పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

సప్తమ స్కంధము : దేవతల నరసింహ స్తుతి

  •  
  •  
  •  

7-306-మ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

లీలాగుణచాతురిన్ భువనముల్ ల్పించి రక్షించి భే
ముం జేయు దురంతశక్తికి ననంజ్యోతికిం జిత్ర వీ
ర్యునికిన్ నిత్యపవిత్రకర్మునికి నే నుత్కంఠతో నవ్యయా
త్మునికిన్ వందన మాచరించెదఁ గృపాముఖ్య ప్రసాదార్థి నై."

టీకా:

ఘన = గొప్ప; లీలా = వేడుకగా ధరించెడి; గుణ = గుణత్రయమును {గుణత్రయము - 1సత్త్వగుణము 2రజోగుణము 3తమోగుణము}; చాతురిన్ = నేర్పుచేత; భువనముల్ = లోకములను; కల్పించి = సృష్టించి; రక్షించి = కాపాడి; భేదనమున్ = నాశనము; చేయు = చేసెడి; దురంత = ఆపలేని; శక్తి = శక్తిగలవాని; కిన్ = కి; అనంత = అపరిమిత; జ్యోతి = తేజముగలవాని; కిన్ = కి; చిత్ర = అబ్బురమైన; వీర్యున్ = పరాక్రమముగలవాని; కిన్ = కి; నిత్య = ఎల్లప్పుడును; పవిత్ర = పావనములైన; కర్మున్ = కర్మములుచేయువాని; కిన్ = కి; నేను = నేను; ఉత్కంఠ = వేడుక; తోన్ = తోటి; అవ్యయ = నాశములేని; ఆత్మ = ఆత్మస్వరూపుని; కిన్ = కి; వందనము = నమస్కారము; ఆచరించెదన్ = చేసెదను; కృపా = దయ; ముఖ్య = మొదలైన; ప్రసాద = అనుగ్రమును; అర్థిన్ = కోరువాడను; ఐ = అయ్యి.

భావము:

“గొప్ప లీలావిలాసాలలా ఈ అఖిల ప్రపంచాన్ని సృష్టించటం, పోషించటం, హరించటం అనే మహాకార్యాలను అవలీలగా నిర్వహించే ఓ ఆపరాని మహా శక్తి స్వరూపా! అపరిమిత తేజో మూర్తీ! అబ్బురమైన పరాక్రమశాలీ! నిత్య పవిత్రకర్మానుసారిణీ! నాశరహితుడైన పరమాత్మా! నేను అత్యంత ఆసక్తితో నీ అనుగ్రహాన్ని అర్థిస్తూ ప్రణామాలు ఆచరిస్తున్నాను. దేవా! స్వీకరించు.”