పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

పంచమ స్కంధము - పూర్వ : ఋషభుని జన్మంబు

  •  
  •  
  •  

5.1-45-క.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

"పరిపూర్ణుఁడ వై యుండియ
ఱువక మా పూజ లెల్ల న్నింతువు; నీ
ణార వింద సేవయు
రఁ బెద్దలు వినిచి నటుల గఁ జేసెదమౌ.

టీకా:

పరిపూర్ణుడవు = పరిపూర్ణుడవు; ఐ = అయ్యి; ఉండియున్ = ఉండికూడ; మఱువక = మరచిపోకుండగ; మా = మా యొక్క; పూజలు = సేవలు; ఎల్లన్ = అన్నిటిని; మన్నింతువు = మన్నించెదవు; నీ = నీ యొక్క; చరణ = పాదములు అనెడి; అరవింద = పద్మముల; సేవయున్ = సేవించుటలు; ధరన్ = భూమిపై; పెద్దలు = పెద్దలు; వినిచినటులన్ = చెప్పిన విధముగ; తగన్ = అవశ్యము; చేసెదము = చేయుదుము; ఔ = ఔను చేసెదము.

భావము:

“నీవు పరిపూర్ణుడవై కూడా మమ్మల్ని మరచిపోకుండా మా పూజలను స్వీకరిస్తావు. పెద్దలు మాకు చెప్పిన విధంగా నీ పాదపద్మాలను సేవిస్తాము.