్రా రతి నుండి నాభీసింధు-
స్వర్ణలోక కంజాత గర్భ
మందుఁ జతుర్ముఖు మరఁ బుట్టించుచు-
రుచి నొప్పు బ్రహ్మస్వరూపి వైన

4-287.1-తే.
 • ఉపకరణాలు:
 •  
 •  
 •  

నీకు మ్రొక్కెద నత్యంత నియమ మొప్ప
వ్యచారిత్ర! పంకజత్రనేత్ర!
చిరశుభాకార! నిత్యలక్ష్మీవిహార!
వ్యయానంద! గోవింద! రి! ముకుంద!

టీకా:

సర్వేశ = హరి; కల్పాంత = ప్రళయ; సమయంబున్ = కాలము; అందున్ = లో; ఈ = ఈ; అఖిల = సమస్తమైన; ప్రపంచంబున్ = ప్రపంచమును; ఆహరించి = మింగి; అనయంబున్ = అవశ్యము; శేష = శేషుని; సహాయుండవు = సహాయము కలవాడవు; ఐ = అయ్యి; శేష = శేషుడు అనెడి; పర్యంకతలమునన్ = శయ్యాతల్పముపై; పవ్వళించి = పండుకొని; యోగనిద్రా = యోగనిద్రయందు; రతిన్ = కుతూహలమున; ఉండి = ఉండి; నాభీ = బొడ్డు అనెడి; సింధు = సముద్రమును; జ = పుట్టిన; స్వర్ణ = బంగారు; లోక = విశ్వ; కంజాత = పద్మము యొక్క; గర్భము = గర్భము; అందున్ = లో; చతుర్ముఖున్ = చతుర్ముఖబ్రహ్మను; అమరన్ = చక్కగ; పుట్టించుచున్ = సృష్టిస్తూ; = రుచిన్ = ప్రకాశముతో; ఒప్పు = చక్కగ ఉండెడి; బ్రహ్మ = పరబ్రహ్మ యొక్క; స్వరూపివి = స్వరూపముగ కలవాడవు; ఐన = అయిన.
నీకున్ = నీకు; మ్రొక్కెదన్ = నమస్కరించెదను; అత్యంత = మిక్కిలి; నియమము = నియమము; ఒప్పన్ = ఒప్పునట్లు; భవ్యచారిత్ర = హరి; పంకజపత్రనేత్ర = హరి; చిరశుభాకార = హరి; నిత్యలక్ష్మీవిహార = హరి; అవ్యయానంద = హరి; గోవింద = హరి; హరి = హరి; ముకుంద = హరి.

భావము:

సర్వేశ్వరా! భవ్యచరిత్రా! కమలదళనయనా! శాశ్వత శుభాకారా! లక్ష్మీవిహారా! అవ్యయానందా! గోవిందా! హరీ! ముకుందా! నీవు కల్పాంత కాలంలో సర్వప్రపంచాన్ని నీలో విలీనం చేసుకుంటావు. ఆదిశేష తల్పంమీద శయనిస్తావు. యోగనిద్ర పొందుతావు. అప్పుడు నీ నాభి అనే సముద్రంలోనుండి పుట్టిన బంగారు తామరపువ్వులోనుండి చతుర్ముఖ బ్రహ్మను సృష్టిస్తావు. అటువంటి తేజోమయమైన నీ పరబ్రహ్మ స్వరూపానికి నిశ్చల నియమంతో నమస్కరిస్తున్నాను.

4-288-వ.
 • ఉపకరణాలు:
 •  
 •  
 •  

అట్లు యోగనిద్రా పరవశుండ వయ్యును జీవులకంటె నత్యంత విలక్షణుండ వై యుండుదు; వది యెట్లనిన బుద్ధ్యవస్థాభేదంబున నఖండితం బయిన స్వశక్తిం జేసి చూచు లోకపాలన నిమిత్తంబు యజ్ఞాధిష్ఠాతవు గావున నీవు నిత్యముక్తుండవును, బరిశుద్ధుండవును, సర్వజ్ఞుండవును, నాత్మవును, గూటస్థుండవును, నాదిపురుషుండవును, భగవంతుండవును, గుణత్రయాధీశ్వరుండవును నై వర్తింతువు; భాగ్యహీనుండైన జీవుని యందు నీ గుణంబులు గలుగవు; ఏ సర్వేశ్వరునం దేమి విరుద్ధగతులై వివిధ శక్తి యుక్తంబు లైన యవిద్యాదు లానుపూర్వ్యంబునం జేసి ప్రలీనంబు లగుచుం; డట్టి విశ్వకారణంబు నేకంబు ననంతంబు నాద్యంబు నానందమాత్రంబు నవికారంబు నగు బ్రహ్మంబునకు నమస్కరించెద; మఱియు దేవా! నీవ సర్వవిధఫలం బని చింతించు నిష్కాము లయినవారికి రాజ్యాదికామితంబులలోనఁ బరమార్థం బయిన ఫలంబు సర్వార్థరూపుండవైన భవదీయ పాద పద్మ సేవనంబ; నిట్లు నిశ్చితంబ యైనను సకాములయిన దీనులను గోవు వత్సంబును స్తన్యపానంబు చేయించుచు, వృకాది భయంబు వలన రక్షించు చందంబునం గామప్రదుండవై సంసార భయంబు వలన బాపుదు;” వని యిట్లు సత్యసంకల్పుండును, సుజ్ఞానియు నయిన ధ్రువునిచేత వినుతింపంబడి భృత్యానురక్తుం డైన భగవంతుండు సంతుష్టాంతరంగుండై యిట్లనియె.

