పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

ద్వితీయ స్కంధము : వైకుంఠపుర వర్ణనంబు

 •  
 •  
 •  

2-227-సీ.
 • ఉపకరణాలు:
 •  
 •  
 •  

సూర్యచంద్రానలస్ఫురణలఁ జొరనీక-
నిజదీధితిస్ఫూర్తి నివ్వటిల్ల
దివ్యమణిప్రభా దీపిత సౌధ వి-
మాన గోపుర హర్మ్య మండపములుఁ
బ్రసవ గుచ్ఛస్వచ్ఛరిత కామిత ఫల-
సంతాన పాదప ముదయములుఁ
గాంచన దండ సంత మారుతోద్ధూత-
రళ విచిత్ర కేనచయములు

2-227.1-తే.
 • ఉపకరణాలు:
 •  
 •  
 •  

వికచకైరవ దళదరవింద గత మ
రందరసపాన మోదితేందిందిరప్ర
భూత మంజుల నినదప్రబుద్ధ రాజ
హంసశోభిత వరకమలాకరములు.

టీకా:

సూర్య = సూర్యుని; చంద్ర = చంద్రుని; అనల = అగ్నిల; స్పురణలఁన్ = వెలుగులను; చొరనీక = ప్రవేశించ నీయని; నిజ = తమ; దీధితి = ప్రకాశము యొక్క; స్ఫూర్తిన్ = వెలుగులు; నివ్వటిల్లన్ = అతిశయించు; దివ్య = గొప్ప; మణి = మణుల; ప్రభా = ప్రకాశము యొక్క; దీపిత = వెలుగులు నిండిన; సౌధ = సౌధములు, మేడలు; విమాన = రాజభవనములు; గోపుర = వాకిళ్ళు; హర్మ్య = హర్మ్యములు, మిద్దెఇళ్ళు; మండపములు = మండపములును; ప్రసవ = పువ్వుల; గుచ్ఛ = గుత్తులు; స్వచ్ఛ = శుభ్రముతో; భరిత = కూడిన; కామిత = కోరిన; ఫల = ఫలములిచ్చు, ఫలితములిచ్చు; సంతాన = సంతాన, నిధుల వంటి {1 సప్త సంతానములు - తటాకము, నిధి, అగ్రహారము, దేవాలయము, వనము, ప్రభందము, పుత్రుడు. 2 కల్పవృక్ష విశేషములు - ఐదు (5), మందారము, పారిజాతము, సంతానము, కల్పవృక్షము, హరి చందనము.}; పాదప = వృక్షముల; సముదాయములుఁన్ = గుంపులును; కాంచన = బంగారు; దండ = దండమునకు, కఱ్ఱకి; సంగత = కట్టబడి; మారుత = గాలికి; ఉద్ధూత = ఎత్తబడి; తరళ = చలిస్తున్న, రెపరెపలాడుతున్న; విచిత్ర = చిత్ర విచిత్ర; కేతన = జండాల; చయములు = వరుసలును;
వికచ = వికసించిన; కైరవన్ = తెల్ల కలువల; తళత్ = మెరుస్తున్న; అరవింద = పద్మముల; గత = అందలి; మరంద = మకరంద; రస = రసమును; పాన = తాగి; మోదిత = ఆనందించిన; ఇందిందిరన్ = తుమ్మెదలకి; ప్రభూత = వెలువడిన; మంజుల = ఇంపైన; నినద = నాదములతో; ప్రబుద్ధ = మేల్కొన్న; రాజహంస = రాజహంసలతో; శోభిత = శోభిస్తున్న; వర = శ్రేష్ఠమైన; కమలాకరములు = కలువకొలనులు.

భావము:

అక్కడ వైకుంఠపురంలో మేడలు, విమానాలు, గోపురాలు, మిద్దెలు, మండపాలు, దివ్యమణికాంతులతో దేదీవ్యమానంగా తేజరిల్లుతున్నాయి. ఆ దీప్తులు సూర్యచంద్రాగ్నుల తేజస్సులను చొరనీయటం లేదు. ఇంకా ఆ వైకుంఠపురంలో పూలగుత్తులతో నిండి కోరిన ఫలాలు ప్రసాదించే కల్పవృక్ష సమూహాలు ఉన్నాయి. బంగారు కఱ్ఱలకు తగిలించిన రంగు రంగుల పతాకలు గాలికి రెపరెప లాడుతున్నాయి. వికసించిన కలువల్లోనూ, కమలాల్లోనూ మకరందముం గ్రోలుతూ మధుకర బృందాలు ఆనందంతో ఝంకారం చేస్తున్నాయి. అక్కడి తటాకాలు ఆ శబ్దానికి మేల్కొన్న కలహంసలతో కనులపండువుగా శోభిస్తున్నాయి.

2-228-సీ.
 • ఉపకరణాలు:
 •  
 •  
 •  

ల నొప్పగా ‘న దైవం కేశవాత్పర’-
మ్మని పల్కు రాజకీరావళియును
హిమ ‘జగద్విష్ణుయ మఖిల’మ్మని-
దివెడు శారికాముదయంబు
నేపారఁగా ‘జితం తే పుండరీకాక్ష’-
ని లీలఁబాడు పికావళియును
లిమీఱఁగా ‘మంగళం మధుసూదన’-
నుచుఁ బల్కెడు మయూరావళియునుఁ

2-228.1-తే.
 • ఉపకరణాలు:
 •  
 •  
 •  

విలి శ్రౌషడ్వషట్స్వధే త్యాది శబ్ద
లితముగ మ్రోయు మధుప నికాయములునుఁ
లిగి యఖిలైక దివ్య మంళ విలాస
హిమఁ జెన్నొందు వైకుంఠమందిరంబు.

