పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

సప్తమ స్కంధము : నారదుని పూర్వజన్మంబు

  •  
  •  
  •  

7-479-వ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

అని యిట్లు నారదుండు చెప్పిన వృత్తాంతం బంతయు విని ధర్మనందనుండు ప్రేమవిహ్వలుండయి వాసుదేవునిం బూజించె; వాసుదేవ ధర్మనందనులచేతఁ బూజితుండై నారదముని దేవమార్గంబునం జనియె" నని శుకయోగీంద్రుండు పాండవపౌత్రునకుం జెప్పె" నని సూతుండు శౌనకాదులకుం జెప్పిన.

టీకా:

అని = అని; ఇట్లు = ఈ విధముగ; నారదుండు = నారదుడు; చెప్పిన = చెప్పిన; వృత్తాంతంబు = గాథ; అంతయున్ = సర్వమును; విని = విని; ధర్మనందనుండు = ధర్మరాజు {ధర్మనందనుడు - యమధర్మరాజు యొక్క పుత్రుడు, ధర్మరాజు}; ప్రేమన్ = అనురాగముచే; విహ్వలుండు = మైమరచినవాడు; అయి = అయ్యి; వాసుదేవునిన్ = శ్రీకృష్ణుని {వాసుదేవుడు - వసుదేవుని కుమారుడు, కృష్ణుడు}; పూజించెన్ = అర్చించెను; వాసుదేవ = శ్రీకృష్ణ; ధర్మనందనుల్ = ధర్మరాజుల; చేతన్ = చేత; పూజితుండు = సత్కరింపబడినవాడు; ఐ = అయ్యి; నారద = నారదుడు యనెడి; ముని = ముని; దేవమార్గంబునన్ = ఆకాశమార్గమున,అదృశ్యమై; చనియెన్ = పోయెను; అని = అని; శుక = శుకుడు అనెడి; యోగి = యోగులలో; ఇంద్రుండు = శ్రేష్ఠుడు; పాండవపౌత్రున్ = పరీక్షిత్తున {పాండవపౌత్రుడు - పాండవుల యొక్క పౌత్రుడు (మనుమడు), పరీక్షిత్తు}; సూతుండు = సూతుడు; శౌనక = శౌనకుడు; ఆదుల్ = మొదలగువారి; కిన్ = కి; చెప్పిన = చెప్పగా.

భావము:

అని ఈ విధంగా నారదమహర్షులవారు ధర్మతత్వం అంతా ధర్మరాజుకు వివరించారు. ఆ మహానుభావుడు పట్టరాని పరమానందం పొందాడు. వినయంగా వాసుదేవుడిని అర్చించాడు. శ్రీకృష్ణుడు సంతోషించాడు. కృష్ణ, ధర్మజులచేత పూజింపబడిన నారదమునీశ్వరుడు ఆకామార్గాన దేవలోకానికి పయనమయి వెళ్ళాడు” అని శుకబ్రహ్మ శ్రీకృష్ణుని మనువడైన పరీక్షిత్తు మహారాజునకు చెప్పాడు” అని సూత మహర్షి శౌనకాది మహర్షులకు చెప్పాడు.