పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

ఉల్లేఖనాలు : ధ్రువ- ఎక్కిరాల వారి సంపుటి-10 పుట 17 నుండి 20

ఉల్లేఖనము

కులపతి కృష్ణమాచార్యులు వారి
శ్రీమద్భాగవత ప్రకాశము
చతుర్థ స్కంధము - ద్వితీయ భాగము (ముద్రణ : 2005 జనవరి గురుపూజలు)
- పుట 17 నుండి 20 వరకు


289.  “రాజకుమార! నీవు నిశ్చల వ్రతము గలవాడవు. నీ మనసున మెసలిస కార్యము నే నెరుగుదును. అది పొందుటకు దుస్సాధ్యమైనదైనను నీ కిచ్చుచున్నాను.
290.  "నీ కిచ్చు స్తాన మెట్టిదో వినుము.: గానుగ యంత్రమున నడిమి స్తంభము పలె వీపు నిలిచి యుండగా నీ చుట్టును గానుగ చక్రము తిరిగినట్లు గ్రహములు, నక్షత్రములు, తారాగణములు, జ్యోతిశ్చక్రము తిరుగుచుండును. ఈ జ్యోతుల రూపమున ధర్ముడు, అగ్ని, కశ్యపుడు, ఇంద్రుడు, సప్తర్షులు తారకలతో కలిసి నీ చుట్టును ప్రదక్షిణము చేయుచుండరు. ఇది పొందరాని కేంద్రస్తితి, కేంద్ర మొక్కటే యుండుసు గనుక అన్యులు దాని యుందుండుట సాధ్యమగాదు, మూడు లోకములు ( ప్రళయ మందిసపుడు గూడ నశింపక నీ ధ్రువముల మార్గము ప్రకాశించుచుండును. నీ పుస్న భూభాగము ధ్రువపదమనబడును. ఇరువది యారువేల సంవత్సరములు జరిగిన వెనుక నీ వా పదమును పొందుదుపు, (ఉత్తర, దక్షిణ ధ్రుపముల నుండి దూసికొని నిలబడు రేఖగా ధ్రుపుడు నిలబడును, అతనికి దిగువగా సప్తర్షి మండలముండును. ధ్రువుడు ఒక ఆత్మ ప్రదక్షిణము చేయు బిందుపు సధిష్టించిన టూహింపగా నా ప్రదక్షిణకాలము భూమి పైనున్న జీవులకు ఇరుపదియారువేల సంవత్సరములుగా భాసించును. ఒక్కొక్క నక్షత్రమున వేయి సంవత్సరములు చొప్పున సంచారము చేసినట్లు భాసించును. భూమి చుట్టును భూమధ్యరేఖ కెదురుగా నాకాశమున గ్రహములు చరించు చక్రమున్నది. దానినే 'రాశిచక్ర ' మందురు. దాని నిరువదియేడు సమభాగములు చేయగా 'నక్షత్రచక్ర ' మేర్పడును. ఒక పరిభ్రమణము పూర్తిచేయుటకు అనగా నిరువదియేడవ నక్షత్రమున ప్రవేశించుటకు నిరుపదియారువేల సంవత్సరములు పట్టును. ఈ మాసములు భూమి తన ధ్రువము చుట్టును తిరుగుచుండుటవలన నేర్పడుచున్నవి. ఈ పరిభ్రమణమునకు నడుము నిలబడురేఖగా ధ్రువుడు స్థానము గొనును. అన్నియు వరిభ్రమించుచున్నను కేంద్రమగు నీ రేఖ పరిభ్రమింపదు గనుక ధ్రువము, లేక ధ్రువుడు అనబడును.
