పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

ప్రథమ స్కంధము : ఏకవింశత్యవతారములు

 •  
 •  
 •  

1-63-వ.
 • ఉపకరణాలు:
 •  
 •  
 •  

అది సకలావతారంబులకు మొదలి గని యైన శ్రీమన్నారాయణ దేవుని విరాజమానం బయిన దివ్యరూపంబు; దానిం బరమ యోగీంద్రులు దర్శింతురు; అప్పరమేశ్వరు నాభీకమలంబువలన సృష్టికర్తలలోన శ్రేష్ఠుండైన బ్రహ్మ యుదయించె; నతని యవయవస్థానంబుల యందు లోకవిస్తారంబులు గల్పింపంబడియె; మొదల నద్దేవుండు కౌమారాఖ్య సర్గంబు నాశ్రయించి బ్రహ్మణ్యుండై దుశ్చరంబైన బ్రహ్మచర్యంబునఁ జరియించె; రెండవ మాఱు జగజ్జననంబుకొఱకు రసాతలగత యయిన భూమి నెత్తుచు యజ్ఞేశుండయి వరాహదేహంబుఁ దాల్చె; మూడవ తోయంబున నారదుం డను దేవర్షియై కర్మనిర్మోచకంబైన వైష్ణవతంత్రంబు సెప్పె; నాలవ పరి ధర్మభార్యా సర్గంబు నందు నరనారాయణాభిధానుం డై దుష్కరంబైన తపంబు సేసెఁ; బంచమావతారంబునం గపిలుం డను సిద్ధేశుం డయి యాసురి యను బ్రాహ్మణునకుఁ దత్త్వ గ్రామ నిర్ణయంబు గల సాంఖ్యంబు నుపదేశించె; నాఱవ శరీరంబున ననసూయాదేవి యందు నత్రిమహామునికిం గుమారుండై యలర్కునికిఁ బ్రహ్లాద ముఖ్యులకు నాత్మవిద్యఁ దెలిపె; నేడవ విగ్రహంబున నాకూతి యందు రుచికి జన్మించి,యజ్ఞుం డనఁ ప్రకాశమానుండై యామాది దేవతల తోడం గూడి, స్వాయంభువమన్వంతరంబు రక్షించె; అష్టమ మూర్తిని మేరుదేవి యందు నాభికి జన్మించి యురుక్రముం డనం బ్రసిద్ధుండై విద్వజ్జనులకుఁ బరమహంస మార్గంబుం బ్రకటించె; ఋషులచేతఁ గోరంబడి; తొమ్మిదవ జన్మంబునఁ బృథుచక్రవర్తియై భూమిని ధేనువుం జేసి సమస్త వస్తువులం బిదికె; చాక్షుష మన్వంతర సంప్లవంబున దశమం బైన మీనావతారంబు నొంది మహీరూపం బగు నావ నెక్కించి వైవస్వతమనువు నుద్ధరించె; సముద్ర మథన కాలంబునం బదునొకొండవ మాఱు కమఠాకృతిని మందరాచలంబుఁ దన పృష్ఠకర్పరంబున నేర్పరియై నిలిపె; ధన్వంతరి యను పండ్రెండవ తనువున సురాసుర మధ్యమాన క్షీరపాథోధి మధ్య భాగంబున నమృత కలశ హస్తుండై వెడలెఁ; బదమూఁడవది యయిన మోహినీ వేషంబున నసురుల మోహితులం జేసి సురల నమృతాహారులం గావించెఁ; బదునాలుగవది యైన నరసింహరూపంబునం గనకకశిపుని సంహరించెఁ; బదునేనవది యైన కపట వామనావతారంబున బలిని బదత్రయంబు యాచించి మూఁడులోకంబుల నాక్రమించెఁ; బదునాఱువది యైన భార్గవరామాకృతిని గుపితభావంబుఁ దాల్చి బ్రాహ్మణ ద్రోహు లయిన రాజుల నిరువదియొక్క మాఱు వధియించి భూమి నిఃక్షత్త్రంబు గావించె; బదునేడవది యైన వ్యాస గాత్రంబున నల్పమతు లయిన పురుషులం గరుణించి వేదవృక్షంబునకు శాఖ లేర్పఱచెఁ; బదునెనిమిదవ దైన రామాభిధానంబున దేవకార్యార్థంబు రాజత్వంబు నొంది సముద్రనిగ్రహాది పరాక్రమంబు లాచరించె; నేకోనవింశతి వింశతితమంబు లైన రామకృష్ణ రూపంబులచే యదువంశంబు నందు సంభవించి; విశ్వంభరా భారంబు నివారించె; నేకవింశతితమం బైన బుద్ధనామధేయంబునం గలియు గాద్యవసరంబున రాక్షస సమ్మోహనంబుకొఱకు మధ్యగయా ప్రదేశంబున జినసుతుండయి దేజరిల్లు; యుగసంధి యందు వసుంధరాధీశులు చోరప్రాయులై సంచరింప విష్ణుయశుం డను విప్రునికిఁ గల్కి యను పేర నుద్భవింపంగలం"డని; యిట్లనియె.
అవతారాలు

టీకా:

అది = అది (ఈవిధముగనుండే రూపము); సకల = అన్ని; అవతారంబులు = అవతారములు; కున్ = కు; మొదలిగని = మూలవిరాట్టు; ఐన = అయినటువంటి; శ్రీమన్నారాయణదేవుని = శ్రీమన్నారాయణుని {శ్రీమన్నారాయణదేవుడు - అత్యంత శుభకరమైన నారాయణు డగు దేవుడు}; విరాజమానంబు = విశేషముగ ప్రకాశించుచున్నది; అయిన = అయిన; దివ్య = దివ్యమైన; రూపంబు = రూపము; దానిన్ = దానిని; పరమ = గొప్ప; యోగి = యోగులలో; ఇంద్రులు = శ్రేష్ఠులు; దర్శింతురు = దర్శించెదరు; ఆ = ఆ యొక్క; పరమేశ్వరు = భగవంతుని; నాభీ = బొడ్డు; కమలంబు = కమలము; వలనన్ = నుండి; సృష్టికర్తల = సృష్టికర్త లందరి; లోనన్ = లోను; శ్రేష్ఠుండైన = ఆద్యుడైన; బ్రహ్మ = బ్రహ్మదేవుడు; ఉదయించె = పుట్టెను; అతని = అతని యొక్క; అవయవ = అవయవముల; స్థానంబులు = స్థానముల; అందున్ = లో; లోక = లోకముల యొక్క; విస్తారంబులు = విస్తరణలు; కల్పింప బడియెన్ = పుట్టింప బడినవి; మొదలన్ = మొదట(1); ఆ = ఆ యొక్క; దేవుండు = దేవుడు (ఆదినారాయణమూర్తి); కౌమార = కౌమార {కౌమారాఖ్యలు - సనకుడు, సనందనుడు, సనత్ కుమారుడు, సనత్ సుజాతుడు}; ఆఖ్య = అను పేరుగల; సర్గంబున్ = సృష్టి (సంఘము) నందు; ఆశ్రయించి = అవతరించి; బ్రహ్మణ్యుండు = బ్రాహ్మణ హితుడు; ఐ = అయి; దుశ్చరంబు = ఆచరించుటకు మిక్కిలి కష్టమైనది; ఐన = అయినటువంటి; బ్రహ్మచర్యంబునన్ = బ్రహ్మచర్యమున; చరియించె = నడిచెను; రెండవ = రెండవ(2); మాఱు = సారి; జగత్ = జగత్తులయొక్క; జననంబు = పుట్టుక; కొఱకున్ = కోసము; రసాతల = రసాతలమున; గత = ఇమిడినది; అయిన = అయిన; భూమిని = భూమండలమును; ఎత్తుచున్ = ఉద్దరిస్తూ; యజ్ఞేశుండు = యజ్ఞమునకు అధిపతి; అయి = అయి; వరాహ = వరాహ; దేహంబున్ = రూపమును; తాల్చెన్ = ధరించెను; మూడవ = మూడవ(3); తోయంబునన్ = సారి; నారదుండు = నారదుడు; అను = అను పేర; దేవర్షి = దేవలోకఋషి; ఐ = అయి; కర్మ = కర్మబంధాలను; నిర్మోచకంబు = విడిపించగలిగినవి; ఐన = అయిన; వైష్ణవ = విష్ణుమూర్తి ఆరాధనమనే; తంత్రంబు = తంత్రము, సిద్ధాంతమును; సెప్పెన్ = చెప్పెను; నాలవ = నాల్గవ(4); పరి = సారి; ధర్మ = ధర్ముడు; భార్యా = (అతని) భార్యల; సర్గంబునందు = సృష్టి యందు, కలయిక యందు; నరనారాయణ = నరనారాయణులనే; అభిధానుండు = పేర్లు గలవాడు; ఐ = అయి; దుష్కరంబైన = చేయుటకు మిక్కిలి కష్టమైన; తపంబు = తపస్సు; చేసెన్ = చేసెను; పంచమ = ఐదవ(5); అవతారంబునన్ = అవతారములో; కపిలుండు = కపిలుడు; అను = అనే; సిద్ధేశుండు = సిద్ధులలో శ్రేష్ఠుడు; అయి = అయి; ఆసురి = ఆసురి; అను = అను; బ్రాహ్మణు = బ్రాహ్మణున; కున్ = కు; తత్త్వ = తత్త్వముల {తత్త్వములు - ప్రకృతి మహత్తాదు లిరువదినాల్గు, (అ.) అష్టప్రకృతులు (భూమి, జలము, అగ్ని, వాయువు, ఆకాశము, మనస్సు, బుద్ధి, అహంకారము), వీనిలో చివరి మూడింటికి కారణమైన విక్షేపశక్తి, పంచ కర్మేంద్రియములు, పంచ జ్ఞానేంద్రియములు, పంచ విషయములు (శబ్దము, స్పర్శము, రూపము, రసము, గంధము), పాఠ్యంతరము, (ఆ.) పంచభూతములు, పంచ జ్ఞానేంద్రియములు, పంచ కర్మేంద్రియములు [చూ. పంచ ఇంద్రియములు], పంచప్రాణములు, చతుర్‌-అంతఃకరణములు, పాఠ్యంతరము, (ఇ) అష్టప్రకృతులు, షోడశ వికారములు}; గ్రామ = సమూహము యొక్క; నిర్ణయంబు = నిర్ణయము; కల = కలిగినటువంటి; సాంఖ్యంబున్ = సాంఖ్యమును {సాంఖ్యము - సాంఖ్యశాస్త్రము, తత్త్వదర్శనములలో నొకటి, బ్రహ్మజ్ఞానమును ఎంచి లెక్కించి తరచి తరచి చూసెడి మార్గమున అభ్యసించుట.}; ఉపదేశించెన్ = ఉపదేశించెను; ఆఱవ = ఆరవ(6); శరీరంబున = అవతారమున; అనసూయాదేవి = అనసూయాదేవి; అందున్ = వలన; అత్రిమహాముని = అత్రిమహాముని; కిన్ = కిని; కుమారుండు = పుత్రుడు; ఐ = అయి; అలర్కుని = అలర్కున; కిన్ = కును; ప్రహ్లాద = ప్రహ్లాద; ముఖ్యులు = మొదలగు ముఖ్యమైనవారల; కున్ = కు; ఆత్మవిద్యన్ = ఆత్మవిద్యను; తెలిపెన్ = తెలియజేసెను; ఏడవ = ఏడవ(7); విగ్రహంబునన్ = అవతారమున; ఆకూతి = ఆకూతి; అందున్ = కిని; రుచి = రుచి; కిన్ = కిని; జన్మించి = పుట్టి; యజ్ఞుండు = యజ్ఞుడు; అనన్ = అనబడుతూ; ప్రకాశమానుండు = అవతరించినవాడు; ఐ = అయి; యామ = యామ {యామ - కాలవిభాగమైన యామమును నిర్ణయించినవాడు, దేవతాయోని}; ఆది = మొదలైన; దేవతలన్ = దేవతలను; కూడి = కలిసి; స్వాయంభువ = స్వాయంభువు డనే; మన్వంతరంబున్ = మనువు కాలములో; రక్షించె = (సృష్టిని) రక్షించెను; అష్టమ = ఎనిమిదవ(8); మూర్తిని = అవతారమునందు; మేరుదేవి = మేరుదేవి; అందున్ = కిని; నాభి = నాభి; కిన్ = కిని; జన్మించి = పుట్టి; ఉరుక్రముండు = ఉరుక్రముండు; అనన్ = అని; ప్రసిద్ధుండు = ప్రసిద్ధి పొందినవాడు; ఐ = అయి; విద్వజ్జనులు = పాండిత్యముగలవారల; కున్ = కు; పరమహంస = పరమహంస {పరమహంస - 1.సర్వ పరిత్యాగము చేసి జ్ఞానమార్గమున చరించు సన్యాసి, ఆనందాత్మను నేను అని ఎరుక కలిగిన వాడు పరమహంస. (పరం ఆనందాత్మా అహం అస్మీతిహన్తి గచ్ఛతి జనాతీతి పరమహంసః - శబ్ద కల్పద్రువం). 2.యతులకు వాడేపదం.