టీకా:

వలన = వలన; ఒప్పన్ = చక్కగ ఒప్పియుండగ; న = లేదు; దైవం = దైవమేదీ; కేశవ = విష్ణువుకి {కేశవ - కే (కేవలము) ఈశ (ప్రభువు), విష్ణువు}; పరం = ఇతరమై; అని = అని; పల్కు = పలుకు; రాజ = రామ; కీర = చిలుకల; ఆవళియును = గుంపులును; మహిమన్ = గొప్పగ; జగత్ = సృష్టి; విష్ణు = విష్ణువుతో; మయము = నిండినది; అఖిలమ్ము = మొత్తము అంతయును; అని = అని; చదివెడు = చదువు; శారికా = గోరువంకల; సముదాయంబున్ = గుంపులును; ఏపారఁగాన్ = అతిశయించగ; జితం = జయము; తే = నీకు; పుండరీకాక్ష = హరి {పుండరీకాక్షుడు - తామరాకుల వంటి కన్నులు ఉన్నవాడు, విష్ణువు}; అని = అని; లీలఁన్ = విలాసముగ; పాడు = పాడుతున్న; పిక = కోకిలల; ఆవళియును = మూకలును; లలిమీఱఁగన్ = ఇంపారగ; మంగళం = శుభము; మధుసూదన = విష్ణుమూర్తీ {మధుసూదన - మధువను రాక్షసుని చంపినవాడు, భగవంతుడు}; అనుచుఁన్ = అంటూ; పల్కెడున్ = క్రేంకారవములు పలుకు; మయూర = నెమళ్ళ; ఆవళియునున్ = గుంపులును; తవిలి = ఇష్టపూర్తిగ;
శ్రౌషట్ = శ్రౌషట్; వషట్ = వషట్; స్వధాత్ = స్వధాత్; ఆది = మొదలగు; శబ్ద = శబ్దములు; కలితముగ = కలుగునట్లు; మ్రోయు = మోగే; మధుప = తేనెటీగల; నికాయంబులును = గుంపులును; కలిగి = కలిగి; అఖిలలైక = మొత్తము అంతా; దివ్య = దివ్యమైన; మంగళ = శుభకర; విలాస = విలాసమైన; మహిమన్ = గొప్పదనముతో; చెన్నొందు = అందము పొందుతున్నది; వైకుంఠ = వైకుంఠ; మందిరంబున్ = పురమునున్.

భావము:

ఆ వైకుంఠపురంలో ఉన్నట్టి రామచిలుకలు “కేశవుని కంటె పరదైవం లేదు” అని నేర్పుగా పలుకు తున్నాయి. గోరువంకలు “విశ్వమంతా విష్ణుమయం” అని మహిమతో చదువుతున్నాయి. కోయిలలు అతిశయంగా “పద్మనేత్రా! నీదే జయం” అని పాడుతున్నాయి. నెమళ్లు ఉత్సాహముగా “మధుసూదనుడ! నీకు మంగళం” అని ఆడుతున్నాయి. తుమ్మెదల గుంపులు ఆసక్తితో “శ్రౌషట్ వషట్ స్వధా” ఇత్యాది శబ్దాలతో ఝంకారం చేస్తున్నాయి. ఈ విధంగా అన్నింటినీ మించి సాటిలేని వైభవోపేతమైన వైకుంఠమందిరం సమస్త దివ్య మంగళ లీలావిలాసాలతో పరమసుందరంగా వుంది.

2-229-వ.
 • ఉపకరణాలు:
 •  
 •  
 •  

మఱియుం బయోధరావళీ విభాసితనభంబునుం బోలె వెలుంగుచున్న య ద్ధివ్యధామంబు నందు.

టీకా:

మఱియున్ = ఇంకను; పయోధర = మేఘముల; ఆవళీ = సముదాయముతో; విభాసిత = ప్రకాశిస్తున్న; అభంబునున్ = ఆకాశమును; పొలెన్ = వలె; వెలుంగుచున్న = వెలిగిపోతున్న; ఆ = ఆ; దివ్య = దివ్యమైన; ధామంబున్ = భవనమును; అందున్ = దానిలో.

భావము:

ఇంకా ధారాధర రాజితో విరాజిల్లే తారాపథంలాగా తేజరిల్లుతున్న ఆ దివ్యమందిరంలో.

2-230-సీ.
 • ఉపకరణాలు:
 •  
 •  
 •  

లలితేందీవరశ్యామాయమానోజ్జ్వ-
లాంగులు, నవ్యపీతాంబరులును,
వళారవిందసుంరపత్రనేత్రులు,-
సుకుమారతనులు, భాసుర వినూత్న
త్న విభూషణ గ్రైవేయ కంకణ-
హార కేయూర మంజీర ధరులు,
నిత్యయౌవనులు, వినిర్మలచరితులు,-
రోచిష్ణులును, హరిరూపధరులు,

2-230.1-తే.
 • ఉపకరణాలు:
 •  
 •  
 •  

గు సునందుండు నందుండు ర్హణుండుఁ
బ్రబలుఁడును నాది యగు నిజపార్శ్వచరులు
ఱియు వైడూర్య విద్రుమాల మృణాళ
తుల్యగాత్రులు దను భక్తితో భజింప.