టీకా:

అట్లు = ఆ విధముగ; యోగనిద్రా = యోగనిద్ర యందు; పరవశుండవు = మైమరచి ఉన్నవాడవు; అయ్యును = అయినప్పటికిని; జీవుల = జీవులు; కంటెన్ = కంటెను; అత్యంత = మిక్కిలి; విలక్షణుండవు = వేరైన లక్షణములు కలవాడవు; ఐ = అయ్యి; ఉండుదువు = ఉంటావు; అది = అది; ఎట్లు = ఏ విధముగ; అనినన్ = అనగా; బుద్ధి = బుద్ధి యొక్క; అవస్థా = అవస్థలలోని; భేదంబునన్ = భేదము వలన; అఖండితంబు = ఎడతెగనిది; ఐన = అయిన; స్వ = స్వంత; శక్తిన్ = శక్తి; చేసి = వలన; చూచు = చూచెడి; లోక = లోకములను; పాలన = పాలించెడి; నిమిత్తంబున్ = కొరకు; యజ్ఞ = యజ్ఞమునకు; అధిష్ఠాతవు = అధిపతిస్థానము వహించినవాడవు; కావునన్ = కనుక; నీవు = నీవు; నిత్య = శాశ్వతముగ; ముక్తుండవును = ముక్తికలవాడవు; పరిశుద్ధుండవును = మిక్కిలి శుద్ధమైనవాడవు; సర్వజ్ఞుండవును = సర్వమును తెలిసినవాడవు; ఆత్మవు = ఆత్మవు; కూటస్థుండవును = దేహములందుండువాడవు; ఆదిపురుషుండవును = ఆదిపురుషుడవు; భగవంతుడవును = మహామహిమాన్వితుడవు; గుణత్రయాధీశ్వరుండవును = త్రిగుణములకు అధిపతివి; ఐ = అయ్యి; వర్తింతువు = ప్రవర్తింతువు; భాగ్యహీనుండు = భాగ్యహీనుడు; ఐన = అయిన; జీవుని = జీవుని; అందున్ = లో; ఈ = ఈ; గుణంబులు = లక్షణములు; కలుగవు = ఉండవు; ఏ = ఏ; సర్వేశ్వరున్ = భగవంతుని; అందేమి = అందులోనైతే; విరుద్ధ = వ్యతిరిక్త; గతులు = గమనములు కలవి; ఐ = అయ్యి; వివిధ = రకరకముల; శక్తిన్ = సామర్థ్యములు; యుక్తంబుల్ = కూడినవి; ఐన = అయిన; అవిద్యా = అవిద్య; ఆదులు = మొదలైనవి; అనుపూర్వ్యంబు = క్రమబద్దము; చేసి = అనుసరించి; ప్రలీనంబులున్ = లయములు; అగుచుండు = అవుతుండును; అట్టి = అటువంటి; విశ్వ = విశ్వము పుట్టుటకు; కారణంబును = కారణమును; అనంతంబును = అంతములేనిది; ఆద్యంబున్ = సృష్టికి ఆది అయినది; ఆనందమాత్రంబున్ = ఆనందము ఒక్కటే ఐనది; అవికారంబున్ = మార్పులు లేనిది; అగు = అయిన; బ్రహ్మంబున్ = బ్రహ్మమున; కున్ = కు; నమస్కరించెదన్ = నమస్కరించెదను; మఱియు = ఇంకను; దేవా = దేవుడ; నీవ = నీవె; సర్వవిధ = అన్నిరకముల; ఫలంబున్ = ఫలితములును; అని = అని; చింతించు = ధ్యానించెడి; నిష్కాములు = కోరికలు లేనివారు; అయిన = అయిన; వారి = వారి; కిన్ = కి; రాజ్య = రాజ్యము; ఆది = మొదలగు; కామితంబుల = కోరదగినవాటి; లోనన్ = లో; పరమ = అత్యుత్తమ; అర్థంబున్ = ప్రయోజనములు; అయిన = అయిన; ఫలంబున్ = ఫలితము; సర్వ = సమస్తమైన; అర్థ = ప్రయోజనంబుల; రూపుండవు = స్వరూపము యైనవాడవు; ఐన = అయిన; భవదీయ = నీ యొక్క; పాద = పాదములు అనెడి; పద్మ = పద్మముల; సేవనంబ = భజియించుటయె; ఇట్లు = ఈ విధముగ; నిశ్చితంబ = నిశ్చయింపబడినదే; ఐనను = అయినప్పటికిని; సకాములు = కోరికలు కలవారు; అయిన = అయిన; దీనులను = దీనులను; గోవు = ఆవు; వత్సంబును = దూడను; స్తన్య = పాలు; పానంబున్ = తాగించుట; చేయించుచు = చేయిస్తూ; వృక = తోడేలు; ఆది = మొదలగు వాటి; భయంబున్ = భయము; వలన = నుండి; రక్షించు = కాపాడెడి; చందంబునన్ = వలె; కామ = కోరినవి; ప్రదుండవు = ఇచ్చువాడవు; ఐ = అయ్యి; సంసార = సంసార మందలి; భయంబున్ = భయము; వలనను = నుండి; పాపుదువు = పోగొట్టెదవు; అని = అని; ఇట్లు = ఈ విధముగ; సత్యసంకల్పుండును = గట్టి సంకల్పము కలవాడు; సుజ్ఞానియు = మంచి జ్ఞానము కలవాడు; అయిన = అయిన; ధ్రువుని = ధ్రువుని; చేతన్ = చేత; వినుతింపంబడి = స్తుతింపబడి; భృత్యు = సేవకుని ఎడల; అనురక్తుండు = ప్రీతి కలవాడు; ఐన = అయిన; భగవంతుండు = హరి; సంతుష్ట = సంతుష్టి చెందిన; అంతరంగుండు = హృదయము కలవాడు; ఐ = అయ్యి; ఇట్లు = ఈ విధముగ; అనియె = పలికెను.

