పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

చతుర్థ స్కంధము : ధక్షాధ్వర ధ్వంసంబు

  •  
  •  
  •  

4-123-వ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

ఇట్లు వీరభద్రుండు దక్షుని యాగంబు విధ్వంసంబు గావించి నిజ నివాసంబైన కైలసంబునకుఁ జనియె నయ్యవసరంబున.

టీకా:

ఇట్లు = ఈ విధముగ; వీరభద్రుండు = వీరభద్రుడు; దక్షునిన్ = దక్షుని; యాగంబు = యజ్ఞమును; విధ్వంసంబున్ = నాశనము; కావించి = చేసి; నిజ = తన యొక్క; నివాసంబు = నివాసము; ఐన = అయినట్టి; కైలాసంబున్ = కైలాసమున; కున్ = కు; చనియెన్ = వెళ్ళెను; ఆ = ఆ; అవసరంబునన్ = సమయములో.

భావము:

ఈవిధంగా వీరభద్రుడు దక్షయజ్ఞాన్ని ధ్వంసం చేసి తన నివాసమైన కైలాసానికి వెళ్ళిపోయాడు. ఆ సమయంలో...