}; మార్గంబున్ = మార్గమును; ప్రకటించెన్ = ఉపదేశించెను; ఋషుల = ఋషుల; చేతన్ = చేత; కోరంబడి = ప్రార్థింపబడి; తొమ్మిదవ = తొమ్మిదవ(9); జన్మంబునన్ = జన్మలో; పృథు = పృథుడనే; చక్రవర్తి = సార్వభౌముడు; ఐ = అయి; భూమిని = భూమండలమును; ధేనువున్ = గోవుగా; చేసి = చేసి; సమస్త = సమస్తమైన; వస్తువులన్ = వస్తువులను; పిదికెన్ = పిదికెను; చాక్షుష = చాక్షుష అనే {చాక్షుషమన్వంతరము - చాక్షుషుడను మనువు కాలం కనుక చాక్షుషమన్వంతరము}; మన్వంతర = మన్వంతరంలో {మన్వంతరము - ఒక మనువు పాలించు కాలపరిమితి, డెబ్బైయొక్క మహాయుగములు}; సంప్లవంబునన్ = జలప్రళయమున; దశమంబు = పదవది(10); అయిన = అయినటువంటి; మీన = మీనముగా; అవతారంబు = అవతారమును; ఒంది = పొంది; మహీ = భూమియొక్క; రూపంబగు = రూపముగల; నావన్ = ఓడను; ఎక్కించి = ఎక్కించి; వైవస్వత = వైవస్వతుడనే; మనువున్ = మనువును; ఉద్ధరించెన్ = ఉద్ధరించెను; సముద్ర = సాగరము; మథన = మథించబడిన (చిలికే); కాలంబునన్ = కాలమున; పదునొకొండవ = పదుకొండవ(11); మాఱు = సారి; కమఠ = కూర్మ; ఆకృతిని = అవతారములో; మందరాచలంబున్ = మందరపర్వతమును; తన = తనయొక్క; పృష్ఠ = వీపుపైనుండే; కర్పరంబున = వెన్నుచిప్పమీద; నేర్పరి = నేర్పుగలవాడు; ఐ = అయి; నిలిపెన్ = నిలిపెను; ధన్వంతరి = ధన్వంతరి; అను = అను; పండ్రెండవ = పండ్రెండవ(12); తనువునన్ = అవతారములో; సుర = దేవతలచేతను; అసుర = రాక్షసులచేతను; మధ్యమాన = మధింపబడుచున్న; క్షీరపాథోధి = పాలసముద్రముయొక్క; మధ్యభాగంబునన్ = మధ్యభాగములో; అమృత = అమృతము నిండిన; కలశ = బిందె, కలశము; హస్తుండు = హస్తమున ధరియించినవాడు; ఐ = అయి; వెడలెన్ = ఉద్భవించెను; పదమూఁడవది = పదమాడవది(13); అయిన = అయినట్టి; మోహినీ = మోహినీ; వేషంబునన్ = అవతారములో; అసురుల = రాక్షసులను; మోహితులన్ = మోహితులుగా; చేసి = చేసి; సురలన్ = దేవతలను; అమృత = అమృతమును; ఆహారులన్ = భుజించినవారిగా; కావించెన్ = చేసెను; పదునాలుగవది = పద్నాలుగవది(14); ఐన = అయినట్టి; నరసింహ = నరసింహ; రూపంబునన్ = అవతారములో; కనకకశిపుని = హిరణ్యకశిపుని {హిరణ్యకశిపుడు - బంగారు వస్త్రము ధరించు వాడు}; సంహరించెన్ = రూపుమాపెను; పదునేనవది = పదిహేనవది(15); ఐన = అయినట్టి; కపట = మాయా; వామన = వామనుడు {వామనః పొట్టివానిగా (మఱుగుజ్జువానిగా) అవతరించిన విష్ణువు, చక్కగా సేవింపదగినవాడు, విష్ణుసహస్రనామములలో 152వ నామం}; అవతారంబునన్ = అవతారములో; బలినిన్ = బలి(చక్రవర్తి)ని; పద = అడుగులు; త్రయంబున్ = మూడు; యాచించి = దానముగా అడిగి; మూఁడు = మూడు; లోకంబులన్ = లోకములను; ఆక్రమించెన్ = ఆక్రమించెను; పదునాఱువది = పదహారవది(16); ఐన = అయినటువంటి; భార్గవరామ = పరశురామ {భార్గవరాముడు - భార్గవుని యొక్క రాముడు, భృగుమహర్షి వంశములో పుట్టిన రాముడు, పరశురాముడు}; ఆకృతినిన్ = అవతారములో; కుపితభావంబున్ = కోపాన్ని; తాల్చి = పొంది; బ్రాహ్మణ = బ్రాహ్మణులకు; ద్రోహులు = ద్రోహము చేసినవారు; అయిన = ఐనటువంటి; రాజులన్ = రాజులను; ఇరువదియొక్క = ఇరవై ఒక్క(21); మాఱు = సార్లు; వధియించి = సంహరించి; భూమిన్ = భూమిని; నిఃక్షత్త్రంబు = క్షత్రియులు లేనిస్థితి; కావించెన్ = కలుగ చేసెను; పదునేడవది = పదిహేడవది(17); ఐన = అయినట్టి; వ్యాస = వ్యాసుని; గాత్రంబునన్ = శరీరమున; అల్ప = మందమైన; మతులు = ప్రజ్ఞానము కలవారు; అయిన = అయినట్టి; పురుషులన్ = మానవులమీద; కరుణించి = దయచూపి; వేద = వేదమనే; వృక్షంబునకున్ = వృక్షమునకు; శాఖలు = శాఖలు {వేదమునకు శాఖలు - ఋక్ యజుస్ సామ అధర్వణ అని 4 శాఖలు}; ఏర్పఱచెన్ = ఏర్పాటుచేసెను; పదునెనిమిదవ = పద్దెనిమిదవది(18); ఐన = అయినట్టి; రామ = శ్రీరాముని; అభిధానంబునన్ = పేరుతో, అవతారముతో; దేవ = దేవతలయొక్క; కార్యార్థంబు = పనికొఱకు; రాజత్వంబున్ = రాజత్వమును {రాజత్వము - రాజు అను తత్వము, భావము}; ఒంది = స్వీకరించి; సముద్ర = సాగరమును; నిగ్రహ = నిగ్రహించుట; ఆది = మొదలైన; పరాక్రమంబులు = శౌర్యవంతము లైన పనులు; ఆచరించెన్ = చేసెను; ఏకోనవింశతి = పందొమ్మిదవది(19); వింశతితమంబు = ఇరువదవది(20); ఐన = అయినట్టి; రామ = బలరాముడు; కృష్ణ = శ్రీకృష్ణుడు; రూపంబుల = శరీరముల; చేన్ = తో; యదు = యాదవ; వంశంబు = కులము; అందున్ = లో; సంభవించి = అవతరించి; విశ్వంభర = భూదేవియొక్క; భారంబు = భారమును; నివారించెన్ = తప్పించెను; ఏకవింశతితమంబు = ఇరువదియొకటవ(21); ఐన = అయినట్టి; బుద్ధ = బుద్ధుడనే {బుద్ధః- ప్రపంచాకారముతో భాసించువాడు, విష్ణుసహస్రనామాలు శ్రీశంకరభాష్యం 351వ నామం}; నామధేయంబునన్ = పేరుతో; కలియుగ = కలియుగముయొక్క; ఆది = మొదలు; అవసరంబునన్ = అగు కాలంబున; రాక్షస = రాక్షసులను; సమ్మోహనంబు = మోహితులుగాచేయుట; కొఱకున్ = కోసము; మధ్యగయా = మధ్యగయ అను; ప్రదేశంబునన్ = స్థలములో; జిన = జినుడియొక్క; సుతుండు = పుత్రుడుగ; అయి = పుట్టి; తేజరిల్లున్ = ప్రకాశించు; యుగసంధి = యుగముల నడిమి కాలము (కలియుగం తరువాత, కృతయుగానికి ముందు); అందున్ = లో; వసుంధరాధీశులు = భూమిని పాలించువారు; చోరప్రాయులు = దొంగలు వంటివారు; ఐ = అయి; సంచరింపన్ = తిరుగుతుండగ; విష్ణుయశుండు = విష్ణుయశుడు; అను = అనే; విప్రుని = బ్రాహ్మణు; కిన్ = నకు; కల్కి = కల్కి; అను = అనే; పేరన్ = పేరుతో; ఉద్భవింపంగలండు = అవతరించును; అని = అని; ఇట్లు = ఈ విధముగ; అనియెన్ = చెప్పెను.