టీకా:

స = చక్కటి; లలిత = మనోఙ్ఞమైన; ఇందీవర = నల్లకలువలు వంటి; శ్యామాయమాన = నల్లని రంగుతో; ఉజ్జ్వల = ప్రకాశిస్తున్న; అంగులు = దేహములు కలవారు; నవ్య = కొత్త; పీత = పచ్చని పట్టు; అంబరులున్ = వస్త్రములును; ధవళ = తెల్లని; అరవింద = పద్మముల వంటి; సుందర = అందమైన; పత్ర = దళముల వంటి; నేత్రులు = కన్నులు కలవారు; సుకుమార = సుకుమారమైన; తనులు = శరీరములు కలవారు; భాసుర = కాంతివంతమైన; విన్నూత్న = సరికొత్త; రత్న = మణులతో; విభూషణ = విశేష ఆభరణములు; గ్రైవేయ = దండలు; కంకణ = కంకణములు; హార = హారములు; కేయుర = దండ వంకీలు; మంజీర = అందెలు, నూపురములు; ధరులు = ధరించిన వారు; నిత్య = నిత్యము; యౌవనులు = యువకులుగ నుండువారు; వినిర్మల = చక్కటి నిర్మలమైన; చరితులు = ప్రవర్తన కలవారును; రోచిష్ణులునున్ = కాంతులు చిందించు వారును; హరి = విష్ణవుయొక్క; రూప = రూపమును; ధరులు = ధరించిన వారును; అగు = అయిన;
సునందుండు = సునందుడు; నందుండు = నందుడు; అర్హణుండు = అర్హణుడు; ప్రబలుఁడునున్ = ప్రబలుడును; ఆదియగు = మొదలగు; నిజ = తన; పార్శ్వచరులు = సహచరులు; మఱియున్ = ఇంకను; వైడూర్య = వైడూర్యములు {వైడూర్యములు - విడూర దేశమున పుట్టిన రత్నములు}; విద్రుమ = పగడములు; అమల = నిర్మలమైన; మృణాళ = తామర తూడులతో; తుల్య = సమానమైన; గాత్రులు = శరీరులు; తనున్ = తనను; భక్తిన్ = భక్తి; తోన్ = తో; భజింపన్ = సేవిస్తుండగ.

భావము:

విష్ణు పరిచారకులు సునందుడు, నందుడు, అర్హణుడు, ప్రబలుడు మొదలైనవారు భగవానుని భక్తితో భజిస్తున్నారు. వాళ్ళు నల్లకలువల్లాగా నీలమై నిగనిగలాడే శరీరాలతో నివ్వటిల్లుతున్నారు. పచ్చని కొంగ్రొత్త వస్తములను కట్టుకొన్నారు. తెల్లతామర రేకుల వంటి కన్నులతో శోభిల్లుతున్నారు. వారివి సుతిమెత్తని దేహాలు, వాళ్లు ధగధగలాడే రత్నాభరణాలూ, కంఠహారాలూ, కంకణాలూ, ముత్యాల సరాలూ, భుజకీర్తులూ, అందెలూ ధరించి వున్నారు. మాసిపోని యౌవనంతో భాసిస్తున్నారు. పవిత్రమైన ప్రవర్తన కలిగి వున్నారు. అందరు హరిరూపాలు ధరించి జాజ్వల్యమానంగా వెలుగొందుతున్నారు. వారు వైడూర్యాలతోటి, పగడాలతోటి, తామర తూండ్లతోటి సమానమైన శరీరాలు కలిగి వున్నారు. వారు అందరు భక్తితో శ్రీమన్నారాయణుని భజిస్తున్నారు.

2-231-సీ.
 • ఉపకరణాలు:
 •  
 •  
 •  

క్షాళితాఖిలకల్మవ్రజామరనదీ-
నక కోమల పదాబ్జముల వాని,
ఖిల సంపత్కారణాపాంగ లక్ష్మీ వి-
లాసిత వక్షఃస్థలంబువానిఁ,
ద్మమిత్రామిత్ర భాసిత కరుణాత-
రంగిత చారునేత్రములవాని,
భువననిర్మాణ నైపుణ భవ్య నిజ జన్మ-
కారణ నాభిపంజము వాని,

2-231.1-తే.
 • ఉపకరణాలు:
 •  
 •  
 •  

హి హితాహిత శయన వాముల వాని,
సేవి తామర తాపస శ్రేణివాని,
ఖిలలోకంబులకుఁ గురుఁడైనవాని
గాంచె; బరమేష్టి గన్నుల ఱవు దీఱ.

