పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

నవమ స్కంధము : శ్రీరాముని కథనంబు

  •  
  •  
  •  

9-327-సీ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

టికంపు గోడలు వడంపు వాకిండ్లు-
నీలంపుటరుగులు నెఱయఁ గలిగి
మనీయ వైడూర్య స్తంభచయంబుల-
కరతోరణముల హిత మగుచు
డగల మాణిక్యద్ధ చేలంబులఁ-
జిగురుఁ దోరణములఁ జెలువు మీఱి
పుష్పదామకముల భూరివాసనలను-
హుతరధూపదీముల మెఱసి

9-327.1-తే.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

మాఱువేల్పులభంగిని లయుచున్న
తులుఁ బురుషులు నెప్పుడు సందడింప
గుఱుతు లిడరాని ధనముల కుప్ప లున్న
రాజసదనంబునకు వచ్చె రామవిభుఁడు.

టీకా:

పటికంపు = స్పటికముల; గోడలు = గోడలు; పవడంపు = పగడాల; వాకిండ్లు = వాకిళ్ళు; నీలంపు = ఇంద్రనీలాల; అరుగులు = వేదికలు; నెఱయన్ = నిండుగ; కలిగి = ఉండి; కమనీయ = మనోహరమైన; వైడూర్యక = వైడూర్యములుపొదిగిన; స్తంభ = స్తంభముల; చయములన్ = సమూహములతో; మకరతోరణములన్ = మకరతోరణములతోను; మహితము = గొప్పగా ఉన్నది; అగుచున్ = అగుచు; పడగలన్ = ధ్వజములతో; మాణిక్య = మాణిక్యములు; బద్ద = పొదిగిన; చేలంబులన్ = వస్త్రములతో; చిగురు = చిగురటాకుల; తోరణంబులన్ = తోరణములతో; చెలువుమీఱి = అందగించి; పుష్ప = పూల; దామకముల = దండల; భూరి = చాలాఎక్కువ; వాసనలను = సువాసనలుతో; బహుతర = చాలాఎక్కువ {బహు - బహుతర -బహుతమ}; ధూప = ధూపములు; దీపములన్ = దీపములతోను; మెఱసి = వెలిగిపోతూ.
మాఱువేల్పుల = దేవతలలాంటి; భంగిని = విధముగ; మలయుచున్న = తిరుగుచున్న; సతులున్ = స్త్రీలు; పురుషులున్ = మగవారు; ఎప్పుడున్ = అంతా; సందడింపన్ = సందడిచేయుచుండగా; గుఱుతులిడరాని = లెక్కలేనన్ని; ధనముల = ధనముల; కుప్పలు = రాశులు; ఉన్న = ఉన్నట్టి; రాజసదనంబున్ = రాజప్రసాదమున; కున్ = కు; వచ్చెన్ = వచ్చెను; రామవిభుడు = శ్రీరామచంద్రప్రభువు.

భావము:

స్పటికాల గోడలు, పగడాల వాకిళ్ళు, ఇంద్రనీలాల వేదికలు నిండుగ ఉన్నాయి. వైడూర్యాలు పొదిగిన స్తంభాలు, మకర తోరణాలతో, ధ్వజాలతో, మాణిక్యాలు పొదిగిన వస్త్రాలతో, చిగురటాకుల తోరణాలతో, పూలదండలసువాసనలతో, ధూప దీపాలతో, దేవతలలా తిరిగుతున్న స్త్రీపురుషులతో, అనంత ధనరాసులతో మనోఙ్ఞంగా ప్రకాశిస్తున్న రాజప్రసాదానికి శ్రీరామచంద్రప్రభువు వచ్చాడు.