పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

అష్టమ స్కంధము : వామనుడు గర్భస్తు డగుట

  •  
  •  
  •  

8-499-క.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

పెట్టుదురు నుదుట భూతిని
బొట్టిడుదురు మేఁన బట్టుఁ బుట్టపుదోయిం
బెట్టుదురు వేల్పు లమ్మకుఁ
ట్టుదురు సురక్ష పడఁతిర్భంబునకున్.

టీకా:

పెట్టుదురు = పెట్టెదరు; నుదుటన్ = నుదుటిమీద; భూతిని = విభూతిని; బొట్టిడుదురు = బొట్టుగా పెట్టెదరు; మేనన్ = ఒంటిమీదకి; పట్టు = పట్టు; పుట్టపు = బట్టల; దోయిన్ = జత (2)ని; పెట్టుదురు = పెట్టెదరు; వేల్పులమ్మ = అదితి; కున్ = కి; కట్టుదురు = కట్టెదరు; సురక్ష = రక్షాతోరమును; పడతి = సతి యొక్క; గర్భంబున్ = గర్భమున; కున్ = కు.

భావము:

పెద్దముత్తైదువలు ఆదిత్యులకు తల్లి అయిన అదితికి నుదుట విభూతి పెట్టారు. తిలకం దిద్దారు పట్టుబట్టలు కట్టారు. ఆమె గర్భానికి రక్ష కట్టారు.