టీకా:

క్షాళిత = కడుగబడిన; అఖిల = సమస్తమైన; కల్మష = పాపముల; వ్రజ = సమూహములు గల; అమరనదీ = దేవ గంగా నది; జనక = పుట్టించిన; కోమల = సుకుమారమైన; పద = పాదములు అను; అబ్జములన్ = పద్మములు ఉన్న; వాని = వానిని; అఖిల = సమస్తమైన; సంపత్ = సంపదలకు; కారణ = హేతువైన; అపాంగ = కటాక్షణ వీక్షణములు కల; లక్ష్మీ = లక్ష్మీదేవి; విలసిత = అలంకరించిన; వక్షఃస్థలంబున్ = వక్షము; వానిఁన్ = కలవానిని; పద్మ = పద్మములకు; మిత్ర = మిత్రుడు (సూర్యుడు); అమిత్ర = శత్రువు (చంద్రుడు); భాసిత = ప్రకాశిస్తున్న; కరుణా = దయ; తరంగితన్ = తరంగములను వెలువరించు; చారు = చక్కని; నేత్రముల = కన్నులు కల; వానిన్ = వానిని; భువన = లోకములను; నిర్మాణ = నిర్మించు; నైపుణ = నిపుణత్వము గల (బ్రహ్మ); భవ్య = దేవుడు; నిజ = అతని; జన్మ = పుట్టుకకు; కారణ = కారణమైన; నాభి = బొడ్డు నందలి; పంకజము = పద్మము కల; వానిన్ = వానిని; అహి = సర్పములకు;
హిత = ఇష్టుడు (శేషుడు); అహిత = గరుడుడు; శయన = శయ్యగను; వాహనములు = వాహనముగను; వానిఁన్ = కల వానిని; సేవిత = సేవిస్తున్న; అమర = దేవతలు; తాపస = మునులు; శ్రేణి = సమూహములు; వానిఁన్ = కలవానిని; అఖిల = సమస్త; లోకంబులన్ = లోకముల; కున్ = కు; గురుఁడు = గురువు; ఐన = అయిన; వానిఁన్ = వానిని; కాంచెన్ = దర్శించెను; పరమేష్టిన్ = బ్రహ్మ {పరమేష్టి - అత్యున్నతమైన సంకల్పశక్తుడు}; కన్నుల = కన్నుల; కఱవున్ = కరువు; తీఱన్ = తీరునట్లు.

భావము:

ఆ భగవంతుని కోమల పాదపద్మాలనుండే సమస్త పాపాలనూ కడిగివేసే గంగానది ఉద్భవించింది. తన కడగంటి చూపుతో కలుములన్నీ ప్రసాదింపగల శ్రీమహాలక్ష్మి ఆయన వక్షఃస్థలంలోనే నివసిస్తున్నది. ఆయన సూర్యచంద్రులనే సుందరమైన కన్నులు కలవాడు. ఆ కనులలో కరుణా తరంగాలు పొంగిపొరలుతూ వుంటాయి. జగత్తును సృష్టించడంలో నిపుణుడైన బ్రహ్మ ఆ భగవంతుని నాభికమలం నుండే జన్మించాడు. శేషుడే ఆయనకు తల్పం గరుడుడే ఆయనకు వాహనం. ముక్కోటి దేవతలు, మునులు ఆయనను సేవిస్తు వుంటారు. ఆయన సమస్తలోకాలకు తండ్రి. అలాంటి పరమేశ్వరుణ్ణి బ్రహ్మదేవుడు కన్నులకరవు దీరేటట్టుగా చూచాడు.

2-232-క.
 • ఉపకరణాలు:
 •  
 •  
 •  

నీయ రూపరేఖా
ణీయతఁ జాల నొప్పు మణీమణి య
క్కలాలయ దన మృదు కర
లంబుల విభుని పాదమలము లొత్తెన్.

టీకా:

కమనీయ = మనోహరమైన; రూప = రూపము; రేఖ = సౌష్టవముల; రమణీయతఁన్ = మనోఙ్ఞతతో; చాలన్ = మిక్కిలి; ఒప్పు = చక్కగ ఉన్న; రమణీ = స్త్రీ; మణి = రత్నము; ఆ = ఆ; కమలాలయ = లక్ష్మీదేవి {కమలాలయ - కమలములు ఆలయముగ కలది, లక్షీదేవి}; తన = తన యొక్క; మృదు = మృదువైన; కర = చేతులు అను; కమలంబులన్ = పద్మములతో; విభుని = ప్రభువు (విష్ణుమూర్తి); పాద = పాదములు అను; కమలములు = పద్మములు; ఒత్తన్ = ఒత్తుచుండగ.

భావము:

చక్కని రూపరేఖావిలాసాలతో చక్కగా ఒప్పి వున్న లక్ష్మీదేవి, తన కోమలమైన పాణి పద్మాలతో ప్రాణేశ్వరుని పాదపద్మాలను ఒత్తుతున్నది.

2-233-వ.
 • ఉపకరణాలు:
 •  
 •  
 •  

వెండియు.

టీకా:

వెండియున్ = మరియు.

భావము:

అంతే కాదు.

2-234-శా.
 • ఉపకరణాలు:
 •  
 •  
 •  

శ్రీకాంతాతిలకంబు రత్నరుచిరాజిప్రేంఖితస్వర్ణడో
లాకేళిన్ విలసిల్లి తత్కచభరాలంకార స్రగ్గంధలో
భాకీర్ణప్రచరన్మధువ్రత మనోజ్ఞాలోలనాదంబు ల
స్తోకానుస్వర లీల నొప్పఁగ నిజేశున్ వేడ్కతోఁ బాడఁగన్.