భావము:

అది అన్ని అవతారాలకు మూలవిరాట్టయిన అదినారాయణుని దేదీప్యమానమైన దివ్యరూపం. ఆ దివ్యరూపాన్ని మహాత్ములైన యోగీంద్రులు దర్శిస్తారు. శ్రీమన్నారాయణ దేవుని నాభికమలం నుంచి సృష్టికర్తలలో ఆద్యుడైన బ్రహ్మదేవుడు ఉద్భవించాడు. శ్రీహరి అవయవ స్థానాలనుంచి లోకాలు సమస్తము ఆవిర్భవించాయి.
1) ఆదినారాయణదేవుడు మొదట కౌమార మనే స్వర్గాన్ని ఆశ్రయించి సనకసనందనాది రూపాలతో కఠోరమైన బ్రహ్మచర్యాన్ని ఆచరిస్తు బ్రహ్మణ్యుడై చరించాడు.
2) రెండవసారి యజ్ఞవరాహదేహం ధరించి విశ్వసృష్టి నిమిత్తం రసాతలం నుంచి భూమండలాన్ని ఉద్ధరించాడు.
3) మూడవ పర్యాయం నారదు డనే దేవర్షిగా జన్మించి మోక్షదాయకమైన వైష్ణవధర్మాన్ని బోధించాడు.
4) నాలుగవ అవతారంలో ధర్ముడను వానికి మూర్తి యందు నరనారాయణ స్వరూపుడై ఆవిర్భవించి ఆత్మశాంతికోసం అపారమైన తపస్సు చేసాడు.
5) ఐదవ అవతారం కపిలావతారం. దేవహూతి కర్దములకు జనించి ఆసురి అనే బ్రాహ్మణునికి తత్త్వనిరూపకమైన సాంఖ్యాన్ని ఉపదేశించాడు.
6) ఆరవ అవతారంలో అత్రి అనసూయలకు దత్తాత్రేయుడై పుట్టి అలర్కుడు, ప్రహ్లాదుడు మొదలైనవారికి ఆత్మవిద్య ప్రబోధించాడు.
7) ఏడవ పర్యాయం యజ్ఞుడనే నామంతో రుచికి, ఆకూతికి కుమారుడై, యమాది దేవతలతో స్వాయంభువ మన్వంతరాన్ని సంరక్షించాడు.
8) ఎనిమిదవ రూపంలో నాభికి మేరుదేవియందు ఉరుక్రముడను పేర ప్రభవించి పండితులకు పరమహంస మార్గాన్ని ప్రకటించాడు.
9) తొమ్మిదవ జన్మలో ఋషుల ప్రార్థన మన్నించి పృథుచక్రవర్తి యై భూదేవిని గోవు గావించి సర్వ ఓషధులను పిదికాడు.
10) పదవదైన మత్స్యావతారం దాల్చి చాక్షుష మన్వంతరాంతంలో సంభవించిన జలప్రళయంలో భూరూపమైన నావపై నెక్కించి వైవస్వత మనువును కాపాడాడు.
11) పదకొండవ పర్యాయం కూర్మావతారం స్వీకరించి మున్నీటిలో మునగిపోతున్న మందరపర్వతాన్ని నేర్పుగా వీపుపై ధరించాడు.
12) పన్నెండవ అవతారంలో ధన్వంతరి యై దేవదానవులు మథిస్తున్న పాలసముద్రంలో నుంచి అమృతకలశం హస్తాన ధరించి సాక్షాత్కరించాడు.
13) పదమూడవ అవతారంలో మోహిని వేషంలో రాక్షసులను వంచించి దేవతలకు అమృతం పంచి పెట్టాడు.
14) పద్నాలుగవ సారి నరసింహమూర్తిగా అవతరించి ధూర్తుడైన హిరణ్యకశిపుణ్ణి రూపుమాపాడు.
15) పదిహేనవ అవతారంలో మాయా వామనుడై బలిచక్రవర్తిని మూడడుగులు దానమడిగి ముల్లోకాలు ఆక్రమించాడు.
16) పదహారవమారు పరశురాముడై రౌద్రాకారంతో బ్రాహ్మణ ద్రోహులైన రాజులను, ఇరవై ఒక్కమారు సంహరించి ధాత్రిని క్షత్రియహీనం కావించాడు.
17) పదిహేడవసారి వేదవ్యాసుడై అల్పప్రజ్ఞులైన వారికోసం వేదశాఖలను విస్తరింపజేశాడు.
18) పద్ధెనిమిదవ పర్యాయం శ్రీరాముడై సముద్రబంధనాది వీరకృత్యాలు ఆచరించి దేవకార్యం నిర్వర్తించాడు.
19) పందొమ్మిదవ అవతారంలో బలరాముడుగా,
20) ఇరవయ్యో అవతారంలో శ్రీకృష్ణుడుగా సంభవించి భూభారాన్ని హరించాడు.
21) ఇరవై ఒకటవసారి బుద్ధుడై మధ్య గయా ప్రదేశంలో తేజరిల్లి రాక్షసులను సమ్మోహపరచి ఓడిస్తాడు.
22) ఇరవై రెండవ పర్యాయం కల్కి రూపంతో విష్ణుయశుడనే విప్రునికి కుమారుడై జన్మించి కలియుగాంతంలో కలుషాత్ములైన రాజులను కఠినంగా శిక్షిస్తాడు అని పలికి సూతుడు ఇంకా ఇలా అన్నాడు.

1-64-మ.
 • ఉపకరణాలు:
 •  
 •  
 •  

""సిం బాసిన వేయు కాలువల యోజన్ విష్ణునం దైన శ్రీ
నానా ప్రకటావతారము లసంఖ్యాతంబు లుర్వీశులున్
సులున్ బ్రాహ్మణసంయమీంద్రులు మహర్షుల్ విష్ణునంశాంశజుల్
రి కృష్ణుండు బలానుజన్ముఁ డెడ లే; దా విష్ణుఁడౌ నేర్పడన్.

టీకా:

సరసిన్ = సరస్సు నుండి; పాసిన = వెలువడిన; వేయు = అనేకము లైన, వెయ్యి; కాలువల = కాలువల; యోజన్ = వలె; విష్ణుని = హరి; అందైన = నుండి ఉద్భవించిన; శ్రీకర = శుభములు కలిగించు, విష్ణుని {శ్రీకరః- శుభములు కలిగించువాడు, సిరులను ఇచ్చువాడు, విష్ణుసహస్రనామాలు శ్రీశంకరభాష్యం 611వ నామం}; నానా = అనేక విధముల; ప్రకట = కనబడిన; అవతారములు = అవతారాలు; అసంఖ్యాతంబులు = లెక్కపెట్టలేనివి; ఉర్వీశులు = రాజులు {ఉర్వీశులు - భూమి పతులు, రాజులు}; సురలున్ = దేవతలు; బ్రాహ్మణ = బ్రాహ్మణులు; సంయమ = జితేంద్రియులలో; ఇంద్రులు = శ్రేష్ఠులు; మహా = గొప్ప; ఋషుల్ = ఋషులు; విష్ణుని = హరియొక్క; అంశాంశ = సూక్ష్మఅంశలతో; అజులు = పుట్టిన వారు; హరి = హరి; కృష్ణుండు = కృష్ణుడు; బల = బలరామునికి; అనుజన్ముఁడు = తోబుట్టువు వలె; ఎడల లేదా = వచ్చాడు కదా; విష్ణుఁ డౌ = హరి యై; ఏర్పడన్ = ఉండగా.

