పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

అష్టమ స్కంధము : వామనుని భిక్షాగమనము

  •  
  •  
  •  

8-527-క.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

ర్వప్రపంచ గురుభర
నిర్వాహకుఁ డగుటఁజేసి నెఱిఁ జనుదేరన్
ర్వుని వ్రేఁగు సహింపక
యుర్వీస్థలి గ్రుంగె; మ్రొగ్గె నురగేంద్రుండున్.

టీకా:

సర్వ = అఖిల; ప్రపంచ = లోకముల; గురు = బరువును; భర = భరించుట; నిర్వాహకుడు = చేయువాడు; అగుటన్ = అగుట; చేసి = వలన; నెఱిన్ = క్రమముగా; చనుదేర = వెశ్ళుచుండగ; ఖర్వుని = పొట్టివాని; వ్రేగున్ = భారమును; సహింపక = తట్టుకొనలేక; ఉర్వీస్థలి = భూమండలము; క్రుంగెన్ = కుంగిపోయినది; మ్రొగ్గెన్ = వంగిపోయెను; ఉరగేంద్రుండున్ = ఆదిశేషుడు.

భావము:

భగవంతుడైన వామనుడు తన కడుపులో సమస్త లోకాలను భరించేవాడు కదా. అందుకే, అతడు ఒయ్యారంగా నడిచేటప్పుడు అతని బరువు తట్టుకోలేక భూమి కృంగిపోయింది. ఆదిశేషుడు వంగిపోయాడు.