టీకా:

శ్రీకాంతాతిలకంబున్ = లక్ష్మీదేవి {శ్రీకాంతా తిలకము- శుభకరమైన స్త్రీలలో ఉత్తమురాలు - లక్ష్మి}; రత్న = రత్నముల; రుచి = కాంతుల; రాజిన్ = పుంజములచే; ప్రేంఖితన్ = ఊపబడుతున్న; స్వర్ణ = బంగారు; డోలా = ఊయల; కేళిన్ = కేళితో; విలసిల్లి = ప్రకాశిస్తూ; తత్ = ఆమె; కచ = కొప్పు; భర = నిండా ఉన్న; అలంకార = అలంకరింపబడ్డ; స్రక్ = పూలదండ యొక్క; గంధ = సువాసన వలన; లోభ = ఆకాంక్ష; ఆకీర్ణ = సంకీర్ణమై; ప్రచరత్ = తిరుగుతున్న; మధువ్రత = తుమ్మెదల యొక్క; మనోఙ్ఞ = మనోహరమైన; ఆలోల = సంచలిస్తున్న; నాదంబున్ = ఝంకార నాదముతో; అస్తోక = గొప్ప; అనుస్వర = శ్రుతి కల్పుతున్న; లీలన్ = విధముగ; ఒప్పఁగన్ = ఒప్పునట్లు; నిజ = తన; ఈశున్ = భర్తను; వేడ్కన్ = ఇష్టము; తోఁన్ = తో; పాడఁగన్ = కీర్తిస్తుండగ.

భావము:

శ్రీ మహాలక్ష్మి రత్నకాంతులతో విరాజిల్లే బంగారపు తూగుటూయెలలో ఊగుతు ఉన్నది. ఆమె కొప్పులో ముడుచుకొన్న సుమమాలికల సుగంధం మీది అశతో గుమిగూడిన తుమ్మెదలు మనోజ్ఞంగా జుమ్మని రొద చేస్తూ విహరిస్తున్నాయి. ఆ భ్రమర ఝుంకారమే శ్రుతిగా శ్రీదేవి తన పతి శ్రీపతిమీద పాటలు పాడుతున్నది.

2-235-వ.
 • ఉపకరణాలు:
 •  
 •  
 •  

అట్టి నిత్యవిభూతి యందు.

టీకా:

అట్టి = అటువంటి; నిత్య = నిత్యమైన; విభూతిన్ = విభూతుల; అందున్ = లో.

భావము:

అలాంటి పరమపదంలో.

2-236-మ.
 • ఉపకరణాలు:
 •  
 •  
 •  

తజ్ఞానరమా యశో బల మహైశ్వర్యాది యుక్తున్ జగ
త్పతి యజ్ఞేశు ననంతు నచ్యుతు దళత్పంకేరుహాక్షున్ శ్రియః
తి నాద్యంతవికారదూరుఁ గరుణాపాథోనిధిన్ సాత్వతాం
తి వర్థిష్ణు సహిష్ణు విష్ణు గుణవిభ్రాజిష్ణు రోచిష్ణునిన్.

టీకా:

సతత = ఎడతెగని; ఙ్ఞాన = ఙ్ఞానము; రమా = లక్ష్మి; యశస్ = యశస్సు; బల = బలము; మహా = గొప్ప; ఐశ్వర్య = ఐశ్వర్యము; ఆది = మొదలగు నవి; యుక్తున్ = కలిగి ఉన్న వానిని; జగత్పతిన్ = జగత్పతిని {జగత్పతి - లోకములకు ప్రభువు, విష్ణువు}; యఙ్ఞేశున్ = యఙ్ఞేశుని {యఙ్ఞేశుడు - యజ్ఞమునకు అధిపతి - విష్ణువు}; అనంతున్ = అనంతుని {అనంతుడు - అంతములేని వాడు}; అచ్యుతు = అచ్యుతుని {అచ్యుతు - చ్యుతము లేనివాడు, విష్ణువు}; దళత్పంకేరుహాక్షున్ = దళత్పంకేరుహాక్షుని {దళత్పంకేరుహాక్షుడు - వికసించినపద్మముల వంటికన్నులు ఉన్నవాడు, విష్ణువు. పంకేరుహము - బురదలో పుట్టునది}; శ్రియఃపతి = శ్రియఃపతిన్ {శ్రియఃపతి - శ్రియస్ (శ్రేయస్సు) నిచ్చు పతి (ప్రభువు), విష్ణువు)}; ఆద్యంతవికారదూరుఁన్ = ఆద్యంతవికారదూరుఁని {ఆద్యంతవికారదూరుడు - మొదలు అంతము అను వికారములు లేనివాడు, విష్ణువు}; కరుణాపాథోనిధిన్ = కరుణాపాథోనిధిని {కరుణాపాథోనిధి - దయకు సముద్రము వంటివాడు, విష్ణువు}; సాత్వతాంపతిన్ = సాత్వతాంపతిని {సాత్వతాంపతి - సాత్వతులకు ప్రభువు, సాత్వతులు - సాత్వత వంశస్థులు లేక సత్వగుణులు, కృష్ణునికి 4 తరముల పూర్వపు సాత్వతి అనునామె వంశము; 1-58-వ. నందు తత్వమును సాత్వతులు భగవంతు డంటారు అని చెప్పబడింది; బలరాముడు ఆదిగురువుగా ఒక ప్రత్యేకమైన భక్తితత్వాన్ని అవలంభించే యాదవులను సాత్వతులంటారు. విష్ణుసహస్రనామములు శ్రీశంకర భాష్యం 512వ నామం, యదుకులమునకు ప్రభువు}; వర్థిష్ణున్ = వర్థిష్ణుని {వర్థిష్ణుడు - వృద్ధి చెందువాడు, విష్ణువు}; సహిష్ణున్ = సహిష్ణున్ {సహిష్ణుడు - సకలము ధరించు వాడు, విష్ణువు, విష్ణుసహస్రనామములు 144వ నామం, 565వ నామం, భక్తుల అపరాధములను మన్నించి సహించువాడు, ద్వంధ్వములను సహించువాడు}; విష్ణున్ = విష్ణువుని {విష్ణువు - సమస్త మందును వ్యాపించిన వాడు}; గుణవిభ్రాజిష్ణున్ = గుణవిభ్రాజిష్ణుని {గుణవిభ్రాజిష్ణుడు - గుణములచే విశేషముగ ప్రకాశించు వాడు, విష్ణువు}; రోచిష్ణునిన్ = రోచిష్ణుని {రోచిష్ణుడు - ప్రకాశించు వాడు, విష్ణవు}.