భావము:

ప్రపంచంలో సరస్సుల నుండి ఎన్నో కాలవలు వెలువడి ప్రవహిస్తూ ఉంటాయి; అలాగే శ్రీమన్నారాయణుని లోనుంచి విశ్వశ్రేయోదాయకములైన ఎన్నెన్నో అవతారాలు ప్రావిర్భవిస్తూ ఉంటాయి; రాజ్యాలేలేవాళ్ళు, దేవతలు, బ్రాహ్మణులు, బ్రహ్మర్షులు, మహర్షులు ఆ నారాయణుని సూక్ష్మ అంశలచే ఉద్భవించిన వారే; పూర్వం బలరామునిగా, అతని సోదరుడు శ్రీకృష్ణునిగా శ్రీమహావిష్ణువు తానే అవతరించాడు కదా.

1-65-క.
 • ఉపకరణాలు:
 •  
 •  
 •  

వంతుం డగు విష్ణుఁడు
ముల కెవ్వేళ రాక్షవ్యధ గలుగుం
నవ్వేళలఁ దడయక
యుయుగమునఁ బుట్టి కాచు నుద్యల్లీలన్.

టీకా:

భగవంతుండు = భగవంతుడు; అగు = అయిన; విష్ణుఁడు = హరి; జగములు = లోకములు; కు = కు; ఎవ్వేళ = ఏవేళ; రాక్షస = రాక్షసులవలన; వ్యధ = బాధ; కలుగున్ = కలుగుతుందో; తగన్ = తగినట్లుగ; ఆ = ఆ; వేళలన్ = సమయములలో; తడయక = ఆలస్యము చేయక; యుగయుగమునన్ = ప్రతియుగములోను; పుట్టి = ఉద్భవించి; కాచున్ = రక్షించును; ఉద్యత్ = యత్నమనే; లీలన్ = మాయతో.

భావము:

ప్రతి యుగంలో రాకాసుల చేష్ఠలతో లోకాలు చీకాకుల పాలయ్యే సమయాలలో, భగవంతుడైన శ్రీమహావిష్ణువు విడువక తగిన అవతారాలు అవతరించి దుష్టుల శిక్షించి, శిష్టుల రక్షించి లోకాలను ఉద్ధరిస్తాడు.

1-66-ఆ.
 • ఉపకరణాలు:
 •  
 •  
 •  

తిరహస్యమైన రిజన్మ కథనంబు
నుజుఁ డెవ్వఁ డేని మాపు రేపుఁ
జాల భక్తితోడఁ దివిన సంసార
దుఃఖరాశిఁ బాసి తొలఁగిపోవు.

టీకా:

అతి = మిక్కిలి; రహస్యము = రహస్యము {రహస్యము - దాచుకొనదగ్గది}; ఐన = అయినట్టి; హరి = హరియొక్క; జన్మ = అవతారముల; కథనంబు = కథలు; మనుజుఁడు = మానవుడు; ఎవ్వఁడేని = ఎవరయిన; మాపు రేపున్ = రాత్రి+పగలు - అనునిత్యము; చాల = ఎక్కువ; భక్తి = భక్తి; తోడన్ = తో; చదివిన = పఠించినచో; సంసార = సంసారములోని; దుఃఖ = వ్యధల; రాశి = సమూహము; పాసి = దూరముగ; తొలఁగి = తొలగి; పోవున్ = పోవును.

భావము:

అత్యంత రహస్య గాథలైన వాసుదేవుని అవతార గాథలు, ఏ మానవుడైతే ఉదయము సాయంకాలము అత్యంత శ్రద్ధాభక్తులతో నిత్యము పఠిస్తాడో, అతడు దుఃఖమయమైన సంసార బంధాలకు దూరంగా తొలగిపోయి ఆనందం అనుభవిస్తాడు.

1-67-వ.
 • ఉపకరణాలు:
 •  
 •  
 •  

వినుం డరూపుం డయి చిదాత్మకుం డయి పరఁగు జీవునికిం బరమేశ్వరు మాయాగుణంబు లైన మహదాది రూపంబులచేత నాత్మస్థానంబుగా స్థూలశరీరంబు విరచితం బైన, గగనంబు నందుఁ బవనాశ్రిత మేఘ సమూహంబును, గాలి యందుఁ బార్థివధూళిధూసరత్వంబును నేరీతి నారీతి ద్రష్ట యగు నాత్మ యందు దృశ్యత్వంబు బుద్ధిమంతులు గానివారిచేత నారోపింపంబడు; నీ స్థూలరూపంబుకంటె నదృష్టగుణం బయి యశ్రుతం బైన వస్తు వగుటం జేసి వ్యక్తంబు గాక సూక్ష్మం బై కరచరణాదులు లేక జీవునికి నొండొక రూపంబు విరచితంబై యుండు; సూక్ష్ముఁ డయిన జీవునివలన నుత్క్రాంతి గమనాగమనంబులం బునర్జన్మంబు దోఁచు; నెప్పు డీ స్థూల సూక్ష్మ రూపంబులు రెండు స్వరూప సమ్యగ్జ్ఞానంబునఁ బ్రతిషేధింపఁ బడు; నపుడ నవిద్యం జేసి యాత్మను గల్పింపంబడు ననియుం దెలియు నప్పుడు జీవుండు బ్రహ్మ దర్శనంబున కధికారి యగు; దర్శనం బన జ్ఞానైక స్వరూపంబు; విశారదుం డైన యీశ్వరునిదై క్రీడించుచు నవిద్య యనంబడుచున్న మాయ యుపరతయై యెప్పుడు దాన విద్యారూపంబునం బరిణత యగు నప్పుడు జీవోపాధి యయిన స్థూలసూక్ష్మరూపంబు దహించి జీవుడు కాష్ఠంబు లేక తేజరిల్లు వహ్ని చందంబునం దాన యుపరతుం డయి బ్రహ్మస్వరూపంబునం బొంది పరమానందంబున విరాజమానుం డగు; ఇట్లు తత్త్వజ్ఞులు సెప్పుదు"రని సూతుం డిట్లనియె.

