పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

స్తుతులు స్తోత్రాలు : ఇంద్రుడు గోవిందుని పొగడుట (అభ్యుదయ కరం)

  1
"రమ! నీ ధామంబు భాసుర సత్వంబు-
శాంతంబు; హత రజస్తమము; నిత్య
ధిక తపోమయ; ట్లు గావున మాయ-
నెగడెడి గుణములు నీకు లేవు
గుణహీనుఁడవు గాన గుణముల నయ్యెడి-
లోభాదికములు నీలోనఁ జేర
వైన దుర్జననిగ్రము శిష్టరక్షయుఁ-
గిలి సేయఁగ దండధారి వగుచు

  2
గముభర్తవు; గురుడవు; నకుఁడవును
గదధీశుల మను మూఢనులు దలఁక
నిచ్చ పుట్టిన రూపంబు లీవు దాల్చి
హితము జేయుదు గాదె లోకేశ్వరేశ!

  3
నావంటి వెఱ్ఱివారిని
శ్రీల్లభ! నీవు శాస్తి చేసితివేనిం
గారము మాని పెద్దల
త్రోవన్ జరుగుదురు బుద్ధితోడుత నీశా!

  4
క్కొక లోకముఁ గాచుచు
నెక్కుడు గర్వమున "నేమె యీశుల"మనుచుం
జొక్కి ననుబోటి వెఱ్ఱులు
నిక్కము నీ మహిమ దెలియనేర రనంతా!

  5
వాసుదేవ! కృష్ణ! రద! స్వతంత్ర! వి
జ్ఞానమయ! మహాత్మ! ర్వపుణ్య
పురుష! నిఖిలబీజభూతాత్మకబ్రహ్మ!
నీకు వందనంబు నిష్కళంక!

  6
నీ సామర్థ్య మెఱుంగ మేఘములచే నీ ఘోషమున్ భీషణో
గ్రాసారంబున ముంచితిన్ మఖము నాకై వల్లవుల్ చేయ రం
చో ర్వేశ! భవన్మహత్త్వమున నా యుద్యోగ మిట్లయ్యె; నీ
దాసున్ నన్నుఁ గృతాపరాధుఁ గరుణన్ ర్శింపవే మాధవా!

  7
నిను బ్రహ్మాదు లెఱుంగలేరు; జడతానిష్ఠుండ లోకత్రయా
దుర్మాన గరిష్ఠుఁడన్; విపులదుర్వైదుష్య భూయిష్ఠుఁడన్;
వియ త్యాగ కనిష్ఠుడం; గుజనగర్వి శ్రేష్ఠుఁడన్; దేవ! నీ
లీలా విభవంబు పెంపుఁ దెలియంగా నెవ్వఁడన్? సర్వగా!"

  8
ఇతి బమ్మెఱ పోతనామాత్య కృత శ్రీమత్తెలుగు భాగవత దశమస్కంధ పూర్వభాగ అంతర్గత ఇంద్రుడు గోవిందుని పొగడుట (అభ్యుదయ కరం)