భావము:

ఎల్ల వేళల జ్ఞానము, సంపద, కీర్తి బలము, ఐశ్వర్యము మొదలైన గుణాలతో కూడినవాడు, భువనాలకు ప్రభువు, యజ్ఞానికి అధీశ్వరుడు, తుది లేనివాడు, చ్యుతి లేనివాడు, వికసించుచున్న పద్మాలవంటి నేత్రాలు కలవాడు, లక్ష్మీవల్లభుడు, మొదలు తుద వికారము లేనివాడు, దయాసముద్రుడు, సాత్వతులకు అధినాథుడు, వృద్ధిశీలుడు, సహనశీలుడు, అంతటా వ్యాపించిన వాడు, కల్యాణగుణాలతో విరాజిల్లేవాడు, కాంతిమంతుడు అయిన శ్రీహరిని బ్రహ్మదేవుడు దర్శించాడు.

2-237-మ.
 • ఉపకరణాలు:
 •  
 •  
 •  

హాసామృత పూరితాస్యు నిజభక్తత్రాణ పారాయణు
న్నరుణాంభోరుహపత్ర లోచనునిఁ బీతావాసుఁ ద్రైలోక్యసుం
రు మంజీర కిరీట కుండల ముఖోద్యద్భూషు యోగీశ్వరే
శ్వరు లక్ష్మీయుతవక్షుఁ జిన్మయు దయాసాంద్రుం జతుర్భాహునిన్.

టీకా:

దరహాసామృత = చిరునవ్వు అను అమృతముతో {దరహాసామృతపూరితాస్యుడు - చిరునవ్వు అను అమృతముతో నిండిన ముఖము కలవాడు, విష్ణువు}; పూరితాస్యుడు = నిండిన మోమువాడు; నిజ = తన {నిజభక్తత్రాణపారాయణు - తనభక్తులను కాపాడుటలో బహునేర్పరిని, విష్ణువు}; భక్త = భక్తులను; త్రాణ = కాపాడుటలో; పారాయణున్ = బహునేర్పరిని; అరుణాంభోరుహపత్ర = ఎఱ్ఱకలువ రేకుల వంటి {అరుణాంభోరుహపత్రలోచనుడు - ఎఱ్ఱకలువల రేకుల వంటి కన్నులు ఉన్నవాడు, అంభోరుహము - నీట పుట్టినది, పద్మము}; లోచనుఁనిన్ = కన్నులు ఉన్నవానిని; పీతావాసుఁన్ = పీతావాసుని {పీతావాసుఁడు - పచ్చని పట్టువస్త్రము ధరించిన వాడు, విష్ణువు}; త్రైలోక్యసుందరున్ = త్రైలోక్యసుందరుని {త్రైలోక్యసుందరుడు - మూడులోకములకు సుందరుడు, విష్ణువు}; మంజీర = అందెలు; కిరీట = కిరీటము; కుండల = చెవి కుండలములు; ముఖ్య = మొదలైన; ఉద్యత్ = ప్రకాశిస్తున్న; భూషు = భూషణముల వానిని; యోగీశ్వరేశ్వరున్ = యోగీశ్వరేశ్వరుని {యోగీశ్వరేశ్వరుడు - యోగులలో శ్రేష్ఠులకు ప్రభువు, విష్ణువు}; లక్ష్మీయుతవక్షున్ = లక్ష్మీయుతవక్షుని {లక్ష్మీయుతవక్షుడు - లక్ష్మీదేవి వక్షస్థలమున ఉన్నవాడు, విష్ణువు}; చిన్మయున్ = చిన్మయుని {చిన్మయుడు - (చిత్ అను) ఙ్ఞానము కలవాడు, విష్ణువు}; దయాసాంద్రున్ = దయాసాంద్రుని {దయాసాంద్రుడు - దయ దట్టముగ కలవాడు, విష్ణువు}; చతుర్భాహునిన్ = చతుర్భాహుని {చతుర్భాహుడు - నాలుగు చేతులు ఉన్నవాడు, విష్ణువు}.

