పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

ద్వితీయ స్కంధము : అవతారంబుల వైభవంబు

  •  
  •  
  •  

2-113-ఉ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

న్య కథానులాపము లర్నిశమున్ వినునట్టి సత్క్రియా
శూన్యములైన కర్ణముల సూరిజనస్తుత సర్వలోక స
మ్మాన్యమునై తనర్చు హరిమంగళదివ్యకథామృతంబు సౌ
న్యతఁ గ్రోలవయ్య బుధత్తమ! యే వివరించి చెప్పెదన్."
^25 అవతారాలు

టీకా:

అన్య = ఇతరుల; కథ = కథలు; అనులాపములున్ = మరల మరల చెప్తుంటే; అహర్ = పగళ్ళు; నిశమున్ = రాత్రుళ్ళును; వినున్ = వినుచుండే; అట్టి = అలాంటివారు; సత్క్రియా = మంచి పనులన్నవే; శూన్యములు = లేనట్టివి; ఐన = అయినట్టి; కర్ణములన్ = చెవులతో; సూరి = పండిత; జన = జనులచే; స్తుత = పొగడబడు వాడా; సర్వ = సమస్త; లోక = లోకములలోను; సమ్మాన్యమున్ = గౌరవింపబడునది; ఐ = అయి; తనర్చు = తరింపజేయు; హరి = హరి యొక్క; మంగళ = శుభకరమైన; దివ్య = దివ్యమైన; కథా = కథలు అను; అమృతంబున్ = అమృతమును; సౌజన్యతన్ = మంచితనము {సౌజన్యము - సుజనుల లక్షణము}; క్రోలు = త్రాగుము; అయ్య = నాయనా; బుధ = బుధులలో; సత్తమ = అత్యుత్తమ; యేన్ = నేను; వివరించి = సవివరముగ; చెప్పెదన్ = చెప్పుతాను.

భావము:

పగలురాత్రి ఎప్పుడైనా ఇతర కథాప్రసంగాలు వింటూ ఏ మాత్రం పుణ్యకథల చోరనీయని వీనులకు విష్ణుకథలు విందుచేస్తాయి. సకల లోకపూజనీయమై వెలుగొందే ఆ దేవదేవుని దివ్యమంగళ కథాసుధారసాన్ని నేను నీకు అందిస్తాను. సద్బుద్ధితో ఆస్వాదించవయ్యా. విజ్ఞానశేఖరులకు ఆరాధనీయుడవైన నారదా!”

2-114-వ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

అని పలికి నారదుం జూచి మఱియు నిట్లనియె.

టీకా:

అని = అని; పలికి = చెప్పి; నారదున్ = నారదుని; చూచి = చూసి; మఱియున్ = మరల; ఇట్లు = ఈ విధముగ; అనియెన్ = పలికెను.

భావము:

ఈ విధంగా పలికి, నారదునితో బ్రహ్మ మళ్లీ ఇలా చెప్పసాగాడు.

2-115-మ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

"కాక్షుండు భుజావిజృంభణమునన్ క్ష్మాచక్రముం జాపఁ జు
ట్టి మాడ్కిం గొనిపోవ, యజ్ఞమయ దంష్ట్రిస్వాకృతిం దాల్చి య
ద్దనుజాధీశ్వరుఁ దాఁకి యబ్ధి నడుమన్ దంష్ట్రాహతిం ద్రుంప ధా
త్రిని గూలెం గులిశాహతింబడు మహాద్రిం బోలి యత్యుగ్రతన్.

టీకా:

కనకాక్షుండున్ = హిరణ్యాక్షుడు {కనకాక్షుడు - హిరణ్యాక్షుడు - బంగారు కళ్ళు ఉన్న వాడు}; భుజా = భుజముల యొక్క; విజృంభణమునన్ = చెలరేగిన బలముతో; క్ష్మా = భూమి; చక్రమున్ = మండలమును; చాపన్ = చాపను; చుట్టిన = చుట్టిన; మాడ్కిన్ = విధముగ; కొని = పట్టుకొని; పోవన్ = పోగా; యఙ్ఞ = యఙ్ఞముల; మయన్ = మయమైన; దంష్ట్రి = కోరలపంది, అడవిపంది; స్వా = తన యొక్క; ఆకృతిన్ = ఆకారముగ; తాల్చి = ధరించి, అవతరించి; ఆ = ఆ; దనుజ = దానవుల; అధీశ్వరున్ = మహారాజును; తాఁకి = ఎదిరించి; అబ్ధి = సముద్రము; నడుమన్ = మధ్యలో; దంష్ట్రా = కోరల; హతిన్ = పోట్లతో; త్రుంపన్ = చీల్చిచెండాడగా; ధాత్రిన్ = భూమిపైన; కూలెన్ = కూలిపోయెను; కులిశా = వజ్రాయుధము; హతిన్ = దెబ్బకు; పడు = పడిపోవు; మహా = పెద్ద; అద్రిన్ = కొండ; పోలిన్ = వలె; అతి = మిక్కిలి; ఉగ్రతన్ = భయంకరముగ.

భావము:

"పూర్వం హిరణ్యాక్షుడనే రాక్షసుడు బాహుబలాటోపంతో భూమండలాన్ని చాపచుట్టినట్లు చుట్టి తీసుకుపోయాడు. అప్పుడు శ్రీమన్నారాయణుడు యజ్ఞవరహరూపం ధరించి, ఆ దానవరాజుతో దారుణమైన యుద్ధం చేసాడు. అపార పారావారం నడుమ కోరలతో క్రుమ్మి ఆ రక్కసుడి ఉక్కడగించాడు. వజ్రాయుధం వ్రేటుకు నేలగూలే మహాపర్వతం లాగా వాడు అతిభీకరాకారంతో మట్టిలో కలిసాడు. ఇది యజ్ఞవరాహావరతార కథ.

2-116-వ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

మఱియు సుయజ్ఞావతారంబు విను" మని యిట్లనియె.

టీకా:

మఱియున్ = ఇంక; సుయఙ్ఞ = సుయఙ్ఞుని; అవతారంబున్ = అవతరించుటను; వినుము = వినుము; అని = అని చెప్పి; ఇట్లు = ఈ విధముగ; అనియెన్ = పలికెను.

భావము:

ఇక సుయజ్ఞావతారం ఎలా జరిగిందో చెబుతాను విను” మని నారదునితో బ్రహ్మ మళ్లీ ఇలా వివరించాడు.

2-117-సీ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

"ప్రకట రుచిప్రజాతికిని స్వాయంభు-
వుని కూఁతు రాకూతి ను లతాంగి
ర్థి జన్మించి సుజ్ఞుండు నానొప్పు-
తఁడు దక్షిణ యను తివయందు
సుయమ నా మామరస్తోమంబుఁ బుట్టించి-
యింద్రుఁడై వెలసి యుపేంద్ర లీల
ఖిల లోకంబుల యార్తి హరించిన-
తని మాతామహుండైన మనువు

2-117.1-తే.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

న మనంబునఁ దచ్చరిత్రమున కలరి
రమపుణ్యుండు హరి యని లికెఁ గాన
నంచితజ్ఞాననిధి యై సుజ్ఞుఁ డెలమిఁ
దాపసోత్తమ! హరి యవతారమయ్యె."

టీకా:

ప్రకటన్ = ప్రసిద్ధమైన; రుచి = రుచి అను; ప్రజాపతి = ప్రజాపతి {ప్రజాపతి - ప్రజల ఉత్పత్తికి అధిపతి}; కిన్ = కిని; స్వాయంభువుని = స్వాయంభువ మనువు; కూఁతురున్ = కుమార్తె; ఆకూతి = ఆకూతి {ఆకూతి - ఆకూతములు కలది - మంచి తలంపులు కలది}; అను = అనే; లతాంగిన్ = స్త్రీ {లతాంగి - లతల వంటి సున్నిత దేహము కలది, స్త్రీ}; కిని = కిని; అర్థిన్ = కోరి; జన్మించి = పుట్టి; సుయఙ్ఞుండు = సుయఙ్ఞుడు; నాన్ = అని; ఒప్పున్ = ఒప్పుతున్న; అతఁడు = అతడు; దక్షిణ = దక్షిణ; అను = అనే; అతివన్ = స్త్రీ; అందున్ = అందు; సుయమ = సుయమ; నామ = పేరు కల; అమర = దేవతల; స్తోమంబున్ = సమూహమును; పుట్టించి = పుట్టించి; ఇంద్రుఁడు = ఇంద్రుడు; ఐ = అయ్యి; వెలసి = ప్రకాశించి; ఉపేంద్ర = విష్ణువు; లీలన్ = వలె; అఖిల = సమస్త; లోకంబులన్ = లోకముల; ఆర్తిన్ = దుఃఖమును; హరించినన్ = హరించివేయగా, పోగొట్టగ; అతని = అతని; మాతామహుండు = తల్లియొక్క తండ్రి, తాత; ఐన = అయినట్టి; మనువు = మనువు (స్వాయంభువుడు);
తన = తన; మనంబునన్ = మనస్సులో; తత్ = అతని; చరిత్రమున్ = నడవడిక; కున్ = కు; అలరి = సంతోషించి; పరమ = గొప్ప; పుణ్యుండు = పుణ్యాత్ముడు; హరి = హరి {హరి - దుఃఖములను హరింపజేయు వాడు - విష్ణువు}; అని = అని; పలికెన్ = పలికెను; కానన్ = అందుచేత; అంచిత = పూజనీయమైన; ఙ్ఞాన = ఙ్ఞానమునకు; నిధి = నిధి; ఐ = అయ్యి; సుయఙ్ఞుఁడు = సుయఙ్డు; ఎలమిన్ = ప్రసిద్దముగ; తాపస = తాపసులలో; ఉత్తమ = ఉత్తముడ; హరి = భగవంతుని {హరి - దుఃఖములను హరింపజేయు వాడు - విష్ణువు}; అవతారము = అవతారము; అయ్యెన్ = అయ్యెను.

భావము:

పూర్వం రుచి అనే ప్రజాపతికి, స్వాయంభువ మనువు కూతురైన ఆకూతి అనే సుగుణవతికి సుయజ్ఞుడు అనేవాడు పుట్టాడు. అతడు దక్షిణ అనే కాంతను భార్యగా స్వీకరించాడు. ఆమె కడుపున సుయములు అను పేరుగల వేల్పులను జన్మింపజేశాడు. ఇంద్రుడై దేవతలకు నాయకత్వం వహించాడు. విష్ణువులాగా సమస్తలోకాల దుఃఖాన్నీ పరిహరింప జేశాడు. తాత అయిన స్వాయంభువ మనువు తన మనుమని చరిత్రకు మనసులో ఎంతో సంతోషించి ఈ పరమ పవిత్రుడు శ్రీహరియే అని పలికాడు. మునీంద్రా ఆ కారణంవల్ల ఉత్తమ జ్ఞానానికి నిధియైన సుయజ్ఞుడు హరి అవతారంగా ప్రశస్తి వహించాడు.”

2-118-వ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

అని చెప్పి సాంఖ్యయోగ ప్రవర్తకాచార్యవర్యుం డగు కపిలుని యవతారంబు విను"మని యిట్లనియె.

టీకా:

అని = అని; చెప్పి = చెప్పి; సాంఖ్య = సాంఖ్యము అను; యోగ = యోగమున; ప్రవర్తక = ప్రవర్తకము చేసిన; ఆచార్య = గురువులలో; వర్యుండు = గొప్పవాడు; అగు = అయిన; కపిలునిన్ = కపిలును; అవతారంబున్ = అవతారమును; వినుము = వినుము; అని = చెప్పి; ఇట్లు = ఈ విధముగ; అనియెన్ = పలికెను.

భావము:

ఇలా సుయజ్ఞావతారం గురించి చెప్పి బ్రహ్మదేవుడు, షడ్దర్శనాలలో ఒకటైన సాంఖ్య యోగం ప్రవర్తింపజేసిన కపిలమహర్షి అవతారగాథను ఆలకించ” మంటు ఇలా అన్నాడు.

