పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

అష్టమ స్కంధము : రాక్షసుల సుతల గమనంబు

  •  
  •  
  •  

8-674-ఆ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

"ర్వగతుఁడ వయ్యు మదర్శనుఁడ వయ్యు
నొకట విషమవృత్తి నుండు దరయ
నిచ్ఛలేనివారి కీవు భక్తులు గోరు
లఁపు లిత్తు కల్పరువు మాడ్కి."

టీకా:

సర్వగతుడవు = అన్నిటి యందు నుండువాడవు; సమదర్శనుడవు = సర్వుల ఎడల సమదృష్టి కలవాడవు; అయ్యున్ = అయినప్పటికిని; ఒకటన్ = ఒక్కొక్కసారి; విషమవృత్తిన్ = పక్షపాతబుద్ధితో; ఉండుదు = ఉండెదవు; అరయ = తరచిచూసినచో; ఇచ్ఛ = భక్తి; లేని = లేనట్టి; వారి = వారి; కిన్ = కి; ఈవు = వరములీయవు; భక్తులు = భక్తులు; కోరు = కోరెడి; తలపుల్ = కోరికలను; ఇత్తు = ప్రసాదించెదవు; కల్పతరువు = కల్పతరువు; మాడ్కిన్ = వలె.

భావము:

నీవు అన్నింటిలోనూ వ్యాపించి ఉంటావు. అందరిని సమానంగా చూస్తావు. అయినప్పటికీ ఒక్కొక్కసారి పక్షపాతాన్నిచూపుతావు. భక్తిలేనివారి కోరికలు తీర్చవు. కల్పవృక్షంవలె భక్తులైనవారి కోర్కెలు నెరవేర్చుతావు.”