భావము:

చిరునవ్వుల అమృతాన్ని కురిపించే మోము వానిని, తన భక్తులను పాలించు పరమాత్ముని, ఎఱ్ఱ కలువరేకుల వంటి కన్నుల వానిని, పట్టు బట్ట ధరించు వానిని, ముల్లోకాలలో మనోహరమైన వానిని, చరణమంజీరాలు, కిరీటము, చెవికుండలములు మున్నగు ఆభరణాలు ధరించువానిని, యోగిశ్రేష్ఠులకు ప్రభువైన వానిని, వక్షస్థలమున లక్ష్మి వసించువానిని, కృపాసముద్రుని, చతుర్భుజములవానిని శ్రీమహావిష్ణువును బ్రహ్మదేవుడు దర్శించాడు.

2-238-వ.
 • ఉపకరణాలు:
 •  
 •  
 •  

మఱియు ననర్ఘ రత్నమయ సింహాసనాసీనుండును సునంద నంద కుముదాది సేవితుండును బ్రకృతి పురుష మహదహంకారంబులను చతుశ్శక్తులును గర్మేంద్రియ జ్ఞానేంద్రియ మనో మహాభూతంబులను షోడశశక్తులును బంచతన్మాత్రంబులునుం బరివేష్టింపఁ గోట్యర్క ప్రభావిభాసితుండును, స్వేతరాలభ్య స్వాభావిక సమస్తైశ్వర్యాతిశయుండును నై స్వస్వరూపంబునం గ్రీడించు సర్వేశ్వరుండైన పరమపురుషుం బురుషోత్తముం బుండరీకాక్షు నారాయణుం జూచి సాంద్రానందకందళిత హృదయారవిందుండును, రోమాంచకంచుకిత శరీరుండును, నానందబాష్పధారాసిక్త కపోలుండును నగుచు.
^ షోడశ శక్తులు లేదా షోడశ వికారములు.

టీకా:

మఱియున్ = ఇంకా; అనర్ఘ = అమూల్య; రత్న = రత్నములు; మయ = తాపడము చేసిన; సింహాసన = సింహాసనమున {సింహాసనము - గుహ (పై పోట్ట యందు పక్కటెముకల క్రింద గుండే దిగువ ఉండు గుహ వంటి స్థానమని యోగశాస్త్రార్థము), ఈ గుహలో ఆసీనుడైన భగవంతుని ధ్యానించుట యోగ సాధనమార్గము లలో ముఖ్యమైనది. ఉదా. నరుల గుహలో నుండు వాడు నృసింహుడు,}; ఆసీనుండునున్ = అలంకరించిన వాడు; సునంద = సునందుడు; నంద = నందుడు; కుముద = కుముద; ఆది = మొదలగు వారిచే; సేవితుండునున్ = సేవింపబడు వాడును; ప్రకృతి = ప్రకృతి; పురుష = పురుషుడు; మహత్ = మహత్తు; అహంకారంబులునున్ = అహంకారములు అను; చతుశ్శక్తులునున్ = నాలుగు శక్తులున; కర్మేంద్రియ = కర్మేంద్రియములును (5); ఙ్ఞానేంద్రియ = ఙ్ఞానేంద్రియములును (5); మనస్ = మనస్సును (1); మహాభూతంబులునున్ = మహాభూతములును (6) అను {మహాభూతములు - (6) నీరు, వాయువు, నిప్పు, నేల, ఆకాశము మరియు మనస్సు}; షోడశ = పదహారు; శక్తులునున్ = శక్తులును; పంచ = ఐదు; తన్మాత్రంబులునున్ = తన్మాత్రలును {పంచ తన్మాత్రంబులు - శబ్దము, స్పర్శము, రూపము, రుచి, వాసన వాని మూల తత్వములు (5)}; పరివేష్టింపన్ = చేరి కొలుస్తుండగ; కోటి = కోటి మంది; అర్క్య = సూర్యుల; ప్రభా = కాంతితో; విభాసితుండునున్ = విశేషముగ ప్రకాశించువాడును; స్వ = తన కంటె; ఇతర = ఇతరులకు; అలభ్య = దొరకని; స్వాభావిక = సహజసిద్ధముగ; సమస్త = సమస్తమైన; ఐశ్వర్య = వైభవములతోను; అతిశయుండునున్ = అతిశయిస్తున్న వాడును; ఐ = అయి; స్వ = స్వంత; స్వరూపంబునన్ = స్వరూపముతో; క్రీడించు = క్రీడిస్తుండు; సర్వేశ్వరుండున్ = సర్వమునకు ఈశ్వరుడును; ఐన = అయినట్టి; పరమపురుషున్ = ఉత్తమోత్తమపురుషుని {పరమపురుషుడు - ఉత్తమోత్తమ పురుషుడు, విష్ణువు}; పురుషోత్తమున్ = పురుషోత్తముని {పురుషోత్తమః - విష్ణుసహస్రనామములలో 24వ నామం, పురుషులలో ఉత్తముడు}; పుండరీకాక్షున్ = పుండరీకాక్షుని {పుండరీకాక్షః - విష్ణుసహస్రనామములలో 111వ నామం, పుండరీకముల (తామరాకుల) వంటి కన్నులు ఉన్నవాడు, భక్తుల హృదయపద్మమున దర్శనీయుడు, విష్ణువు}; నారాయణున్ = నారాయణుని {నారాయణః - విష్ణుసహస్రనామములలో 245వ నామము, నరులకు ఆశ్రయమైన వాడు, నారములందు వసించు వాడు}; చూచి = చూసి; సాంద్ర = మిక్కిలి; ఆనంద = ఆనందము తో; కందళిత = చిగురించిన; హృదయ = హృదయము అను; అరవిందుండునున్ = పద్మము కలవాడును; రోమాంచక = గగుర్పాటుచేత; అంచుకిత = అలంకరింపబడిన; శరీరుండును = దేహము కలవాడును; ఆనంద = అనందపు; బాష్ప = కన్నీటి; ధారా = ధారలతో; సిక్త = తడసిన; కపోలుండునున్ = బుగ్గలు కలవాడును; అగుచున్ = అగుచు.

