పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

స్తుతులు స్తోత్రాలు : నారదుని కృష్ణ స్తుతి (శ్రీ కరం)

  1
గదీశ! యోగీశ! ర్వభూతాధార!-
కలసంపూర్ణ! యీశ్వర! మహాత్మ!
కాష్ఠగతజ్యోతి కైవడి నిఖిల భూ-
ము లందు నొకఁడవై నరు దీవు
ద్గూఢుఁడవు; గుహాయుఁడవు సాక్షివి-
నీ యంతవాఁడవై నీవు మాయఁ
గూడి కల్పింతువు గుణముల; వానిచేఁ-
బుట్టించి రక్షించి పొలియఁజేయుఁ

  2
దీ ప్రపంచ మెల్ల నిట్టి నీ విప్పుడు
రాజమూర్తులైన రాక్షసులను
సంహరించి భూమిక్రంబు రక్షింప
వతరించినాఁడ య్య! కృష్ణ!

  3
ఇతి బమ్మెఱ పోతనామాత్య కృత శ్రీమత్తెలుగు భాగవత దశమస్కంధ పూర్వభాగ అంతర్గత నారదుని కృష్ణ స్తుతి (శ్రీ కరం)