పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

షష్ఠ స్కంధము : శ్రీమన్నారాయణ కవచము

  •  
  •  
  •  

6-308.1-ఆ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

యువిద పిండుతోడ విమానముతోడఁ
నదు విద్యతోడ రణిఁ ద్రెళ్ళి
తిరిగి లేవలేక తికమక గుడువంగ
వాలఖిల్యమౌని వానిఁ జూచి.

టీకా:

అతి = మిక్కిలి; భక్తిన్ = భక్తితో; కౌశికుండు = కౌశికుడు; అను = అనెడి; బ్రాహ్మణుడు = బ్రహ్మణుడు; తొల్లి = పూర్వము; ఈ = ఈ; విద్య = విద్యను; ధరియించి = ధరించి; ఎలమిన్ = వికాసముతో; మించి = అతిశయించి; మరుభూమి = శ్మశానము; అందు = లో; నిర్మల = స్వచ్ఛమైన; చిత్తుడు = మనసు గలవాడు; ఐ = అయ్యి; యోగధారణంబునన్ = యోగధారణ ద్వారా; బిట్టు = శ్రీఘ్రమే; తనువున్ = దేహమును; విడిచె = వదలెను; దాని = దాని; పైన్ = మీద; ఒకడు = ఒకడు; గంధర్వ = గంధర్వులలో; వరేణ్యుండు = శ్రేష్ఠుడు; చిత్రరథ = చిత్రరథుడు; ఆఖ్యుడు = అనబడెడివాడు; అజేయుడు = జయింపరానివాడు; ఒంటిన్ = ఒంటరిగా; చదలన్ = ఆకాశమున; చనంగ = వెళుతుండగ; తత్ = ఆ; ఛాయ = నీడ; తత్ = ఆ; అస్థి = ఎముక; పైన్ = మీద; కదిసిన = చేరగా; ఆతడు = అతడు; కళవళించి = తొట్రుపడి;
ఉవిద = స్త్రీల; పిండు = గుంపు; తోడన్ = తోటి; నవ = కొత్త; విమానము = విమానము; తోడన్ = తోటి; తనదు = తన యొక్క; విద్య = జ్ఞానము; తోడన్ = తోటి; ధరణిన్ = భూమిపైన; త్రెళ్ళి = తూలిపడిపోయి; తిరిగి = మరల; లేవలేక = లేవలేక; తికమక = తొట్రుపాటు; కుడువంగ = పడుతుండగ; వాలఖిల్య = వాలఖిల్యుడు యనెడి; మౌని = ముని; వానిన్ = వానిని; చూచి = చూసి.

భావము:

పూర్వం కౌశికుడనే బ్రాహ్మణుడు ఎంతో భక్తితో ఈ నారాయణ కవచాన్ని ఉపాసించి, నిర్మలమైన హృదయంతో యోగమార్గాన్ని అవలంబించి ఒక ఎడారి ప్రదేశంలో తన దేహాన్ని విడిచిపెట్టాడు. చిత్రరథుడు అనే గంధర్వరాజు తన రాణులతో కలిసి విమానంలో ఆకాశమార్గాన పోతుండగా ఆ విమానం నీడ కౌశికుని అస్థిపంజరం మీద పడగానే అది ముందుకు పోకుండా ఆగిపోయి నేల మీదకు వచ్చిపడింది. చిత్రరథుడు తన రాణులతో క్రింద పడిపోయాడు. అవయవాలు స్తంభించగా అతడు లేవలేక తికమక పడ్డాడు. ఆ సమయంలో వాలఖిల్యుడు అనే ముని ఆ గంధర్వునితో ఇలా అన్నాడు.