పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

నవమ స్కంధము : శ్రీరాముని కథనంబు

  •  
  •  
  •  

9-314-ఉ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

శోషితదానవుండు నృపసోముఁడు రాముఁడు రాక్షసేంద్రతా
శేవిభూతిఁ గల్పసమజీవివి గమ్మని నిల్పె నర్థి సం
తోణుఁ బాపశోషణు నదూషణు శశ్వదరోషణున్ మితా
భాణు నార్యపోషణుఁ గృపాగుణభూషణు నవ్విభీషణున్.

టీకా:

శోషిత = నాశనముచేయబడిన; దానవుండు = రాక్షసులు కలవాడు; నృప = రాజులనెడి చుక్కలలో; సోముడు = చంద్రునివంటివాడు; రాముడు = రాముడు; రాక్షసేంద్రత్ = రాక్షసరాజ్యాధికారపు; అశేష = అంతులేని; విభూతిన్ = వైభవమును; ఆకల్ప = కల్పాంతమువరకు; సమజీవివిన్ = చక్కగాజీవించెడివాడవు; కమ్ము = ఐ ఉండుము; అని = అని; నిల్పెన్ = నిలబెట్టెను; అర్థి = అడిగినవారిని; సంతోషణున్ = సంతోషపెట్టువానిని; పాప = పాపములను; శోషణున్ = రహితుని; అదూషణున్ = నిందించుటలేనివానిని; శశ్వత్ = శాశ్వతముగా; అరోషణున్ = కోపములేనివానిని; మితా = మితముగా; భాషణున్ = మాట్లాడువానిని; ఆర్య = పెద్దలను; పోషణున్ = పోషించెడివానిని; కృపాగుణ = దయాగుణము; భూషణున్ = అలంకారముగాగలవానిని; ఆ = ఆ; విభీషణున్ = విభీషణుని.

భావము:

రాక్షసులను నాశనం చేసిన శ్రీరామచంద్రుడు పాప రహితుడు, అర్థులను తృప్తిపరచువాడు, మృదుభాషి, మితభాషి, శాంతస్వభావి, పెద్దలను గౌరవించువాడు, దయాగుణశాలి అయిన విభీషణుని రాక్షసరాజ్యానికి పట్టంకట్టాడు. అంతులేని వైభవంతో కల్పాంతంవరకు చక్కగా జీవించు అని అనుగ్రహించాడు.