భావము:

ఆ విధంగా యోగనిద్రలో మైమరచి ఉన్నప్పటికీ నీవు జీవుల కంటె మిక్కిలి విలక్షణంగా ఉంటావు. అవస్థా భేదాన్ని పొందిన బుద్ధితో, చెక్కు చెదరని దృష్టితో జగత్తును రక్షించటానికి విష్ణురూపాన్ని గైకొంటావు. నీవు నిత్యముక్తుడవు; పరిశుద్ధుడవు; సర్వజ్ఞుడవు; ఆత్మవు; కూటస్థుడవు; ఆదిపురుషుడవు; భగవంతుడవు; మూడు గుణాలకు అధిపతివి. జీవుడు భాగ్యహీనుడు. అతనియందు నీ గుణాలు ఉండవు. ఏ సర్వేశ్వరుని యందైతే విరుద్ధగమనం కలిగి వివిధ శక్తులతో కూడిన అవిద్యాదులు ఒకదాని వెంట ఒకటి విలీనం అవుతాయో, అటువంటి జగత్కారణమూ, అద్వితీయమూ, అనంతమూ, ఆద్యమూ, ఆనందమాత్రమూ, అవికారమూ అయిన పరబ్రహ్మవు నీవు. నీకు నమస్కారం. దేవా! నిష్కాములైనవారు నిన్నే సర్వతోముఖ ఫలంగా భావిస్తారు. వారికి రాజ్యం మొదలైన వాంఛలలో పరమార్థమైన ఫలం సర్వాంతర్యామివైన నీ పవిత్ర పాదసేవనమే. ఇది నిశ్చయం. అయినప్పటికీ ఆవు తన దూడకు చన్నిస్తూ తోడేళ్ళు మొదలైన క్రూర మృగాల బారినుండి రక్షించే విధంగా సకాములైనవారి కోరికలను తీరుస్తూనే సంసార భయాలను తొలగిస్తావు.” అని ఈ విధంగా సత్సంకల్పుడు, సుజ్ఞాని అయిన ధ్రువుడు శ్రీహరిని స్తుతించాడు. అప్పుడు భృత్యులపై అత్యంత ప్రేమగల భగవంతుడు మనస్సులో తృప్తిపడి ఇలా అన్నాడు.

4-289-క.
 • ఉపకరణాలు:
 •  
 •  
 •  

"ధీవ్రత! రాజన్య కు
మాక! నీ హృదయమందు సలిన కార్యం
బారూఢిగా నెఱుంగుదు
నాయ నది వొందరాని దైనను నిత్తున్.
ధ్రువ ఇకె వారి సంపుచి 10 - పుట 17 నుండి 20 ;   ధ్రువ - నళినీ మోహనువారి నక్షత్ర వీధిలో.

టీకా:

ధీరవ్రత = బుద్ధిబలము దీక్షగా కలవాడ; రాజన్య = రాజోత్తముని; కుమారక = కుమారుడ; నీ = నీ; హృదయము = మనసు; అందున్ = లో; మసలిన = కదులుతున్న; కార్యంబున్ = కోరికను; ఆరూఢిగ = నిశ్చయముగ; నేన్ = నేను; ఎఱుంగుదున్ = తెలియుదును; ఆరయ = పరికించి చూసిన; అది = అది; పొందరానిది = పొందలేనిది; ఐనను = అయినప్పటికిని; ఇత్తును = ఇచ్చెదను.

భావము:

“అచంచల దీక్షావ్రతా! రాకుమారా! నీ మనస్సులోని అభిప్రాయాలను చక్కగా గ్రహించాను. అయితే అది దుర్లభమైనది. అయినప్పటికీ నీ కోరిక తీరుస్తాను.

4-290-వ.
 • ఉపకరణాలు:
 •  
 •  
 •  

అది యెట్టి దనిన నెందేని మేధియందుఁ బరిభ్రామ్యమాణ గోచక్రంబునుం బోలె గ్రహనక్ష త్రతారాగణ జ్యోతిశ్చక్రంబు నక్షత్ర రూపంబు లయిన ధర్మాగ్ని కశ్యప శక్రులును సప్తర్షులును, దారకా సమేతులై ప్రదక్షిణంబు దిరుగుచుండుదు; రట్టి దురాపంబును ననన్యాధిష్ఠితంబును లోకత్రయ ప్రళయకాలంబునందు నశ్వరంబుగాక ప్రకాశమానంబును నయిన ధ్రువక్షితి యను పదంబు ముందట నిరువది యాఱువేలేండ్లు చనం బ్రాపింతువు; తత్పద ప్రాప్తిపర్యంతంబు భవదీయ జనకుండు వనవాస గతుండైనం దద్రాజ్యంబు పూజ్యంబుగా ధర్మమార్గంబున జితేంద్రియుండవై చేయుదువు; భవదనుజుం డగు నుత్తముండు మృగయార్థంబు వనంబునకుం జని మృతుం డగు; తదన్వేషణార్థంబు తదాహిత చిత్త యై తన్మాతయు వనంబునకుం జని యందు దావదహన నిమగ్న యగు; వెండియు.

