పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

భూమిక : ద్వితీయ స్కంధం

ఓం శ్రీరామ

పోతన తెలుగు భాగవతం

: : చదువుకుందాం భాగవతం; బాగుపడదాం మనం అందరం : :

రచన

భాగవత రచనకు ప్రేరకులు నారదమునీశ్వరులు.
భాగవతానికి మూల కర్త వ్యాసభగవానులు.
తెలుగు సేతకు ప్రేరకులు శ్రీరామచంద్రులు.
తెలుగు ప్రణీతము బమ్మెర పోతనామాత్యులు.

మహాపురాణనికి సంస్కృత మూలకర్త వ్యాసభట్టారకులు. వీరు వేదాలను విభాగించారు, మహాభారతాన్ని మరియు సమస్తమైన పురాణాలు ఆ మహానుభావుడే రచించారు. వాటిలో ఉత్కృష్టమైనది శ్రీమద్భాగవతం. వీరి జీవిత కాలాన్ని నిర్ణయించడం కష్టం. 5000 సంవత్సరాల కంటెను ముందటి వారు అన్నది నిర్వివాదాంశం. అట్టి శ్రీమద్భాగవత మహాపురాణం భగవంతుని, భాగవతుల గురించి చెప్తుంది. సద్యోముక్తి సాధన మిది. పన్నెండు స్కంధాలుగా అనుగ్రహింప బడిన ఈ మహామహితాత్మకమైన గ్రంధంలోని ద్వితీయ స్కంధం యిది. మన పోతన్న గారి మధురాతి మధుర ప్రణీతము.

శ్రీమద్భాగవతాన్ని మన పోతన్నగారు ఆంధ్రీకరించిన శైలి ఆబాలగోపాలానికి, పండిత పామరు లందరికి చవులూరించే టంత మధురాతి మధురం. ఆ మహానుభావుడు మహేశ్వరుని ధ్యానిస్తు గంగ ఒడ్డున కూర్చుని ఉండగా. శ్రీరాముడు దర్శనమిచ్చి భాగవతమును తెనిగించ మన్నాడట. షష్ఠ్యంతాలలో శ్రీకృష్ణునికి అంకింతంగా పూనుకొన్నాడట. మరి శంకరునిలా శుభకరం, రాముని మాటలా తిరుగులేని అండ నిస్తూ, మధురాధిపతిలా మధురంగా ఉంటూ, ఆధ్యాత్మిక సాఫల్యాన్ని అందించేది కాకుండా ఎలా పోతుంది. ఇక్కడి తత్వం హరిహరాది అబేధం, అధ్వైత మూలం. ఎంతటి నిష్టాగరిష్ఠుడు మన పోతన అంటే రాజదండన కైనా వెరువక సాగే ధీరుడు. హలం కలం ఆత్మాభిమానం వదలని త్రివిక్రముడు. లోకంలో ఈ విషయంలో ఒక కథ ప్రచారంలో ఉంది సత్యాసత్యాలు పక్కనపెట్టి చూస్తే, ఒకసారి తన బావమరిది, శ్రీనాధకవి వచ్చి భాగవతాన్ని రాజుకి అంకిత మిమ్మని ఒత్తిడి చేస్తున్న సందర్భంలో పొలంనించి అప్పుడే వచ్చిన పోతన్నగారు ద్వైధీభావం చెందబోయారుట. అంతలో వాణి కన్నీరు కార్చుతు కనిపించింది. అప్పుడు ఇలా సమాధానపరచారట మహానుభావుడు:

కాటుక కంటి నీరు చనుట్టు పయింబడ నేల యేడ్చెదో
కైభదైత్యమర్దనుని గాదిలి కోడల! యో మదంబ! యో
హాకగర్భురాణి! నిను నాకటికిం గొనిపోయి యల్ల క
ర్ణా కిరాట కీచకుల మ్మ త్రిశుద్ధిగ నమ్ము భారతీ!

ద్వితీయ స్కంధము

స్కంధంలో మోక్ష మార్గమును, భక్తిమార్గ ప్రాధాన్యత, శ్రీహరి లీలావతారాల వర్ణన, ప్రపంచోద్భవాది సంప్రశ్నంబు వివరించబడ్డాయి. మరొక చోట తనకు ముహుర్తమాత్రమే ఆయుశ్శేషం ఉందని తెలిసిన ఖట్వాంగ మహర్షి వైరాగ్యం ఎంతో చక్కటి పద్యంలో వర్ణించారు.

