పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

నవమ స్కంధము : శశిబిందుని చరిత్ర

  •  
  •  
  •  

9-714-వ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

ఉగ్రసేనునకుఁ గంసుండును, న్యగ్రోధుండును, సునామకుండును, కహ్వుండును, శంకుండును, సుభువును, రాష్ట్రపాలుండును, విసృష్టుండును, దుష్టిమంతుండును ననువారు దొమ్మండ్రు కొడుకులును, కంసయుఁ, గంసవతియు, సురాభువును, రాష్ట్రపాలికయు నను కూఁతులుం బుట్టరి; వారు వసుదేవానుజభార్యలైరి; భజమానునికి విడూరథుండును, విడూరథునికి శినియు, నతనికి భోజుండు భోజునికి హృదికుండును గలిగి; రందు హృదికునికి దేవమీఢుండు, శతధనువు కృతవర్మయు నను కొడుకులు గలిగి; రా దేవమీఢుండు శూరుండు ననంబడు శూరునికి మారిష యను భార్య యందు వసుదేవుండును దేవభాగుండును దేవశ్రవుండును నానకుండును సృంజయుండును శ్యామకుండును గంకుండును ననీకుండును వత్సకుండును వృకుండును ననువారు పదుగురు గొడుకులును బృథయు శ్రుతదేవయు శ్రుతకీర్తియు శ్రుతశ్రవసయు రాజాధిదేవియు నను కూఁతు లేవురును బుట్టిరి; అందు.

టీకా:

ఉగ్రసేనున్ = ఉగ్రసేనున; కున్ = కు; కంసుండునున్ = కంసుడు; న్యగ్రోధుండునున్ = న్యగ్రోధుడు; సునామకుండునున్ = సునామకుడు; కహ్వుండునున్ = కహ్వుడు; శంకుండునున్ = శంకుడు; సుభువునున్ = సుభువు; రాష్ట్రపాలుండునున్ = రాష్ట్రపాలుడు; విసృష్టుండునున్ = విసృష్టుడు; తుష్టిమంతుడునున్ = తుష్టిమంతుడు; అను = అనెడి; వారు = వారు; తొమ్మండ్రు = తొమ్మిదిమంది; కొడుకులునున్ = పుత్రులు; కంసయున్ = కంస; కంసవతియున్ = కంసవతి; సురాభువున్ = సురాభువు; రాష్ట్రపాలియున్ = రాష్ట్రపాలి; అను = అనెడి; కూతులున్ = కుమార్తెలు; పుట్టిరి = జన్మించిరి; వారు = వారు; వసుదేవా = వసుదేవుని; అనుజ = అన్న; భార్యలు = భార్యలు; ఐరి = అయ్యిరి; భజమానుని = భజమానుని; కిన్ = కి; విడూరథుండును = విడూరథుడు; విడూరథుని = విడూరథుని; కిన్ = కి; శినియున్ = శిని; అతని = అతని; కిన్ = కి; భోజుండు = భోజుడు; భోజున్ = భోజుని; కిన్ = కి; హృదికుండును = హృదికుడు; కలిగిరి = పుట్టిరి; అందున్ = వారిలో; హృదికుని = హృదికుని; కిన్ = కి; దేవమీఢుండు = దేవమీఢుడు; శతధనువు = శతధనువు; కృతవర్మయున్ = కృతవర్మ; అను = అనెడి; కొడుకులు = పుత్రులు; కలిగిరి = పుట్టిరి; ఆ = ఆ; దేవమీఢుండు = దేవమీఢుడు; శూరుండు = శూరుడు; అనంబడు = అనబడెడి; శూరుని = శూరుని; కిన్ = కి; మారిష = మారిష; అను = అనెడి; భార్య = భార్యలు; అందున్ = అందు; వసుదేవుండును = వసుదేవుడును; దేవభాగుండును = దేవభాగుడు; దేవశ్రవుండును = దేవశ్రవుడు; ఆనకుండునున్ = ఆనకుడు; సృంజయుండును = సృంజయుడు; శ్యామకుండునున్ = శ్యామకుడు; కంకుండునున్ = కంకుడు; అనీకుండును = అనీకుడు; వత్సకుండును = వత్సకుడు; వృకుండునున్ = వృకుడు; అను = అనెడి; వారు = వారు; పదుగురు = పదిమంది (10); కొడుకులునున్ = పుత్రులు; పృథయు = పృథ; శ్రుతదేవయున్ = శ్రుతదేవ; శ్రుతకీర్తియున్ = శ్రుతకీర్తి; శ్రుతశ్రవసయున్ = శ్రుతశ్రవస; రాజాధిదేవియున్ = రాజాధిదేవి; అను = అనెడి; కూతులున్ = కుమార్తెలు; ఏవురున్ = ఐదుగురు; పుట్టిరి = జన్మించిరి; అందున్ = వారిలో.

భావము:

ఉగ్రసేనునకు కంసుడు, న్యగ్రోధుడు, సునామకుడు, కహ్వుడు, శంకుడు, సుభువు, రాష్ట్రపాలుడు, విసృష్టుడు, తుష్టిమంతుడు అనెడి తొమ్మిదిమంది పుత్రులు; కంస, కంసవతి, సురాభువు, రాష్ట్రపాలి అనెడి నలుగురు కుమార్తెలు జన్మించారు. వారు వసుదేవుని అన్నకు భార్యలు అయ్యారు. భజమానునికి విడూరథుడు; విడూరథునికి శిని; అతనికి భోజుడు; భోజునికి హృదికుడు పుట్టారు. వారిలో హృదికునికి దేవమీఢుడు, శతధనువు, కృతవర్మ అనెడి పుత్రులు పుట్టారు; ఆ దేవమీఢునికి శూరుడు అని ఇంకో పేరు ఉంది. శూరునికి భార్యలు మారిష అందు వసుదేవుడు, దేవభాగుడు, దేవశ్రవుడు, ఆనకుడు, సృంజయుడు, శ్యామకుడు, కంకుడు, అనీకుడు, వత్సకుడు, వృకుడు అనెడి పదిమంది పుత్రులు; పృథ, శ్రుతదేవ, శ్రుతకీర్తి, శ్రుతశ్రవస, రాజాధిదేవి అనెడి కుమార్తెలు ఐదుగురు జన్మించారు. వారిలో...