పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

షష్ఠ స్కంధము : వృత్రాసుర వృత్తాంతము

  •  
  •  
  •  

6-415-తే.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

మెఱయ యంత్రమయం బైన మృగము భంగి
దారునిర్మితమైనట్టి రణిపోల్కి
క్ర! యెఱుఁగుమ యీ భూతజాల మెల్ల
ళిత పంకేరుహాక్షు తంత్రంబు గాఁగ.

టీకా:

మెఱయ = ప్రకాశముగ; యంత్రమయంబు = యంత్రములతో చేయబడిన; ఐన = అయిన; మృగము = జంతువు; భంగిన్ = వలె; దారు = చెక్కతో; నిర్మితము = తయారైనట్టిది; ఐనట్టి = అయిన; తరణి = పడవ; పోల్కిన్ = వలె; శక్ర = ఇంద్రుడా; ఎఱుగుము = తెలియుము; ఈ = ఈ; భూత = జీవుల; జాలము = సమూహము; ఎల్లన్ = సర్వము; దళితపంకేరుహాక్షున్ = నారాయణుని {దళిత పంకేరుహాక్షుడు - దళిత (వికసించిన) పంకేరుహ (పద్మముల) వంటి అక్షుడు (కన్నులు గలవాడు), విష్ణువు}; తంత్రంబున్ = తంత్రము; కాగన్ = అయినట్లు.

భావము:

ఇంద్రా! యంత్ర నిర్మితమైన జంతువుల వలె, కొయ్యచెక్కతో చేసిన పడవల వలె ఈ ప్రపంచంలోని ప్రాణులందరూ మహావిష్ణువు మాయాతంత్రం వల్ల కదులుతున్న బొమ్మలని తెలుసుకో.