పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

నవమ స్కంధము : నిమి కథ

  •  
  •  
  •  

9-373-ఆ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

తఁడు మఖము చేయ వని దున్నింపంగ
లాంగలంబుకొనను క్షణాంగి
సీత జాత యయ్యె సీరధ్వజుం డనఁ
దానఁ జెప్పఁబడియె న్యుఁ డతఁడు.

టీకా:

అతడు = అతడు; మఖమున్ = యాగము; చేయన్ = చేయుటకై; అవనిన్ = భూమిని; దున్నింపగన్ = దున్నించుచుండగా; లాంగలంబు = నాగలి; కొనను = చివర; లక్షణాంగి = సౌభాగ్యవతి {లక్షణాంగి - శుభలక్షణములుగల అవయవములు గలామె, సౌభాగ్యవతి}; సీత = సీతాదేవి {సీత - సీత (నాగేటి చాలు)న పుట్టినామె, సీతాదేవి}; అయ్యె = కలిగినది; సీరధ్వజుండును = సీరధ్వజుడు {సీరధ్వజుడు - సీరము (నాగలి) ధ్వజుడు (గుర్తుగాగలవాడు), జనకుడు}; అనన్ = అని; దానన్ = అందుచేతనే; చెప్పంబడియన్ = పిలవబడెను; ధన్యుడు = ధన్యాత్ముడు; అతడు = అతను.

భావము:

ఆ సీరధ్వజుడు యాగం చేయడానికి భూమి దున్నుతుంటే, నాగలి చాలులో శుభలక్షణాంగి సీతాదేవి పుట్టింది. అందుకే ఆ పుణ్యాత్ముడిని సీరధ్వజుడు అని పిలుస్తారు.