పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

నవమ స్కంధము : సగరుని కథ

  •  
  •  
  •  

9-206-వ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

ఇట్లు సుమతికొడుకులు నేలంద్రవ్వి పాతాళంబునం దూర్పుముట్టి యున్న నుత్తరభాగంబునం గపిలమునిపొంతనున్న తురగంబుఁ గని.

టీకా:

ఇట్లు = ఈ విధముగ; సుమతి = సగరుని భార్య సుమతి; కొడుకులు = పుత్రులు; నేలన్ = భూమిని; త్రవ్వి = తవ్వి; పాతాళంబునన్ = పాతాళలోకమునందు {తూర్పుముట్టియున్ననుత్తరభాగము - ఈశాన్యము}; తూర్పున్ = తూర్పుదిక్కును; ముట్టి = తగిలి; ఉన్నన్ = ఉన్నట్టి; ఉత్తర = ఉత్తరపు; భాగంబునన్ = దిశవైపున; కపిల = కపిలుడు అనెడి; ముని = ఋషి; పొంతన్ = దగ్గర; ఉన్నన్ = ఉన్నట్టి; తురగంబున్ = గుఱ్ఱమును; కని = చూసి.

భావము:

ఇలా భూమిని తవ్విన సుమతి, సగరుని భార్య, పుత్రులు పాతాళలోకంలో ఉత్తర ఈశాన్య భాగంలో తపస్సు చేసుకుంటున్న కపిలమహర్షి దగ్గర ఉన్న గుఱ్ఱాన్ని కనుగొన్నారు.