పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

నవమ స్కంధము : నిమి కథ

  •  
  •  
  •  

9-370-వ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

అని పలికిన నిమిమాటలు క్రమ్మఱింపనేరక "శరీరులు గన్నులు దెఱచినప్పుడును, మూసినప్పుడును నిమి గానవచ్చుంగాక" యని పల్కి దేవతలు చని; రంత.

టీకా:

అని = అని; పలికినన్ = అనినట్టి; నిమి = నిమియొక్క; మాటలు = పలుకులను; క్రమ్మఱింపనేరక = తిరస్కరించలేక; శరీరులు = దేహధారులు; కన్నులున్ = కళ్ళను; తెఱచినన్ = తెరచెడి; అప్పుడున్ = సమయమునందు; మూసినన్ = మూసెడి; అప్పుడును = సమయమునందును; నిమి = నిమి; కానవచ్చుంగాక = అస్థిత్వమగుగాక; అని = అని; పల్కి = నిర్ణయించి; దేవతలు = దేవతలు; చనిరి = వెళ్ళిపోయిరి; అంతన్ = అప్పుడు.

భావము:

ఇలా అన్న నిమి పలుకులను తిరస్కరించలేక, దేవతలు “దేహధారులు కన్నులు తెరచేటప్పుడు, మూసేటప్పుడు నిమి అస్థిత్వం కనబడుతుండు గాక” అని పలికి వెళ్ళిపోయారు. అప్పుడు.