పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

అష్టమ స్కంధము : గరళ భక్షణము

  •  
  •  
  •  

8-232-వ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

అని మఱియు నభినందించుచున్న ప్రజాపతి ముఖ్యులం గని సకల భూత సముండగు నద్దేవదేవుండుఁ దన ప్రియసతి కిట్లనియె.

టీకా:

అని = అని; మఱియున్ = ఇంకను; అభి = మిక్కిలిగ; నందించుచున్న = స్తోత్రముచేయుచున్న; ప్రజాపతి = బ్రహ్మదేవుడు; ముఖ్యులన్ = మున్నగువారిని; కని = చూసి; సకల = సర్వ; భూత = ప్రాణులను; సముండు = సమానంగా చూచెడివాడు; అగు = అయిన; ఆ = ఆ; దేవుండు = దేవుడు; తన = తన యొక్క; ప్రియ = ఇష్టమైన; సతి = భార్య; కిన్ = కి; ఇట్లు = ఈ విధముగ; అనియె = పలికెను.

భావము:

ఇలా తనను స్తుతిస్తున్న బ్రహ్మాది దేవతలను చూసి, సర్వప్రాణులనూ సమానంగా ఆదరించే పరమ విభుడు, శంకరుడు తన అనుంగు భార్యతో ఇలా అన్నాడు....