పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

నవమ స్కంధము : సగరుని కథ

  •  
  •  
  •  

9-213.1-తే.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

గాన రొకవేళఁ జీఁకటిఁ గందు రాత్మ
లందుఁ దెలియరు వెలుపల మరు బొందు
రయుదురు దేహధారు లత్యంధు లగుచుఁ
డిఁది నీ మాయ నెన్నఁడుఁ డువ లేక."

టీకా:

మతిన్ = మనసుని; చిక్కబట్టి = చిక్కబట్టుకొని; సమాధి = యోగసమాధి; గౌరవమునన్ = అవస్థలో; వాసిగా = ప్రసిద్ధమైన; తన = తన; కున్ = కు; అవ్వల = అతీతముగ; వెలుంగు = ప్రకాశించెడి; నినున్ = నిన్ను; కానడు = చూడలేడు; ఒకనాడు = ఎప్పటికిని; నిన్నున్ = నిన్ను; ఎఱుంగునె = తెలియగలడే; బ్రహ్మ = బ్రహ్మదేవుడు; యజుని = బ్రహ్మదేవుని; మనంబునన్ = మనసునుండి; అవయవముల = అవయవములనుండి; బుద్ధిన్ = బుద్ధినుండి; జన్మించిన = పుట్టినట్టి; భూరి = అనేకమైన; జంతువులు = జీవుల; అందున్ = లో; హీనులము = అల్పులము; ఐన = అయినట్టి; మా = మా; కున్ = కు; ఎఱుగన్ = తెలిసికొనుట; వశమె = సాధ్యమా, కాదు; తమ = వారి; లోనన్ = లోనే; నీవు = నీవు; ఉండన్ = ఉండగా; తాము = వారు; ఎఱుంగరు = తెలిసికొనలేరు; నిన్నున్ = నిన్ను; గుణములన్ = త్రిగుణాత్మకంగా; చూతురు = చూచెదరు; గుణములు = లక్షణములు; ఐనన = అయినప్పటికి; కానరు = చూడలేరు; ఒకవేళ = ఏకారణంచేతనైన; చీకటి = తమోగుణమును; కందురు = దర్శించెదరు; ఆత్మన్ = తమయాత్మల; అందున్ = లో; తెలియరు = తెలిసికొనలేరు.
వెలుపలన్ = బయట; అమరు = ఉండునట్టి; బొందులన్ = రూపములను; అరయుదురు = చూచెదరు; దేహధారులు = జీవులు {దేహధారులు - శరీరములు గలవారు, జీవులు}; అతి = మిక్కిలి; అంధులు = గుడ్డివారు; అగుచున్ = ఔతూ; కడిది = దాటరాని; నీ = నీ యొక్క; మాయన్ = మాయను; ఎన్నడున్ = ఎప్పటికి; గడువలేక = దాటలేక.

భావము:

“మనసుని చిక్కబట్టుకొని యోగసమాధి సిద్ధిపొందిన ఆ బ్రహ్మదేవుడు సైతం, తనకు అతీతముగ ప్రకాశించే నిన్ను తెలియలేడు. ఆ బ్రహ్మదేవుడి మనసు నుండి అవయవాల నుండి బుద్ధి నుండి పుట్టిన అసంఖ్యాక జీవులలో అల్పులము అయిన మాకు తెలిసికొనుట ఎంత మాత్రం సాధ్యం కాదు. వారితో పాటు నీవు ఉన్నా కూడ, వారు నిన్ను తెలిసికొనలేరు. గుణ ప్రధానులు అయిన దేహధారులు, నీ మాయకు చిక్కి తమోగుణంతో బాహ్యాన్ని మాత్రమే చూస్తారు.”