పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

అష్టమ స్కంధము : ఉచ్చైశ్రవ ఆవిర్భవము

  •  
  •  
  •  

8-256-క.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

పగు నురమును బిఱుఁదును
నెఱిఁ దోఁకయు ముఖముసిరియు నిర్మలఖురముల్
కుచచెవులుఁ దెలిఁగన్నులు
చగు కందంబుఁ జూడఁ గు నా హరికిన్.

టీకా:

ఒఱపు = దృఢమైన; ఉరమునున్ = రొమ్ము; పిఱుదునున్ = పిరుదులు; నెఱిన్ = నిండైన; తోకయున్ = తోక; ముఖము = ముఖము; సిరియు = శోభ; నిర్మల = స్వచ్ఛమైన; ఖురములున్ = గిట్టలు; కుఱుచ = పొట్టి; చెవులున్ = చెవులు; తెలి = తెల్లని; కన్నులున్ = కళ్ళు; తఱచు = దళసరిదైన; అగు = అయినట్టి; కందంబునున్ = కంఠము; చూడన్ = చూచుటకు; తగున్ = తగిననట్టివి; ఆ = ఆ; హరి = గుఱ్ఱమున; కిన్ = కు.

భావము:

ఆ ఉచ్ఛైశ్రవము అనే ఆ హరి (గుఱ్ఱం) దృఢమైన రొమ్ము, చిక్కని పిరుదును, చక్కటి తోక, కాంతివంతంగా తళతళలాడే ముఖము, స్వచ్ఛమైన గిట్టలు, పొట్టి చెవులు, శుభ్రమైన కన్నులు, బలమైన మెడ కలిగి చూడముచ్చటగా ఉంది.