పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

: :చదువుకుందాం భాగవతం; బాగుపడదాం మనం అందరం: :


ఈ ప్రవేశికలో ఈ తెలుగుభాగవతం.ఆర్గ్ కోసం ఉపయోగించిన, ఉపకరించిన వివరాలు; సంబంధించిన కార్యక్రమాలు, విశేషాలు క్రింద విధంగా ఉన్నాయి:-


1. అనుబంధాలు: (అ) మన సభ్యుల వివరాలు; (ఆ) ప్రోత్సహించిన వ్యక్తుల, సంస్థల వివరాలు; (ఇ) గ్రంథంలో వాడిన ఛందోప్రక్రియలు, వాటి సంకేత గుర్తులు చూపబడ్డాయి; (ఈ) అంతర్జాల గుర్తింపు అవసరాలకోస మైన టాగ్స్; (ఉ) ఈ జాలగూడు మరియు సంబంధించిన ఇతర కార్యక్రమాలు నిర్వహణ కోసం స్థాపించుకున్న ట్రస్టు వివరాలు; వంటివి ఇవ్వబడ్డాయి.


2. ముందుమాట : జాలగూడులోని విషయము విధానాల గురించిన (అ) ఈటివి-2 వారు చేసిన చక్కటి పరిచయ వీడియో; (ఆ) సంబంధించిన కాపీరైటు వివరాలు; (ఇ) చక్కటి తెలుగు పలుకులతో చిన్న ఉపోద్ఘాతము; (ఈ) ఆంగ్లభాషలో అందించిన చిన్న ఇంట్రడక్షను; (ఉ) ఎంతో సహాయకరంగా ఉపయోగపడిన గ్రంథాదుల వివరాలు రెండు పుటలులోనూ; (ఊ) ఎంతో ఉపయుక్త సహాయ సహకారాలు అందించిన సంస్థల వివరాలు; (ఎ) ఈ కార్యక్రమాలలో ఉపయోగించిన చిహ్నముల వివరాలు; (ఏ) మా సంస్థ చేస్తున్న వివిధ కార్యక్రమాల వివరాలు; వంటివి అందించబడ్డాయి.


3. సభలు సమావేశాలు: మా సంస్థ తరఫున చేపట్టిన వివిధ సభలూ సమావేశలు కార్యక్రమాలకు చెందిన చిత్రాలు, వినుకరులు, కనుకరులు వంటివి ఇక్కడ చూపాము.


4. భూమిక: పోతన భాగవతం గురించి వివిధ స్కంధాల గురించి చిన్న చిన్న వివరాలను ఇక్కడ అందించాము.


5. పద్యసూచిక: తెలుగు భాగవతం పెద్ద ఉద్గ్రంథం. అందుకని లింకులు పెట్టిన విషయ సూచికలు గ్రంథంలో ఉన్న వరుసలోనూ, అకారాది వరుసలోనూ; అలాగే వీరభద్రవిజయానికి చెందిన సూచికలు ఇవ్వబడ్డాయి.


6. పత్రికా ఉల్లేఖనాలు: వివిధ మాధ్యమాలలో సంస్థ గురించి లేదా సంస్థకు చెందిన విషయాలు అనేకం వస్తున్నాయి. వాటి ఉల్లేఖనాలు ఇక్కడ ఇవ్వబడ్డాయి.


7. ట్రస్టు - కార్యక్రమాలు: ట్రస్టు గురించి అది చేపట్టే, చేపట్టబోయే వాటి వివరాలు ఇక్కడ ఇస్తున్నాము.


8. బమ్మెర పోతన: మొత్తం ఈ కృషికి మూలపురుషుడు జాతీయ మహాకవి బమ్మెర పోతనామాత్యుల వారు. కనుక వారికి చెందిన విషయాలను ఈ ఉప విభాగంలో సంకలనం చేయబడుతున్నాయి.


9. పోటీలు: సంస్థ చేపట్టే వివిధ పోటీల వివరాలు, ఆహ్వానాలు వంటివి ఇక్కడ ప్రచురింపబడ్తాయి.