2-119-చ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

"ధృమతి దేవహూతికిని దివ్యవిభుండగు కర్దమప్రజా
తికిఁ బ్రమోద మొప్ప నవభామలతోఁ గపిలాఖ్యఁ బుట్టి యే
తి హరి పొందునట్టి సుభగంబగు సాంఖ్యము దల్లి కిచ్చి దు
ష్కృములువాపి చూపె మునిసేవితమై తనరారు మోక్షమున్.

టీకా:

ధృతమతిన్ = బుద్ధిశాలి {ధృతమతి - ధరించిన బుద్ధి కలది}; దేవహూతి = దేవహూతి; కిన్ = కిని; దివ్య = దివ్యమైన; విభుండు = ప్రభువు; అగు = అయిన; కర్దమ = కర్దమ; ప్రజాపతి = ప్రజాపతి {ప్రజాపతి - ప్రజల ఉత్పత్తికి పతి}; కిన్ = కిని; ప్రమోదము = సంతోషము; ఒప్పన్ = అగునట్లు; నవ = తొమ్మిది మంది, ఉదయిస్తున్న; భామలన్ = ఆడపిల్లలు, సూర్యకిరణకాంతి; తోన్ = తో; కపిల = కపిలుడు; ఆఖ్య = అను పేరుతో; పుట్టి = జనించి; ఏ = ఏ; గతిన్ = విధముగనైతే; హరిన్ = హరిని; పొందున్ = పొందగలమో; అట్టి = అటువంటి; సుభగంబు = శ్రీకరము; అగు = అయిన; సాంఖ్యమున్ = సాంఖ్యమును {సాంఖ్యము - సాంఖ్యాశాస్త్రము}; తల్లి = మాత; కిన్ = కి; ఇచ్చి = ఇచ్చి; దుష్కృతములున్ = పాపములు; పాపి = రూపుమాపి (పాయం జేసి); చూపెన్ = చూపెను; ముని = మునులచే; సేవితము = సేవింపబడునది; ఐ = అయి; తనరారు = ప్రకాశించు; మోక్షమున్ = మోక్షమును.

భావము:

“దేవహూతి నిశ్చలమతి అయిన సతి. దివ్యతేజస్వి యైన కర్దమ ప్రజాపతి ఆమె పతి. ఆ దంపతులకు ఆనందం అతిశయింపగా తొమ్మండుగురు ఆడు తోబుట్టువులతో సహా శ్రీహరి కపిలుడు అన్న పేరుతో ఆవిర్భవించాడు. ఏ యోగంతో నారాయణుని పొందటానికి వీలవుతుందో, ఆ మనోజ్ఞమైన సాంఖ్యయోగాన్ని ఆ మహనీయుడు తల్లికి బోధించాడు. ఆ విధంగా ఆమె పాపాలు రూపుమాపి మునులు అపేక్షించే మోక్షాన్ని ఆమెకు ప్రసాదించాడు.”

2-120-వ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

మఱియు దత్తాత్రేయావతారంబు వినుము

టీకా:

మఱియున్ = ఇంకను; దత్తాత్రేయ = దత్తాత్రేయ; అవతారంబున్ = అవతారమును; వినుము = వినుము.

భావము:

ఇక దత్తాత్రేయుని అవతారం ఎలా విలసిల్లిందో వివరిస్తాను విను.

2-121-సీ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

తాపసోత్తముఁ డత్రి నయునిఁ గోరి ర-
మేశు వేఁడిన హరి యేను నీకు
నఘ దత్తుడనైతి ని పల్కు కతమున-
తఁడు దత్తాత్రేయుఁడై జనించె
మ్మహాత్ముని చరణాబ్జ పరాగ సం-
దోహంబుచేఁ బూతదేహు లగుచు
హైహయ యదు వంశ్యు లైహికాముష్మిక-
లరూప మగు యోగలము వడసి

2-121.1-తే.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

సంచితజ్ఞానఫల సుఖైశ్వర్య శక్తి
శౌర్యములఁ బొంది తమ కీర్తి దల వెలుఁగ
నిందు నందును వాసికి నెక్కి; రట్టి
దివ్యతర మూర్తి విష్ణు నుతింపఁ దరమె?

