పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

సప్తమ స్కంధము : ప్రహ్లాద చరిత్రము

  •  
  •  
  •  

7-149-తే.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

ను మయస్కాంతసన్నిధి నెట్లు భ్రాంత
గు హృషీకేశు సన్నిధి నా విధమునఁ
రఁగుచున్నది దైవయోమునఁ జేసి
బ్రాహ్మణోత్తమ! చిత్తంబు భ్రాంత మగుచు.

టీకా:

ఇనుము = ఇనుము; అయస్కాంత = అయస్కాంతమునకు; సన్నిధిని = వద్ద; ఎట్లు = ఏ విధముగ; భ్రాంతము = లోలము, లోనైనది; అగు = అగునో; హృషీకేశు = నారాయణుని {హృషీకేశుడు - హృషీకము (ఇంద్రియము) లకు ఈశుడు (ప్రభువు), విష్ణువు}; సన్నిధిన్ = సన్నిధానము నందు; ఆ = అట్టి; విధమునన్ = విధముగనే; కరగుచున్నది = కరిగిపోవుచున్నది; దైవయోగమునన్ = దైవగతి; చేసి = వలన; బ్రాహ్మణ = బ్రాహ్మణులలో; ఉత్తమ = ఉత్తముడా; చిత్తంబు = మనసు; భ్రాంతము = చలించునది; అగుచున్ = అగుచు.

భావము:

ఓ బ్రాహ్మణ శ్రేష్ఠుడా! చండామార్కుల వారూ! అయస్కాంతం వైపుకు ఇనుము ఆకర్షించబడు విధంగా, దైవ నిర్ణయానుసారం, నా మనసు సర్వేంద్రియాలకు అధిపతి అయిన విష్ణుమూర్తి సన్నిధిలో ఆకర్షింపబడుతోంది, ఇంకే విషయంలోనూ నా మనసు నిలవటం లేదు.