పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

చతుర్థ స్కంధము : దక్షాదుల శ్రీహరి స్తవంబు

  •  
  •  
  •  

4-201-మ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

" పంకేజభ వామరాదులు మరీచ్యాదిప్రజానాథు లో
విందాక్ష! రమాహృదీశ! భవదీయాంశాంశ సంభూతులై
రఁగం దావకలీలయై నెగడు నీ బ్రహ్మాండమున్; దేవ! యీ
శ్వ! నీ కే మతిభక్తి మ్రొక్కెదము దేవాధీశ! రక్షింపుమా."


ఇది (గంధర్వు లిట్లనిరి క్రింద రెండవ పద్యంగా) ఒకానొక ప్రతిని జూపట్టెడి..

4-201.1/1-మ.
దంశాంశజు లీ మరీచిముఖరుల్ బ్రహ్మామరేంద్రాదిజా
ముఖ్యుల్ దివిషద్గణంబుఁ బరమాత్మా! నీకు విశ్వంబు ను
త్సలీలాకరకందుకోపమము నాథా! వేదశాఖాశిఖా
స్తనీయాంఘ్రికి నీ కొనర్తుము నమస్కారంబు లశ్రాంతమున్.


టీకా:

హర = శివుడు; పంకేజభవ = బ్రహ్మదేవుడు; అమర = దేవతలు; ఆదులు = మొదలగువారు; మరీచి = మరీచి; ఆది = మొదలగు; ప్రజానాథులు = ప్రజాపతులు; ఓ = ఓ; అరవిందాక్ష = విష్ణుమూర్తి; రమాహృదీశ = విష్ణుమూర్తి; భవదీయ = నీ యొక్క; అంశ = భాగములో; అంశ = భాగమున; సంభూతులు = జనించినవారు; పరగన్ = ప్రసిద్ధముగ; తావక = నీ యొక్క; లీల = లీలకొరకు; ఐ = అయ్యి; నెగడున్ = వర్థిల్లును; ఈ = ఈ; బ్రహ్మాండమున్ = బ్రహ్మాండమును; దేవ = హరి; ఈశ్వర = హరి; నీకున్ = నీకు; ఏము = మేము; అతి = మిక్కిలి; భక్తిన్ = భక్తితో; మ్రొక్కెదము = నమస్కరించెదము; దేవాధీశా = హరీ {దేవాధీశుడు - దేవతలకు ప్రభువు, విష్ణువు}; రక్షింపుమా = కాపాడుము.

భావము:

“కమలలోచనా! లక్ష్మీహృదయేశ్వరా! దేవా! ఈశ్వరా! దేవతకు ప్రభువైన శ్రీహరీ! శివుడు, బ్రహ్మ మొదలైన దేవతలు, మరీచి మొదలైన ప్రజాపతులు నీ అంశాంశాలచేత జన్మించారు.ఈ బ్రహ్మాండం నీ క్రీడా మందిరం. నీకు పరమభక్తితో ప్రణమిల్లుతున్నాము. మమ్మల్ని పాలించు.”