పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

నవమ స్కంధము : దుష్యంతుని చరిత్రము

  •  
  •  
  •  

9-604-క.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

మా కందర్పుని శరములు
మాకందము లగుటఁ జేసి మా కందంబుల్
మాకందము లను కైవడి
మాకందాగ్రములఁ బికసమాజము లులిసెన్.

టీకా:

మా = మా యొక్క; కందర్పుని = మన్మథుని; శరములు = బాణములు; మాకందములు = మామిడిపూలు; అగుటన్ = ఐ ఉండుటచేత; మాకందంబుల్ = మామిడిచెట్లు; మా = మా; కున్ = కు; అందములు = తగినవి; అను = అనుచున్న; కైవడిన్ = విధముగ; మాకంద = మామిడిచెట్ల; అగ్రములన్ = కొనకొమ్మలలో; పిక = కోయిలల; సమాజమున్ = సమూహములు; ఉలుసెన్ = కూజితములు చేసినవి .

భావము:

మా మన్మథునిబాణాలు మామిడిపూలు అగుటచేత మామిడిచెట్లు మాకు తగి ఉన్నాయి అంటున్నట్లుగా కోయిలలు కూస్తున్నాయి.