పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

నవమ స్కంధము : కల్మాషపాదుని చరిత్రము

  •  
  •  
  •  

9-237.1-తే.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

వాఁడు మానవ మాంసంబు వండి తెచ్చి
మునికి వడ్డింపఁ గోపించి ముని నరేంద్రుఁ
బిలిచి మనుజామిషంబును బెట్టి తనుచు
లుకతో రాక్షసుఁడవు గమ్మని శపించె.

టీకా:

ఆ = ఆ; సుదాసుడు = సుదాసుడు; వేట = వేటాడుట; కై = కోసము; వనంబున్ = అడవి; కిన్ = కి; ఏగి = వెళ్ళి; గర్వించి = మదించి; ఒక్క = ఒకానొక; రక్కసునిన్ = రాక్షసుని; చంపి = సంహరించి; వాని = అతని; తోబుట్టినవాని = సోదరుని; పోవిడిచినన్ = పోనివ్వగా; వాడునున్ = అతడు; తన = తనయొక్క; తోడివాని = సోదరుని; చావు = మరణమును; పోనీక = వదలిపెట్టక; కపటి = మోసముచేయువాడు; ఐ = అయ్యి; భూపాలున్ = రాజుయొక్క; గృహమునన్ = ఇంటిలో; అడబాలతనమునన్ = వంటవానివలె; అర్తిన్ = కోరి; కొలిచి = కొలువులోచేరి; ఉండన్ = ఉండగ; వసిష్ఠున్ = వసిష్ఠుని; కున్ = కి; ఉర్వీశుడు = రాజు {ఉర్వీశుడు - ఉర్వి (భూమి)కి ఈశుడు, రాజు}; ఒక్క = ఒకానొక; నాడు = దినమున; అన్నంబు = భోజనంబు; చేయంగన్ = తినుటకు; అతనిన్ = అతనిని; పనుపన్ = నియమించగా;
వాడు = అతడు; మానవమాంసంబు = నరమాంసముతో; వండి = వంటచేసి; తెచ్చి = తీసుకొని వచ్చి; ముని = ఋషి; కిన్ = కి; వడ్డింపన్ = వడ్డించగా; కోపించి = కోపముచేసి; ముని = ఋషి; నరేంద్రున్ = రాజుని; పిలిచి = పిలిపించి; మనుజామిషంబును = నరమాంసమును; పెట్టితి = పెట్టావు; అనుచున్ = అంటు; అలుక = కోపము; తోన్ = తోటి; రాక్షసుడవు = రాక్షసుడవుగా; కమ్ము = అయిపోవుము; అని = అని; శపించెన్ = శాపమునిచ్చెను.

భావము:

“ఆ సుదాసుడు వేటకి అడవికి వెళ్ళి ఒక రాక్షసుడిని సంహరించాడు. అతని సోదరుని చంపకుండా పోనిచ్చాడు. ఆ సోదరుడు పగబట్టాడు. మోసపూరితంగా వంటవానిలా వచ్చి రాజు కొలువులో చేరాడు. ఒక దినం రాజు వసిష్ఠుని భోజనానికి ఆహ్వానించాడు. భోజనం వండి పెట్టమని ఆ రాక్షససోదరుని నియమించాడు. అతడు నరమాంసముతో వంటచేసి తీసుకువచ్చి ఋషికి వడ్డించాడు. కోపగించిన వసిష్ఠుడు రాజుని “పిలిచి నరమాంసం పెట్టావు కనుక రాక్షసుడవు అయిపోమ్ము” అని శపించాడు.