  ధ్రువము చుట్టును నక్షత్ర మండలము మొలత్రాడుగా భూమధ్యరేఖ వెంట తిరిగివచ్చుటకు నిరువదియారువేల సంవత్సరములు పట్టును. సప్తర్వులు నక్షత్ర. మండలమున కెదురుగా నొకమారు తిరిగివచ్చినట్లు కనిపించుటకు నిరువదియారువందల సంవత్సరములు పట్టును. ఇందు శతాబ్దుల, సహస్రాబ్దుల కొలతలు కొలుచుటకు వీలగును. కనుక యుగములలో జరిగిన కథలను కొలుచుట కిదియే యాధారము అందలి చక్రవర్తుల కాలనిర్ణయమునకు గూడ నిదియే ఆధారము. ఉదాహరణకు : “ఆసన్మఖాసు, మునయః యుధిష్ఠిరే, శాసతి పృథివీం" అని వరాహమిహిరాచార్యులు చెప్పిరి. మఖా నక్షత్రమున సప్తర్షులుండగా యుధిష్ఠిరుడు భూమిని పాలించెనని యర్ధము. దీనినిబట్టి “షట్ ద్విక పంచద్వియుతఃశక కాలస్తస్యరాజ్ఞస్య" అని వరాహమిహిరుడు యుధిష్ఠిరుని కాలమును సాధించెను. శకకాలమైన శాలివాహన శకమునకు 2526 సంవత్సరములకు పూర్వము యుధిష్ఠిరుడు పరిపాలించెనని సాధించెను. దీనినిబట్టి కలియుగమునం దిప్పటి కెన్ని సంవత్సరములు గడచినవో తెలియును. ధర్మరాజు పరిపాలన యంతమగుటతో కలియుగ మారంభించెను. ఈ గణనము నాధారముగా గొనియే ఇప్పటి పంచాంగకర్తలు కలియుగ సంవత్సరములను నిర్ణయించుచున్నారు. ఈ విధముగా ధ్రువుని, వాని ననుసరించు సప్తరులను ఆధారముగా గొనియే యుగమందలి కథల కాలనిర్ణయమునైనను చేయవచ్చును. పురాణములయందలి కథల కాలమిట్లే నిర్ణయింపబడెను.) అంతవరకును నీవు నీ తండ్రి రాజ్యమును పరిపాలించుచుండుము. నీ తండ్రి వనవాసగతుడగును. నీవు వాని రాజ్యమును పూజ్యముగా ధర్మమార్గమున జితేంద్రియుడవై పరిపాలింతువు. (ఉత్తానపాద మనగా భూగర్భమున కేంద్రమగు ధ్రువరేఖనుండి భూమధ్యరేఖ పైకి గీయబడు లంబకోణరేఖ. అతడు వనవాసగతు డగుననగా ధ్రువుని కాలము నుండి భూమధ్యరేఖ కటు నిటు మహారణ్యములు పెరుగుట యారంభించును.) నీ తమ్ముడు మృగములను వేటాడుటకు వనమునకు బోయి చనిపోవును. (దక్షిణాయనమునుండి ఉత్తరాయణమునకు సూర్యుడు సంవత్సరమున కొకమారు భూమధ్యరేఖను ఖండించును. ఆ ఖండించిన దినమును "విషవత్పుణ్యకాల” మందురు, ఇది ప్రతి సంవత్సరము మార్చి 21-వ తేదీనాడు జరుగును. ఆ దినమున భూమధ్యరేఖపై నిలిచి కొలిచినచో అహోరాత్రములు సమభాగములుగా నుండును. ఈ బిందువును వేదములలో, పురాణములలో 'యజ్ఞమృగము’ అందురు. మృగ మనగా వెదుకబడునది యని యర్థము. ఈ బిందువే సౌర సంవత్సరమునకు సంవత్సరాది. సంవత్సరాదిని నిర్ణయించుటకు వేదఋషులు ఒక పుల్లను పాతి దాని నీడను కొలిచి ఈదినమును స్థాపించెడివారు. ఈబిందువునుండి సమస్త ఖగోళ గణితములను లెక్కించెడివారు. ఈ బిందువు ప్రతిసంవత్సరము భూమధ్యరేఖ పై కొంచెము వెనుకకు నడచుచుండును. ఈ నడచుటనే 'గవామయనము' అను యజ్ఞముగా వేదఋషులు గుర్తించిరి. ఈ బిందువుతోపాటు సంవత్సరాది కూడ వెనుకకు నడచుచుండును. దీనినే కాలస్వరూపుడగు శంకరుడు మృగరూపమైన యజ్ఞమును వేటాడుటగా కవులు వర్ణించిరి. 'నల్లలేడియందు దృష్టి నిలిపి వింటియం దెక్కు పెట్టిన బాణమును చూచుకొనుచున్న నీవు మృగము వెంట పరుగెత్తుచున్న పినాకపాణివలె నున్నావు' అని కాళిదాస కృతమగు శాకుంతల నాటకమున మాతలి దుష్యంతుని ప్రశంసించును. నాటకము మొత్తమునందు చాంద్ర సంవత్సరముయొక్క కథ అంతర్వాహినిగా నడచును. కనుకనే దుష్యంతుడు చంద్రవంశపు రాజుగా చమత్కరింపబడెను. ఈ బిందువునకై భూమధ్యరేఖ ఖండింపబడుటకు కావలసిన సూర్యగతి ధ్రువుని కాలముననే పుట్టినది. ఇట్లు ఖండింపబడుటయే ఉత్తానపాదుని కుమారుడగు ఉత్తముడు చనిపోవుటగా చెప్పబడినది.) నీ తమ్ముని వెదకుటకై వాని తల్లియగు సురుచి యడవికిపోయి దావాగ్నియందు చిక్కుకొని చనిపోవును." (విషువద్బిందువు వెనుకకు జరుగుటయే సురుచి పుత్రుని వెదకుట. ఆ బిందువునుండి వసంతఋతువు ప్రారంభించును. అడవులలో చెట్లు రాచుకొని నిప్పు పుట్టి అడవులు తగులబడు కాల మారంభమగునని యర్థము)