టీకా:

అది = అది; ఎట్టిది = ఎటువంటిది; అనిన్ = అనినచో; ఎందేని = ఎక్కడైతే; మేధి = కట్రాట {మేధి - ధాన్యము నూర్చునప్పుడు ఎడ్లను తిప్పుటుకు నడుమ పాతెడి రాట, కట్రాట}; అందున్ = అందు; పరిభ్రామ్యమాణ = చుట్టును తిరుగుచున్న; గో = పశువు చేయు; చక్రంబునున్ = చక్రము; పోలెన్ = వలె; గ్రహ = గ్రహములు; నక్షత్ర = నక్షత్రములు; తారా = తారల; గణ = సమూహము; జ్యోతిశ్చక్రంబున్ = జ్యోతిశ్చక్రము; నక్షత్ర = నక్షత్రముల; రూపంబులు = రూపములు; అయిన = అయిన; ధర్మ = ధర్ముడు; అగ్ని = అగ్ని; కశ్యప = కశ్యపుడు; శక్రులును = ఇంద్రుడును; సప్తర్షులును = ఏడుగురు ఋషులు; తారకా = తారకల; సమేతులు = కూడినవారు; ఐ = అయ్యి; ప్రదక్షిణంబున్ = ప్రదక్షిణ రూపముగ; తిరుగుచున్ = తిరుగుతూ; ఉండుదురు = ఉంటారు; అట్టి = అటువంటి; దురాపంబును = చేరుటకు శక్యము కానిది; అనన్యాధిష్టితంబును = ఇంకొకరిచే ఆక్రమింపబడనిది; లోకత్రయ = ముల్లోకముల {లోకత్రయము - భూః భువః సువః లోకములు}; ప్రళయ = విలయ; కాలంబున్ = సమయము; అందున్ = లోను; నశ్వరంబు = నశించుట; కాక = కాకుండగ; ప్రకాశమానంబు = ప్రకాశవంతము; అయిన = అయిన; ధ్రువక్షితి = ధ్రువపదము; అను = అనెడి; పదంబున్ = పదమును; ముందటన్ = రాబోవుకాలమున; ఇరువదియాఱువేల = ఇరవైయారువేల (26000); ఏండ్లు = సంవత్సరములు; చనన్ = గడిచిన తరువాత; ప్రాపింతువు = పొందుదువు; తత్ = ఆ; పద = పదము; ప్రాప్తి = పొందెడి; పర్యంతంబున్ = వరకు; భవదీయ = నీ యొక్క; జనకుండు = తండ్రి; వనవాస = వనవాసమునకు; గతుండు = వెళ్ళినవాడు; ఐనన్ = అయిన; తత్ = ఆ; రాజ్యంబున్ = రాజ్యమును; పూజ్యంబుగా = పూజనీయంబుగా; ధర్మ = ధర్మబద్ధమైన; మార్గంబునన్ = విధముగ; జిత = జయించిన; ఇంద్రియుండవు = ఇంద్రియములు కలవాడు; ఐ = అయ్యి; చేయుదువు = చేసెదవు; భవత్ = నీ యొక్క; అనుజుండు = సోదరుడు; అగున్ = అయిన; ఉత్తముండు = ఉత్తముడు; మృగయా = వేట; అర్థంబున్ = నిమిత్తంబున; వనంబున్ = అడవి; కున్ = కి; చని = వెళ్ళి; మృతుండు = మరణించినవాడు; అగున్ = అగును; తత్ = అతని; అన్వేషణా = వేదకెడి; అర్థంబునన్ = కోసము; తత్ = అతని యందు; ఆహిత = నిలిపిన; చిత్త = మనసు కలామె; ఐ = అయ్యి; తత్ = అతని; మాతయు = తల్లికూడ; వనంబున్ = అడవి; కున్ = కి; చని = వెళ్ళి; అందున్ = అందు; దావ = దావాగ్ని యందు; దహన = మంటలలో; నిమగ్న = పడినది; అగున్ = అగును; వెడియు = ఇంక.

భావము:

కట్టుకొయ్య చుట్టూ పశువుల మంద తిరిగినట్లుగా గ్రహాలు, నక్షత్రాలు, తారాగణాలు, జ్యోతిశ్చక్రం, నక్షత్ర స్వరూపాలైన ధర్ముడు, అగ్ని, కశ్యపుడు, శుక్రుడు, సప్తర్షులు, తారకలతో కూడి దేనికి ప్రదక్షిణం చేస్తారో అటువంటి ధ్రువక్షితి అనే మహోన్నత స్థానాన్ని ఇకపైన ఇరవైఆరువేల సంవత్సరాల తరువాత నీవు పొందుతావు. అది ఎవ్వరికీ అందరానిది. ఇదివరకు ఎవ్వరూ దానిని పొందలేదు. ముల్లోకాలు నశించేటప్పుడు కూడా అది నశించకుండా ప్రకాశిస్తూ ఉంటుంది. అటువంటి స్థానాన్ని నీవు అలంకరిస్తావు. అంతవరకు నీ తండ్రి రాజ్యాన్ని నీవు సర్వజన రంజకంగా ధర్మమార్గాన పరిపాలిస్తావు. ఇంద్రియాలను జయిస్తావు. నీ తండ్రి అడవికి పోయి వానప్రస్థాశ్రమం స్వీకరిస్తాడు. నీ తమ్ముడైన ఉత్తముడు వేటకై అడవికి వెళ్ళి మరణిస్తాడు. అతనిని వెదుకుతూ అతనియందే మనస్సు చేర్చిన అతని తల్లి అరణ్యంలో ప్రవేశిస్తుంది. ఆమె అడవిలో కార్చిచ్చులో పడి కాలిపోతుంది.

4-291-సీ.
 • ఉపకరణాలు:
 •  
 •  
 •  

నఘాత్మ! మఱి నీవు జ్ఞరూపుం డనఁ-
గు నన్ను సంపూర్ణ క్షిణంబు
గు మఖంబులచేత ర్చించి సత్యంబు-
గు నిహసౌఖ్యంబు నుభవించి
యంత్యకాలమున నన్నాత్మఁ దలంచుచు-
ఱి సర్వలోక నస్కృతమును
హిఁ బునరావృత్తి హితంబు సప్తర్షి-
మండలోన్నత మగు మామకీన

4-291.1-తే.
 • ఉపకరణాలు:
 •  
 •  
 •  

దము దగఁ బొందఁగల" వని రమపురుషుఁ
తని యభిలషితార్థంబు ర్థి నిచ్చి
తఁడు గనుఁగొను చుండంగ నాత్మపురికి
రుడగమనుఁడు వేంచేసెఁ గౌతుకమున.