టీకా:

వినుండు = వినండి; అరూపుండు = రూపములేనివాడు; అయి = అయి; చిదాత్మకుండు = జ్ఞాని {చిదాత్మకుడు - చేతనా రూపమైన ఆత్మ కలవాడు, జ్ఞాని}; అయి = అయి; పరఁగు = ప్రవర్తిల్లు; జీవుని = జీవు; కిన్ = నకు; పరమేశ్వరు = పరమేశ్వరునియొక్క; మాయా = మాయతోకూడిన; గుణంబులు = గుణములు; ఐన = అయినట్టి; మహత్ = మహత్తు; ఆది = మొదలగు {మహత్త్వాదులు - చతుర్వింశతితత్వంబులు, (1)మహత్తు (1)పురుషుడు (1)ప్రకృతి (5)పంచభూతములు (5)పంచతన్మాత్రలు (5)పంచకర్మేంద్రియములు (5)పంచజ్ఞానేంద్రియములు మరియు (1)అంతఃకరణము మొత్తము 1+1+1+5+5+5+5+1 - 24 ... పందవింశతి తత్త్వములు చతుర్వింశతి తత్తవములు + బుద్ధి}; రూపంబుల = రూపముల; చేతన్ = చేత; ఆత్మస్థానంబుగాన్ = స్వస్థానముగా; స్థూల = భౌతికమైన; శరీరంబు = శరీరము; విరచితంబు = ఏర్పాటుచేయబడినది; ఐన = అయినట్టి; గగనంబునందున్ = ఆకాశమునందు; పవన = వాయువును; ఆశ్రిత = ఆశ్రయించిన; మేఘ = మేఘముల; సమూహంబును = సమూహమును; గాలియందున్ = వాయువునందు; పార్థివ = భూమికి సంబంధించిన; ధూళి = ధూళితోను; ధూసరత్వంబును = దుమ్ముతోను కూడినట్టి; ఏ = ఏ; రీతి = విధమైతే; ఆ = ఆ; రీతి = విధముగ; ద్రష్ట = చూచువాడు; అగు = అయినట్టి; ఆత్మ = ఆత్మ; అందున్ = లోపల; దృశ్యత్వంబున్ = చూడబడు దాని తత్త్వము; బుద్ధిమంతులు = జ్ఞానము గలవారు; కానివారి = కాకుండా ఉండే వారి; చేతన్ = చేత; ఆరోపింపంబడున్ = లేనిది యన్నట్లు గా భావింపబడును; ఈ = ఈయొక్క; స్థూల = భౌతిక; రూపంబు = రూపము; కంటెన్ = కంటెను; అదృష్ట = చూడబడని; గుణంబు = గుణములు; అయి = కలిగి యుండినదై; అశ్రుతంబు = వినబడనిది; ఐన = అయినట్టి; వస్తువు = పదార్థము; అగుటన్ = అగుట; చేసి = వలన; వ్యక్తంబున్ = అభివ్యక్తము, తెలియబడునది; కాక = కాకుండ; సూక్ష్మంబై = సూక్ష్మమై; కర = చేతులు; చరణ = కాళ్లు; ఆదులు = మొదలగుని; లేక = లేని; జీవుని = జీవుని; కిన్ = కి; ఒండొక = ఇంకొక; రూపంబు = రూపము; విరచితంబు = ఏర్పరచబడినది; ఐ = అయి; ఉండున్ = ఉండును; సూక్ష్ముఁడు = సూక్ష్మమైనవాడు; అయిన = అయినట్టి; జీవుని = జీవుని; వలనన్ = వలన; ఉత్క్రాంతి = వ్యక్తపరచ బడిన; గమన = వెడలుట; ఆగమనంబులన్ = వచ్చుటలను; పునర్జన్మంబున్ = మళ్ళీ మళ్ళీ జన్మిస్తున్నట్లు; తోఁచున్ = అర్థమగును; ఎప్పుడు = ఎప్పుడు; ఈ = ఈ యొక్క; స్థూల = భౌతిక; సూక్ష్మ = సూక్ష్మ; రూపంబులు = రూపములు; రెండున్ = రెండును; స్వ = తన; రూప = రూపము యొక్క; సమ్యక్ = పూర్తియైన; జ్ఞానంబునన్ = జ్ఞానమువలన; ప్రతిషేధింపఁబడున్ = అడ్డగింపబడును; అపుడ = అప్పుడు; అవిద్యన్ = అజ్ఞానము; చేసి = వలన; ఆత్మను = ఆత్మయందు; కల్పింపంబడును = కల్పింపబడతాయి; అనియున్ = అనీ; తెలియున్ = తెలసిన; అప్పుడు = అప్పుడు; జీవుండు = జీవుడు; బ్రహ్మ = పరబ్రహ్మను; దర్శనంబు = దర్శించుట; కున్ = కు; అధికారి = తగినవాడు; అగున్ = అగును; దర్శనంబు = దర్శనము; అనన్ = అనగా; జ్ఞాన = జ్ఞానముయొక్క; ఏక = ప్రత్యేకమైన; స్వరూపంబు = స్వరూపము; విశారదుండు = నేర్పరియైనవాడు; ఐన = అయినట్టి; ఈశ్వరునిది = ఈశ్వరు యొక్క; ఐ = అయి; క్రీడించుచున్ = క్రీడిస్తూ, వినోదము గా చరిస్తూ; అవిద్య = అవిద్య; అనంబడుచున్ = అని పిలవబడుచు; ఉన్న = ఉన్నట్టి; మాయ = మాయ; ఉపరత = నిలచిపోయినది; ఐ = అయి; ఎప్పుడు = ఎపుడైతే; తాన = తానే; విద్య = విద్య యొక్క; రూపంబునన్ = రూపముగ; పరిణత = పరిణామము చెందినది; అగున్ = అగునో; అప్పుడు = అప్పుడు; జీవ = జీవునకు; ఉపాధి = ఆధారము; అయిన = అయినట్టి; స్థూల = భౌతికమైన; సూక్ష్మ = సూక్ష్మమైన; రూపంబున్ = రూపము; దహించి = నశించి; జీవుడు = జీవుడు; కాష్ఠంబు = కట్టె; లేక = లేకనే; తేజరిల్లున్ = ప్రకాశించు; వహ్ని = అగ్ని; చందంబునన్ = వలె; తాన = తనే; ఉపరతుండు = నిలిచిపోయినవాడు; అయి = అయి; బ్రహ్మ = బ్రహ్మయొక్క; స్వరూపంబునన్ = స్వరూపమును; పొంది = ప్రాప్తించి; పరమ = అన్నిటికంటె నుత్తమమైన; ఆనందంబునన్ = ఆనందములో; విరాజమానుండు = విశేషముగ ప్రకాశించువాడు; అగున్ = అగును; ఇట్లు = ఈవిధముగ; తత్త్వజ్ఞులు = తత్త్వజ్ఞానము గలవారు; చెప్పుదురు = చెబుతారు; అని = అని చెప్పి; సూతుండు = సూతుడు; ఇట్లు = ఈవిధముగ; అనియె = చెప్పెను.

