పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

ద్వాదశ స్కంధము : ఉపోద్ఘాతము

 •  
 •  
 •  

12-1-క.
 • ఉపకరణాలు:
 •  
 •  
 •  

SitraRamulu - ^

శ్రీ రుదశనపతిశయన!
కామితమునిరాజయోగిల్పద్రుమ! యు
ద్దా! ఘనజనకవరనృప
జామాతృవరేశ! రామచంద్రమహీశా!

టీకా:

శ్రీ = శోభనకరమైన; మరుదశనపతిశయన = రామ {మరు దశన పతి శయనుడు -మరుత్ (గాలిని) అశన (భక్షణముచేసెడి వారి - సర్పముల) పతి (ప్రభువైన ఆదిశేషుని పైన) శయనుడు (పరుండువాడు), విష్ణువు}; కామితమునిరాజయోగికల్పద్రుమ = రామ {కామిత ముని రాజ యోగి కల్పద్రుముడు - కామిత (కోరి ఆశ్రయించిన) ముని (ఋషులకు) రాజ (రాజులకు) యోగి (యోగులకు) కల్పద్రుముడు (కల్పవృక్షము వంటివాడు), విష్ణువు}; ఉద్దామ = రామ {ఉద్దాముడు - స్వతంత్రుడు, విష్ణువు}; ఘనజనకవరనృప = రామ {ఘన జనక వరనృప జామాతృ వరేశుడు - ఘన (గొప్ప) జనకవరనృప (జనకమహారాజు యొక్క) జామాతృ (అల్లుళ్ళలో) వరేశ (ఘనత వహించినవాడు), రాముడు}; రామచంద్రమహీశా = రామ {రామచంద్ర మహీశుడు - రామచంద్రుడనెడి మహీశుడు (భూమికి ప్రభువు, రాజు), రాముడు}.

భావము:

వాయుభక్షణంచేసే సర్పలకు అధిపతి అయిన ఆదిశేషునిపై శయనించేవాడా! కోరి ఆశ్రయించిన మునులకు, రాజులకు, యోగులకు కోరికలు తీర్చే కల్పవృక్షమా! మహోన్నతుడా! గొప్పవాడైన జనకమహారాజు అల్లుళ్ళలో కెల్లా మహా ప్రసిద్ధుడా! శ్రీరామచంద్రప్రభూ!

12-2-వ.
 • ఉపకరణాలు:
 •  
 •  
 •  

మహనీయగుణగరిష్ఠులగు నమ్మునిశ్రేష్ఠులకు నిఖిల పురాణవ్యాఖ్యాన వైఖరీ సమేతుండైన సూతుం డిట్లనియె "నట్లు పరీక్షిన్నరేంద్రునకు శుకయోగీంద్రుండు వాసుదేవ నిర్యాణ పర్యంతంబుఁ దజ్జన్మ కర్మంబులు సెప్పిన విని సంతసంబంది యన్నరపాలపుంగవుండు “మహాత్మా! నారాయణ కథా ప్రపంచంబును, దద్గుణంబులును, నాచారవిధియును, జీవాత్మభేదంబును, హరిపూజావిధానంబును, జ్ఞానయోగప్రకారంబు ననునవి మొదలైనవి యెఱింగించి విజ్ఞానవంతుగాఁ జేసి మన్నించితి; వింక భావి కార్యంబు లన్నియు నెఱింగింపు” మనిన శుకుండు రాజున కిట్లనియె.

టీకా:

మహనీయ = గొప్పవైన; గుణ = గుణములుకల; గరిష్ఠులు = గొప్పవారి; అగు = ఐన; ఆ = ఆ ప్రసిద్ధులైన; ముని = మునులలో; శ్రేష్ఠుల్ = ఉత్తముల; కున్ = కు; నిఖిల = సర్వ; పురాణ = పురాణములను; వ్యాఖ్యాన = వివరించిచెప్పెడి; వైఖరీ = సామర్థ్యము; సమేతుండు = కలిగినవాడు; ఐన = అగు; సూతుండు = సూతుడు; ఇట్లు = ఈ విధముగ; అనియెన్ = పలికెను; అట్లు = ఆ విధముగ; పరీక్షిత్ = పరీక్షిత్తు అను; నరేంద్రున్ = మహారాజున {నరేంద్రుడు - నర (మానవులకు) ఇంద్రుడు (ప్రభువు), రాజు}; కున్ = కు; శుక = శుకుడు అను; యోగి = ఋషులలో; ఇంద్రుండు = శ్రేష్ఠుడు; వాసుదేవ = శ్రీకృష్ణుని {వాసుదేవుడు - వసుదేవుని పుత్రుడు, కృష్ణుడు}; నిర్యాణ = పరమపదించుట; పర్యంతంబున్ = వరకు; తత్ = అతని; జన్మ = జీవిత; కర్మంబులు = చరితములను; చెప్పినన్ = చెప్పగా; విని = విన్నవాడై; సంతసంబున్ = సంతోషమును; అంది = పొంది; ఆ = ఆ ప్రసిద్ధుడైన; నరపాల = రాజులలో; పుంగవుండు = శ్రేష్ఠుడు; మహాత్మా = గొప్పవాడా; నారాయణ = విష్ణుమూర్తి యొక్క; కథా = కథలను; ప్రపంచంబును = సర్వము; తత్ = అతని యొక్క; గుణంబులును = గొప్పగుణములను; ఆచార = ఆచారములను; విధియును = చేయవలసిన కర్మలను; జీవ = జీవునికి; ఆత్మ = ఆత్మకి; భేదంబును = వేరిమి వివరము; హరి = విష్ణు; పూజా = పూజించెడి; విధానంబును = పద్ధతి; ఙ్ఞానయోగ = ఙ్ఞానయోగము యొక్క; ప్రకారంబు = విధానము; అనునవి = అనెడివి; మొదలైనవి = ఇంకా ఇటువంటివానిని; యెఱింగించి = తెలియజెప్పి; విఙ్ఞానవంతున్ = విఙ్ఞానము కలవాడను; కాన్ = అగునట్లు; చేసి = చేసి; మన్నించితివి = ఆదరించితివి; ఇంక = ఇక; భావి = భవిష్యత్తులో జరగబోయెడి; కార్యంబులు = విషయములను; అన్నియున్ = సర్వము; ఎఱిగింపుము = తెలుపుము; అనినన్ = అని అడుగగా; శుకుండు = శుకుడు; రాజున్ = రాజున; కున్ = కు; ఇట్లు = ఈ విధముగ; అనియెన్ = చెప్పెను.

భావము:

మహనీయ గుణాలు కల ఆ మునీశ్వరులకు సకల పురాణాలను నేర్పుగా వివరించి చెప్పే సూతుడు ఇలా చెప్పసాగాడు. “పరీక్షన్మహారాజుకు శుకమహర్షి ఆ విధంగా శ్రీకృష్ణుడు అవతరించినప్పటి నుండి, అవతారం చాలించే వరకు జరిగిన జన్మకర్మలు అన్నీ చెప్పాడు. వాటిన శ్రద్ధాగా వినిన పరీక్షిత్తు సంతోషించి శుకుని ఇలా అడిగాడు. “మహాత్మా! శ్రీహరి కథలు అతని గుణగణాలు, ఆచారవిధులు, జీవాత్మ భేదాన్ని, హరిని పూజించే విధానాన్ని, ఇంకా ఇటువంటి వాటిని ఎన్నింటినో చెప్పి నాకు ఎంతో విజ్ఞానం కలిగించావు. ఆదరించావు. ఇంక భవిష్యత్తులో జరగబోయే వాటిని గూర్చి కూడ తెలియచెప్పు.” అంతట శుకమహర్షి ఇలా చెప్పసాగాడు.

12-3-క.
 • ఉపకరణాలు:
 •  
 •  
 •  

"నవర! యీ ప్రశ్నమునకు
రి సెప్పఁగ రాదు; నేను సామర్థ్యముచేఁ
రికించి నీకుఁ జెప్పదఁ
మొప్పఁగ భావికాలతులన్ వరుసన్.

టీకా:

నరవర = రాజా; ఈ = ఈయొక్క; ప్రశ్నమున్ = ప్రశ్న; కున్ = కు; సరి = సరిపడుసమాధానము; చెప్పగరాదు = చెప్పుటకు వీలుకాదు; నేను = నేను; సామర్థ్యము = నేర్పు; చేన్ = తో; పరికించి = దర్శించి; నీ = నీ; కున్ = కు; చెప్పెద = తెలిపెదను; కరము = బహు; ఒప్పగన్ = చక్కగానుండునట్లు; భావి = భవిష్యత్తు; కాల = కాలపు; గతులన్ = నడవడికలను; వరుసన్ = క్రమబద్దముగా.

భావము:

“ఓ రాజశ్రేష్ఠా! నీవు అడిగిన ఈ ప్రశ్నకు సమాధానం సరిగా చెప్పడం సాధ్యం కాదు. అయినా నేను నా నేర్పు అంతా వాడి, దర్శించి, భావికాల గతులను చక్కగా వరుసగా వెల్లడిస్తాను.