టీకా:

అనఘాత్మ = పుణ్యాత్మ; మఱి = మరి; నీవు = నీవు; యజ్ఞ = యజ్ఞము; రూపుండు = స్వరూపముగాకలవాడు; అనన్ = అనుటకు; తగు = తగిన; నన్ను = నన్ను; సంపూర్ణ = పూర్తి; దక్షిణంబులు = దక్షిణలుకలిగినవి; అగున్ = అయిన; మఖంబులన్ = యజ్ఞముల; చేతన్ = చేత; అర్చించి = పూజించి; సత్యంబులు = సత్యమైనవి; అగు = అయిన; ఇహ = ఈలోకపు; సౌఖ్యంబులన్ = సౌఖ్యములను; అనుభవించి = అనుభవించి; అంత్య = మరణ; కాలంబునన్ = సమయములో; నన్ = నన్ను; ఆత్మన్ = మనసులో; తలచుచున్ = ధ్యానము చేస్తూ; మఱి = మరి; సర్వ = అన్ని; లోక = లోకములచేతను; నమస్కృతముమును = నమసేకరింపబడునది; మహిన్ = భూమిపై; పునరావృత్తి = మరల వచ్చుట, జననమరణములు; రహితంబును = లేనిది; సప్తర్షి = ఏడుగురు ఋషులు; మండల = పదమునకు; ఉన్నతము = పైనది; అగు = అయిన; మామకీన = నా యొక్క.
పదమున్ = స్థానము; పొందగలవు = పొందగలవు; అని = అని; పరమపురుషుడు = విష్ణువు; అతని = అతని; అభిలషితార్థంబులు = కోరిన ప్రయోజనములు; అర్థిన్ = కోరి; ఇచ్చి = ఇచ్చి; అతడు = అతడు; కనుగొనుచుండన్ = చూస్తుండగ; ఆత్మ = స్వంత; పురికి = నగరికి; గరుడగమనుడు = విష్ణువు {గరుడగమనుడు - గరుడవాహనము పై తిరుగువాడు, విష్ణువు}; వేంచేసె = వెళ్ళను; కౌతుకము = కుతూహలము; ఒప్పన్ = ఒప్పునట్లుగ.

భావము:

పుణ్యాత్మా! నీవు యజ్ఞపురుషుడనైన నన్ను సంపూర్ణ దక్షిణలతో కూడిన యజ్ఞాలచేత ఆరాధిస్తావు. ఈ లోకంలోని అనంత సౌఖ్యాలను అనుభవిస్తావు. మరణకాలంలో నన్ను మనస్సులో స్మరిస్తూ, సకల లోకాలకు వందనీయమై, పునరావృత్తి రహితమై సప్తర్షిమండలం పైన ఉండే నా స్థానాన్ని పొందుతావు.” అని భగవంతుడు ధ్రువుడు కోరిన కోరికలను ప్రసాదించి, అతడు చూస్తూ ఉండగానే గరుత్మంతుణ్ణి అధిరోహించి ఆనందంగా తన పట్టణమైన వైకుంఠమునకు వేంచేశాడు.

4-292-తే.
 • ఉపకరణాలు:
 •  
 •  
 •  

అంత ధ్రువుఁడునుఁ బంకేరుహాక్ష పాద
మల సేవోపపాదిత న మనోర
ములఁ దనరియుఁ దనదు చిత్తంబులోనఁ
దుష్టిఁ బొందక చనియె విశిష్టచరిత!"

టీకా:

అంత = అంతట; ధ్రువుడును = ధ్రువుడు; పంకేరుహాక్ష = హరి {పంకేరుహాక్షుడు - పంకేరుహము (నీటిలో పుట్టునది, పద్మము) వంటి కన్నులు కలవాడు, విష్ణువు}; పాద = పాదములు అనెడి; కమల = పద్మముల; సేవా = సేవించుటవలన; ఉపాదిత = పొందిన; ఘన = గొప్ప; మనోరథములన్ = కోరికలందు; తనరియున్ = అతిశయించియును; తనదు = తన యొక్క; చిత్తంబు = మనసు; లోనన్ = లో; తుష్టి = తృప్తి; పొందక = పొందలేక; చనియె = పోయెను; విశిష్టచరిత = అతిశ్రేష్ఠమైన వర్తన కలవాడ.

భావము:

అప్పుడు ధ్రువుడు పద్మాక్షుడైన విష్ణువు యొక్క పాదపద్మాలను సేవించడం వల్ల సమధిక మనోరథాలు సంప్రాప్తించినప్పటికీ, సంతృప్తి పొందక చింతిస్తూ వెళ్ళిపోయాడు.

4-293-క.
 • ఉపకరణాలు:
 •  
 •  
 •  

ని మైత్రేయుఁడు ధ్రువుఁ డ
ట్లయము హరిచేఁ గృతార్థుఁడైన విధం బె
ల్లను వినిపించిన విదురుఁడు
విని మునివరుఁ జూచి పలికె వినయం బెసఁగన్.

టీకా:

అని = అని; మైత్రేయుడు = మైత్రేయుడు; ధ్రువుడు = ధ్రువుడు; అట్లు = ఆ విధముగ; అనయము = పూర్తిగ; హరి = విష్ణువు; చేన్ = చేత; కృతార్థుడు = కోరినది పొందినవాడు; ఐన = అయిన; విధంబున్ = విధము; ఎల్లను = అంతయు; వినిపించిన = చెప్పగా; విదురుడు = విదురుడు; విని = విని; ముని = మునులలో; వరున్ = ఉత్తముని; చూచి = చూసి; పలికెన్ = పలికెను; వినయంబున్ = వినయము; ఎసగన్ = అతిశయించగ.