గిరులంబోలెడి కరులను,
హరులం, దన ప్రాణదయితలై మనియెడి సుం
దరులను, హితవరులను, బుధ
వరులను వర్జించి గాఢవైరాగ్యమునన్.

నిరుత్తరుండు గాక సదుత్తరప్రదాన కుతూహలుండైన లోకోత్తర గుణోత్తరుండైన తాపసోత్తముని ప్రార్థన

తపములఁ జేసియైన, మఱి దానము లెన్నియుఁ జేసియైన, నే
జపములఁ జేసియైన ఫలసంచయ మెవ్వనిఁ జేర్పకున్న హే
యపదములై దురంతవిపదంచితరీతిగ నొప్పుచుండు న
య్యపరిమితున్ భజించెద నఘౌఘనివర్తను భద్రకీర్తనున్.

వృత్తాల వారీ పద్యాల లెక్క

పద్యగద్యలు = 288 +తేసీతో 36 +ఆసీతో 11; మొత్తం = 335

పద్యం ఛందోప్రక్రియ = ద్వితీయ స్కంధ సంఖ్యమొత్తం = 335వచనం. = 82కంద పద్యం. = 68సీస పద్యం. = 47తేటగీతి సీసంతో. = 36మత్తేభం. = 41చంపకమాల. = 19ఉత్పలమాల. = 10ఆటవెలది. = 6తేటగీతి. = 5శార్దూలం. = 7ఆటవెలది సీసంతో. = 11తరలం. = 1గద్యం. = 1మాలిని. = 1


లాంటి అద్భుతమైన రచనాశైలి, వస్తువు గలదీ అయిన ద్వితీయ స్కంధమును ఆస్వాదిద్దాం రండి. అంతే కాదు విష్ణువు అంటే వ్యాపకశీలుడు. ఆ విష్ణు మాయా వ్యాపక తత్వాన్ని దర్శించేది ద్వితీయ స్కంధం అంటారు.

సంకలన కర్త

లపల్లి వంశంలో తల్లి వెంకటరత్నంగారు తండ్రి అచ్యుత రామయ్య గారు లకు కీ.శ. 1949లో జన్మించాను. నన్ను సాంబశివరావు అంటారు. ఎలక్ట్రికలు ఇంజనీరుగా ఎమ్.ఇ.ఎస్., రాష్ట్ర విద్యుత్ సంస్థలలో పనిచేసాను. 2007లో పదవీవిరమణానంతరం ఈ భాగవత కార్యక్రమం, గణనాధ్యాయం అని భావగ్రహణం (conceptualisation) చేసికొని, ఆ ప్రయత్నంలో భాగంగా ఈ తెలుగు భాగవతం యూనీకోడీకరించాను.

కృతఙ్ఞతలు

కృషికి ఉపయోగపడిన వివిధ పుస్తకముల రచయితలకు, ప్రచురణకర్తలకు, సహకరించిన ప్రోత్సాహించిన మిత్రులకు, ఇతర వ్యక్తులకు, అంతర్జాల సంస్థలకు. మా తెలుగుభాగవతం అంతర్జాల జాలగూడు ఆదులను నిర్మించుట నిర్వహించుట, ప్రతి పద్యగద్యకు గాత్ర ప్రదానం మున్నగు పనులకు తమ అమూల్యమైన సమయాన్ని కేటాయించిన వారికి, అంతులేని సహకారం అందించిన కుటుంబ సభ్యులకు అందరికీ పేరుపేరునా కృతఙ్ఞతలు.

ఊలపల్లి సాంబశివ రావు, భాగవత గణనాధ్యాయి.
తెలుగుభాగవతం.ఆర్గ్

: : చదువుకుందాం భాగవతం; బాగుపడదాం మనం అందరం : :

ఓం నమో భగవతే వాసుదేవాయ
ఓం. ఓం. ఓం
ఓం శాంతి. శాంతి. శాంతిః
సర్వే జనాః సుఖినో భవంతు.
- x - - x - - x -