పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

అష్టమ స్కంధము : స్వర్గ వర్ణనము

  •  
  •  
  •  

8-448-క.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

మారు నగవులకును గను
మూరు కాలంబు కతన ముదియరు ఖలులన్
డారు పుణ్యజనంబుల
బారు సురరాజ వీటి ప్రమదాజనముల్.

టీకా:

మాయరు = చెరగనివ్వరు; నగవుల్ = నవ్వుల; కునున్ = కు; కనుమూయరు = మరణించరు, కన్నులార్పరు; కాలంబు = కాలము యొక్క; కతనన్ = ప్రభావమువలన; ముదియరు = ముసలివారుకారు; ఖలులన్ = దుష్టులను; డాయరు = దరిచేరరు; పుణ్యజనంబులన్ = పుణ్యవంతులను; పాయరు = విడువరు; సురరాజ = దేవేంద్రుని; వీటి = పట్టణపు; ప్రమదా = స్త్రీ; జనముల్ = జనములు.

భావము:

దేవేంద్రుడి పట్టణంలోని స్త్రీలు ఎల్లప్పుడూ నవ యౌవ్వన యువతులుగానే ఉంటారు. వారికి చిరునవ్వులతో అలసట, వడలిపోవడం లాంటివి ఉండవు. కన్నులార్పడం ఉండదు (అందుకే దేవతలను అనిమిషులు అంటారు). కాల ప్రభావానికి లొంగి ముసలివారు కారు. దుష్టులను దరిచేరనీయరు. పుణ్యాత్ములను ఎడబాయరు.