టీకా:

తాపస = తాపసులలో; ఉత్తముఁడు = ఉత్తముడు; అత్రి = అత్రి; తనయునిన్ = కుమారుని; కోరి = కావలెనని; రమేశున్ = విష్ణుని {రమేశు - రమ (లక్ష్మి) యొక్క భర్త - హరి}; వేఁడినన్ = ప్రార్థించగ; హరి = విష్ణువు {హరి - దుఃఖములను హరించువాడు - భగవంతుడు}; ఏను = నేను; నీకున్ = నీకు; అనఘ = పాపములు చేయనివాడా; దత్తుడన్ = దానము చేయబడిన వాడిని; ఐతిన్ = అయితిని; అని = అని; పల్కు = పలికిన; కతమున = కారణమున; అతఁడు = అతడు; దత్తాత్రేయుఁడు = దత్తాత్రేయుడు; ఐ = అయ్యి; జనించెన్ = పుట్టెను; ఆ = ఆ; మహాత్మునిన్ = మహాత్ముని; చరణ = పాదములు అను; అబ్జ = పద్మముల; పరాగ = పుప్పొడి రేణువుల; సందోహంబున్ = సమూహము; చేన్ = చేత; పూతన్ = పవిత్రమైన; దేహులు = దేహము కలవారు; అగుచున్ = అగుచు; హైహయ = హైహయ; యదు = యదు; వంశులు = వంశస్తులు; ఐహిక = ఇహలోక; ఆముష్మిక = పరలోక; ఫల = ఫలిత; రూపమున్ = రూపము; అగు = అయినట్టి; యోగ = యోగము వలని; బలమున్ = శక్తి; వడసి = పొంది;
సంచిత = కూడబెట్టిన, పోగుపడ్డ; ఙ్ఞాన = ఙ్ఞానము యొక్క; ఫల = ఫలితము; సుఖ = సుఖము; ఐశ్వర్య = ఐశ్వర్యము; శక్తి = బలము; శౌర్యము = శౌర్యము; పొంది = పొంది; తమ = తమ; కీర్తి = పేరప్రతిష్టలు; చదలన్ = దిక్కుల; వెలుఁగన్ = ప్రకాశించగ; ఇందున్ = ఇహలోకమున; అందున్ = పరలోకమున; వాసికిన్ = ప్రసిద్ధికిని; ఎక్కిరి = పొందిరి; అట్టి = అటువంటి; దివ్యతర = మిక్కిలి దివ్యమైన {దివ్యము - దివ్యతరము - దివ్యతమము}; మూర్తిన్ = రూపుడైన; విష్ణున్ = భగవంతుని; నుతింపన్ = స్తుతించుట; తరమె = తరమా ఏమి.

భావము:

“అత్రిమహర్షి మునులలో ముఖ్యుడు. ఆయన తనకు పుత్రుణ్ణి ప్రసాదించమని లక్ష్మీనాథుణ్ణి ప్రార్థించాడు. అప్పుడు శ్రీహరి “పాపరహితుడవైన ఓ మునీంద్రా! నేను నీకు దత్తుడ నయ్యాను” అని అన్నాడు. అందువల్ల హరియే అత్రికి దత్తాత్రేయుడై జన్మించాడు. ఆ మహనీయుని పాదపద్మపరాగం సోకి హైహయవంశానికీ, యదువంశానికీ చెందిన వారందరు పవిత్ర దేహు లయ్యారు. ఆయన అనుగ్రహంవల్లనే వాళ్లు ఇహపరలోకాలు ప్రసాదించే యోగబలం ఆర్జించుకొన్నారు. జ్ఞాన ఫలాన్ని, సుఖాన్ని, ఐశ్వర్యాన్ని, శక్తిని, శౌర్యాన్ని పొందారు. తమ కీర్తి మింట వెలుగొందుతుండగ ఉభయలోకాలలో ప్రసిద్ధి వహించారు. అలాంటి దివ్యరూపుడైన విష్ణుదేవుని వినుతించడం సాధ్యమా.

2-122-వ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

వెండియు సనకాద్యవతారంబు వినుము

టీకా:

వెండియున్ = మరియును; సనక = సనకుడు; ఆది = మొదలగువారి; అవతారంబున్ = అవతారమును; వినుము = వినుము.

