పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

చతుర్థ స్కంధము : శివుం డనుగ్రహించుట

  •  
  •  
  •  

4-149.1-తే.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

హింసఁ గావింపకుండు సమిద్ధచరిత!
నీలోహిత! మహితగుణావాల!
లోపాలనకలిత! గంగాలాప!
ర! జగన్నుతచారిత్ర! దియుఁ గాక.

టీకా:

మఱి = మరి; భేద = వైమనస్యమైన; బుద్ధిన్ = బుద్ధితో; కర్మ = కర్మలందు; ప్రవర్తనముల = నడచుటలలో; మద = మదముతో; యుతులు = కూడినవారు; ఐ = అయ్యి; దుష్ట = దుర్మార్గపు; హృదయులు = హృదయములు కలవారు; అగుచున్ = అవుతూ; పర = ఇతరుల; విభవ = వైభవములవలన; అసహ్య = సహించలేకపోవుటచే; భవ = కలిగిన; మనస్ = మానసిక; వ్యాధులన్ = వ్యాధులకు; తగిలి = తగుల్కొని; మర్మా = ప్రాణముల; ఆత్మ = మూలముల; భేదకములు = బద్దలుకొట్టునవి; అయిన = అయినట్టి; బహు = అనేకమైన; దురుక్తుల్ = చెడుమాటల; చేతన్ = తోటి; పరులన్ = ఇతరులను; పీడించుచున్ = బాధిస్తూ; ఉండు = ఉండెడి; మూఢులను = మూర్ఖులను; దైవోపహతులు = మాయోవిమోహితులు; కాన్ = అగనట్లు; తలపోసి = అనుకొని; ఆ = ఆ; కపట = మోసపూరిత; చిత్తులు = మనసులుకలవారి; కున్ = కి; నీ = నీ; వంటి = లాంటి; సత్ = మంచి; పురుషుడు = పురుషుడు; ఏవలనన్ = ఏవిధముగ; ఐన = అయిన.
హింస = హింసించుట; కావింపకుండు = చేయకుండును; సమ = చక్కటి; ఇద్ధ = ప్రసిధ్ధ; చరిత = వర్తనకలవాడ; నీలలోహిత = శివ {నీలలోహితుడు - నీలవర్ణము లోహితవర్ణములతో కూడినవాడు, శివుడు}; మహితగుణాలవాల = శివ {మహితగుణాలవాలుడు - మహిత (గొప్ప) గుణాల (గుణముల)అలవాల (పాదువంటివాడు), శివుడు}; లోకపాలనకలిత = శివ {లోకపాలనకలిత - లోకములను పాలించువాడు, శివుడు}; గంగాకలాప = శివ {గంగాకలాప - గంగ (గంగదేవి)ని కలాప (భూషణముగ కలవాడు), శివుడు}; హర = శివ {హరుడు - లయకారుడు, శివుడు}; జగన్నుతచారిత్ర = శివ {జగన్నుతచారిత్ర - జగత్ (లోకములచే) నుత (కీర్తింపబడు) చారిత్ర (చరిత్ర కల వాడు), శివుడు}; అదియున్ = అంతే; కాక = కాకుండగ.

భావము:

ఓ భవ్యచరితా! నీలలోహితా! పావన గుణ భరితా! లోక పరిపాలా! గంగాధరా! హరా! సకల లోక స్తుత చరిత్రా! మూర్ఖులు మదించి, దుష్టచిత్తులై భేదబుద్ధితో ప్రవర్తిస్తారు. పరుల సంపదను చూచి ఓర్వలేరు. మనోవ్యాధితో క్రుంగిపోతారు. మర్మస్థానాలను భేదించే పరుషవాక్కులతో ఇతరులను బాధిస్తారు. నీవు వారిని దైవానుగ్రహానికి దూరమైన వారినిగా భావిస్తావు. ఆ కపటాత్ములకు నీవంటి సత్పురుషుడు ఏ విధంగానూ హింస కావించడు.