పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

అష్టమ స్కంధము : పూర్ణి

  •  
  •  
  •  

8-743-క.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

రాజేంద్ర! దైత్యదానవ
రామహాగహన దహన! రాజస్తుత్యా!
రాజావతంస! మానిత
రాధరార్చిత! గుణాఢ్య! రాఘవరామా!

టీకా:

రాజేంద్ర = మహారాజా {రాజేంద్రుడు – రాజులలో ఇంద్రుని వంటివాడు, శ్రీరాముడు}; దైత్యదానవరాజమహాగహనదహన = శ్రీరామా {దైత్య దానవ రాజ మహాగహన దహనుడు – దైత్యల యొక్క, దానవుల యొక్క రాజులు అనే గొప్ప అడవిని దహించినవాడు, శ్రీరాముడు}; రాజస్తుత్య = శ్రీరామా {రాజ స్తుత్యుడు - రాజులచేత స్తుతింపబడువాడు, శ్రీరాముడు}; రాజావతంస = శ్రీరామా {రాజా వతంసుడు - రాజులందరిలోను తలమానికమైనవాడు, శ్రీరాముడు}; మానిత = మన్నింపదగినవాడైన; రాజధరార్చిత = శ్రీరామా {రాజధ రార్చితుడు - రాజధరుని (చంద్రధరుడైన శివుని)చే అర్చితుడు, శ్రీరాముడు}; గుణాఢ్య = శ్రీరామా {గుణాఢ్యుడు - సుగుణసంపన్నుడు, శ్రీరాముడు}; రాఘవరామ = శ్రీరామా {రాఘవ రాముడు - రఘువంశలలాముడు, శ్రీరాముడు}.

భావము:

రాజులలో ఇంద్రుని వంటి వాడా! రాక్షస రాజులనే గొప్ప అడవిని కాల్చినవాడా! రాజులచేత స్తుతింప బడినవాడా! రాజులలో తలమానికం అయినవాడా! మహానుభావుడైన శివునిచేత పూజింపబడినవాడా! గుణసంపన్నుడా! రఘవంశలలామా!