పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

నవమ స్కంధము : దూర్వాసుని కృత్య కథ

  •  
  •  
  •  

9-104-క.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

కాలానల సన్నిభయై
శూలాయుధహస్త యగుచు సుఱసుఱ స్రుక్కన్
నేలఁ బదంబులఁ ద్రొక్కుచు
వాలి మహాకృత్య మనుజల్లభుఁ జేరెన్.

టీకా:

కాలానల = ప్రళయాగ్ని; సన్నిభ = సమానమైనది; ఐ = అయ్యి; శూలాయుధ = శూలాయుధము; హస్త = చేతగలది; అగుచున్ = ఔతూ; సుఱసుఱ = చురచురమని; స్రుక్కన్ = కుంగిపోవునట్లు; నేలన్ = భూమిని; పదంబులన్ = కాళ్ళతో; త్రొక్కుచున్ = తొక్కుతు; వాలి = దూకి; మహా = గొప్ప; కృత్య = పిశాచము; మనుజవల్లభున్ = రాజును; చేరెన్ = దగ్గరకువెళ్ళెను.

భావము:

ఆ భీకరమైన కృత్య శూలం బట్టుకుని, ప్రళయాగ్నిలా చురచురమంటూ, భూమి కుంగిపోయేలా కాళ్ళతో తొక్కుతు, దూకుతూ రాజు దగ్గరకు వెళ్ళింది.