పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

నవమ స్కంధము : శ్రీరాముని కథనంబు

  •  
  •  
  •  

9-289-వ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

ఇట్లు సముద్రంబు దాఁటి రామచంద్రుండు రావణు తమ్ముం డైన విభీషణుండు శరణంబు వేఁడిన నభయం బిచ్చి; కూడుకొని లంకకుఁ జని విడిసి వేడెపెట్టించి లగ్గలుపట్టించిన.

టీకా:

ఇట్లు = ఈ విధముగ; సముద్రంబున్ = సముద్రమును; దాటి = తరించి; రామచంద్రుండు = శ్రీరాముడు; రావణు = రావణుని; తమ్ముండు = తమ్ముడు; ఐన = అయినట్టి; విభీషణుండు = విభీషణుడు; శరణంబు = అండ; వేడినన్ = కోరగా; అభయంబున్ = అభయమును; ఇచ్చి = ఇచ్చి; కూడుకొని = కలుపుకొని; లంక = లంకానగరమున; కున్ = కు; చని = వెళ్ళి; విడిసి = విడిది ఏర్పరచుకొని; వేడెపెట్టించి = చుట్టుముట్టి; లగ్గలుపట్టించిన = ముట్టడించి కోటలెక్కించిన.

భావము:

ఈ విధంగ సముద్రం దాటి శ్రీరాముడు తన అండ కోరిన శత్రువు రావణుని తమ్ముడు విభీషణుడికి అభయం ఇచ్చాడు. తన పరివారంలో కలుపుకున్నాడు. లంకానగరం వెళ్ళి విడిసి, చుట్టుముట్టి, ముట్టడించాడు. కోటలెక్కించాడు.