భావము:

అని ఈ విధంగా మైత్రేయుడు ధ్రువుడు శ్రీహరినుండి వరాలను పొందిన విధం అంతా విదురునికి వినిపించాడు. విన్న విదురుడు మహర్షితో సవినయంగా ఇలా అన్నాడు.

4-294-క.
 • ఉపకరణాలు:
 •  
 •  
 •  

"మునినాయక! విను కాముక
దుష్ప్రాపంబు విష్ణు రణాంబురుహా
ర్చ మునిజన సంప్రాప్యము
నఁగల పంకేరుహాక్షు వ్యయ పదమున్.

టీకా:

ముని = మునులకు; నాయక = నాయకుఢ; విను = వినుము; కాముక = కోరికలుగల; జన = వారిచే; దుష్ప్రాపంబున్ = పొందరానిది; విష్ణు = హరి; చరణ = పాదములు అనెడి; అంబురుహ = పద్మముల; అర్చన = పూజించెడి; ముని = మునులైన; జన = వారిచే; సంప్రాప్యమున్ = చక్కగ పొందబడునది; అనగల = అనగలిగిన; పంకేరుహాక్షు = విష్ణువు; అవ్యయ = తరుగనట్టి; పదమున్ = స్థానము.

భావము:

“మునీంద్రా! కాముకులకు పొందరానిది, విష్ణు భక్తులైన మునులు మాత్రమే పొందగలిగినది శాశ్వతమైన విష్ణుపదం కదా!

4-295-వ.
 • ఉపకరణాలు:
 •  
 •  
 •  

పెక్కు జన్మంబులం గాని పొందరాని పదంబు దా నొక్క జన్మంబుననే పొందియుం దన మనంబునం దప్రాప్త మనోరథుండ నని పురుషార్థవేది యైన ధ్రువుం డెట్లు దలంచె” ననిన మైత్రేయుం డిట్లనియె

టీకా:

పెక్కు = అనేకమైన; జన్మంబులన్ = జన్మములకు; కాని = కాని; పొందరాని = పొందరాని; పదంబున్ = పదమును; తాన్ = తాను; ఒక్క = ఒకటే; జన్మంబునన్ = జన్మములోనే; పొందియున్ = పొందినప్పటికిని; తన = తన యొక్క; మనంబునన్ = మనసులో; అప్రాప్త = పొందని; మనోరథుండను = కోరికలు గలవాడను; అని = అని; పురుషార్థ = పురుషార్థములు {పురుషార్థములు - ధర్మార్థకామమోక్షములు}; వేది = తెలిసినవాడు; ఐన = అయిన; ధ్రువుండు = ధ్రువుడు; ఎట్లు = ఏ విధముగ; తలంచెన్ = భావించెను; అనిన = అనగ; మైత్రేయుడు = మైత్రేయుడు; ఇట్లు = ఈ విధముగ; అనియె = పలికెను.

భావము:

ఎన్నో జన్మలకు కాని పొందరాని విష్ణుపదాన్ని తాను ఒక్క జన్మలోనే పొందికూడా పురుషార్థాలను చక్కగా ఎరిగిన ధ్రువుడు తన కోరిక తీరలేదని ఎందుకు భావించాడు?” అని ప్రశ్నించగా మైత్రేయుడు ఇలా అన్నాడు.

4-296-తే.
 • ఉపకరణాలు:
 •  
 •  
 •  

"ఘ! పినతల్లి దన్నుఁ బల్కి దురుక్తి
బాణవిద్ధాత్ముఁ డగుచుఁ దద్భాషణములు
చిత్తమందుఁ దలంచుటఁ జేసి ముక్తిఁ
గోరమికి నాత్మలో వగఁ గూరుచుండె.

టీకా:

అనఘ = పుణ్యుడ; ఆ = ఆ; పినతల్లి = పినతల్లి; తన్ను = తనను; పల్కిన = అనిన; దురుక్తి = తిట్లు అనెడి; బాణ = బాణములచే; విద్ధాత్ముడు = గాయ పడ్డ మనసు కల వాడు; అగుచున్ = అవుతూ; తత్ = ఆ; భాషణములు = పలుకులు; చిత్తము = మనసు; అందున్ = లో; తలంచుటన్ = తలచుట; చేసి = వలన; ముక్తిన్ = ముక్తిని; కోరమికిన్ = కోరుకొనకుండుటకు; ఆత్మ = మనసు; లోన్ = లో; వగన్ = విచారములో; కూరుచుండె = కూరుకుపోతుండెను.

భావము:

“పుణ్యాత్మా! పినతల్లి ఆడిన దుర్భాషలు అనే బాణాలచేత ధ్రువుని మనస్సు బాగా గాయపడింది. అందుచేత ఆ దుర్భాషలనే మాటిమాటికి స్మరిస్తూ హరి ప్రత్యక్షమైనపుడు ముక్తిని కోరలేకపోయాడు. అందుకే అతడు మనస్సులో పరితపిస్తున్నాడు.

4-297-వ.
 • ఉపకరణాలు:
 •  
 •  
 •  

అంత నా ధ్రువుండు.

టీకా:

అంతన్ = అంతట; ఆ = ఆ; ధ్రువుండు = ధ్రువుడు.

భావము:

అప్పుడు ఆ ధ్రువుడు...

4-298-చ.
 • ఉపకరణాలు:
 •  
 •  
 •  

ఘ! జితేంద్రియుల్ సుమహితాత్ములునైన సనందనాదు లెం
య మనేక జన్మ సముపార్జిత యోగ సమాధిఁ జేసి యె
వ్వని చరణారవిందములు వారని భక్తి నెఱుంగుచుందు; రా
నుఁ బరమేశు నీశు నవికారు నమేయు నజేయు నాద్యునిన్.

