పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

చతుర్థ స్కంధము : దక్షాదుల శ్రీహరి స్తవంబు

  •  
  •  
  •  

4-205-క.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

ని తన్ను సకల జనములు
వినుతించిన హరి భవుండు విఘ్నము గావిం
చి యా దక్షుని యజ్ఞము
ముగఁ జెల్లించెఁ గొఱఁత గాకుండంగన్.

టీకా:

అని = అని; తన్నున్ = తనను; సకల = సమస్తమైన; జనములున్ = వారు; వినుతించినన్ = స్తుతి చేయగ; హరి = నారాయణుడు; భవుండు = శివుడు; విఘ్నమున్ = అంతరాయము; కావించిన = కలిగించిన; ఆ = ఆ; దక్షుని = దక్షుని; యజ్ఞము = యాగమును; ఘనముగన్ = గొప్పగ; చెల్లించెన్ = పూర్తి చేయించెను; కొఱత = కొరత; కాకుండగన్ = లేకుండగా.

భావము:

అని ఈ విధంగా సమస్త జనులూ తనను స్తుతించగా విష్ణుమూర్తి ప్రసన్నుడై శివుడు ధ్వంసం చేసిన దక్షుని యజ్ఞాన్ని ఏ కొరత లేకుండ చక్కగా పూర్తి చేయించాడు.