పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

: :చదువుకుందాం భాగవతం; బాగుపడదాం మనం అందరం: :


తెలుగు బాగవతంలో ఉన్న ఉపయుక్తమైన పదాలు, పదబంధాదులు, విశిష్ఠ విషయాలు ఎన్నెన్నో ఉన్నాయి. వాటిలో కొన్నిటి వివరణల సంకలనం చేసినవే ఈ వివరాలు. వీటిని కింది విధంగా అందుబాటులో ఇవ్వబడ్డాయి.

కౌరవులు వందమది పేర్లు, అలాగే చతురాశ్రమాలు 4 వాటిలో నాలుగేసి విభాగాలు రాసి ఆ పదహారింటి వివరాలు, 64 కళలు, ఉదహరించిన ఏకవింశతి అవతారాలు చతుర్వింశతి అవతారాలు వంటి అనేక పారిభాషిక పదాలు వంటివి సంకలనం చేయట మైంది, మన కాలము కొలతలు, సంఖ్యామానము మున్నగునవి కూడ ఇవ్వబడ్డాయి. కొన్నిటి వ్యుత్పత్తి, వివరణలు, కొన్ని విశేష విషయాలపై గణనాధ్యాయి వ్రాసినవి వంటి వివిధములైన యుక్తములు అనుకున్న విషయాలు “అనుయుక్తాలు” పేర యివ్వబడ్డాయి.

పంచకోశాది; రాసక్రీడలో నడక విధాలు, అడుగులు వేసే విధానాలు, తలతిప్పే విధానాలు; మున్నగు కొన్ని వివరాలు కొందరు మహా పండితులు చాలా అద్భుతంగా తమ ఉత్తమ భాగవత రచనలలో చెప్పారు. కొన్ని భాగవత ప్రతులలో ముందుమాటలుగా ప్రముఖులు అద్భుత విషయాలు వెలిబుచ్చారు. అట్టి వాటిని ఉత్తమ భాగవత గ్రంధాలలో నుంచి ఉల్లేఖించ బడినవి “ఉల్లేఖనాలు” పేరుగల బొత్తంలో చూడగలరు.

పోతన తెలుగు భాగవతంలోని పద్యాలు అన్ని మధురమైనవే వేటిని బాగాలేవు అనలేం. కాని వాటిలోంచి ~ 400 మధువులు జాలు వారే పద్యాలు ఎంచి ఒకచోట అకారాది వరసలో పెట్టి భాగవత “తేనెసోనలు” పేర యివ్వబడ్డాయి. వాటిని రెండు జాబితాలులో (“అ-న”; “ప-హ”) యివ్వబడ్డాయి

అత్యంత జనాదరణ పొందినవి, సకల జనాల చిన్నతనం నుండి నోటిలో నానుతుండేవి, పిల్లలకు బాల్యంలోనే చెప్పటానికి అనుకూలంగా ఉండేవి, రత్నాల వంటి పద్యాలు పన్నెండింటిని (12) ఎంచి “పద్య రత్నాలు” అని యివ్వబడ్డాయి. వీటిని అన్ని ప్రాంతాలలోను బాల్యంలో పిల్లలకు, ఇప్పుడు ఆంగ్లంలో రైమ్స్ అని చెప్తున్నట్లు, చెప్పేవారు. వాటిని పెద్ద అవుతు వివిధ వయోస్థాయిలలోను గుర్తు చేసుకుంటు, అబ్బా ఇంత అందమైనవా, ఇంతటి అర్థం ఉందా, ఇంతేసి లోతులు ఉన్నాయా అనుకొని, తమ పెద్దలు ఇంతటి చక్కటివాటిని మాకు అందించారని ఆనందించటం సర్వ సాధరణమైన విషయం. అట్టి వాటిలో ఎన్నదగినవి ఈ పద్య రత్నాలు. వీటిని చిన్న పిల్లలకు చెప్పి బట్టీ పట్టిద్దాం. మన తరువాతి తరాలకు బాగుపడే అవకాశాలు పెంచుదాం. మన సంస్కృతిని పొంది గర్వించడానికి అవకాశం ఇద్దాం.

గ్రంథంలో వచ్చిన అనేక విషయాల మరియు దీనికి సంబంధించిన వివిధ వ్యాసములు,రచనలు “వ్యాసములు” ఉపవిభాగం క్రింద సంకనం చేయబడ్డాయి.

గ్రంథంలోని పద్యాలు కాకుండా “కాటుక కంటి నీరు”, “బాలరసాలసాల”, “ముద్దులు గార” వంటి బహుళ జనాదరణ పొందినవి మధురాతి మధురరమైనవి అయిన చాటువుల, ఇతర పద్యములు ఇక్కడ “పద్య మధురిమలు”లో సంకలనం చేయబడ్డాయి.

శ్రీమద్భాగవతం మహా మంత్ర పూరితమూ, గాయత్రిని అధికరించినది. దీనిలోని అనేకనేక ఘట్టాలలో కథాపరమైన తాత్పర్యాలు కాకుండా వాటిని అతిక్రమించిన వివిధ సంకేతార్థాలతో కూడి అనేక ఆధ్యాత్మిక, తాత్విక, శాస్త్రీయ తాత్పర్యాలు, భావప్రకంపనలు, విశేషార్థాలు అంతర్గతంగా ఇమిడ్బబడి ఉన్నాయి. కొన్ని పదాలకైన అట్టి సంకేత అర్థాలను సంకలనం చేసి అందించే ప్రయత్నం ఇక్కడ “సంకేత పదాలు”లో చేయబడుతోంది.

ప్రబంధ, పురాణ నియమాల ప్రకారం మనువుల వంశాల, ఇంకా అవే కాక అనేక ప్రముఖుల వంశాల వర్ణనలు పుంఖానుపుంఖాలుగా శతెలుగుభాగవతంలో కనబడతాయి. వాటిని వంశవృక్షాల రూపంలో ఇక్కడ “వంశవృక్షాలు” ఉప విభాగంలో సంకలనం చేయబడ్డాయి.