భావము:

అంతేకాక బ్రహ్మదేవునికి సాక్షాత్కరించిన శ్రీమన్నారాయణు వెలకట్టలేనంతటి విలువైన రత్నాలు పొదిగిన సింహాసనంపై ఆసీనుడై ఉన్న వాడు; కమలాల వంటి కన్నులు కల వాడు; నందుడు, సునందుడు, కుముదుడు మున్నగువారు సేవిస్తున్న వాడు; చతుశ్శక్తులు అనెడి 1ప్రకృతి, 2పురుషుడు, 3మహత్తు, 4అహంకారములు; పంచ కర్మేంద్రియములు అనెడి 1చేతులు, 2కాళ్ళు, 3నోరు, 4పాయువు, 5ఉపస్తు; పంచ జ్ఞానేంద్రియములు అనెడి 1కన్ను, 2ముక్కు, 3చెవి, 4నాలుక, 5చర్మము; మనస్సు; పంచ మహాభూతములు అనెడి ఆకాశము, అగ్ని, వాయువు, జలము, భూమి; షోడశశక్తులును; పంచతన్మాత్రలు అనే శబ్దము, స్పర్శము, రూపము, రుచి, వాసన వాని పంచ మూల తత్వములు సర్వం చుట్టు పరివేష్టించి ఉన్న వాడు. తన స్వరూపంతో స్వయంగా కోటి సూర్యుల ప్రకాశంతో వెలిగిపోతున్నవాడు; తనకు తప్ప ఇతరులకు అందరాని స్వభావసిద్ధమైన సమస్తమైన ఐశ్వర్యాలతో అతిశయించి ఉన్నవాడు; సర్వేశ్వరుడు; పరమపురుషుడు; పురుషోత్తముడు; విఙ్ఞానమునందు వసించి ఉండువాడు కనుక నారాయణుడు అని పిలవబడువాడు { నారం విజ్ఞానం తదయ సమాశ్రయో యస్యసః నారాయణః, రిష్యతే క్షీయతే యితరః రిజ్క్షయే ధాతుః స నభవతీతి నరః అవినాశ్యాత్మాః (వ్యుత్పత్తి)}; అట్టి ఆ పద్మాక్షుని దర్శించిన బ్రహ్మదేవుని హృదయము పరమానందముతో తృప్తిచెందింది. ఆనందభాష్పాలు ధారలుకట్టి ప్రవహించుటచే చెక్కిళ్ళు తడసిపోయాయి.

2-239-క.
 • ఉపకరణాలు:
 •  
 •  
 •  

పరమహంస గమ్య
స్ఫుణం దనరారు పరమపురుషుని పదపం
రుహములకు నజుఁడు చతు
శ్శిములు సోఁకంగ నతులు సేసిన హరియున్.

టీకా:

వర = శ్రేష్ఠమైన; పరమహంస = యతీంద్రులకు {పరమహంస - హంస అను శ్వాసతో పరమమైన వాడు}; గమ్య = గమ్యముగ; స్ఫురణన్ = తెలియబడుతూ; తనరారు = ఒప్పుతుండు; పరమపురుషునిన్ = పరమపురుషుని {పరమపురుషుడు - ఉత్తమోత్తమ పురుషుడు, అన్నిటికి (పరమై) పైన ఉండు వాడు}; పద = పాదములు అను; పంకరుహములకున్ = పద్మములకు {పంకరుహములు - పంకము నందు పుట్టునవి, పద్మములు}; అజుఁడు = బ్రహ్మదేవుడు {అజుడు - (ఏ గర్భమందును) జన్మము లేనివాడు, బ్రహ్మదేవుడు}; చతుస్ = నాలుగు; శిరములున్ = తలలు; సోఁకంగన్ = తాకునట్లు; నతులున్ = నమస్కారములు; చేసినన్ = చేయగా; హరియున్ = విష్ణువు కూడ.

భావము:

అలా సాక్షాత్కరించిన ఆ పరమహంసలకు గమ్యస్థానమైన పరమపురుషుని పాదపద్మములకు స్వాయంభువుడైన చతుర్ముఖ బ్రహ్మ తన నాలుగు శిరస్సులు తాకునట్లుగ మ్రొక్కాడు. అంతట విష్ణుమూర్తి ప్రసన్నుడై.....