భావము:

ఇంక సనకాదుల అవతార ప్రకారం ఆకర్ణించు.

2-123-సీ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

నఘాత్మ! యేను గల్పాదిని విశ్వంబు-
సృజియింపఁ దలఁచి యంచిత తపంబు
ర్థిఁ జేయుచు సన ని పల్కుటయు నది-
కారణంబుగ సనాఖ్యలనుగల స
నందన సనక సత్కుమార సనత్సు-
జాతులు నల్వురు సంభవించి
మానసపుత్రులై హి నుతికెక్కిరి-
పోయిన కల్పాంతమున నశించి

2-123.1-తే.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

ట్టి యాత్మీయతత్త్వంబు వుట్టఁ జేసి
సంప్రదాయక భంగిని గతి నెల్ల
లుగఁ జేసిరి యవ్విష్ణుళలఁ దనరి
లువు రయ్యును నొక్కఁడ యచరిత్ర!

టీకా:

అనఘాత్మ = పుణ్యాత్ముడా; ఏను = నేను; కల్ప = కల్పమునకు; ఆదిని = మొదట్లో; విశ్వంబున్ = ప్రపంచమును; సృజియింపన్ = సృష్టింపను; తలఁచి = వలయుననుకొని; అంచిత = చక్కని; తపంబున్ = తపస్సుని; అర్థిఁన్ = కోరి; చేయుచు = చేస్తూ; సన = సన; అని = అని; పల్కుటయున్ = ఉచ్చరింటయును; అది = దాని; కారణంబుగన్ = వలన; సన = సన; ఆఖ్యలను = పేర్లను; కల = కలిగి; సనందన = సనందన; సనక = సనకుడు; సనత్కుమార = సనత్కుమారుడు; సనత్సుజాతులు = సనత్సుజాతుడు అను; నల్వురు = నలుగురు; సంభవించు = జన్మించి; మానస = మనసున స్వీకరించిన; పుత్రులు = కుమారులు; ఐ = అయ్యి; మహిన్ = భూమిపై; నుతికి = వినుతికి; ఎక్కిరి = ఎక్కిరి; పోయిన = కిందటి; కల్పాంతమునన్ = కల్పాంతము; నశించి = నశించిపోయిన; అట్టి = అటులంటి;
ఆత్మీయ = ఆత్మ కు సంభందించిన; తత్త్వంబున్ = తత్త్వమును; పుట్టన్ = పుట్టునట్లు, పునరుజ్జీవితము; చేసి = చేసి; సాంప్రదాయక = ఒక సంప్రదాయ పరంపరల; భంగిన్ = పద్ధతిని; జగతిన్ = ప్రపంచము; ఎల్లన్ = అంతయను; కలుగఁన్ = వ్యాపింప; చేసిరి = చేసిరి; ఆ = ఆ; విష్ణు = విష్ణుని; కళలఁన్ = అంశలతో; తనరి = ప్రసిద్ధులై; నలువురు = నలుగురు; అయ్యును = అయినప్పటికిని; ఒక్కఁడన్ = ఒక్కడే అన్నట్లు; నయ = మంచి; చరిత్ర = చరిత్ర కల వాడ.

భావము:

పవిత్రాత్మ! నారద! నేను కల్పారంభంలో విశ్వాన్ని సృష్టింపదలచు కొన్నాను. అందుకై తపస్సు చేస్తూ “సన” అని పలికాను . అందువల్ల సన పేరుతో “సనకుడు, సనందుడు, సనత్కుమారుడు, సనత్సుజాతుడు” అనే నలుగుర పుట్టారు. వాళ్లు బ్రహ్మమానసపుత్రులుగా ప్రపంచంలో ప్రసిద్ధికెక్కారు. గతించిన కల్పం చివర అంతరించిపోయిన ఆత్మ తత్త్వాన్ని వాళ్లు మళ్లీ లోకంలో సంప్రదాయానుసారంగా ప్రవర్తింపజేశారు. నయశీలుడ! ఆ విష్ణుదేవుని కళలతో జన్మించిన వాళ్లు నలుగురైన నిజానికి వారి అవతారం ఒక్కటే.