291.  ఇంకను విష్ణుదేవు డిట్లనెను : "పుణ్యమూర్తీ! యజ్ఞరూపుడనైన నన్ను సంపూర్ణ దక్షిణలతో కూడినయజ్ఞములతో పూజింతువు. సత్యములైన ఇహ సౌఖ్యము లనుభవించెదవు. చివరికాలమున నన్నాత్మలో దలచుచు సర్వలోకములచే నమస్కరింపదగు స్థానము నలంకరించెదవు. ఇక నీకు పునర్జన్మములు లేక సప్తర్షి మండలముకన్న పైనున్న నా పదమును పొందగలవు." ఇట్లు పలికి విష్ణువు ధ్రువుడు చూచుచుండగనే తన పట్టణమునకు గమనము చేసెను. (1. సంపూర్ణ దక్షిణాలుగల యజ్ఞములనగా సంవత్సరములు, అహోరాత్రములు, యుగములు మొదలగు కొలతలనమనరించి భూగోళము సరియైన క్రమమున పరిభ్రమించుట, దానివలన ఋతుధర్మములు, వర్ష చక్రము మొదలగునవి యేర్పడి భూమిపై జీవులకు అన్నపానీయాదుల వసతి ఏర్పడుట. 2. సత్యములైన ఇహసౌఖ్యములను యనుభవించుట యనగా భౌతికశరీరములు సంపూర్ణముగా జీవుల కేర్పడి ఇంద్రియాదిసుఖము లనుభవించుట, అంతకుముందున్న జీవులు భావమయముగా సమస్తము ననుభవించుచున్నవి. 3 భూమిపై పరిభ్రమణము ననుభవించువారి కందరికిని పునర్జన్మలుండును. ధ్రువుడు పరిభ్రమింపడు కనుక నతనికి పునర్జన్మముండదు. 4. ఉత్తరధ్రువమున కెదురుగా సప్తర్షి మండలమున్నది వానికన్న నుత్తరముగా, అనగా ధ్రువములకు సూటిగా ధ్రువతారయున్నది. ధ్రువుడాతారయందు ప్రతిష్టితుడై భూమియొక్క పరిభ్రమణమునకు ఇరుసుగా పనిచేయును. ఇతనికన్న పైన నాకాశమున్నది. అందుండి సుడిగుండము కేంద్రమువలె ధ్రువతార మీదుగా భూమిపై నుత్తర ధ్రువమున పనిచేయుచూ ధ్రువుడు భూమిని పరిపాలించును. ఈ భ్రమణమువలన 27 దినములు, 27 సంవత్సరములు, 27 శతాబ్దులు, 27 సహస్రాబ్దులు మొదలుగాగల పరిభ్రమణముల నేర్పరచుచుండును. గనుక 26 వేల సంవత్సరములు పూర్తిచేసి సంఖ్యతో ధ్రువుడు పరిపాలించునని చెప్పబడెను. ధ్రువతారకు పైనున్న యాకాశమందలి శక్తుల సుడిగుండముగా పనిచేయు తావునకు ‘విష్ణుపదముయొక్క బొటనవ్రేలు' అని పేరు. అందుండి దిగివచ్చు ప్రజ్ఞామయమైన శక్తిధారనే 'ఆకాశగంగ’ యందురు. ధ్రువు డచ్చట నిజస్థానము వహించి ధ్రువతార మీదుగా భూమి యుత్తర ధ్రువమునుండి దక్షిణ ధ్రువము దాటి రేఖను కల్పించి తన రాజ్యమును పరిపాలించును. ఇట్టి రేఖను మొట్టమొదటగా మన భూగోళమునకు యజ్ఞవరాహమూర్తి తన కోరలతో నేర్పరచెను, అటుపైన భూగోళము చుట్టును భూమధ్యరేఖను మను వేర్పరచెను. ధ్రువరేఖను ధ్రువు డేర్పరచెను. వరాహమూర్తి యేర్పరచిన రేఖలనుబట్టి గోళములకు స్థితి యేర్పడెను, మనువు గీచిన రేఖనుబట్టి జీవుల ధర్మము లేర్పడెను. ధ్రువుని రేఖను బట్టి అహోరాత్రాది పరిభ్రమణ మేర్పడెను. ఇందు వరాహరేఖలు, ధ్రువరేఖ సృష్టిని శాసించును, మనురేఖ ధర్మమును శాసించును. అంతేకాక మానవులు స్వధర్మాచరణము రూపమున మనురేఖ ననుసరించి సుఖపడుచున్నారు. “మనువునుండి రేఖగా వచ్చుచున్న - మార్గము పరమముగా నంగీకరించి అటు నిటు దాటకుండ చక్రనేమియందు దిలీపుని ప్రజలు వర్తించుచున్నారు" అని కాళిదాసు రఘువంశమున వర్ణించెను. వృత్తిధర్మములు. వయోధర్మములు, వర్ణ ధర్మములు సక్రమముగా పరిపాలింపబడుటచేత మానవు లీరేఖను తమయందు స్పష్టపరచుకొనుచుందురు. అప్పుడు దేవతలను గౌరవించుటయు, దేవతలు జీవులకు సకాలవర్షమును, శస్యగోక్షీరాది సంపదలను ప్రసాదించి గౌరవించుటయు జరుగును. ఇట్లు పరస్పరము గౌరవించుటయే యజ్ఞ మాచరించుట. “ఈ యజ్ఞమార్గమున దేవతలను గౌరవించుటవలననే దేవతలు మిమ్ము గౌరవించుచున్నారు" అని గీతలో కృష్ణుడు చెప్పెను.)