టీకా:

అనఘ = పుణ్యుడ; జిత = జయిచిన; ఇంద్రియుల్ = ఇంద్రియములు కలవారు; సు = గొప్ప; మహిత = మహిమ గల; ఆత్ములున్ = వారు; ఐనన్ = అయినప్పటికిని; సనందన = సనందనుడు; ఆదులు = మొదలగువారు; ఎంత = ఎంతో; అనయము = అతిశయించి; అనేక = అనేకమైవ; జన్మ = జన్మముల; సమ = గొప్పగ; ఉపార్జిత = కూడబెట్టుకొన్న; యోగసమాధి = యోగసమాధి; చేసి = వలన; ఎవ్వని = ఎవని యొక్క; చరణ = పాదములు అనెడి; అరవిందములు = పద్మములు; వారని = హద్దులేని, లోటులేని; భక్తిన్ = భక్తితో; ఎఱుంగుచుందురు = తెలియుచుందురు; ఆ = ఆ; ఘనున్ = హరిని {ఘనుడు - గొప్పవాడు, విష్ణువు}; పరమేశున్ = హరిని {పరమేశు - అత్యున్నత ప్రభువు, విష్ణువు}; ఈశున్ = హరిని {ఈశుడు - ఈశ్వరుడు, విష్ణువు}; అవికారున్ = హరిని {అవికారుడు - వికారములు (మార్పులు) లేనివాడు, విష్ణువు}; అమేయున్ = హరిని {అమేయుడు - మేరలులేనివాడు, విష్ణువు}; అజేయున్ = హరిని {అజేయుడు - జయింపరానివాడు, విష్ణువు}; ఆద్యునిన్ = హరిని {ఆద్యుడు - పురాతనుడు}.

భావము:

‘జితేంద్రియులు, మహాత్ములు అయిన సనందుడు మొదలైన మునీంద్రులు మిక్కిలి భక్తితో పెక్కు జన్మల సమాధి యోగం ద్వారా ఏ మహానుభావుని చరణకమలాలను దర్శించ గలుగుతారో అటువంటి ఘనుడు, పరమేశ్వరుడు, అవికారుడు, అమేయుడు, అజేయుడు, ఆద్యుడు అయిన శ్రీహరిని...

4-299-వ.
 • ఉపకరణాలు:
 •  
 •  
 •  

ఏను షణ్మాసంబులు భజియించి తత్పాదపద్మ చ్ఛాయం బ్రాపించియు భేదదర్శనుండ నైతి; నక్కటా! యిట్టి భాగ్యహీనుండనైన యేను భవనాశకుండైన యతనిం బొడఁగనియు నశ్వరంబులైన కామ్యంబు లడిగితి; నిట్టి దౌరాత్మ్యం బెందేనిం గలదే? తమ పదంబులకంటె నున్నత పదంబు నొందుదునో యని సహింపంజాలని యీ దేవతలచేత మదీయ మతి గలుషితం బయ్యెం గాక; నాఁడు నారదుం డాడిన మాట తథ్యం బయ్యె; నతని వాక్యంబు లంగీకరింపక యే నసత్తముండనై స్వప్నావస్థలం బొందినవాఁడు దైవికంబైన మాయంజెంది భిన్న దర్శనుండగు చందంబున నే నద్వితీయుండ నైనను, భ్రాత యను శత్రువుచేఁ బ్రాప్తం బైన దుఃఖంబు నొంది జగదాత్మకుండును, సుప్రసాదుండును, భవనాశకుండును నైన యీశ్వరు నారాధించి తత్ప్రసాదంబు బడసియు నాయుర్విహీనుం డైన రోగికిం బ్రయోగించు నౌషధంబుం బోలె నిరర్థకంబులైన, నశ్వరంబులైన, యీ కామితంబులు గోరితి” నని; వెండియు.

టీకా:

ఏను = నేను; షట్ = ఆరు (6); మాసంబులు = నెలలు; భజియించి = సేవించి; తత్ = అతని; పాద = పాదములు అనెడి; పద్మ = పద్మముల; ఛాయన్ = నీడను; ప్రాపించియున్ = పొందియు; భేద = భేద; దర్శనుండను = దృష్టి కలవాడను; ఐతిన్ = అయిపోతిని; అక్కటా = అయ్యో; ఇట్టి = ఇటువంటి; భాగ్యహీనుండను = దురదృష్టవంతుడను; ఐన = అయిన; ఏను = నేను; భవ = సంసారమును; నాశకుండు = నశింపజేయువాడు; ఐన = అయిన; అతనిన్ = అతనిని; పొడగనియున్ = దర్శించియు; నశ్వరంబులు = నశించిపోవునవి; ఐన = అయిన; కామ్యంబులు = కోరికలు; అడిగితిని = అడిగాను; ఇట్టి = ఇటువంటి; దౌరాత్మ్యంబున్ = చెడ్డవాని లక్షణము; ఎందేని = ఎక్కడైనా; కలదే = ఉందా ఏమి; తమ = తమ యొక్క; పదంబుల = స్థానము; కంటెన్ = కంటె; ఉన్నత = పైనున్న; పదంబున్ = స్థానమును; ఒందుదునో = పొందుదునేమో; అని = అని; సహింపజాలని = సహింపలేని; ఈ = ఈ; దేవతల = దేవతల; చేతన్ = చేత; మదీయ = నా యొక్క; మతిన్ = బుద్ధి; కలుషితంబున్ = కలకబారినది; అయ్యెంగాక = అయినది కాబోలు; నాడు = ఆవేళ; నారదుండు = నారదుడు; ఆడిన = పలికిన; మాట = మాట; తథ్యంబున్ = నిజము; అయ్యెన్ = అయినది; అతనిన్ = అతని యొక్క; వాక్యంబులు = మాటలు; అంగీకరింపక = ఒప్పుకొనక; ఏన్ = నేను; అసత్తముండను = చెడ్డవాడిని; ఐ = అయ్యి; స్వప్న = కలలుకనే; అవస్థలన్ = అవస్థలను; పొందినవాడు = పొందినవాడు; దైవికంబు = దైవికమైనది; ఐన = అయిన; మాయన్ = మాయను; చెంది = చెంది; భిన్న = భేద; దర్శనుండను = దృష్టి కలవాడను; అగు = అయిన; చందంబునన్ = విధముగ; నేన్ = నేను; అద్వితీయుండను = రెండవది లేనివాడను; ఐనను = అయినప్పటికిని; భ్రాత = సోదరుడు; అను = అనెడి; శత్రువు = శత్రువు; చేన్ = వలన; ప్రాప్తంబు = పొందబడినది; ఐన = అయిన; దుఃఖంబున్ = దుఃఖమును; ఒంది = పొంది; జగత్ = విశ్వమును; ఆత్మకుండును = రూపకుడు; సు = గొప్ప; ప్రసాదుండును = వరముల నిచ్చువాడు; భవ = సంసార; నాశకుండును = నశింపజేయువాడు; ఐన = అయిన; ఈశ్వరున్ = భగవంతుని; ఆరాధించియు = పూజించి; తత్ = అతని; ప్రసాదంబున్ = వరప్రసాదము; పడసియు = పొందియు; ఆయుః = ఆయుష్షు; విహీనుండు = లేనివాడు; ఐన = అయిన; రోగి = వ్యాధిగ్రస్తుని; కిన్ = కి; ప్రయోగించు = వేసిన; ఔషధంబుం = మందు; పొలెన్ = వలె; నిరర్థకంబులు = ప్రయోజన శూన్యములు; ఐన = అయిన; నశ్వరంబులు = నశించునట్టివి; ఐన = అయిన; ఈ = ఈ; కామితంబులున్ = కోరికలను; కోరితిని = కోరుకొంటిని; అని = అని; వెండియు = మరల.

