పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

సప్తమ స్కంధము : ప్రహ్లాదుడు స్తుతించుట

  •  
  •  
  •  

7-350-మ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

మున్ వంశముఁ దేజమున్ శ్రుతము సౌంర్యంబు నుద్యోగమున్
నిపుణత్వంబుఁ బ్రతాపపౌరుషములున్ నిష్ఠాబలప్రజ్ఞలున్
హోమంబులుఁ జాల వీశ్వర! భవత్సంతుష్టికై దంతి యూ
థఁపు చందంబున భక్తి జేయవలయుం దాత్పర్య సంయుక్తుఁడై.

టీకా:

తపమున్ = తపస్సుచేయుట; వంశమున్ = కులము; తేజమున్ = తేజస్సు; శ్రుతము = వేదశాస్త్రాధ్యయనము; సౌందర్యమున్ = అందము; ఉద్యోగమున్ = ప్రయత్నము; నిపుణత్వంబున్ = నేర్పరితనము; ప్రతాప = పరాక్రమము; పౌరుషములున్ = పౌరుషము; నిష్ఠ = పూనిక; బల = శక్తి; ప్రజ్ఞలున్ = సామర్థ్యములు; జప = జపముచేయుట; హోమంబులున్ = హోమములుచేయుటలు; చాలవు = సరిపోవు; ఈశ్వర = ప్రభూ; భవత్ = నీకు; సంతుష్టి = మెప్పుకలిగించుట; కై = కొఱకు; దంతియూథంపు = గజేంద్రుని {దంతియూథము - దంతి (ఏనుగు) యూథము (వీరుడు), గజేంద్రుడు}; చందంబునన్ = వలె; భక్తిన్ = భక్తిని; చేయవలయును = చేయవలెను; తాతపర్య = దానియందేలగ్నమగుటతో {తాత్పర్యము - దానియందేలగ్నమగుట, ఏకాగ్రత}; సంయుక్తుండు = కూడినవాడు; ఐ = అయ్యి.

భావము:

ప్రభూ! నారసింహా! గొప్ప గొప్ప జపతపాలు, సద్వంశమూ, తేజస్సూ, వేద నైపుణ్యాలూ, సౌందర్యాలు, గట్టి నిష్ఠలూ, సత్కార్యాలు చేసే నైపుణ్యాలు, పరాక్రమాలూ, పౌరుషాలు, నైష్ఠికాలూ, శక్తిసామర్థ్యాలూ, హోమాలూ యజ్ఞాలూ మొదలైని ఏవీ కూడ నిన్ను సంతోషపెట్టటానికి సరిపోవు. పూర్వం గజేంద్రుడు భక్తితో నిన్ను మెప్పించి మెక్షం సాధించాడు కదా. నిన్ను మెప్పించటానికి అలాంటి భక్తి తాత్పర్యాలు అలవరుచుకోవాలి.