పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

నవమ స్కంధము : శ్రీరాముని కథనంబు

  •  
  •  
  •  

9-288-క.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

శైలంబులుఁ దరువులు
జవమునఁ బెఱికి తెచ్చి పికులనాథుల్
జలరాశిం గట్టిరి
వాహప్రముఖదివిజణము నుతింపన్.

టీకా:

ఘన = పెద్ద; శైలంబులున్ = కొండరాళ్ళు; తరువులు = వృక్షములు; ఘన = మిక్కిలి; జవమునన్ = వేగముగా; పెఱికి = పెకిలించి; తెచ్చి = తీసుకొని వచ్చి; కపి = వానర; కుల = జాతి; నాథుల్ = నాయకులు; ఘనజలరాశిన్ = సముద్రముపైన; కట్టిరి = నిర్మించిరి; ఘనవాహ = ఇంద్రుడు {ఘనవాహుడు - ఘన (మేఘము)లపై వాహ (విహరించువాడు), ఇంద్రుడు}; ప్రముఖ = మున్నగు; దివిజ = దేవతా; గణము = సమూహము; నుతింపన్ = స్తుతించగా.

భావము:

శీఘ్రమే పెద్ద కొండరాళ్ళు, వృక్షాలు పెకిలించి తీసుకొని వచ్చి వానర జాతి నాయకులు సముద్రము మీద వారధి నిర్మించారు. ఇంద్రాది దేవతలు అందరూ స్తుతించారు.