భావము:

నేను ఆరునెలలు సేవించి ఆయన పాదపద్మాల నీడలో నిలిచి కూడా భేదదృష్టి కలవాణ్ణి అయ్యాను. నేను దురదృష్టవంతుణ్ణి. సంసారబంధాలను హరించే హరిని దర్శించి కూడా అనిత్యాలైన కోరికలను కోరుకున్నాను. ఇలాంటి దౌర్భాగ్యం ఎక్కడైనా ఉంటుందా? తమ స్థానాలకంటె ఉన్నతమైన స్థానాన్ని నేను పొందుతానేమో అని ఓర్వలేక దేవతలు నా బుద్ధిని కలతపరచి ఉంటారు. ఆనాడు నారదుడు చెప్పిన మాట నిజమయింది. ఆయన మాటలను నేను లెక్క చేయలేదు. నేను అధముణ్ణి. నిద్రించేవాడు కలలో దైవమాయకు చిక్కి తా నొక్కడే అయినా తనకంటె వేరుగా అనేకులను తనయందు చూస్తాడు. అలాగే నేను ఒక్కడినే అయినప్పటికీ తమ్ముడనే శత్రువును కల్పించుకొని దుఃఖం పొందాను. జగత్స్వరూపుడు, దయామయుడు, సంసారవినాశకుడు అయిన హరిని ఆరాధించి, ఆయన అనుగ్రహం పొందికూడ ఆయుస్సు చాలని రోగికి ఔషధం వలె కొరగాని కోరికలను కోరుకున్నాను.

4-300-మ.
 • ఉపకరణాలు:
 •  
 •  
 •  

"హీనుండు నృపాలుఁ జేరి మిగులన్ ధాటిన్ ఫలీకార మి
మ్మని యర్థించినరీతి ముక్తిఫలదుం డై నట్టి పంకేజలో
నుఁ డే చాలఁ బ్రసన్నుఁడైన నతనిన్ సాంసారికం బర్థిఁ గో
రి నావంటి విమూఢమానసులు ధాత్రిం గల్గిరే యెవ్వరున్?"

టీకా:

ధనహీనుండు = పేదవాడు; నృపాలున్ = రాజును {నృపాలుడు - నృ (నరులను) పాలించువాడు, రాజు}; చేరి = దగ్గరకు వెళ్ళి; మిగులన్ = మిక్కిలి; ధాటిన్ = ధాటిగా, గట్టిగా; ఫలీకారము = ఊకతో కూడిన నూకలు; ఇమ్ము = ఇమ్ము; అని = అని; అర్థించిన = కోరిన; రీతి = విధముగ; ముక్తిన్ = మోక్షమును; ఫలదుండు = ఫలితమును ఇచ్చువాడు; ఐనట్టి = అయినట్టి; పంకేజలోచనుఁడే = విష్ణుమూర్తే {పంకేజ లోచనుఁడు - పద్మముల వంటి కన్నులుగలవాడు, విష్ణువు}; చాలన్ = మిక్కిలి; ప్రసన్నుడు = ప్రసన్నమైనవాడు; ఐనన్ = అవ్వగా; అతనిన్ = అతనిని; సాంసారికంబు = సంసారమునకు సంబంధించినవి; అర్థిన్ = కావాలని; కోరిన = కోరినట్టి; నా = నా; వంటి = వంటి; విమూఢ = మిక్కిలి మూర్ఖపు; మానసులు = మనస్సు కలవారు; ధాత్రిన్ = భూమిని; కల్గిరే = ఉన్నారా ఏమి; ఎవ్వరున్ = ఎవరైనను.

భావము:

పేదవాడు రాజును సమీపించి ఊకతో కూడిన నూకలను ఇమ్మని కోరినట్లు మోక్షప్రదాత అయిన కమలాక్షుడు నాకు ప్రసన్నుడైనా అతన్ని నేను సంసారాన్ని అర్థించాను. నావంటి మందబుద్ధులు ఈ లోకంలో ఎవ్వరూ ఉండరు’ (అని ధ్రువుడు విచారించాడు).