పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

పంచమ స్కంధము - ఉత్తర : భగణ విషయము

  •  
  •  
  •  

5.2-87-క.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

చందురునకు మీఁదై యా
నందంబున లక్ష యోజనంబులఁ దారల్
క్రందుకొని మేరు శైలం
బంది ప్రదక్షిణము దిరుగు భిజిద్భముతోన్.

టీకా:

చందురున్ = చంద్రుని; కున్ = కి; మీదన్ = పైన; ఐ = ఉండి; ఆనందంబున = సంతోషముగ; లక్ష = లక్ష (1,00,000); యోజనంబులన్ = యోజనముల దూరములో; తారల్ = తారకలు; క్రందుకొని = గుమికూడి; మేరుశైలంబున్ = మేరుపర్వతమును; అంది = అందుల; ప్రదక్షిణమున్ = చక్రభ్రమణమున; తిరుగున్ = తిరుగును; అభిజిద్భము = అభిజిత్ అనెడి తార; తోన్ = తోటి;

భావము:

చంద్రుని పైన లక్షయోజనాల ఎత్తు ప్రదేశంలో నక్షత్ర మండలం ఉంది. అందలి నక్షత్రాలన్నీ అభిజిత్తుతో కూడా కలిసి మేరుపర్వతానికి ప్రదక్షిణం చేస్తూ ఉంటాయి.