పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

నవమ స్కంధము : దూర్వాసుని కృత్య కథ

  •  
  •  
  •  

9-150-క.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

రి గొల్చుచుండువారికిఁ
మేష్ఠిపదంబు మొదలు దభోగంబుల్
కసమము లను తలఁపున
ణీ రాజ్యంబుతోడి గులము మానెన్.

టీకా:

హరిన్ = విష్ణుమూర్తిని; కొల్చుచుండు = సేవించెడి; వారి = వైరల; కిన్ = కు; పరమేష్ఠి = బ్రహ్మదేవుని; పదంబున్ = పదవి, పీఠము; మొదలు = మొదలైన; పద = పదవీ; భోగంబుల్ = భోగములు; నరక = నరకముతో; సమములు = సమానమైనవి; అను = అనెడి; తలపునన్ = భావముతో; ధరణీ = భూమండలమంతటి; రాజ్యంబున = రాజ్యాధికారము; తోడి = తోటి; తగులము = మోహమును; మానెన్ = వదలివేసెను.

భావము:

విష్ణుమూర్తిని సేవించె వారికి బ్రహ్మపదవి మొదలైన పదవీ భోగాలు నరకంతో సమానం అనెడి తలంపుతో, అంత గొప్ప రాజ్యాధికారం ఎడల మోహం వదలివేసాడు.