భావము:

వినండి, ప్రాకృత రూప రహితుడు చిదాత్మస్వరూప జ్ఞానస్వరూపుడు ఐన జీవునికి మహదాదులైన మాయాగుణాల వల్ల ఆత్మస్థానమైన స్థూలశరీరం ఏర్పడింది; గగన మందు మేఘసమూహాన్ని ఆరోపించినట్లూ, గాలి యందు పైకి లేచిన దుమ్ముదుమారాన్ని ఆరోపించినట్లూ అజ్ఞానులైన వారు సర్వదర్శి అయిన ఆత్మ యందు దృశ్యత్వాన్ని ఆరోపించుతున్నారు; జీవునికి కనిపించే ఈ స్థూలరూపం కంటే కనిపించనిది, వినిపించనిది ఐన జీవాత్మ యొక్క ఉత్ర్కాంతి గమనాగమనాల వల్ల మళ్లీ మళ్లీ జన్మిస్తున్నట్లు అనిపిస్తుంది; స్వస్వరూపజ్ఞానం వల్ల ఈ స్థూల సూక్ష్మరూపాలు రెండు తొలగిపోతాయని, మాయవల్ల ఇవి ఆత్మకు కల్పింపబడతాయని గ్రహించి నప్పుడు జీవునికి బ్రహ్మసందర్శనానికి అధికారం లభిస్తుంది; సమ్యక్ జ్ఞానమే దర్శనం; సర్వజ్ఞుడైన ఈశ్వరునికి లోబడి క్రీడిస్తూ అవిద్య అనబడే మాయ ఉపశమించి, తాను విద్యగా పరిణమించినప్పుడు ఉపాధి అయిన స్థూల సూక్ష్మరూపాలను దగ్ధం చేసి, కట్టె లేకుండా ప్రకాశిస్తున్న అగ్నిలాగా తానే బ్రహ్మస్వరూపాన్ని పొంది, పరమానందంతో విరాజిల్లుతాడని తత్త్వవేత్తలు వివరిస్తారు” అని సూతుడు మళ్లీ చెప్పసాగాడు.

1-68-చ.
 • ఉపకరణాలు:
 •  
 •  
 •  

""నము లేక కర్మముల జాడలఁ బోక సమస్త చిత్త వ
ర్తనుఁడగు చక్రికిం గవు లుదార పదంబుల జన్మకర్మముల్
వినుతులు సేయుచుండుదురు వేదరహస్యములందు నెందుఁ జూ
చి మఱి లేవు జీవునికిఁ జెప్పిన కైవడి జన్మకర్మముల్.

టీకా:

జననము = పుట్టుక; లేక = లేని; కర్మముల = కర్మల; జాడలన్ = వెంట; పోక = పోని; సమస్త = సర్వుల; చిత్త = చిత్తములలో; వర్తనుఁడు = చరించేవాడు; అగు = అయిన; చక్రి = చక్రధారియైన హరి {చక్రిః- సుదర్శనమను చక్రమును ధరించినవాడు, విష్ణుసహస్రనామాలలో 908వ నామం}; కిన్ = కి; కవులు = కవులు; ఉదార = గొప్ప; పదంబుల = పదములతో; జన్మ = పుట్టుక; కర్మముల్ = నడతల; వినుతులు = పొగడ్తలు; సేయుచున్ = చేస్తూ; ఉండుదురు = ఉంటారు; వేద = వేదము లందలి; రహస్యములు = రహస్యములు {రహస్యము - దాచుకొనదగ్గది}; అందున్ = లోపల; ఎందున్ = ఎందులోను కూడ; చూచిన = వెతికి చూచిన; మఱి = ఇంక; లేవు = లేవు; జీవుని = జీవుని; కిన్ = కొరకు; చెప్పిన = చెప్పబడిన; కైవడిన్ = విధమైన; జన్మ = జన్మలు; కర్మముల్ = కర్మలు.

భావము:

“చక్రధారుడైన ఆ హరికి జన్మ అన్నది లేదు. ఏ కర్మలూ ఆయనని అంటవు. సమస్తజీవుల చిత్తములలోను ఆయన నివసిస్తూ ఉంటాడు. ఆ పరాత్పరునికి విద్వాంసులు జన్మలు కర్మలు కల్పించి, ఉదాత్తములైన పదజాలాలతో వర్ణిస్తున్నారు. స్తోత్రాలు చేస్తున్నారు. వాస్తవానికి వేదాలన్నీ వెదకి చూసినా జీవునికి వలె దేవునికి జన్మలు కర్మలు లేనేలేవు.

1-69-మ.
 • ఉపకరణాలు:
 •  
 •  
 •  

భునశ్రేణి నమోఘలీలుఁ డగుచుం బుట్టించు రక్షించు నం
విధింజేయు మునుంగఁడందు; బహుభూవ్రాతమం దాత్మతం
త్రవిహారస్థితుడై షడింద్రియ సమస్తప్రీతియున్ దవ్వులన్
దివిభంగిం గొనుఁ జిక్కఁ డింద్రియములం ద్రిప్పున్ నిబంధించుచున్.

టీకా:

భువన = లోకముల; శ్రేణిన్ = సమూహములో; అమోఘ = అమోఘమైన {అమోఘము - వ్యర్థము కానిది}; లీలుఁడు = లీల కలవాడు; అగుచున్ = అగుచూ; పుట్టించు = సృష్టించు, సృష్టి; రక్షించున్ = రక్షించు, స్థితి; అంతవిధిన్ = అంతముచేయుటను, లయలను; చేయు = చేయును; మునుంగఁడు = లోనుకాడు; అందున్ = అందు; బహు = అనేక; భూత = జీవుల; వ్రాతము = సమూహము; అందున్ = లోపల; ఆత్మ = స్వయముగ అల్లుకొనిన; తంత్ర = తంత్రము, అల్లిక - స్వతంత్ర; విహార = విహారముచేయు; స్థితుడు = స్థితిగలవాడు; ఐ = అయి; షట్ = ఆరు; ఇంద్రియ = ఇంద్రియముల యొక్క {ఇంద్రియములు ఆరు - మనసు, పంచేంద్రియాలు కలిసి 6}; సమస్త = సమస్తమైన; ప్రీతియున్ = దగ్గరలు; దవ్వులన్ = దూరములను; దివి = ఆకాశము; భంగిన్ = వలె; కొనున్ = గ్రహించును; చిక్కఁడు = చిక్కుకొనడు; ఇంద్రియములన్ = ఇంద్రియములను; త్రిప్పున్ = విహరింపచేయును; నిబంధించుచున్ = నియమించును.

భావము:

ఈ సకల భువన జాలాన్నీ తన అమోఘమైన లీలావిలాసం చేత శ్రీమన్నారాయణుడు పుట్టిస్తుంటాడు, రక్షిస్తుంటాడు, అంతం చేస్తూ ఉంటాడు. కాని తాను మాత్రం ఆ జనన మరణాలలో నిమగ్నం కాడు. సర్వ ప్రాణి సమూహ మందు ఆత్మస్వరూపుడై విహరిస్తుంటాడు. ఎంతో దూరంలో అందకుండా స్వర్గంలాగా ఉండి, జీవుల ఇంద్రియాలకు సంతోషాన్ని సమకూరుస్తూ, తాను మాత్రం ఇంద్రియాలకు అతీతుడుగా ఉండి, నియంతయై ఇంద్రియాలను తన ఇష్టం వచ్చినట్లు త్రిప్పుతూ ఉంటాడు.

