పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

ద్వితీయ స్కంధము : ఉపోద్ఘాతము

 •  
 •  
 •  

2-1-క.
 • ఉపకరణాలు:
 •  
 •  
 •  

^

శ్రీద్భక్త చకోరక
సో! వివేకాభిరామ! సురవినుత గుణ
స్తో! నిరలంకృతాసుర
రామా సీమంతసీమ! రాఘవరామా!

టీకా:

శ్రీమత్ = గొప్పవారైన; భక్త = భక్తులు అను; చకోరక = చకోరపక్షులకు; సోమ = చంద్రుడా; వివేక = వివేకమువలన; అభిరామ = సుందరమైనవాడా; సుర = దేవతలచే; వినుత = పొగడబడుచున్న; గుణ = గుణముల; స్తోమ = సమూహముగలవాడా; నిరలంకృత = నష్టమైన అలంకారములు గల; అసుర = రాక్షస; రామా = స్త్రీల; సీమంత = పాపిటలు; సీమ = ప్రాంతము కలగజేసినవాడా; రాఘవ = రఘువంశమున జన్మించిన; రామా = రాముడా.

భావము:

భక్తులు అనెడి చకోరక పక్షులకు చంద్రుని వంటివాడా! వివేకముతో విలసిల్లు వాడా! దేవతలచేత పొగడబడిన సుగుణములు గలవాడా! (రాక్షసులను సంహరించి) రాక్షస స్త్రీల పాపిట సింధూరాలంకరణలు తొలగించిన వాడ! రఘు వంశోద్భవుడవైన శ్రీరామచంద్రప్రభూ! అవధరింపుము.

2-2-వ.
 • ఉపకరణాలు:
 •  
 •  
 •  

మహనీయ గుణగరిష్ఠులగు నమ్ముని శ్రేష్ఠులకు నిఖిల పురాణ వ్యాఖ్యాన వైఖరీ సమేతుండైన సూతుం డిట్లనియె; "నట్లు పరీక్షిన్నరేంద్రునకు శుకయోగీంద్రుం డిట్లనియె.

టీకా:

మహనీయ = గొప్ప; గుణ = గుణములగలవారిలో; గరిష్ఠులు = ఉత్తములు; అగు = అయినట్టి; ఆ = ఆ; ముని = యోగులలో; శ్రేష్ఠులు = గొప్పవారల, శౌనకుల; కున్ = కు; నిఖిల = సమస్తమైన; పురాణ = పురాణములను; వ్యాఖ్యాన = సవివరముగ చెప్పు; వైఖరీ = నేర్పు; సమేతుండు = కలిగినవాడు; ఐన = అయినట్టి; సూతుండు = సూతుడు; ఇట్లు = ఈ విధముగ; అనియెన్ = పలికెను; అట్లు = ఆ విధముగ; పరీక్షిత్ = పరీక్షత్తు అను; నరేంద్రుడు = మహారాజు {నరేంద్రుడు - నరులకు ప్రభువు, రాజు}; కున్ = కి; శుక = శుకుడు అను; యోగి = యోగులలో; ఇంద్రుడు = శ్రేష్ఠుడు; ఇట్లు = ఈ విధముగ; అనియెన్ = పలికెను.

భావము:

ఉన్నత గుణశీలురులలో అగ్రేసరులైన ఆ శౌనకాది మునీశ్వరులను చూసి సమస్త పురాణాల ప్రవచనోత్తముడైన సూతమహర్షి ఈ విధంగా చెప్పసాగాడు. “ఆ విధంగా ప్రాయోపవేశం చేసిన పరీక్షిన్మహారాజుతో శుక మహర్షి ఈ విధంగా చెప్పాడు.