పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

: :చదువుకుందాం భాగవతం; బాగుపడదాం మనం అందరం: :


భాగవత గణనాధ్యాయం అనే వినూత్న (ఇన్నొవేటివ్) నవ్య (వితౌట్ ప్రిసిడెన్స్) సాహితీ ప్రక్రియను భావించిన (కాన్సెప్ట్యులైజేషను) ఉద్దేశ్యము తెలుగు భాగవతము 9014 పద్యగద్యలను ఏ పద్యానికి ఆ పద్యగద్యం, ఏ పదానికి ఆ పదం, ఏ అక్షరానికి ఆ అక్షరం విడదీసి, ఎంచి, మధించి, గణించి అధ్యయనం చేసి కంప్యూటరుతో జనింపజేసిన పట్టికలు, పటాలు, జాబితాలను ఉపయోగించి అధ్యయన పత్రాలు చేసికొనుటకు వలసిన దత్తైలను రూపొందించా లన్నది. మరియు కొన్ని మాదిరి జాబితాలు, పట్టికలు, పటాలు రూపొందించాలి అని.

దానికి అనుగుణంగా తెలుగుభాగవత పాఠ్యము మొదలైనవి సంకలనం చేసి దత్తైలను చేయటమైనది. ఉదాహరణకు స్కంధాల వారీ, పద్యాలవారీ రూపొందించిన ప్రథమాక్షర, ప్రథమ పదాల దత్తై ఉపయోగపడుతోంది. అలాగే పదాల, అక్షరాల దత్తైలు రూపొందించి ప్రయోగించబడ్డాయి. కాని పిమ్మట పాఠ్యాదులు రెండు ఆవృత్తుల సంస్కరణలను జేసుకున్న నేపథ్యంలో ఆయా దత్తైలను మరింత సంస్కరింప వలసిన అవసరం ఏర్పడింది. ఆ కార్యక్రమం పూర్తి చేసుకుని కొన్ని మాదిరులు తయారు చేసి వాటిని కూడ ఇక్కడ జత చేయవలసినది ఉన్నది. దానికి కొంత సమయం పడుతుంది. దయచేసి మన్నించగలరు.