పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

సప్తమ స్కంధము : ఆశ్రమాదుల ధర్మములు

  •  
  •  
  •  

7-462-క.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

మునఁ గ్రిమియును బడు క్రియ
నిబడు నొడ లాత్మ గాదు హేయం బనుచుం
లఁతురు తద్జ్ఞులు పొగడుదు
సత నొడ లాత్మ యనుచు జ్ఞు లిలేశా!

టీకా:

మలమునన్ = అశుద్ధమునందు; క్రిమియునున్ = పురుగు; పడు = పుట్టెడి; క్రియన్ = విధముగనే; ఇలన్ = నేలపైన; పడు = పడెడి; ఒడలు = దేహము; ఆత్మ = తాను; కాదు = కాదు; హేయంబున్ = అసహ్యమైనది; అనుచున్ = అని; తలతురు = భావించెదరు; తద్జ్ఞులు = వస్తుతత్వముతెలిసినవారు; పొగడుదురు = మెచ్చుకొనెదరు; అలసతన్ = మందబుద్ధిచేత; ఒడలు = దేహమే; ఆత్మ = తాను; అనుచున్ = అని; అజ్ఞులు = తెలియనివారు; ఇలేశా = రాజా {ఇలేశుడు -ఇల(భూమికి) ఈశుడు, రాజు};

భావము:

ఓ ధరాధిపా! ధర్మరాజా! మలంలో పురుగులు పడ్డట్లు, మానవదేహంతో లోకంలో పడి ఉండే ఈ దేహం నీవు కాదు; నీవు ఆత్మవు; కనుక, బ్రహ్మజ్ఞానులు ఆ హేయమైన దేహము విడువ తగినది అంటారు; కానీ, అజ్ఞానులు ఆ దేహామే ఆత్మ అనుకొని, ఆ దేహాన్ని నమ్ముకుని మాయలో పడిపోతుంటారు.