పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

నవమ స్కంధము : విశ్వామిత్రుని వృత్తాంతము

  •  
  •  
  •  

9-505-క.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

వేలుపులఱేఁడు గురుచే
వేలిమి వేల్పించి బలిమి వెలయఁగ నిజ దం
భోళిని రజిసుతులను ని
ర్మూము గావించి స్వర్గముం గైకొనియెన్.

టీకా:

వేలుపులఱేడున్ = ఇంద్రుడు; గురు = బృహస్పతి; చేన్ = చేత; వేలిమిన్ = హోమమును; వేల్పించి = చేయించి; బలిమిన్ = బలము; వెలయగన్ = అతిశయించగ; నిజ = తన; దంభోళిన్ = వజ్రాయుధముతో; రజి = రజి యొక్క; సుతులను = పుత్రులను; నిర్మూలనము = నాశనము; కావించెన్ = చేసెను; స్వర్గమున్ = స్వర్గమును; కైకొనియెన్ = చేపట్టెను.

భావము:

అంతట ఇంద్రుడు బృహస్పతి చేత హోమం చేయించాడు. అతిశయించిన బలంతో వజ్రాయుధం ప్రయోగించి రజి పుత్రులను నాశనం చేసి, స్వర్గాన్ని చేపట్టాడు.