పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

షష్ఠ స్కంధము : చంద్రుని ఆమంత్రణంబు

  •  
  •  
  •  

6-198-క.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

నిముగ దేవాధీశ్వరుఁ
జుఁడు ప్రజాసర్గమునకు నఘుల మిమ్మున్
సృజియించె నిట్టివారికిఁ
గుదహనము చేయ నెట్లు గోరిక పొడమెన్?

టీకా:

నిజముగ = నిజముగ; దేవాధీశ్వరుడు = బ్రహ్మదేవుడు {దేవాధీశ్వరుడు - దేవ (దేవత లందరికి) అధీశ్వరుడు (అధిపతి), బ్రహ్మదేవుడు}; అజుడు = బ్రహ్మదేవుడు {అజుడు - జన్మము లేనివాడు, బ్రహ్మదేవుడు}; ప్రజ = ప్రజలను; సర్గమున్ = సృష్టి; కు = కి; అనఘుల = పుణ్యులను; మిమ్మున్ = మిమ్ములను; సృజియించెన్ = సృష్టించెను; ఇట్టి = ఇటువంటి; వారి = వారల; కిన్ = కి; కుజ = చెట్లను {కుజము - కు (భూమి) నుండి జము (జనించునది), వృక్షము}; దహనంబు = బూడిద; చేయ = చేయవలె నని; ఎట్లు = ఏవిధముగ; కోరిక = కోరిక; పొడమెన్ = కలిగెను.

భావము:

నిజానికి దేవదేవుడైన బ్రహ్మ ప్రజాసృష్టి కోసం పుణ్యాత్ములైన మిమ్మల్ని సృష్టించాడు. ఇటువంటి మీకు వృక్షాలను దహించాలనే కోరిక ఎలా పుట్టింది?