1-70-చ.
 • ఉపకరణాలు:
 •  
 •  
 •  

దధినాథుఁడైన హరిసంతతలీలలు నామరూపముల్
గిలి మనోవచోగతులఁ దార్కికచాతురి యెంత గల్గినన్
మిగిలి కుతర్కవాది తగ మేరలు సేసి యెఱుంగ నేర్చునే?
ణిత నర్తనక్రమము జ్ఞుఁ డెఱింగి నుతింప నోపునే?

టీకా:

జగత్ = సృష్టికి; అధి = పై; నాథుడు = పతి - అధిపతి; ఐన = అయినట్టి; హరి = హరియొక్క; సంతత = ఎడతెగని; లీలలు = లీలలు; నామ = నామాలు; రూపముల్ = రూపములు; తగిలి = పూనుకొని; మనో = ఆలోచనల; వచో = వాక్కుల; గతులన్ = రీతులతో; తార్కిక = తర్కమునకు సంబంధించిన; చాతురి = నేర్పు; ఎంత = ఎంత; కల్గినన్ = కలిగి యున్నప్పుటికిని; మిగిలి = అతిశయించి; కు = చెడ్డ; తర్క = హేతు విమర్శ; వాది = వాదించువాడు - చెడ్డ వాదనలు వాదించువాడు; తగ = తగిన; మేరలు = హద్దులు; సేసి = చేసి; ఎఱుంగ = తెలిసికొన; నేర్చునే = గలడా; అగణిత = లెక్కకందని; నర్తన = నాట్యము, నృత్యము; క్రమమున్ = విలువ; అజ్ఞుఁడు = అజ్ఞానము కలవాడు; ఎఱింగి = అర్థము చేసికొని; నుతింపన్ = అభినందించుట; ఓపునే = చేయకలడా.

భావము:

సర్వలోకేశ్వరుడైన శ్రీహరి లీలావిలాసంగా నానావిధాలైన నామరూపాలు ధరిస్తూ ఉంటాడు. కళా హృదయం లేని అజ్ఞుడు, నాట్యంలోని అందచందాలను అర్థంచేసికొని ఆనందించి అభినందించ లేనట్లే, వితర్కాలు కుతర్కాలు నేర్చినవాడు తర్క శాస్ర్త పాండిత్యం ఎంత ఉన్నా, భగవంతుని సత్యస్వరూపాన్ని మనస్సుచేత గానీ వాక్కుల చేతగానీ ఇంత అని గ్రహింపలేడు.

1-71-ఉ.
 • ఉపకరణాలు:
 •  
 •  
 •  

ఇంచుక మాయలేక మది నెప్పుడుఁ బాయని భక్తితోడ వ
ర్తించుచు నెవ్వఁడేని హరిదివ్యపదాంబుజ గంధరాశి సే
వించు, నతం డెఱుంగు నరవింద భవాదులకైన దుర్లభో
దంచితమైన, యా హరి యుదార మహాద్భుత కర్మమార్గముల్.

టీకా:

ఇంచుక = కొంచెము కూడ; మాయ = మాయ, మర్మము; లేక = లేకుండా; మదిన్ = మనసులో; ఎప్పుడు = ఎల్లప్పుడూ; పాయని = విడువని; భక్తి = భక్తి; తోడన్ = తో; వర్తించుచున్ = నడచు కొనుచు; ఎవ్వఁడేని = ఎవరైతే; హరి = హరియొక్క; దివ్య = దివ్యమైన; పద = పాద; అంబుజ = పద్మముల యొక్క; గంధ = వాసన; రాశి = మొత్తములను; సేవించున్ = సేవించునో; అతండు = అతడు; ఎఱుంగున్ = తెలియును; అరవిందభవ = బ్రహ్మదేవుడు {అరవిందభవుడు - అరవిందము (పద్మము)న భవుడు (పుట్టినవాడు), విష్ణువు}; ఆదులు = మొదలైనవారు; కున్ = కి; ఐన = అయినను; దుర్లభ = లభించనిది; ఉదంచితము = విజృంభణము కలది; ఐన = అయినట్టి; ఆ = ఆ; హరి = హరియొక్క; ఉదార = చక్కటి; మహా = గొప్ప; అద్భుత = ఆశ్చర్యకరమైన; కర్మ = కర్మలయొక్క; మార్గముల్ = విధానములు.

భావము:

మర్మము అన్నది కొంచం కూడ లేకుండ, ఎడతెగని భక్తితో ప్రవర్తిస్తూ, నారాయణ చరణారవింద సుగంధాన్ని సేవించే మహాత్ముడు, బ్రహ్మాదులకు సైతం అందుకొన శక్యం కాని భగవంతుని అత్యద్భుతమైన లీలావిశేషాలను తెలుసుకొంటాడు” ఇలా చెప్పి సూతుడు శౌనకాది మహర్షులతో ఇలా అన్నాడు.

1-72-మ.
 • ఉపకరణాలు:
 •  
 •  
 •  

రిపాదద్వయభక్తి మీ వలన నిట్లారూఢమై యుండునే
తిరుగంబాఱదు చిత్తవృత్తి హరిపై దీపించి మీలోపలన్
ణీదేవతలార! మీరలు మహాన్యుల్ సమస్తజ్ఞులున్
రిచింతన్ మిముఁ జెంద వెన్నడును జన్మాంతర్వ్యధాయోగముల్

టీకా:

హరి = హరియొక్క; పాద = పాదములు; ద్వయ = జంట మీది; భక్తి = భక్తి; మీ = మీ; వలనన్ = వలన; ఇట్లు = ఈవిధముగా; ఆరూఢమై = నెలకొని, ఎంతగానో; ఉండున్ = ఉండును; ఏతిరుగన్ = ఇంకొక విధముగ; పాఱదు = విస్తరించదు; చిత్త = చిత్తము యొక్క; వృత్తి = ప్రవృత్తి; హరి = హరి; పై = మీద; దీపించి = ప్రకాశిస్తూ; మీ = మీ; లోపలన్ = అందు; ధరణీదేవతలారా = విప్రులులారా {ధరణీదేవుడు - ధరణీ (భూమికి) దేవుడు, విప్రుడు}; మీరలు = మీరు; మహా = మిక్కిలి, గొప్ప; ధన్యులు = సార్థకజీవులు; సమస్త = సర్వము; అజ్ఞులున్ = తెలిసిన వారు; హరి = హరిమీది; చింతన్ = భక్తి వలన; మిమున్ = మిమ్ములను; చెందవు = అంటవు; ఎన్నడును = ఎప్పుడూ; జన్మాంతర = వివిధజన్మలలో; వ్యధ = బాధలయొక్క; యోగముల్ = యోగములు.

భావము:

“ఓ బ్రహ్మణ్యులారా ! మీరు పుణ్యవంతులలో శ్రేష్ఠులు, సర్వం తెలిసిన మునివరేణ్యులు. మీలో శ్రీహరి చరణయుగంపై భక్తి ఇంతగా ఆరూఢమై ఉన్నది. మీ హృదయాలు శ్రీహరి యందు అసక్తములై ఎడబాటు ఎరుగకుండా ఉన్నాయి. శ్రీమన్నారాయణ సంస్మరణ ప్రభావం వల్ల ఈ చావు పుట్టుకల బాధలు ఎన్నడూ మీ సమీపానికి రాలేవు.