పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

: :చదువుకుందాం భాగవతం; బాగుపడదాం మనం అందరం: :



ఓం సహనావవతు! సహనౌభునక్తు!
సహవీర్యం కరవావహై!
తేజస్వి నావధీతమస్తు! మా విద్విషా వహై!
ఓం శాంతిః శాంతిః శాంతిః!!

ఈశ్వరుడు మనల నిరువురిని రక్షించుగాక! మనల నిరువురను పోషించుగాక! మనము గొప్ప శక్తితో (దివ్యబలముతో) కలసి పని చేయుదుముగాక! అధ్యయనముచే మనమిఱువురము మేధా సంపదను పొందుదుముగాక! మన మొండొరులను ద్వేషింపకుందుముగాక! శాంతి, శాంతి, శాంతి సర్వత్రా వుండుగాక!

తెలుగు జాలజనులారా మీకు స్వాగతం సుస్వాగతం. . రండి రండి. . . మీ ఈ తెలుగుభాగవతం.ఆర్గ్ ఒక అందాల భరిణ లాంటిది. మీ తెలుగు జాలజనులు (నెట్ సిటిజనులు) కోసం, ఎంతో శ్రమించి ఈ భరిణలోని అనేక "అర"లలో ఏర్చి కూర్చిన ఈ అమృత గుళికలు ఆస్వాదించండి:

వ్యాసమహర్షి సంస్కృతంలో రచించిన భాగవతాన్ని పోతనామాత్యులు తెలుగులోనికి ఆంధ్రీకరించి ఆ అమృతభాండాగారాన్ని మన తెలుగులు అందరికీ అందించారు. సమగ్రంగా దేశభాషలలోకి వచ్చిన మొట్టమొదటి భాగవతం ఇదే. అలాగే, తెలుగులోనే కాదు దేశభాషల్లోని గ్రంథాలలో, ఇంత సమగ్రంగా అంతర్జాలంలో అందించిన మొట్టమొదటి గ్రంథంగా మన "తెలుగు భాగవతానికే" ఆ ఘనత దక్కింది. "పలికెడిది భాగవతమట నే పలికిన భవహార మగునట" అని తన వినయాన్ని, భాగవతం పలకడం వల్ల కలిగే ప్రయోజనాన్ని సరళమైన భాషలో చెప్పారు . మన తెలుగు భాగవతం జాలగూడు (వెబ్సైటు)లో భాగవతంలోని 9000+ పద్యాలూ ఉంచడమే కాదు వాటి ప్రతిప్రదార్ధాలు , భావాలే కాకుండా ఆ పద్యం వినేలాగా, నేర్చుకోవడానికి వీలుగా ఉండేలా ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నాం. అంతేకాదు,, భాగవతానికి పోతనామాత్యులవారికీ,. . . చెందిన అనేకానేక విషయాలు, వ్యాసాలు, పుటలు, పుస్తకాలు, ఆటలు, పాటలు. . . మున్నగునవి కూడా ఇక్కడ సంకలనం చేయబడ్డాయి. ఈ జాలగూడు (వెబ్సైటు)లో ఎటువంటి వ్యాపారప్రకటనలు ఉండవు , మీరు స్వేచ్చగా ఏ పద్యానైనా కాపీ చేసుకోవచ్చు, వాడుకోవచ్చు , షేర్ చేసుకోవచ్చు వ్యాపారాత్మకం కానంత వరకు. మీరు షేర్ చేసిన చోట మన భాగవత వెబ్సైటు పేరు ఇవ్వడం ఇవ్వకపోవడం మీ విజ్ఞతకే విడిచిపెడుతున్నాం.

విష్ణుమూర్తి కథలు శుభప్రదమైనవి, అమృతంలా ఉంటాయి; వాటిని ఎన్నిసార్లు విన్నా, ఎప్పటికప్పుడు సరి క్రొత్తగా ఉంటాయి; మన పోతన తెలుగు భాగవతం అలాంటి పవిత్రమైన కథల కాసారం; ఇది భక్తి ప్రపత్తులు, సాహిత్యమే కాకుండా అనేక శాస్త్రీయ, సాంఘిక విషయాలు అసంఖ్యాకంగా ఉన్న ఒక మహా ప్రపంచం; దీని లోని సందేశాన్ని, అనంత విజ్ఞాన విశేషాలను సంపూర్ణంగా, సమగ్రంగా పాత కొత్తల మేలు కలయికగా, అందిస్తున్నాం; రండి రండి: ఆస్వాదించండి


సంకలనములు
పిల్లలకు:-

ఎంచిన పద్యాలు:-

ఎంచిన ఘట్టాలు:- మున్నగునవి

పుస్తకములు:- మొదలైనవి.

వ్యాకరణాదులు:- వంటివి.

వివరణలు:- .

ఇతరములు:- వగైరా

పరిశోధనలు:- .

గణాంకములు:- జాబితాలు, పట్టికలు, పదకేళి అక్షర కేళి వంటి దత్తైలు, అకారాది - ఛందోవారీ జాబితాలు లాంటివి.